
జర్మనీ : మ్యూనిచ్ నగరం లో తెలంగాణా సంస్కృతికి ప్రతిబింబమైన సద్దుల బతుకమ్మ కన్నుల పండుగల జరిగింది. ఈ వేడుకల్లో 200లకు పైగా ఎన్నారై మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో అక్కడి పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల పాటలు పాడారు. తెలంగాణలో జరుపుకున్న విధంగానే జర్మనీలోనూ బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణ, తెలుగు వాసులు కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులు అరవింద్ గుంత, నరేష్ మేసినేని, రమేష్, వికాస్, శ్రీనివాస్, మహేష్, శివ, సుష్మ మేసినేని అన్నారు. మ్యూనిచ్ నగరంలో జరిగిన బతుకమ్మ సంబరాలు జర్మనీలోని మిగితా నగరాలకు స్ఫూర్తినిచ్చాయి.


Comments
Please login to add a commentAdd a comment