హైదరాబాద్ - తిరుపతి మధ్య ప్రారంభమైన 'ట్రూజెట్' సర్వీసులు
హైదరాబాద్: ట్రూజెట్ విమాన సర్వీసులను ప్రారంభించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆదివారం హైదరాబాద్ - తిరుపతి మధ్య తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. ఈ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్గజపతిరాజు ప్రారంభించారు.
టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ తేజ ట్రూజెట్‌లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా కంపెనీ డెరైక్టర్, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ట్రూజెట్ హైదరాబాద్ కేంద్రంగా ప్రాంతీయ విమాన సర్వీసులు నిర్వహిస్తున్న విషయం విదితమే.