డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్వర్యంలో 2021 సంవత్సరానికి ఫౌండేషన్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారకార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిస్కోలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్, కో-చైర్ పర్సన్, కో-ఆర్టినేటర్, ప్రెసిడెంట్‌తో పాటు ఇతర ఆఫీసు బేరర్లు ప్రమాణం స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ.. 2020 కరోనా కాలంలో టీపీఏడీ స్వచ్ఛంద కార్యకలాపాలను చేపట్టిందన్నారు. న్యూయార్క్‌లోని ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఎన్ 95 మాస్క్‌లు అందించామన్నారు. అలాగే ఇండియాలో ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిత్యవసర సరుకులు, అవసరమైన వస్తు సామాగ్రి పంపిణీకి టీపీఏడీ నుంచి విరాళాలు సేకరించి పంపించామన్నారు.
హైదరాబాద్‌లోని పేద కళాకారులకు కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. అనంతరం మహమ్మారి కాలంలో ప్రజలకు సేవ చేస్తున్న ఫ్రంట్ లైన్ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత టీపీఏడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు మధుమతి వైజరాజు మాట్లాడుతూ.. ఫౌండేషన్ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను వివరించారు. ఫౌండేషన్ చైర్ పర్సన్ రావు కల్వాలా మాట్లాడుతూ.. బ్లడ్ డ్రైవ్ ద్వారా టీపీఏడీ గత కొన్ని సంవత్సరాలుగా వందలాది మంది ప్రాణాలను కాపాడిందన్నారు. అవసరమున్న వారికి రక్తదానం ఇవ్వడంలో సహాయపడటానికి బ్లడ్ డ్రైవ్‌ను మరింత కఠినంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ చైర్ మాధవి సుంకిరెడ్డి మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడంతో పాటు సమాజానికి ఏ విధంగానైనా సేవ చేయడమే టీపాడ్ లక్ష్యం అన్నారు. 2021లో టీపీఏడీ మరిన్ని స్వచ్ఛంద కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సంస్థ సీనియర్ నాయకత్వ సభ్యులు అజయ్ రెడ్డి, జానకి రామ్ మాండాడి, రఘువీర్ బండారులు ప్రపంచ శాస్త్రీయ సమాజానికి కృషి చేసి, కోవిడ్-19కు వ్యాక్సిన్‌ను తక్కువ సమయంలో అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా కోఆర్డినేటర్‌గా ఎన్నికైన గోలీ బుచి రెడ్డి బృందాన్ని అభినందించారు, సంస్థకు బలమైన పునాది వేసినందుకు టీపీఏడీ గత అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.
2021 సంవత్సరానికి కొత్తగా ఎన్నికైన ఫౌండేషన్ సభ్యులు..
రావు కల్వాలా (చైర్, ఫౌండేషన్ కమిటీ), రఘువీర్ బండారు (వైస్ చైర్, ఫౌండేషన్ కమిటీ), మాధవి సుంకిరెడ్డి (చైర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు), ఇంద్రాణి పంచెరుపుల (వైస్ చైర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్), బుచి రెడ్డి గోలి (కో-ఆర్డినేటర్), రవికాంత్ మామిడి (ప్రెసిడెంట్), చంద్రరెడ్డి పోలీస్ (గత అధ్యక్షుడు), రూప కన్నయ్యరి (ఉపాధ్యక్షుడు), అనురాధ మేకల (ప్రధాన కార్యదర్శి), లింగా రెడ్డి అల్వా (సంయుక్త కార్యదర్శి), శంకర్ పరిమల్ (కోశాధికారి), మధుమతి వైజరాజు (సంయుక్త-కోశాధికారి), కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మాధవి లోకిరేడ్డి, లక్ష్మి పోరెడ్డి, రత్న వుప్పల, రోజా అడెపు, శ్రీధర్ వేముల, మంజులా తోడినావూరు ధర్మకర్తలు రామ్ అన్నాడి, అశోక్ కొండల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, పాండురంగ రెడ్డి పాల్వే,అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, జానకిరామ్ మందాడి ఈ ఏడాదికి గాన నూతన ఫౌండేషన్ సభ్యులుగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment