జక్కన్న పోస్టుపై వర్మ​ కామెంట్స్‌..! | Director Rajamouli post a Photo with Ram Charan and Jr NTR | Sakshi
Sakshi News home page

జక్కన్న పోస్టుపై వర్మ​ కామెంట్స్‌..!

Published Sun, Nov 19 2017 6:48 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

Director Rajamouli post a Photo with Ram Charan and Jr NTR - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సెన్సెషనల్‌ డైరెక్టర్‌ రాజమౌళి బాహుబలి సినిమాకు ఉత్తమ డైరెక్టర్‌గా నంది అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. జక్కన్న తన ఫేస్‌బుక్‌లో ఒక ఫొటో పోస్టు చేశాడు. ఆ ఫొటోలో మధ్యలో రాజమౌళి ఒకవైపు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌లు కూర్చొన్నారు. ఈ పోస్టుపై విమర్శాత్మక డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తనదైన రీతిలో కామెంట్స్‌ చేశాడు.

వర్మ తన ఫేస్‌బుక్‌లో ‘ ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురూ ఆ టైపేనా .. పైగా ముగ్గురు కూడా పెళ్లైన వాళ్లు.. అల్లా ఏం జరుగుతుంది ? జీసస్‌ దయచేసి మీరైనా నాకు చెప్పండి.. బాలాజీ గారు మీరైనా చెప్పండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఫ్యాన్స్‌ తమదైన రీతిలో స్పందించారు. ఒక అభిమాని అయితే ‘ ఓ జంతువూ.. నువ్వు గేలా ఉండి అందరిని అంటావేంటిరా’ అని వర్మపై విరుచుకుపడ్డాడు. మరో అభిమాని‘ పచ్చ కామెర్లు వ్యాధి ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అనే సామెత’ వర్మకి సరిపోతుందని కామెంట్‌ చేశాడు.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో మల్టీ స్టార్‌ మూవీ 2018లో మొదలవుతుంది.. టాలీవుడ్‌ రికార్డులని బద్దలయ్యే క్షణం.. అని ఓ అభిమాని పోస్టు చేశాడు. బాహుబలి 2015 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement