flowers festival
-
Bathukamma 2024: పూల పండుగ బతుకమ్మ..సంబురాలు లోడింగ్
తెలంగాణా ఆడబిడ్డలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే వేడుక బతుకమ్మ. ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటుభక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. రంగుల రంగుల పూలతో తెలంగాణా పల్లెలు కళ కళలాడుతాయి. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ లాంటి ఆటపాటలతో సందడి నెలకొంటుంది. దీంతో ఇప్పటికే తెలంగాణా ఆడబిడ్డలు సంబరాలకు రెడీ అయిపోతున్నారు.పండుగ సంబురాలు ఎపుడు మొదలు2024లో భాద్రపద అమావాస్య అక్టోబరు 2 బుధవారం రోజు వచ్చింది. ఇలా ప్రారంభమయ్యే వేడుకలు తొమ్మిది రోజుల పాటు అత్యంగా ఉత్సాహంగా సాగుతాయి అక్టోబరు 10న సద్దుల బతుకమ్మ వేడుకతో ఈ బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగుస్తాయి.దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ, గునుగు పూలు, బంతి, చేమంతి, తంగేడు, కట్ల, సీతమ్మవారి జడ, గుమ్మడి పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ తొమ్మిది రోజులు పాటు, పలు నైవేద్యాలతో కులం, మతం, చిన్నా పెద్ద, ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అద్భుతమైన పండుగ. తొమ్మిది రోజులు, తొమ్మిది రకాల బతుకమ్మలుఅక్టోబరు 2 తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మనాలుగో రోజు నానేబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మతొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆఖరి రోజైన తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మను పూజించి, అందంగా ముస్తామైన ఆడబిడ్డలు అత్యంత ఉత్సాహంగా బతుకమ్మలను మధ్యలో పెట్టి ఆడి పాడితారు. గౌరమ్మకు నైవేద్యాలు సమర్పిస్తారు. బతుకమ్మను చివరకు గంగమ్మ చెంతకు చేరుస్తారు.దీంతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. -
పూల కోసమే ప్రత్యేకమైన పండుగ! ఇది ఒకరోజు పండుగ కాదు.. ఏకంగా..
పూలతోటలు పెంచడం, దైవారాధనలోను, గృహాలంకరణలోను పూలను ఉపయోగించడం దాదాపు ప్రతి దేశంలో ఉన్న వ్యవహారమే! మన దేశంలోనైతే మహిళలు పూలను సిగలో కూడా ధరిస్తారు. ప్రాచీన సంస్కృతుల ప్రభావం గల కొన్ని ఇతర దేశాల్లోనూ మహిళలు పూలను తమ అలంకరణలో భాగంగా ఉపయోగిస్తుంటారు. మన దేశంలో పండుగల్లో పూలను విరివిగా వినియోగిస్తారు గాని, పూల కోసం ప్రత్యేకమైన పండుగ ఏదీ లేదు.అయితే, కొలంబియాలో మాత్రం పూల కోసమే ప్రత్యేకమైన పండుగ ఉంది. ఇది ఒకరోజు పండుగ కాదు, ఏకంగా పదిరోజులు జరుపుకొనే భారీ వేడుక. ఏటా ఆగస్టు 2 నుంచి 11 వరకు ఈ పండుగ జరిగినన్ని రోజులూ కొలంబియాలో ఊరూ వాడా ఎటు చూసినా రంగు రంగుల పూల సోయగాలు కనువిందు చేస్తాయి. చిత్రవిచిత్రమైన పుష్పాలంకరణలు చూపరులను కట్టిపడేస్తాయి.కొలంబియా వాసులు ఈ పండుగను ‘ఫెరియా డి లాస్ ఫ్లోరెస్’ అని పిలుచుకుంటారు. కొలంబియాలో అత్యంత ప్రాధాన్యమున్న సాంస్కృతిక వేడుకల్లో ఈ పూల పండుగ ఒకటి. వర్ణ మహోత్సవంలా సాగే ఈ పూల పండుగను తిలకించడానికి పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ పండుగలో భాగంగా జరిగే ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొలంబియా రాజధాని బొగోటాలోని చరిత్రాత్మక కట్టడం ‘ఎల్ ఒబెలిస్కో’ వద్ద పూలబుట్టలతో, పూలతో అలంకరించిన వాహనాలతో జనాలు పెద్దసంఖ్యలో చేరుకుని, అక్కడ సంగీత కార్యక్రమం నిర్వహించడంతో ఈ పూల పండుగ సంబరాలు మొదలవుతాయి.ఈ సందర్భంగా వీథుల్లో పూలతో భారీ పరిమాణంలో నిర్మించిన జంతువులు, పక్షుల విగ్రహాలు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. వివిధ సాంస్కృతిక కేంద్రాల్లోను, ప్రధాన కూడళ్లలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదికలపైన సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ముగింపు రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పూల రైతులు తమ తమ తోటల్లో పూసిన పూలను బుట్టల్లో నింపుకుని, వాటిని వీపున కట్టుకుని ‘సిలెటరోస్ పరేడ్’ ఊరేగింపును నిర్వహిస్తారు. -
సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ చివరి రోజైన సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త రాష్ట్రంలో ప్రకృతి మాత సహకరించడంతో కురిసిన వర్షాలతో గ్రామాల్లో చెరువులు నీటితో నిండి జలకళను సంతరించుకున్నాయని అన్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగు నింపుతుందని ఆకాంక్షించారు. -
ఒక్కేసి.. పువ్వేసి...
పరవశించే ప్రకృతి పరిమళాలు.. బతుకమ్మ పూలల్లో ఔషధ గుణాలు అందరికీ ఆరోగ్య ఫలాలు జోగిపేట: సంప్రదాయబద్దంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మది ప్రత్యేక స్థానం. పువ్వులు.. ఆకులు.. గౌరమ్మలు.. పసుపుకుంకుమలు.. ప్రకృతి ఒడిలో విరబూసే పూలు అందాన్ని, పరిమళాలను వెదజల్లడమే కాక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రతి పువ్వులో ఔషధాలు మెండుగా ఉన్నాయి. తంగేడు, గునుగు, చంద్రకాంత, గడ్డిపూలు, గుమ్మడి, మందార పూలకు ఎంతో గొప్ప విశిష్టత ఉంది. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా కూడా బోలెడు ప్రయోజనాలున్నాయి. చెరువు నీటిలో ఉన్న మలినాలు ఔషధ గుణాలు కలిగిన పూలతో మటుమాయమై నీటి శుద్ధి జరుగుతుంది. ఇలా బతుకమ్మ ఆట, పాటలకే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ దోహద పడుతోంది. ఇదిలా ఉండగా..భక్తిశ్రద్ధలతో పూలు పేర్చి.. పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతూ.. మహిళలు ఇళ్లల్లో.. ఆలయాల్లో.. కూడళ్లలో.. రెండో రోజైన శనివారం అటుకుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.