ramcharan teja
-
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్ ..
-
జక్కన్న పోస్టుపై వర్మ కామెంట్స్..!
సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమాకు ఉత్తమ డైరెక్టర్‌గా నంది అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. జక్కన్న తన ఫేస్బుక్లో ఒక ఫొటో పోస్టు చేశాడు. ఆ ఫొటోలో మధ్యలో రాజమౌళి ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్‌లు కూర్చొన్నారు. ఈ పోస్టుపై విమర్శాత్మక డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తనదైన రీతిలో కామెంట్స్ చేశాడు. వర్మ తన ఫేస్బుక్లో ‘ ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురూ ఆ టైపేనా .. పైగా ముగ్గురు కూడా పెళ్లైన వాళ్లు.. అల్లా ఏం జరుగుతుంది ? జీసస్ దయచేసి మీరైనా నాకు చెప్పండి.. బాలాజీ గారు మీరైనా చెప్పండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ తమదైన రీతిలో స్పందించారు. ఒక అభిమాని అయితే ‘ ఓ జంతువూ.. నువ్వు గేలా ఉండి అందరిని అంటావేంటిరా’ అని వర్మపై విరుచుకుపడ్డాడు. మరో అభిమాని‘ పచ్చ కామెర్లు వ్యాధి ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అనే సామెత’ వర్మకి సరిపోతుందని కామెంట్ చేశాడు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో మల్టీ స్టార్ మూవీ 2018లో మొదలవుతుంది.. టాలీవుడ్ రికార్డులని బద్దలయ్యే క్షణం.. అని ఓ అభిమాని పోస్టు చేశాడు. బాహుబలి 2015 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకుంది. -
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...
దసరా సందర్భంగా పలువురు చిన్నారుల మనసుల్లో రామ్‌చరణ్ ఆనందాన్ని నింపారు. వాళ్లతో కాలు కదిపారు. సినిమాల్లో చరణ్ డ్యాన్సులు చూసే చిన్నారులకు స్వయంగా ఈ హీరో తమతో డ్యాన్స్ చేయడం ఓ కలలా అనిపించి ఉంటుంది. భార్య ఉపాసనతో కలసి సేవా సమాజ్ బాలిక నిలయం అనాథాశ్రమంలోని మహిళలు, పిల్లలతో రామ్‌చరణ్ బతుకుమ్మ పండగ జరుపుకున్నారు. పిల్లలతో చరణ్ హుషారుగా స్టెప్పులేశారు. -
బాల మగధీర మృతి.. రామ్‌చరణ్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: అతి పిన్న వయసులోనే అదిరిపోయే డైలాగ్‌లు చెప్పడమే కాకుండా చక్కటి హావభావాలతో ఆశ్చర్యపరిచి తనను అమితంగా ఆకర్షించిన తన బాల అభిమాని పరశురామ్ మృతిపట్ల ప్రముఖ హీరో రామ్‌చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరశురాం లేని లోటును ఎలా చెప్పాలో కూడా తనకు మాటలు రావడం లేదన్నారు. ఇలాంటి కష్ట సమయాల్లో ఆ కుటుంబానికి పూర్తి ప్రేమ అందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోదరుడు పరుశురామ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఫేస్బుక్లో తన సంతాపాన్ని తెలియజేశారు. మహబూబ్ నగర్‌లోని అయిజ మండలానికి చెందిన పరశురామ్ చిన్న వయసులోనే గొప్ప కళాకారుడిగా కనిపించాడు. ‘మగధీర’ సినిమాలోని డైలాగ్‌లను అలవోకగా చెబుతూ ఆశ్చర్యపరిచేశాడు. అతడు చెప్పిన డైలాగ్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి భారీ పాపులారిటీని సంపాధించుకున్నాయి. అతడికి ముచ్చటపడి రామ్‌చరణ్ స్వయంగా తన ఇంటికి పిలిపించుకుని సరదాగా కాసేపు ముచ్చటించారు. అతడికి కానుకలు కూడా ఇచ్చారు. అంతేకాకుండా పరశురాం విద్యాబాధ్యతలు కూడా తానే చూసుకుంటానని తెలిపారు. అయితే, ఇటీవల కామెర్ల వ్యాధికి గురైన పరశురామ్ అనూహ్యంగా కన్నుమూశాడు. దీంతో అతడి కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది. -
కోలీవుడ్‌కు సూపర్ పోలీస్‌గా రామ్‌చరణ్
టాలీవుడ్ యువ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజకు కోలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంతకుముందు మావీరన్ చిత్రం ఇక్కడ మంచి ఆదరణ పొందింది. త్వరలో స్ట్రయిట్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.తాజాగా సూపర్ పోలీస్‌గా ఒక పవర్ఫుల్ పాత్రలో తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో ఆయన పెద్ద సాహసమే చేశారు. హిందీలో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ హీరోగా నటించిన జంజీర్ చిత్ర రీమేక్‌లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రమే తెలుగులో తుపాన్ గా విడుదలై కమర్షియల్‌గా హిట్ అయ్యింది. ఇప్పుడు సూపర్ పోలీస్‌గా కోలీవుడ్‌కు రానుంది. ఇందులో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంకచోప్రా రామ్‌చరణ్ తేజకు జంటగా నటించడం ఒక విశేషం అయితే, సంచలన హిందీ నటుడు సంజయ్‌దత్ ప్రధాన పాత్రలో నటించడం మరో విశేషం. ఇక ప్రకాశ్‌రాజ్, తనికెళ్లభరణి, శ్రీహరి, మహీగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రల్లో నటించారు. కాకీ షర్టుపై గౌరవంతో పని చేసే నిజాయితీపరుడైన పోలీస్ అధికారి ఇతి వృత్తమే సూపర్‌పోలీస్. తన నిజాయితీ కారణంగా ఐదేళ్లలో 23 సార్లు బదిలీ అయి, చివరికి ముంబైకి చేరిన ఆ పోలీస్ అధికారికి ఒక కలెక్టర్ దారుణ హత్య దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆ హత్యకు కారణాలేంటీ? ఆ హంతకులను ఎలా ఎదుర్కొని శిక్షించారన్న పలు ఆసక్తికరమైన అంశాలకు ప్రతిరూపమే సూపర్ పోలీస్ చిత్రం. ఇంతకు ముందు పలు సక్సెస్ఫుల్ చిత్రాలను కోలీవుడ్‌కు అందించిన స్వాతి, హర్హిణిల భద్రకాళీ ఫిలింస్ అధినేత భద్రకాళీ ప్రసాద్ రూపొందిస్తున్న తాజా చిత్రం ఇది. సత్య సీతల, అడ్డాల వెంకటరావు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకుడు.ఏఆర్కే.రాజరాజన్ సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రం మంచి కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఓరియంటెట్ కథతో జనరంజకంగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. చిత్రంలో ఐదు ఐటమ్ సాంగ్స్ చోటు చేసుకోవడం మరో ప్రత్యేకత అని వారు పేర్కొన్నారు. సూపర్ పోలీస్ చిత్రాన్ని ఇదే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
హైదరాబాద్ - తిరుపతి మధ్య ప్రారంభమైన 'ట్రూజెట్' సర్వీసులు
హైదరాబాద్: ట్రూజెట్ విమాన సర్వీసులను ప్రారంభించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం హైదరాబాద్ - తిరుపతి మధ్య తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. ఈ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు ప్రారంభించారు. టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ తేజ ట్రూజెట్‌లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా కంపెనీ డెరైక్టర్, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ట్రూజెట్ హైదరాబాద్ కేంద్రంగా ప్రాంతీయ విమాన సర్వీసులు నిర్వహిస్తున్న విషయం విదితమే. -
మెగా ఫ్యామిలీ సెంటిమెంట్!
సినిమా రంగం సెంటిమెంట్లకు నిలయం. ఆ సెంటిమెంట్ ఒకటని చెప్పలేం. అనేక రకాల సెంటిమెంట్లు రాజ్యమేలుతున్నాయి. వారాలు - తేదీలు - నెలలు-పండుగలు-కాంబినేషన్లు.....ఇలా అనేక సెంటిమెంట్లు ఎక్కువ మంది నమ్ముతారు. ముఖ్యంగా టాలీవుడ్లో హీరోలు ఎక్కవగా సెంటిమెంట్లను ఫాలో అవుతారని చెబుతుంటారు. అందరికీ ఉన్నట్లే మెగా ఫ్యామిలికి చెందిన హీరోలకు కూడా సెంటిమెంట్లపై నమ్మకం ఉందని అంటున్నారు. వారిలో ఎవరితోనైనా ఓ హీరోయిన్ జతగా నటించిన చిత్రం హిట్ కొడితే, మిగిలినవారి సినిమాలలో కూడా ఆ హీరోయిన్‌కు అవకాశం దక్కడం ఖాయం. నాజూకు భామ శృతి హాసన్ ఇటీవల అటువంటి అవకాశాలను కొట్టేసింది. వరుస పెట్టి ఆ స్టార్ హీరోల సరసన నటించింది. ఇంకా నటిస్తోంది. ఆ రకంగా శృతి మెగా హీరోలకి లక్కీ గర్ల్‌గా మారింది. ఈ బ్యూటీ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజతో ఎవడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో రేసు గుర్రం చిత్రాలలో నటించింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం మెగా అభిమానులు మరోసారి శృతి హాసన్‌తో మెగా హీరోలు రోమాన్స్ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు. దాంతో మెగా హీరోలు కూడా శృతితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. రామ్ చరణ్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్గా శృతి హాసన్‌ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శృతిని హీరోయిన్గా తీసుకోవలసిందిగా శ్రీను వైట్లని రామ్‌చరణ్ కోరినట్లు సమాచారం. అందుకు శ్రీను వైట్ల కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీను వైట్ల ఆగడు, రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఆ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. - శిసూర్య -
హీరో రామ్‌చరణ్‌పై కేసు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా కాల్చిన ఘటనలో హీరో రామ్‌చరణ్ తేజ, చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ నిర్వాహకులు ఆర్.స్వామినాయుడుపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 28న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద, చిరంజీవి బ్లడ్‌బ్యాంకు వద్ద నిబంధనలకు విరుద్ధంగా రామ్‌చరణ్, స్వామినాయుడు ఫొటోలతో బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయడంపై జీహెచ్ఎంసీ సర్కిల్-10 ఏఎంహెచ్‌వో దామోదర్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు మంగళవారం రామ్‌చరణ్, స్వామినాయుడులపై ఐపీసీ సెక్షన్ 421(1), జీహెచ్ఎంసీ ప్రకటనల నిషేధిత చట్టం-1955 కింద కేసు నమోదు చేశారు. -
రాజకీయంగా చిరంజీవికే మద్దతు
మెగా అభిమానుల రాష్ట్రస్థాయి సమావేశంలో తీర్మానం కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం పవన్ తమ గుండెల్లో ఉంటారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్‌కల్యాణ్ రాజకీయంగా వేరుపడిన నేపథ్యంలో అన్నయ్యకే మద్దతు ప్రకటించాలని మెగా కుటుంబం సినీ అభిమానుల సంఘం నిర్ణయించింది. చిరంజీవి, ఆయన కుటుంబ హీరోల అభిమానుల సంఘంగా ఏర్పడిన ‘చిరంజీవి యువత’ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం హైదరాబాద్ ఫిలింనగర్ క్లబ్లో జరిగింది. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో జిల్లాలవారీగా ఉన్న అభిమాన సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చిరంజీవి ఏ రాజకీయ పార్టీలో ఉంటే, తామూ ఆ పార్టీలో కొనసాగుతామని తీర్మానం చేశారు. అభిమానుల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న 15 వేల మందిని గుర్తించి, వారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయాలని నిర్ణయించారు. వీరికి చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు సంతకంతో కూడిన గుర్తింపు కార్డులు ఇవ్వాలని తీర్మానించారు. చిరుకు మద్దతు పలకడం ఆయన తమ్ముడు పవన్క ల్యాణ్‌ను వ్యతిరేకించినట్టు కాదని చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామినాయుడు అన్నారు. పవన్ తమ గుండెల్లో ఎప్పటికీ ఉంటారని.. ఒక హీరోను అభిమానించడమంటే మరో హీరోను వ్యతిరేకిస్తున్నట్టు కాదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెగా అభిమానులందరూ ఒక సంఘటిత శక్తిగా రూపొందడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిపారు. పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ స్థాపన తరువాత అభిమానుల పేరుతో కొందరు రకరకాల ప్రకటనలు చేస్తున్నందున, చిరంజీవి యువత నుంచి కూడా 25 మందిని అధికార ప్రతినిధులుగా నియమించారు. చిరంజీవి పెద్ద సోదరుడు నాగబాబు వారిని ఎంపిక చేసినట్టు సమాచారం. కాగా, ఈ సమావేశానికి 250 మందికి మాత్రమే అధికారికంగా రాంచరణ్ ఫోటోతో ఉన్న పాస్‌లను పంపిణీ చేశారు. పాస్‌లు లేనివారిని సిబ్బంది అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. బ్లడ్ బ్యాంక్‌లో కేక్ కట్ చేసిన చరణ్.. రాంచరణ్ తేజ తన పుట్టిన రోజున జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో బాబాయ్ నాగబాబు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రాంచరణ్ అన్నారు. నిర్మాత బండ్ల గణేష్, ఫిలించాంబర్ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.