
దసరా సందర్భంగా పలువురు చిన్నారుల మనసుల్లో రామ్‌చరణ్ ఆనందాన్ని నింపారు. వాళ్లతో కాలు కదిపారు. సినిమాల్లో చరణ్ డ్యాన్సులు చూసే చిన్నారులకు స్వయంగా ఈ హీరో తమతో డ్యాన్స్ చేయడం ఓ కలలా అనిపించి ఉంటుంది. భార్య ఉపాసనతో కలసి సేవా సమాజ్ బాలిక నిలయం అనాథాశ్రమంలోని మహిళలు, పిల్లలతో రామ్‌చరణ్ బతుకుమ్మ పండగ జరుపుకున్నారు. పిల్లలతో చరణ్ హుషారుగా స్టెప్పులేశారు.