
డల్లాస్ : తెలుగు పీపుల్స్ అసోసియేషన్ (టీపాడ్) ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్‌లో బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకల్లో మహిళలంతా సంప్రదాయ వస్త్రాలంకరణలతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మ పాటలతో సందడి చేయనున్నారు. టీపాడ్ సభ్యులతో పాటు, పక్కనున్న ఓక్లాహోమా, కన్సాస్, ఆర్కాన్సాస్ రాష్ట్రాలకు చెందిన భారతీయులు బతుకమ్మ సంబరాల్లో భాగం కానున్నారు. ప్రతీయేటా జరుగుతున్నట్టే ఈసారి కూడా టీపాడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నామనీ, ఈ వేడుకల్లో దాదాపు 10 వేల మంది పాల్గొంటారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
కాగా, విదేశాల్లోని భారతీయులు ఎక్కువ మంది జరుపుకొనే ఉత్సవంగా బతుకమ్మ పండగా నిలిచింది. దాదాపు 10 వేల మంది పాల్గొనే ఈ వేడుకలు నిర్వహించే ఆర్గనైజేషన్లలో టీపాడ్ ఒకటి కావడం విశేషం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ పండగ నిర్వహిస్తోన్న టీపాడ్‌కు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో టీపాడ్ ప్రెసిడెంట్ శ్రీని గంగాధర, బోట్ చైర్మన్ శారదా సింగిరెడ్డి, బోట్ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ రఘువీర్ బండారు పాల్గొన్నారు.
టీపాడ్ సభ్యులు..
టీపాడ్ ఫౌండేషన్ టీమ్-జానకీరామ్ మందాడి, ఉపెందర్ తెలుగు, అజయ్ రెడ్డి, రావు కాల్వల, రాజ్‌వర్ధన్ గోంధీ, మహెందర్ కామిరెడ్డి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్- పవన్‌కుమార్ గంగాధర, ఇందు పంచెరుపుల, మనోహర్ కాసగాని, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండల, సుధాకర్ కాసగాని. ఎగ్జిక్యూటివ్ కమిటీ- రమణ లష్కర్, కరణ్ పోరెడ్డి, చంద్రా పోలీస్, సత్య పెర్కారీ, శ్రీని వేముల, రవికాంత్ మామిడి, లింగారెడ్డి ఆల్వ, సురెందర్ చింతల, రోజా ఆడెపు, శరత్ ఎర్రం, మధుమతి వైశ్యరాజు, మాధవి లోకిరెడ్డి, దీప్తి సూర్యదేవర, శంకర్ పరిమళ్. అడ్వజర్లు- వేణు భాగ్యనగర్, విక్రం జంగం, నరేష్ సుంకిరెడ్డి, జయ తెలకపల్లి, గంగా దేవర, సంతోష్ కోరే, అరవింద్ ముప్పిడి, రత్న ఉప్పల, సతీష్ నాగిల్ల, కల్యాణి తడిమేటి. కొలాబరేషన్ టీమ్- లక్ష్మీ పోరెడ్డి, పల్లవి తోటకూర, రోహిత్ నరిమేటి, అనుష వనం, నితిన్ చంద్ర, శిరీష్ గోనే, మాధవి ఓంకార్, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివాకర్ల, కవిత బ్రహ్మదేవర, అనురాధ మేకల, సునీత, నితిన్ కొరివి, శశిరెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి, మాధవి ఓంకార్, సుగత్రి గూడూరు, మాధవి మెంట, లావణ్య యరకల, ధనలక్ష్మీ రావుల, మంజుల రెడ్డి ముప్పిడి, శాంతి నూతి, శ్రీనివాస్ కూటికంటి మొదలగు వారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు.







Comments
Please login to add a commentAdd a comment