రాష్ట్రపతిని కలువనున్న ఎన్నికల కమిషన్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఎన్నికల కమిషన్ అధికారులు ఆదివారం సాయంత్రం కలువనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే సమావేశానికి ఎన్నికల కమిషన్ అధికారులకు అనుమతి లభించింది. దేశవ్యాప్తంగా ఎన్నికైన లోకసభ సభ్యుల జాబితాను రాష్ట్రపతి ప్రణబ్ కు అందించనున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల తీరును రాష్ట్రపతికి అధికారులు వివరించే అవకాశముంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరున్న భారత్ లో ఎన్నికలు నిర్వహించిన తీరుపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా సఫలమైందనే ప్రశంసలు లభిస్తున్నాయి.