పండుగ రుచులు.. కరాచీ హల్వా, ఛెన పొడ ఇలా తయారు చేసుకోండి.. | How To Make Karachi Halwa And Chena Poda Recipes | Sakshi
Sakshi News home page

పండుగ రుచులు.. కరాచీ హల్వా, ఛెన పొడ ఇలా తయారు చేసుకోండి..

Published Tue, Nov 2 2021 12:03 PM | Last Updated on Tue, Nov 2 2021 1:09 PM

How To Make Karachi Halwa And Chena Poda Recipes - Sakshi

దీపావళి పండుగకు ఈ కొత్త రుచులతో మీ ఇంటి అతిధులకు పసందైన విందు ఇవ్వండి.

కరాచీ హల్వా 

కావల్సిన పదార్థాలు
కార్న్‌ఫ్లోర్‌ – కప్పు, 
నీళ్లు – ఒకటింబావు కప్పు,
 పంచదార – ఒకటి ముప్పావు కప్పు
యాలకులపొడి – అర టీస్పూను
నెయ్యి – ముప్పావు కప్పు
పిస్తా, జీడి పప్పు, బాదం పలుకులు – మూడు టేబుల్‌ స్పూన్లు
ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌– చిటికెడు

తయారీ విధానం
►గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌ ఒకటింబావు కప్పు నీళ్లు , ఆరెంజ్‌ కలర్‌ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కనబెట్టుకోవాలి. 
►స్టవ్‌ మీద బాణలి పెట్టి వేడెక్కిన తరువాత పంచదార, ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. 
►సుగర్‌ సిరప్‌ తీగపాకం వచ్చాక కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం వేసి తిప్పుతూ 15 నిమిషాల పాటు ఉడికించాలి.  మిశ్రమం దగ్గర పడిన తరువాత నెయ్యి, డ్రైఫ్రూట్స్‌వేసి తిప్పాలి.  
►నెయ్యి పైకి తేలి, బాణలీకి అంటుకోకుండా ఉండకట్టినప్పుడు బాణలి నుంచి తీసి నెయ్యిరాసిన పాన్‌లో వేయాలి. రెండు గంటలు ఆరాక ముక్కలు కట్‌ చేసుకుంటే కరాచీ హల్వా రెడీ. 

ఛెన పొడ
కావల్సిన పదార్థాలు
పాలు – రెండు లీటర్లు
నిమ్మరసం – రెండు టేబుల్‌ స్పూన్లు 
పంచదార – పావు కప్పు
సూజీ రవ్వ – రెండు టేబుల్‌ స్పూన్లు
నీళ్లు – మూడు టేబుల్‌ స్పూన్లు
నెయ్యి – టీస్పూను, 
బాదం, జీడిపప్పు పలుకులు – నాలుగు టేబుల్‌ స్పూన్లు, 
కిస్‌మిస్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు
యాలకుల పొడి – పావు టీస్పూను

తయారీ విధానం
►ముందుగా పాలను కాచి, తరువాత నిమ్మరసం వేసి తిప్పాలి. 
►విరిగిన పాలను వడగట్టి పాల మిశ్రమాన్ని తీసుకోవాలి. 
►ఈ మిశ్రమాన్ని ముద్దగా చేసుకోవాలి. తరువాత పంచదార, రవ్వ వేసి, పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. 
►ఇప్పుడు కొద్దిగా నీళ్లుపోసుకుని కేక్‌ బ్యాటర్‌లా కలపాలి. 
►తరువాత టీ స్పూను నెయ్యి, బాదం, జీడిపలుకులు, కిస్‌మిస్, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. 
►ఇప్పుడు ఒక పాత్రకు అడుగుభాగంలో నెయ్యిరాసి ఈ బ్యాటర్‌ను దానిలో పోయాలి. 
►స్టవ్‌ మీద ప్రెజర్‌ కుకర్‌ పెట్టి, అడుగు భాగంలో సాల్ట్‌వేసి పైన చిన్న స్టాండ్‌ పెట్టి కేక్‌ బ్యాటర్‌ గిన్నె పెట్టాలి.  కుకర్‌ మూతకున్న గ్యాస్‌కటర్, విజిల్‌ తీసి కుకర్‌ మూతపెట్టి అరగంట పాటు మీడియం మంటమీద ఉడికించాలి. 
►ఒవెన్‌ ఉన్నవారు 180 డిగ్రీల సెల్సియస్‌లో 15 నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి. 
►అరగంట తరువాత మూత తీసి పాత్రను చల్లారనిచ్చి ముక్కలు చేస్తే ఛెనపొడ రెడీ. 

చదవండి: Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement