
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి చెంత విరివిల్లు విరిసింది. మహిళా లోకం పులకించింది. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి

ఒకవైపు చిరుజల్లులు కురుస్తున్నా లెక్కచేయకుండా మహిళలు బతుకమ్మ ఆడారు. సంబరాలకు బీజేపీ ఎంపీ డీకే అరుణ, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వాసంతి శ్రీనివాసన్, రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు















