సాక్షి, హైదరాబాద్: బంతి, చామంతి పువ్వుల్లో బతుకమ్మ పసిడి కాంతులీనడం తెలిసిందే. కానీ.. బంగారంతోనే బతుకమ్మను తయారు చేశారు కూకట్‌పల్లికి చెందిన నాయినేని శ్రీవైష్ణవి, శ్రీనైన. శుక్రవారం ఆటకోసం బంగారు బతుకమ్మను అందంగా ముస్తాబు చేసి తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా వారి తాత సీహెచ్.జనార్దన్‌రావు ఆ అరుదైన బతుకమ్మను కానుకగా ఇచ్చినట్లు వారు తెలిపారు. సుమారు కేజీన్నర వెండికి బంగారాన్ని జోడించి పూల ఆకృతిలో బతుకమ్మను తయారు చేయించినట్లు వెల్లడించారు. బంగారంతో తయారు చేసిన మొట్టమొదటి బతుకమ్మ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
చదవండి: దేవీ శరన్నవరాత్రులు: అమ్మవారికి రూ.5,55,55,555తో అలంకారం
Comments
Please login to add a commentAdd a comment