హీరో రామ్‌చరణ్‌పై కేసు | case filed on hero ramcharan teja | Sakshi
Sakshi News home page

హీరో రామ్‌చరణ్‌పై కేసు

Published Wed, Apr 2 2014 12:31 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

హీరో రామ్‌చరణ్‌పై కేసు - Sakshi

హీరో రామ్‌చరణ్‌పై కేసు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా కాల్చిన ఘటనలో హీరో రామ్‌చరణ్ తేజ, చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ నిర్వాహకులు ఆర్.స్వామినాయుడుపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 28న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద, చిరంజీవి బ్లడ్‌బ్యాంకు వద్ద నిబంధనలకు విరుద్ధంగా రామ్‌చరణ్, స్వామినాయుడు ఫొటోలతో బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయడంపై జీహెచ్‌ఎంసీ సర్కిల్-10 ఏఎంహెచ్‌వో దామోదర్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.

 

విచారణ జరిపిన పోలీసులు మంగళవారం రామ్‌చరణ్, స్వామినాయుడులపై ఐపీసీ సెక్షన్ 421(1), జీహెచ్‌ఎంసీ ప్రకటనల నిషేధిత చట్టం-1955 కింద కేసు నమోదు చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement