
సిడ్నీ : సిడ్నీ నగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఆస్ట్రేలియన్ స్టేట్ అసోసియేషన్ (ATSA) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. దాదాపు వెయ్యి మంది మహిళలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. ఆటపాటలు, కోలాటాలతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. నార్త్‌మీడ్ హైస్కూల్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను జరుపి అనంతరం.. ప్యారమట్ట నదిలో నిమజ్జనం చేశారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఈ బతుకమ్మ సంబరాల్ని జరుపుకున్నామని, గత పదమూడు సంవత్సరాలుగా జరుపుకుంటున్న ATSA వేడుకలన్నంటికి ఈ బతుకమ్మ వేడుక తలమానీకమని ATSA అధ్యక్షుడు రవిందర్ చింతామణి అన్నారు.

Comments
Please login to add a commentAdd a comment