
బతుకమ్మతో ఇందిరాగాంధీ(ఫైల్)
వరంగల్, హన్మకొండ కల్చరల్ : 1978లో ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఉన్న సమయంలో సమాచారశాఖ కమిషనర్‌గా ఉన్న దుర్గాభక్తవత్సలం చొరవతో ఢిల్లీలో మన వరంగల్ మహిళలు బతుకమ్మ ప్రదర్శన ఇచ్చారట. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బతుకమ్మ పండుగపై ఆసక్తి చూపించారట. బతుకమ్మ పండుగను గురించి అడిగి తెలుసుకుని, వరంగల్‌లో అత్యంతవైభవంగా జరుపుతారని చెప్పినప్పుడు రామ్‌లీలా మైదానంలా ఆ ప్రాంతాన్ని బతుకమ్మ ఆడుకోవడానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని చెప్పారట.