Gifts Prasentation
-
Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!!
పండగంటే పెద్దగా ఉండాలి. గిఫ్ట్ ఇస్తే గుర్తుండిపోవాలి. అందునా దీపావళి ప్రతిఒక్కరికీ ప్రత్యేకమైనది. మీ సన్నిహితులకు ఈ గిఫ్ట్‌లు ఇచ్చారంటే మీ మధుర స్నేహం చిరకాలం నిలిచిపోతుంది. పైగా వాటిని అస్సలు కాదనరు కూడా. డ్రై ఫ్రూట్స్ బాస్కెట్ మీ లైఫ్‌లో ప్రత్యేక వ్యక్తులకు ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలంటే డ్రై ఫ్రూట్స్ బాస్కెట్ బెస్ట్! ఇదేకాకుండా బిస్కెట్లు, చాక్లెట్లు, టోఫీలు, కప్‌కేక్‌లు వంటి ఇతర తినగలిగిన వస్తువులు ఉన్న బాస్కెట్లను కూడా గిఫ్ట్‌లుగా ఇవ్వొచ్చు. కుకీస్ గిఫ్ట్ కుకీస్‌లను బహుమతిగా ఇవ్వవడం మంచి ఎంపిక. టీ, కాఫీలతో తినడానికి ఇవి ఉత్తమమైనవి. ఈ రోజుల్లో, చోకో చిప్, జీడిపప్పు బాదం, తాజా పండ్లు వంటి అనేక రకాల కుకీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మీ ప్రియమైన వ్యక్తులకు ఇస్తే అస్సలు వద్దనరు. చదవండి: Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం.. ఫ్రూట్ బాస్కెట్ మీ స్నేహితులకు ఇష్టమైన పండ్లను కొనుగోలు చేసి ప్రత్యేకంగా తయారుచేసిన బుట్టలో అందంగా సర్ది కూడా గిఫ్టులుగా ఇవ్వొచ్చు. స్నాక్స్ మీరు ఏదైనా విభిన్నంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. అల్పాహారంగా తినగలిగే స్నాక్స్ ఐటమ్స్ మిక్స్ చేసిన గిఫ్ట్ బాక్స్‌ను తయారు చేసి ఇవ్వొచ్చు. ఇందులో పోహా, ఓట్స్ మ్యాగీ, ఇడ్లీ దోస పిండి, రవ్వ ఇడ్లీ పిండి, చాక్లెట్లు, టోఫీ పెట్టుకోవచ్చు. టెట్రా జ్యూస్ ప్యాక్ మిక్స్ విభిన్న రుచుల్లో ఉండో టెట్రా జ్యూస్ ప్యాక్‌లతో కూడా గిఫ్ట్ బాక్స్‌లను తయారు చేయవచ్చు. వీటిని కూడా మీ ప్రియమైన వారికి ప్రత్యేకంగా అందించవచ్చు. చదవండి: Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా.. -
జిన్‌పింగ్‌కు బహుమతులు ఇవ్వనున్న మోదీ
మామల్లాపురం : ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు విలువైన బహుమతులు ఇవ్వనున్నారు. తమిళనాడులోని మహాబలిపురం వేదికగా వీరి బేటీ అనధికారికంగా జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ భారతీయ సంప్రదాయం ఉట్టిపడే కళాకండాలను బహుమతిగా ఇవ్వనున్నారు. ఆరుగడుల ఎత్తుండే దీపపు స్తంబాలు, మూడడగుల ఎత్తుండే తంజావూరు పెయింటింగ్‌లను కానుకగా అందజేస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ బహుమతులు తమిళనాడు హస్తకళ నైపుణ్యం ఉట్టిపడే విధంగా ఉండనున్నాయి. బంగారం పూత పూసిన ఇత్తడి దీపపు స్తంబాలు ఆరుగడుల ఎత్తు, 108 కేజీల బరువు ఉంటాయి. వీటిని తయారు చేయడానికి 12 రోజులు పట్టింది. కలపతో తయారు చేసిన మూడు అడుగుల ఎత్తున్న తంజావూరు పెయింటింగ్‌లో నాట్యం చేస్తున్న సరస్వతి దేవితో పాటు, సంగీతం ప్రాముఖ్యాన్ని తెలియజేసే పరికరాలను ఉంచారు. దీనిని తయారు చేయడానికి 45 రోజులు పట్టినట్లు తెలిసింది. -
నేడు విద్యార్థులకు బహుమతుల ప్రదానం
మహబూబ్‌నగర్ కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు అధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ధర్మ పరిచయం,ధర్మ ప్రవేశిక 33వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నేడు ఉదయం 10 గంటలకు స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో బహుమతులను ప్రదానం చేస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా సహాయకులు ఉత్తరాపల్లి రామాచారి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ధర్మ పరిచయంలో కె.రమాదేవి ( పాల్వాయి హైస్కూల్),కె.శ్వేత (టీడీ గుట్ట హైస్కూల్),కె.నరేశ్(ఉప్పునుంతల హైస్కూల్) విద్యారులు ప్రథమ,ద్వితీయ,తతీయ బహుమతులకు ఎంపికయ్యారని పేర్కొన్నారు.ధర్మ ప్రవేశికలో ఎ.రూపిక, బి.గోపాల్ నాయక్ ( కల్వకుర్తి సీవీ రామన్ హైస్కూల్), ఎస్.స్రవంతి (ఎదిర హైస్కూల్) విద్యార్థులు ప్రథమ,ద్వితీయ,తతీయ బహుమతులకు ఎంపికయ్యారని తెలిపారు.