గూగుల్ మీట్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోనుంది. గూగుల్ మీట్ ఫీచర్‌లో ఇప్పటివరకూ ఆడియో, వీడియో కాల్ మాత్రం అందుబాటులో ఉండగా.. ఇకపై గూగుల్ మీట్ కాల్స్ సంభాషణలు టెక్ట్స్ రూపంలో కనిపించనున్నాయి. అవసరం అయితే ఆటెక్ట్స్‌ను గూగుల్ డాక్ ఫార్మాట్‌లోనూ సేవ్ చేసుకోవచ్చు.
అయితే ఈ సేవలు కేవలం గూగుల్ వర్క్‌స్పేస్ బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్లస్, ఎంటర్‌ప్రైజ్ స్టార్టర్, ఎంటర్‌ప్రైజ్ స్డాండర్డ్, ఎంటర్‌ప్రైజ్ ప్లస్, ఎడ్యుకేషన్ ప్లస్, టీచింగ్, లెర్నింగ్ అప్‌గ్రేడ్ కస్టమర్లకు అందించనుంది. దశల వారీగా సాధారణ యూజర్లు సైతం వినియోగించేలా అందుబాటులోకి తీసుకొని రానుంది. కాగా ఈ ఫీచర్ అక్టోబర్ 24 నుంచి ఎనేబుల్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment