Bathukamma 2022
-
టీపాడ్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ, దసరా వేడుకలు
కళల నిలయమైన అమెరికాలోని డాలస్.. మన తెలుగువారి పండుగల అందాలనూ అద్దుకుంటోంది. తంగేడు వనాన్ని, గునుగుపూల సోయగాన్ని ఇముడ్చుకుని తెలంగాణ పండుగ బతుకమ్మకు మరింత కళను జోడించింది. చరిత్ర సంరక్షణకూ పెట్టింది పేరైన ఆ పట్టణం.. మన బతుకమ్మ, దసరా పండుగల సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అక్కడ నివసిస్తున్న తెలంగాణ ప్రజల సమూహం తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్).. ఏ విదేశాలలో నిర్వహించలేనంత వైభవంగా, ఈ పండుగలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రత్యేకతను చాటింది. దాదాపు పదిహేను వేల మంది హాజరై మహా సందడి చేసిన ఈ కార్యక్రమానికి డాలస్ పరిధిలోని ఫ్రిస్కో పట్టణంలో గల కొమెరికా సెంటర్ (డాక్టర్ పెప్పర్ ఎరెనా స్టేడియం) వేదికగా నిలిచింది. ఏటా బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి దృష్టిని టీపాడ్ ఆకర్షించి సంగతి తెలిసిందే. దీంతో టీపాడ్ ఆతిథ్యం గురించి తెలుసుకుని పొరుగు రాష్ట్రాలైన ఓక్లహామా, కాన్సాస్, ఆర్కన్సాస్లో ఉంటున్న తెలుగువారూ అక్కడికి విచ్చేసి సందడి చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సుమారు 6మంది మహిళలు, బాలికలు సామూహికంగా పాడుతూ, చప్పట్లు కొడుతూ లయబద్దంగా కదులుతుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజాము వరకు వేడుకలు కొనసాగాయి. స్థానిక డ్యాన్స్ స్కూల్స్ విద్యార్థుల నృత్యాలతో వేడుక మొదలయింది. అమ్మవార్లే కదిలివచ్చారా అన్నట్టుగా నవదుర్గ వేషధారణతో అమ్మాయిల ఊరేగింపు వైభవోపేతంగా సాగింది. నాలుగు గంటల పాటు సాగిన సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి. అనంతరం విజయదశమి వేడుకలను నిర్వహించారు. శమీపూజ చేశారు. సినీనటి రీతూవర్మ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఆపై అందరినీ ఆహ్లాదపరుస్తూ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బృందం తమ పాటలు, సంగీతంతో కొత్త లోకంలో విహరించేలా చేసింది. గాయకులు లిప్సికా, రోల్ లైడా, ధనుంజయ్ తదితరులు తమ పాటలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గాను తెలంగాణ పీపుల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) Telangana people’s association of Dallas (T pad) భారీ కసరత్తే చేసింది. దాదాపు నెలరోజుల క్రితమే అసోసియేషన్ బృందం కమిటీలు గా ఏర్పడి బాధ్యతలను తీసుకున్నారు. టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్, అధ్యక్షుడు రమణ లష్కర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాణి పంచెర్పుల, కోఆర్డినేటర్లు ఈ కార్యక్రమం ఆసాంతం విజయవంతమయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నాటా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి తనవంతు సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా, స్థానిక, జాతీయ తెలుగు సంస్థలకు, దాతలకు, మీడియా సంస్థలకు తమ కార్యక్రమాలకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న డాలస్ లోని తెలుగు వారందరికీ TPAD నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. -
హైదరాబాద్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
ఆలయంలో అనుకోకుండా ఎదురుపడ్డ గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత..
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత అనుకోకుండా ఒకరికి ఒకరు తారసపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి (శ్రీ సీతారామచంద్రస్వామి) ఆలయం వద్ద ఈ సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అమ్మపల్లి ఆలయం వద్ద బతుకమ్మ సంబురాల నిర్వహణకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలోకి వెళ్లి అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి పూజలు నిర్వహిస్తుండగా.. కాసేటికి ఊహించని విధంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్కడికి చేరుకున్నారు. నేరుగా ఆలయంలోకి వెళ్లారు. అప్పటికే అక్కడ పూజలు నిర్వహిస్తున్న కవిత.. గవర్నర్‌ను చూసి పలకరించారు. పూజ అనంతరం బతుకమ్మ ఉత్సవాలకు రావాలని కోరగా.. తాను స్వామి పూజలు జరిపిస్తానని గవర్నర్ జవాబిచ్చారు. పూజల తర్వాత కవిత ఆలయం గర్భగుడి నుంచి బయటకు వెళ్లగా.. ప్రత్యేక పూజల అనంతరం గవర్నర్ ఉత్తర ద్వారం ద్వారా బయటకు వెళ్లిపోయారు. కొత్తూరు మండలంలోని చేగూరు వద్ద ఉన్న కన్హాశాంతి వనం ఆశ్రమానికి వెళ్లిన గవర్నర్.. తిరుగు ప్రయాణంలో అమ్మపల్లికి వచ్చారు. గవర్నర్ ఆకస్మిక రాకతో ఆలయం అధికారులు, పోలీసులు కాసేపు పరుగులు పెట్టాల్సి వచ్చింది. తెలంగాణ మెల్లగా తెరిపిన పడుతోంది: ఎమ్మెల్సీ కవిత తెలంగాణ మెల్ల మెల్లగా మళ్లీ తెరిపిన పడుతోందని, తెలంగాణ రాకముందు అనుకున్నవి ఒక్కొక్కటి నిజమవుతున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బతుకమ్మ సంబురాలకు హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడారు. 11వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. అంతకుముందు మహిళలతో కలిసి కవిత పూలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మను నెత్తిన పెట్టుకుని ఆలయంలో తిరిగారు. పాటలు పాడి, ఆడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. చదవండి: బెంజ్ సీఈవోకు తప్పని ట్రాఫిక్ కష్టాలు.. కిలోమీటర్లు నడిచి, ఆటో ఎక్కి -
బహుజన బతుకమ్మ ఆడదాం
మన సమాజపు ఆవరణలోని పునాది ఉపరితలాల్లో పరివ్యాప్తి చెంది, సమాజపు లోతుల్లోకి పాతుకుపోయిన కులవివక్ష, లింగ వివక్ష గురించి మాట్లాడుకోవడానికి మున్నూట ఆరవై ఐదు రోజులు సరిపోవు. అలాంటి వివక్షకు గురవుతున్న బహుజన సమాజపు స్త్రీలు అచ్చంగా ఆడి పాడేదే బతుకమ్మ పండుగ. చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ, తదనంతర విప్లవోద్యమంలోనూ, అలాగే స్వరాష్ట్ర సాధన పోరాటంలోనూ బతుకమ్మ ఒక ఉద్యమ పతాకగా మన చేతికందింది. నిషేధాలకు గురై కూడా కొనసాగుతున్న అంటరానితనం, అన్ని రంగాల్లో ప్రబలిన కులవివక్ష, పితృస్వామ్యం, బతుకమ్మ పండుగల్లోనూ వ్యక్తమవుతుంది. ప్రజలంతా జరుపుకునే పండుగల్లోనూ ఊరూ–వాడల్ని విభజించే కుల వివక్షకు వ్యతిరేకంగా ‘కల్సి ఆడుదాం– కల్సి పాడుదాం–కల్సి పోరాడుదాం’ అంటూ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బహుజన బతుకమ్మ ద్వారా పండుగల్లోని అసమానతలను, వివక్షను సరిచేస్తూ దీన్నొక పంటల పండుగగా జరుపుతున్నాం. అందుకే ‘బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం’ అంటూ చాటుతున్నాం. బతుకమ్మ బహుజన సాంప్రదాయం. పురాణ ఇతి హాసాల్లో బతుకమ్మ గురించి ఏమి చెప్పినా బతుకమ్మ మాత్రం తెలంగాణ పంటల పండుగ. మత కోణం నుండి దీనిని బ్రాహ్మణీకరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దూరంగా నిశ్చేష్ఠులై ఉండలేము కదా! తెలంగాణ ఉత్పత్తి విధానంలోని నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపడ్తూ దానితో ముడిపడ్డ పంటలనూ, ఆ పంటలకు నీరిచ్చే చెరువులూ, కుంటలనూ; వాటికి ఆదరువైన గుట్టలూ, కొండలనూ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. అలా ప్రతి ఏటా వర్తమాన సమస్యలతో జోడించి బహుజన బతుకమ్మను కొనసాగిస్తున్నాం. నా అనుభవంలో ఏ కులానికి ఆ కులం కలిసి ఆడు కోవడం, బతుకమ్మను నీళ్లల్లో వేసి సాగనంపి మాలో మేమే సద్దులు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం. నా చిన్నతనంలో కుల వాడలు, వెలివాడలు స్పష్టంగా ఉన్న కాలంలో కుర్మోళ్ల బతుకమ్మ, రెడ్డోళ్ల బతుకమ్మ అంటూ పోటీపడేవాళ్ళం. నిన్న మొన్నటిదాకా కూడా దళితుల బతుకమ్మ ఊర్లోళ్ళ బతుకమ్మతో కలిపి ఆడుకోవడం అనేది లేకుండా పోయిన విషయం మన గమనంలో ఉంది. గడిచిన 12 ఏళ్ల అనుభవంలో దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేస్తూ ఊరుతోపాటు ఆడి పాడి వారితో కలిసి ఒకే చెరువులో నిమజ్జనం చేయడమే ఒక విప్లవాత్మక చర్యగా ప్రజలు భావించారు. ఇక గర్భగుడిలోకి దళితుల ప్రవేశం గురించి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందేమో! ఇంకా కొన్ని గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి అమలు జరుగుతోంది. ఇప్పటికీ భూమిలేని దళితులు కోకొల్లలు. వారికి కనీస భూమి ఇవ్వాలి. వారు ఊరుతో కలిసి ఆడుకొని, సహపంక్తి భోజనాలు చేసుకుని ఆత్మ గౌరవంగా పండుగ చేసుకునేలా ప్రజలు ఐక్యతను చాటాలి. - విమలక్క ప్రజా గాయని -
కేజిన్నర వెండి, బంగారంతో కూకట్‌పల్లిలో బతుకమ్మ.. వైరల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: బంతి, చామంతి పువ్వుల్లో బతుకమ్మ పసిడి కాంతులీనడం తెలిసిందే. కానీ.. బంగారంతోనే బతుకమ్మను తయారు చేశారు కూకట్‌పల్లికి చెందిన నాయినేని శ్రీవైష్ణవి, శ్రీనైన. శుక్రవారం ఆటకోసం బంగారు బతుకమ్మను అందంగా ముస్తాబు చేసి తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బతుకమ్మ పండుగ సందర్భంగా వారి తాత సీహెచ్.జనార్దన్‌రావు ఆ అరుదైన బతుకమ్మను కానుకగా ఇచ్చినట్లు వారు తెలిపారు. సుమారు కేజీన్నర వెండికి బంగారాన్ని జోడించి పూల ఆకృతిలో బతుకమ్మను తయారు చేయించినట్లు వెల్లడించారు. బంగారంతో తయారు చేసిన మొట్టమొదటి బతుకమ్మ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. చదవండి: దేవీ శరన్నవరాత్రులు: అమ్మవారికి రూ.5,55,55,555తో అలంకారం -
Bathukamma Song: ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జాము ఆయె చందమామా
తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఆదివారం ఎంగిపూలతో ఆరంభమైన ఈ పండుగ సందడి కొనసాగుతోంది. తొమ్మిదిరోజుల పాటు కోలాహలంగా సాగే ఈ వేడుకలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. పల్లె, పట్నం అంతటా ప్రాచుర్యం పొందిన బతుకమ్మ పాట ఒక్కేసి పువ్వేసి చందమామా.. లిరిక్స్ ఈ పండుగ సందర్భంగా మీకోసం.. ‘‘ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జాము ఆయె చందమామా పైన మఠం కట్టి చందమామా.. కింద ఇల్లు కట్టి చందమామా మఠంలో ఉన్న చందమామా.. మాయదారి శివుడు చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా గౌరి గద్దెల మీద చందమామా.. జంగమయ్య ఉన్నాడె చందమామా రెండేసి పూలేసి చందమామా.. రెండు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా మూడేసి పూలేసి చందమామా.. మూడు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా నాలుగేసి పూలేసి చందమామా.. నాలుగు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా ఐదేసి పూలేసి చందమామా.. ఐదు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా ఆరేసి పూలేసి చందమామా.. ఆరు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా ఏడేసి పూలేసి చందమామా.. ఏడు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా ఎనిమిదేసి పూలేసి చందమామా.. ఎనిమిది జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా తొమ్మిదేసి పూలేసి చందమామా.. తొమ్మిది జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా తంగేడు వనములకు చందమామా.. తాళ్లు కట్టబోయె చందమామా గుమ్మాడి వనమునకు చందమామా.. గుళ్లు కట్టబోయె చందమామా రుద్రాక్ష వనములకు చందమామా.. నిద్ర చేయబాయె చందమామా’’ సేకరణ : రాచర్ల శ్రీదేవి, భారత్ టాకీస్ రోడ్, కరీంనగర్ చదవండి: Bathukamma Songs: బతుకమ్మ: పుట్టిన రీతి జెప్పె చందమామ! పూర్వకాలం నాటి పాట! Bathukamma Songs: పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి! కలవారి కోడలు ఉయ్యాలో..! -
Batukamma: అలాంటి పిచ్చి డ్యాన్స్‌లు వద్దు.. గౌరమ్మ తల్లి గౌరవం కాపాడుదాం!
ఎక్కడా లేనట్లుగా పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్నాం. ఎంతో విశిష్టత ఉన్న ఈ వేడుకల్లో తొమ్మిదిరోజులపాటు ఆడబిడ్డలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పొద్దున్నే లేచి తీరొక్క పూలను సేకరిస్తున్నారు. అందంగా బతుకమ్మలను పేర్చి సాయంత్రం అంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతున్నారు. ఎంగిలిపూలతో మొదలైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పటి బతుకమ్మ ఆటాపాట తీరుపై పలువురు మహిళలు అసంతృప్తి వ్యక్తంజేస్తున్నారు. నాటి సంస్కృతి, సంప్రదాయాలు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అప్పటి, ఇప్పటి బతుకమ్మ వేడుకల నిర్వహణపై పలువురు మహిళలు వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. చదవండి: బతుకమ్మ, జానపద సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న సింగర్స్ అప్పట్లోనే బాగా ఆడేవాళ్లం కోటపల్లి: బతుకమ్మ పండుగత్తే మా చిన్నతనంలో ఎంతో సంబురపడేటోళ్లం. మాకన్న పెద్దోళ్లు ఆడుతుంటే వాళ్ల అడుగులో అడుగేసి వారి లెక్కే ఆడెటోళ్లం. నడుము వంచి చేతులతో చప్పట్లు కొడుతూ పాటలు పాడేవాళ్లం. ఇప్పటోళ్లకు డీజే పాటల మీద డ్యాన్సుల చేసుడు తప్ప చప్పట్లు కొడుతూ ఆడుడు తెల్వది. పాటలు పాడుతలేరు. చప్పట్లు కొడుతూ స్వయంగా పాడుతూ సంస్కృతిని కాపాడుకోవాలె. – కావిరి సుగుణ, రొయ్యలపల్లి, కోటపల్లి మండలం పెద్దవాళ్ల నుంచి నేర్చుకున్న.. చెన్నూర్: చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, అమ్మ బతుకమ్మ పాటలు పాడడం గమనించిన. నాకూ పాటలు అంటే ఇష్టం. ప్రతీ బతుకమ్మ పండుగకు పాటలు పాడడం చెప్పలేనంత సంతోషాన్నిస్తోంది. పండుగ వచ్చిందంటే కొత్తకొత్త పాటలు నేర్చుకొని తొమ్మిది రోజులు పాడేదాన్ని. బతుకమ్మ అంటేనే చప్పట్లు కొడుతూ పాడుతూ ఆడేది. బతుకమ్మ ఆటను అప్పట్లాగే ఆడితేనే బాగుంటది. – మదాసు శృతి, చెన్నూర్ పిచ్చి పాటలు.. పిచ్చి డ్యాన్స్‌లు.. కాసిపేట: ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాకా అప్పట్లో ఎంతో సంబురంగా చప్పట్లు కొడుతూ స్వయంగా పాటలు పాడెటోళ్లం. 40 ఏళ్లుగా మా ఊళ్లో నేను పాటలు పాడుతుంటే మిగతావాళ్లు పాడేది. ప్రస్తుతం ఏడ జూసినా సౌండ్ బాక్స్‌లు, డీజేలల్ల పిచ్చి పాటలు పెట్టి పిచ్చి డ్యాన్స్‌లు చేస్తున్నరు. ఇది మన సంస్కృతి కాదని అందరూ తెలుసుకుంటే మంచిది. – సాయిని మల్లక్క, కోమటిచేను, కాసిపేట మండలం పాటలు పాడుతూ ఆడుతాం చెన్నూర్‌రూరల్: నేను బతుకమ్మ పాటలు పుస్తకంలో చూసి నేర్చుకొన్న. నా చిన్నతనం నుంచి బతుకమ్మ వద్ద పాటలు పాడుతున్న. మా వాడకు బతుకమ్మ ఆడేటప్పుడు చప్పట్లు కొడుతూ స్వయంగా పాడుతున్నం. ఊళ్లో చాలాచోట గిట్లనే ఆడుతున్నరు. నాకు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడడం అంటే చాలా ఇష్టం. చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడి మన సంస్కృతిని కాపాడుకోవాలె. – గద్దె శ్రీలత, పొక్కూరు, చెన్నూర్ డీజే సౌండ్లు తప్ప చప్పట్లు లేవు కాసిపేట: బతుకమ్మ వేడుకలు మొదలైనయంటే తొమ్మిది రోజులు ఊళ్లో పండుగ వాతావరణం కనిపించేది. ఒకరు పాటందుకుంటే మిగతా వాళ్లు అనుకరించెటోళ్లు. సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆనందంగా ఆడుకునెటోళ్లం. ఇప్పుడు డీజే సౌండ్లు, డ్యాన్స్‌లు తప్పా చప్పట్లు వినిపించడంలేదు. యువత పూర్వం నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమివ్వాలె. – బూసి రాజేశ్వరి, సోమగూడం, కాసిపేట మండలం ఇప్పుడు పాడెటోళ్లే లేరు లక్సెట్టిపేట: చిన్నప్పుడు బతుకమ్మ పాటలు పాడుతూ సంబురంగా బతుకమ్మ పండుగను జరుపుకొనేటోళ్లం. బతుకమ్మ వచ్చిందంటే చాలు సంబురంగా పాటలు పాడేదాన్ని. ఇప్పుడు పాటలు పాడేవాళ్లే లేరు. డీజే పాటలు పెట్టుకుని ఆడుతున్నరు. రోజురోజుకూ ఆట తీరే మారుతున్నది. బాధనిపిస్తుంది. సంప్రాదాయాన్ని కాపాడుకోవాలె. పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుకోవాలె. – లింగాల దేవక్క, గంపలపల్లి, లక్సెట్టిపేట మండలం ఎంతో ఇష్టపడి పాటలు పాడుతా భీమారం: బతుకమ్మ పండుగ అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రతీ సంవత్సరం పండుగ వచ్చిందంటే చాలు ఉదయాన్నే మాఇంట్లో లేని పూలను ఇంటింటికీ వెళ్లి సేకరించి బతుకమ్మను పేరుస్తా. డీజే పాటలు పెట్టినా నన్నే పాడుమంటరు. నేను పాడితే మిగతావాళ్లు సంబురంగా పాడుతున్నరు. మా ఊళ్లో ఎంతో ఇష్టంగా తొమ్మిదిరోజుల పాటు సంబురాలు జరుపుకొంటున్నం. – ఎల్కటూరి శంకరమ్మ, భీమారం మండలం ఇప్పటోళ్లకు ఆడుడే రాదు జన్నారం: నాడు సాయంత్రం బతుకమ్మ ఆట మొదలువెట్టి గంటలతరబడి ఆడుకునేది. వాడోళ్లందరం చప్పట్లు కొడుతూ పాటలు పాడెటోళ్లం. ఎంతో భక్తిశ్రద్ధలతో తొమ్మిదిరోజులు పండుగ జరుపుకొనేది. ఇప్పుడు ఎక్కడ చూసినా డీజే పాటలు పెట్టుకుని ఎగురుతున్నరు. బతుకమ్మల చుట్టూ కోలలాడుతున్నరు. బతుకమ్మ ఆటనే మార్చిండ్రు. ఇప్పటోళ్లకు ఎగురుడు తప్ప ఆడుడు రాదు. – అమరగొండ లక్ష్మి, జన్నారం మండలం మా అప్పుడు డీజేల లొల్లి లేదు లక్ష్మణచాంద: అప్పట్లో మేం బతుకమ్మ ఆడేటప్పుడు గీ డీజేల లొల్లి లేదు. అచ్చమైన బతుకమ్మ పాటలు పాడెటోళ్లం. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పుట్లు కొడుతూ ఒకరు ముందు పాడితే వెనుక అందరం పాడేది. ‘రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో..’ అంటూ రాగమెత్తితే ఆ జోష్ వేరేలా ఉండేది. ఇప్పటోళ్లకు అప్పటిలెక్క ఆడుడే రాదు. తెల్వనోళ్లు నేర్చుకుని ఆడాలె. – ఎంకవ్వ, లక్ష్మణచాంద సంప్రదాయాలను కాపాడుకోవాలె భీమిని: పూర్వపు సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరంపైన ఉంది. పూలను దేవతగా పూజించే పండుగ మరెక్కడా లేదు. సంప్రదాయం ప్రకారం బతుకమ్మ ఆడాలి. నాడు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆడుకునేవాళ్లం. నేడు డీజే సౌండ్ల మధ్య జరుపుతున్నారు. ఆనాటి సంప్రదాయాలను కాపాడుకోవాలె. – పుల్లూరి సురేఖ, కన్నెపల్లి, భీమిని మండలం అప్పటి ఆట పిల్లలకు నేర్పిస్తున్న భైంసాటౌన్: నేటి తరం పిల్లల కు మన అప్పటి బతుకమ్మ ఆట గురించి తెలియదు. పిల్లలకు వివరించేందుకు తల్లిదండ్రులకూ సమయం ఉండడం లేదు. నేను భరత నాట్యం నేర్చుకుని ఇప్పటి పిల్లలకు నేర్పుతున్న. బతుకమ్మ పండుగ అంటే డీజే పెట్టుకుని డ్యాన్సులు చేయడం కాదని వారికి వివరిస్తున్న. దీంతో వారిలో మార్పు వస్తోంది. కొందరైనా నన్ను అనుసరించడం సంతోషంగా ఉంది. – రంగు సౌమ్య, నృత్య శిక్షకురాలు, భైంసా -
బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. (ఫొటోలు)
-
తెలంగాణ రాజ్ భవన్ లో బతుకమ్మ సంబరాలు
-
పుష్ప విలాసం.. నేడు ఎంగిలి పూల బతుకమ్మ
తీరొక్క రంగులు. వేర్వేరు రకాలు. వాటన్నింటా సుగంధమే. నిర్జన ప్రదేశాల్లో జన్మ తీసుకొని తంతెలు తంతెలుగా నిర్మితమయ్యే పుష్పాల విలాసమే బతుకమ్మ. నేడు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, హన్మకొండ: తెలంగాణలోని సంప్రదాయాలకు సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. ఈపండుగ వచ్చిందటే ఆడపడుచులకు ఎనలేని ఆనందం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్యను జానపదులు పెత్రమాస అంటారు. బతుకమ్మ పండుగ పెత్రమాసనాడు ప్రారంభమై మహాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. ఆరో రోజు అర్రెం అంటారు. ఈరోజు బతుకమ్మను పేర్చడం గానీ ఆడడం గానీ చేయరు. ఆరో రోజు బతుకమ్మ అలిగిందని భావిస్తారు. బతుకమ్మను పేర్చడానికి వరుసగా పూలను సేకరిస్తుంటారు. ఆకారణంగా ఆరో రోజు పూలను సేకరించకుండా ఉండడానికే అర్రెం అనే నియమం వచ్చినట్లు జానపద పరిశోధకుల అభిప్రాయం. బతుకమ్మను పేర్చేందుకు తంగేడు, గునుగు, సీతజడ, బంతి, కట్ల, మందార, మొల్ల, గోరంట, ముళ్లగోరంట, పట్నం బంతి, తురకబంతి, చామంతి, కలువ తామర, గన్నేరు, ఉద్రాక్ష, జాజి, గుమ్మడి, సంపెంగ తదితర పూలను సేకరించి ఇంటికి తెచ్చుకుంటారు. ఎంగిలిపూలు అని ఎందుకంటారంటే.. బతుకమ్మ తయారీకోసం ఒకరోజు ముందే పూలను సేకరిస్తారు. పూలు తీసుకొచ్చిన వారింట్లో ఈపూలు ఒకరోజు నిద్ర చేస్తాయి. అలా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారని పెద్దలు చెబుతున్నారు. ముందు రోజు పూలను సేకరించడం వల్ల మొగ్గలుగా ఉన్న పూలను తెచ్చుకొని బతుకమ్మను పేర్చుతున్నప్పుడు నోటితో పూలను ఊది వాటిని పేరుస్తారు. అలా పూలను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని చెబుతుంటారు. పెత్రమాస రోజు ఉదయమే లేచి చనిపోయిన పెద్దలకు నివేదనలు చేసి అనంతరం భోజనం చేసిన తర్వాత బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారని పలురకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. బతుకమ్మకు హారతి ఇస్తున్న మహిళలు పితృ అమావాస్య.. పెత్రమాసనే పితృ అమావాస్య అని, మహాలయ అమావాస్య అని పిలుస్తారు. పెద్దలకు బియ్యం ఇవ్వడానికి పెత్రమాసం మంచిరోజు. ఈరోజు పైలోకాల్లో ఉన్న పితృదేవతలు భూలోకంలో తమ వారి కోసం వస్తారని భావిస్తారు. వారికోసం వారి సంతృప్తి కోసం సహపంక్తి భోజనాలు నిర్వహించి కులమతభేదం లేకుండా కలిసి భుజించాలని అంటారు. అలా చేయడం అందరికీ వీలవదని పితృదేవతల పేరుమీద బ్రాహ్మణులకు బియ్యం ఇచ్చే సంప్రదాయం ప్రారంభమైనట్లు పురోహితులు చెబుతున్నారు. పూల దారులు ఆదివారం పెత్రమావాస్య కావడంతో ఎంగిలి పూల బతుకమ్మను పేర్చడానికి కావాల్సిన పూల సిబ్బిలు, రంగులు, తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీతజడలు మొదలైనవి కొనుగోలు చేయడానికి వచ్చిన వారితో శనివారం రాత్రి రోడ్లు కిక్కిరిసిపోయాయి. హనుమకొండ చౌరస్తా, కుమార్‌పల్లి, టైలర్స్ట్రీ్టట్, అంబేడ్కర్ సెంటర్, వరంగల్‌లోని పిన్నవారి వీధి, రామన్నపేట, బట్టలబజార్, కాశీబుగ్గ, గోపాలస్వామి గుడి, కాజీపేటలోని బాపూజీనగర్ తదితర ప్రాంతాల్లో పూల అమ్మకాలు జోరుగా సాగాయి. 200 ఏళ్ల నాటి బతుకమ్మ పాట శ్రీలక్ష్మీ దేవియు చందమామ – సృష్టి బతుకమ్మాయె చందమామ పుట్టిన రీతి జెప్పె చందమామ – భట్టు నరసింహకవి చందమామ ధర చోళదేశమున చందమామ– ధర్మాంగుడను రాజు చందమామ ఆరాజు భార్యయు చందమామ– అతి సత్యవతి యంద్రు చందమామ నూరునోములు నోచి చందమామ – నూరు మందిని గాంచె చందమామ వారు శూరులయ్యె చందమామ – వైరులచే హతమైరి చందమామ తల్లిదండ్రులపుడు చందమామ – తరగనీ శోకమున చందమామ ధనరాజ్యమునుబాసి చందమామ – దాయాదులను బాసి చందమామ వనితతో ఆరాజు చందమామ – వనమందు నివసించె చందమామ కలికి లక్ష్మిని గూర్చి చందమామ – పలికె వరమడుగుమని చందమామ వినుతించి వేడుచు చందమామ – వెలది తన గర్భమున చందమామ పుట్టుమని వేడగా చందమామ – పూబోణి మది మెచ్చి చందమామ సత్యవతి గర్భమున చందమామ – జన్మించె శ్రీలక్ష్మీ చందమామ అంతలో మునులునూ చందమామ – అక్కడికి వచ్చిరి చందమామ కపిలగాలవులునూ చందమామ – కశ్యపాంగీరసులు చందమామ అత్రి వశిష్ఠులూ చందమామ – ఆ కన్నియను జూచి చందమామ బతుకు గనె ఈతల్లి చందమామ – బతుకమ్మ యనిరంత చందమామ నేడు పాటల పోటీలు శ్రీరాధేశ్యాం సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వేయిస్తంభాల దేవాలయంలో బతుకమ్మ పాటల పోటీలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. బతుకమ్మ పాటల పోటీల్లో పాల్గొని విజేతలైన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజులు మహిళలు ప్రశాంతంగా దేవాలయంలో ఆడుకోవచ్చని తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. -
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ, 'బతుకమ్మ' ఉత్సవాల ప్రారంభం (ఆదివారం నుంచి) సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు, పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా, రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబురం గొప్పగా వెల్లివిరుస్తుందని సీఎం తెలిపారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేసిందన్నారు. దాదాపు రూ.350 కోట్ల ఖర్చుతో కోటి మంది ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన కోటి చీరెలను బతుకమ్మ కానుకగా అందిస్తూ గౌరవించుకుంటున్నామని సీఎం అన్నారు. ప్రజల జీవనంలో భాగమైపోయిన "బతుకమ్మ" ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వ వ్యాప్తం చేసిందన్నారు. బతుకమ్మ పండుగను జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని ప్రకృతి దేవత బతుకమ్మను సీఎం కేసీఆర్ ప్రార్థించారు. చదవండి: (మీకో దండం ఠాగూర్ బాబు.. మమ్మల్ని వదిలి వెళ్లండి!) -
Telangana: కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ చీరలను రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ చీరల పంపిణీ జరిగేలా చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు కోటి చీరల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించుకున్న రాష్ట్రప్రభుత్వం ఈ చీరల తయారీకి రూ.339.73 కోట్లు వెచ్చించింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 24 విభిన్న డిజైన్లు, ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల జరీ అంచులతో (త్రెడ్ బోర్డర్) తెలంగాణ టెక్స్టైల్ విభాగం ఈ చీరలను తయారు చేయించింది. గ్రామీణ ప్రాంతాల మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, ఆసక్తిని పరిగణనలోకి తీసుకొని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సహకారంతో డిజైన్లను రూపొందించారు. అత్యుత్తమ ప్రమాణాలతో చీరలను ఉత్పత్తి చేశారు. రెండు విభిన్న పొడవుల్లో చీరలను తయారు చేయించగా, ఇందులో ఆరు మీటర్ల చీరలు 92 లక్షలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్ల పొడవైన చీరలు ఎనిమిది లక్షలు తయారు చేయించినట్లు చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం వెల్లడించింది. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగి, 18 ఏళ్లు పైబడిన మహిళలకు అందజేయనున్నారు. బతుకమ్మ చీరలతో నేతన్నల జీవితాల్లో వెలుగు: కేటీఆర్ తెలంగాణ ఆడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక ఇచ్చేందుకు 2017లో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించినట్లు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. గురువారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. సంక్షోభంలో చిక్కుకున్న నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీతో భరోసా వచ్చిందన్నారు. నేతన్నల వేతనాలు రెట్టింపు కావడంతో పాటు కార్మికులు తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితికి చేరుకున్నారని తెలిపారు. నేత కార్మికులు ఏడాది పొడవునా ఉపాధి పొందేందుకు ఈ పథకం దోహదం చేసిందన్నారు. సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న నేత కార్మికులను ఆదుకునేందుకు సొంత రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ వంటి విధానాలతో వారి ఉపాధిని క్లిష్టతరం చేస్తోందన్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు 5.81 కోట్ల చీరలను పంపిణీ చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇదీ చదవండి: టెర్రర్ ఫండింగ్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు