తెలంగాణా ఆడబిడ్డలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే వేడుక బతుకమ్మ. ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటుభక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. రంగుల రంగుల పూలతో తెలంగాణా పల్లెలు కళ కళలాడుతాయి. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ లాంటి ఆటపాటలతో సందడి నెలకొంటుంది. దీంతో ఇప్పటికే తెలంగాణా ఆడబిడ్డలు సంబరాలకు రెడీ అయిపోతున్నారు.
పండుగ సంబురాలు ఎపుడు మొదలు
2024లో భాద్రపద అమావాస్య అక్టోబరు 2 బుధవారం రోజు వచ్చింది. ఇలా ప్రారంభమయ్యే వేడుకలు తొమ్మిది రోజుల పాటు అత్యంగా ఉత్సాహంగా సాగుతాయి అక్టోబరు 10న సద్దుల బతుకమ్మ వేడుకతో ఈ బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగుస్తాయి.
దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ, గునుగు పూలు, బంతి, చేమంతి, తంగేడు, కట్ల, సీతమ్మవారి జడ, గుమ్మడి పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ తొమ్మిది రోజులు పాటు, పలు నైవేద్యాలతో కులం, మతం, చిన్నా పెద్ద, ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అద్భుతమైన పండుగ.
తొమ్మిది రోజులు, తొమ్మిది రకాల బతుకమ్మలు
అక్టోబరు 2 తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ
రెండో రోజు అటుకుల బతుకమ్మ
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ
నాలుగో రోజు నానేబియ్యం బతుకమ్మ
ఐదో రోజు అట్ల బతుకమ్మ
ఆరో రోజు అలిగిన బతుకమ్మ
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ
ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ
ఆఖరి రోజైన తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మను పూజించి, అందంగా ముస్తామైన ఆడబిడ్డలు అత్యంత ఉత్సాహంగా బతుకమ్మలను మధ్యలో పెట్టి ఆడి పాడితారు. గౌరమ్మకు నైవేద్యాలు సమర్పిస్తారు. బతుకమ్మను చివరకు గంగమ్మ చెంతకు చేరుస్తారు.దీంతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment