
మునిచ్ నగరంలో తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ కన్నుల పండుగల జరిగింది. ఈ వేడుకల్లో 200లకు పైగా ఎన్నారై మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో ఆ ప్రాంత పరిసరాలు మార్మోగాయి.
ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల పాటలు పాడారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడ ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణలో జరుపుకున్న విధంగానే జర్మనీలోను బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణ, తెలుగు వాసులు కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగ నిర్వహించుకోవాలన్నారు.
మునిచ్ నగరంలో జరిగిన బతుకమ్మ సంబురాలు జర్మనీ లోని ఇతర నగరాలకు కూడా స్ఫూర్తినిచ్చాయి. అనంతరం నిర్వాహకులు అరవింద్, నరేష్, శ్రీనివాస్, వికాస్ ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment