చికాగో : తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు. చికాగోలోని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దాదాపు 300 మంది మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరూ రంగురంగుపూలతో బతుకమ్మలను తయారు చేసి తమ వెంట తీసుకొచ్చారు. ఆటపాటలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ఈ కార్యక్రమంలో హనుమంత్ రెడ్డి, మెహర్ మాదవరం, లక్ష్మీ బోయపల్లి, భాను స్వర్గం, వెంకట్ తుడి, మహిపాల్ వంచ, హరి రైనీ, సునీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితురాలైన జానపద గాయనీ రాగం శాలినీ ఆలపించిన పాటలు హుషారెత్తించాయి.
Comments
Please login to add a commentAdd a comment