
సింగపూర్ : సింగపూర్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్, సింగపూర్ తెలుగు సమాజం సంస్థలు సంయుక్తంగా నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలతో, కోలాటాలతో ప్రాంగణమంతా హోరెత్తింది. తెలంగాణ ప్రముఖ గాయకురాలు వొల్లాల వాణి, మిట్ట సౌమ్య గారి ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సుమారు 2500మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ‘మేము అడుగగానే మాతో కలసి ఈ బతుకమ్మ సంబరాలలో పనిచేయడానికి ముందుకు వచ్చిన సింగపూర్ తెలుగు సమాజం వారికి హృదయ పూర్వక ధన్యవాదములు ..ఇంకా ముందు ముందు తెలుగు వారందరికీ కోసం ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామ’ని సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్ కి చెందిన పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. మనిషి ప్రకృతితో మమేకమయ్యే ఈ పూల పండుగ ఘనమైన సంస్కృతి, సాంప్రదాయాలకు తెలంగాణ ప్రతీక అని, వెయ్యి సంత్సరాల పైగా చరిత్ర కలిగిన ఈ పండుగను సింగపూర్ లో ఇంత సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. సింగపూర్లో నివసిస్తున్న తెలుగువారందికీ ఈ సందర్భంగా తెలుగు సమాజం తరుపున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు.
ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయడంలో సహకరించిన వారందరికీ, స్పాన్సర్స్ కు పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి పేరు పేరున ధన్యవాదములు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి అహర్నిశలు కృషిచేసిన కృష్ణ ప్రసాద్ రావు వేరమళ్ళ, చిట్ల విక్రమ్ పటేల్, యశరవేణి విజయ్, వెంకట రమణ రెడ్డి, మొగిలి రాజేందర్ రెడ్డి, దామోదర్, చిలుక సురేష్, నల్ల వేణు, మురళి మోహన్ రెడ్డి, రంజిత్ రావు, అంకటి తిరుపతి, సి హెచ్ మహేష్, చల్ల కృష్ణ, పింగిళి భరత్, గుడిపల్లి చంద్ర, మంచుకంటి శ్రీధర్, తిరుమల రెడ్డి, ఆర్ సి రెడ్డి, తీపి రెడ్డి రవీందర్ రెడ్డి, రవీందర్ రావు, మోతుకూరి రవి, గోసంగి శంకర మూర్తి, ముసుకు శేఖర్ రెడ్డి, వేముల సురేష్, మాసర్తి వెంకటేష్, గోలి శ్రీధర్ రెడ్డి, ముద్దం అశోక్, యెల్ల రామ్ రెడ్డి, కందుకూరి జగన్, అనసూరి రవి, మడిపల్లి రామ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment