Texts
-
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఏఐతో బోధన
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో ప్రపంచ స్థాయి బోధన ప్రమాణాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ)తో పాఠాలు బోధించనుంది. అధ్యాపకులు పాఠ్యపుస్తకాలు చూస్తూ, బ్లాక్ బోర్డులపై రాస్తూ పాఠాలు చెప్పే విధానాన్ని ఏఐతో భర్తీ చేయనుంది. విద్యార్థులను ఆకట్టుకుంటూ వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంచేలా అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)ల్లో బోధించనుంది. ఈ మేరకు దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ‘వర్చువల్ లెర్నింగ్ ల్యాబ్స్’ను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ అమెరికాకు చెందిన ‘జెడ్ స్పేస్’ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. తొలి దశలో సైన్స్ పాఠాలు.. విద్యార్థులకు పాఠ్యాంశాలను త్రీడీ విధానంలో విజువలైజ్ చేసి బోధించడం తాజా ప్రాజెక్ట్ లక్ష్యం. ఇందుకోసం జెడ్‌స్పేస్ అందించే ప్రత్యేక ల్యాప్‌టాప్‌ను వినియోగించనున్నారు. తొలి దశలో సైన్స్ కోర్సుల్లోని పలు సబ్జెక్టుల పాఠ్యాంశాలకు వర్చువల్ కంటెంట్‌ను తయారు చేసి బోధన చేయనున్నారు. సైన్స్ సబ్జెక్టుల్లో సుమారు 40 టాపిక్స్‌కు చెందిన కంటెంట్‌ను జెడ్‌స్పేస్ ఉచితంగా అందిస్తోంది. దీనికి అదనంగా మరో 60 టాపిక్స్‌కు కంటెంట్‌ను కళాశాల విద్యాశాఖ రూపొందించనుంది. దీనికోసం జెడ్‌స్పేస్ అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఏఐ బోధన.. ఇప్పటికే ప్రభుత్వం డిగ్రీ విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు తరగతి గది బోధనతోపాటు 10 నెలల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయడం ద్వారా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే 2023–24లో సింగిల్ మేజర్, సింగిల్ మైనర్ సబ్జెక్టు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. తద్వారా ఒక విద్యార్థి ఒక సబ్జెక్టులో పరిపూర్ణ విజ్ఞానాన్ని సాధించేలా మార్గం సుగమం చేసింది. ఈ క్రమంలోనే కళాశాల విద్యాశాఖ సుమారు 80 రకాల సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్‌ను ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అందిస్తోంది. ఆర్ట్స్‌లో 23, కామర్స్‌లో 15, బయోలాజికల్ సైన్స్‌లో 15, ఫిజికల్ సైన్స్‌లో 15, కెమికల్ సైన్స్‌లో 5, మ్యాథ్స్‌లో 3, ఒకేషనల్ కోర్సుల్లో 4 ప్రోగ్రామ్స్‌ను ప్రవేశపెట్టింది. తొలుత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ నాలుగు కోర్సుల్లో సింగిల్ మేజర్లు ఉన్న కళాశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా ‘ఏఐ’ విధానంతో బోధనను తెస్తోంది. త్రీడీ అద్దాలు లేకుండానే.. జెడ్‌స్పేస్ ల్యాప్‌టాప్‌లు వర్చువల్ రియాలిటీ సామర్థ్యాలతో కూడిన పోర్టబుల్ వర్క్స్టేషన్లుగా పనిచేస్తాయి. దీన్ని ఉపయోగించే వ్యక్తులు త్రీడీ అద్దాలు ధరించాల్సిన అవసరం లేదు. ఇందులోని వర్చువల్ ఆబ్జెక్టులు స్క్రీన్ వెలుపల, లోపలకి కదలాడుతూ వాస్తవికంగా కనిపిస్తాయి. ఉదాహరణకు అనాటమీ టాపిక్ బోధనలో మానవ శరీర నిర్మాణాన్ని త్రీడీ ఇమేజ్‌ల ద్వారా ఒక్కో లేయర్‌ను వివరిస్తూ లోపలి భాగాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు వీలుగా బోధన చేయొచ్చు. వాస్తవానికి జెడ్‌స్పేస్ ల్యాప్‌టాప్ ఎదురుగా కూర్చుని ఆపరేట్ చేసే వ్యక్తికి మాత్రమే త్రీడీ ఎఫెక్ట్స్‌లో సబ్జెక్ట్ కనిపిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌కు ప్రత్యేకంగా జెడ్‌వ్యూ కెమెరాను అమర్చడం ద్వారా ప్రొజెక్టర్‌ను ఉపయోగించి ఎక్కువ మందికి స్క్రీన్‌పై త్రీడీ అనుభూతిని అందించవచ్చు. ఇందుకు వీలుగా సాధారణ ప్రొజెక్టర్స్ స్థానంలో అత్యాధునిక ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత ఆరు కళాశాలల్లో.. ప్రస్తుత సెమిస్టర్ నుంచి ఏఐ టెక్నాలజీ సాయంతో బోధన చేసేందుకు వీలుగా కళాశాల విద్యాశాఖ ఆరు కళాశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. కడప (మహిళ), అనంతపురం (మెన్), రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ, విజయవాడ ఎస్ఆర్ఆర్– సీవీఆర్ డిగ్రీ కాలేజీ, గుంటూరు (మహిళ), విశాఖపట్నంలోని వీఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జెడ్‌స్పేస్ ల్యాప్‌టాప్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. అనంతరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా సుమారు 50 కళాశాలల్లో అమలు చేయనుంది. జెడ్‌స్పేస్ సాంకేతికత వినియోగంపై ఇప్పటికే అధ్యాపకులకు సైతం శిక్షణ పూర్తయింది. -
‘సారీ మీ ఫుడ్ తినేశా’.. డెలివరీ బాయ్ మెసేజ్‌తో కస్టమర్ షాక్
లండన్: ప్రస్తుత రోజుల్లో ఇంటికే ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి పలు ఆన్లైన్ సంస్థలు. రోజుకు లక్షల మంది ఆయా యాప్‌ల ద్వారా తమకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. మంచి ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాక.. ఇంటి కాలింగ్ బెల్ మోగితే డెలివరీ బాయ్ వచ్చాడేమోనని ఆత్రుతగా పరుగెడతాం. కాదని తెలిస్తే ఒక్కసారిగా కోపం పెరిగిపోతుంది. ఫుడ్ డెలివరీ బాయ్ ఆలస్యంగా వచ్చినా చికాకుతో ఊగిపోతాం. అలాంటి సంఘటనే యూకేలోని ఓ వ్యక్తికి ఎదురైంది. అయితే, ఇక్కడ ఆలస్యం కాలేదు. అసలు తాను ఎదురుచూస్తున్న ఫుడ్ తీసుకురాలేదు కదా తాపీగా సారీ అంటూ ఓ మెసేజ్ చేశాడు ఫుడ్ డెలివరీ బాయ్. ఆ తర్వాత ఏం జరిగింది? లియమ్ బ్యాగ్నాల్ అనే వ్యక్తి ‘డెలివెరూ’ అనే ఫుడ్ డెలివరీ యాప్‌లో తనకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ కోసం ఎదురుచూడశాగాడు. కొద్ది సేపటి తర్వాత తన ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అది ఫుడ్ డెలివరీ ఏజెంట్ ‘సారీ’ అంటూ పంపించాడు. దానికి బ్యాగ్నాల్ ఏం జరిగిందని రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఈ ఫుడ్ చాలా రుచికరంగా ఉంది. దానిని నేను తినేశాను. మీరు డెలివెరూ కంపెనీకి రిపోర్ట్ చేయండి’అని రిప్లై ఇచ్చాడు డెలివరీ బాయ్. ఆ తర్వాత నువ్ భయంకరమైన మనిషివి అని లియామ్ పేర్కొన్నాడు. దానికి ‘ఐ డోంట్ కేర్’ అంటూ షాకిచ్చాడు. ఈ సంభాషణ స్క్రీన్ షార్ట్స్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు లియామ్. ట్విట్టర్ పోస్ట్‌కు 192వేల లైక్స్ వచ్చాయి. వేలాది మంది కామెంట్లు చేశారు. Deliveroo driver has gone rogue this morning pic.twitter.com/sFNMUtNRrk — Bags (@BodyBagnall) October 28, 2022 ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి -
గూగుల్ మీట్లో అదిరిపోయే ఫీచర్లు
గూగుల్ మీట్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోనుంది. గూగుల్ మీట్ ఫీచర్లో ఇప్పటివరకూ ఆడియో, వీడియో కాల్ మాత్రం అందుబాటులో ఉండగా.. ఇకపై గూగుల్ మీట్ కాల్స్ సంభాషణలు టెక్ట్స్ రూపంలో కనిపించనున్నాయి. అవసరం అయితే ఆటెక్ట్స్ను గూగుల్ డాక్ ఫార్మాట్లోనూ సేవ్ చేసుకోవచ్చు. అయితే ఈ సేవలు కేవలం గూగుల్ వర్క్‌స్పేస్ బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్లస్, ఎంటర్ప్రైజ్ స్టార్టర్, ఎంటర్ప్రైజ్ స్డాండర్డ్, ఎంటర్ప్రైజ్ ప్లస్, ఎడ్యుకేషన్ ప్లస్, టీచింగ్, లెర్నింగ్ అప్‌గ్రేడ్ కస్టమర్లకు అందించనుంది. దశల వారీగా సాధారణ యూజర్లు సైతం వినియోగించేలా అందుబాటులోకి తీసుకొని రానుంది. కాగా ఈ ఫీచర్ అక్టోబర్ 24 నుంచి ఎనేబుల్ కానుంది. -
సీఎంకు వ్యతిరేకంగా గవర్నర్ మెసేజ్‌లు.. అనైతికమని ఎంపీ ఫైర్
కోల్‌కతా: తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా గవర్నర్ తనకు మెసేజ్‌లు పంపుతున్నారని ఆరోపించారు. గవర్నర్ స్థాయి వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం అనైతికమని విమర్శిచారు. తాను తృణమూళ్ కాంగ్రెస్ ఎంపీనని, సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ అధినేత్రి అని అన్నారు. గవర్నర్‌ను ఎవరో వెనక ఉండి నడిపిస్తూ.. ఈ చర్యలకు పాల్పడాలని ప్రభావితం చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. ఇటీవల గవర్నర్ జగదీప్ ధంఖర్ బీజేపీ నేతలు కేంద్రమంత్రి అమిత్ షా, సువేందు అధికారిని కలిసిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మెసేజ్‌లు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ విషయం బెంగాల్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
రాతలు చెల్లవ్!
► కొత్త కరెన్సీ నోట్లపై రాతలుంటే చెల్లవ్ ►స్పష్టం చేస్తున్న బ్యాంకు అధికారులు ►అవగాహన కోసం బ్యానర్ల ఏర్పాటు కొత్తనోట్లపై రాతలు వద్దని శ్రీకాకుళం ఎస్బీఐ ప్రధాన బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బ్యాంకుల వద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. తీరని చిల్లర సమస్య పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేయడంతో చిన్ననోట్లకు డిమాండ్ పెరిగింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకొని వారం దాటినా చిల్లర సమస్య ప్రజలను వెంటాడుతూనే ఉంది. చేతిలో వేలాది రూపాయలు ఉన్నా దేనికీ పనికిరాని పరిస్థితి. దీంతో చిన్ననోట్ల కోసం బ్యాంకులు, తపాలాశాఖ కార్యాలయాలు, ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచిఉంటున్నారు. ‘టోల్’ తీస్తున్న ఆర్టీసీ ఓ వైపు కరెన్సీ కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలను ఆర్టీసీ అధికారులు మరోలా దోచుకుంటున్నారనే ఆందోళన అందరి నుంచీ వ్యక్తమవుతోంది. టోల్‌ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి చార్జీలు వసూలు చేయవద్దనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు భిన్నంగా బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల నుంచి ఆర్టీసీ సిబ్బంది టిక్కెట్ చార్జీతోపాటు టోల్ చార్జీని కూడా వసూలు చేస్తున్నారు. దీంతో ఈ పద్ధతి ఎంతవరకూ సమంజసమని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ వరకూ టోల్ ఫీజును ప్రభుత్వం రద్దు చేసింది. అరుుతే ఆర్టీసీ మాత్రం చార్జీల పేరిట టోల్ తీస్తుందా..లేక ఉపశమనం కలిగిస్తుందా అనేదానిపై ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. -
పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి?
గురువు అంటే పాఠం చెప్పేవాడు, శిష్యుడు అంటే పాఠం వినేవాడు అయితే గురుశిష్యుల సంబంధం ఎప్పుడూ వక్త, శ్రోతల్లాగానే ఉంటుంది. అలాకాదు వినీతుడు, వినీయుడులాగా ఉండాలి. విద్యార్థిగా సంస్కారవంతుడు ఎప్పుడవుతాడంటే- ప్రప్రథమంగా గురువు దగ్గర వినయాన్ని నేర్చుకున్నప్పుడు. ఇది ఎలా తెలుస్తుంది? ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సముపార్జించిన గురువు దానిని అంతే కష్టపడి శిష్యుడికి నేర్పినప్పుడు... తదనంతర కాలంలో ఆ గురువు పేరు తలచుకున్నప్పుడల్లా ఆ శిష్యుడి కళ్ళు చెమ్మగిల్లినప్పుడు తెలుస్తుంది. ఆర్ద్రత అని సంస్కృతంలో ఒక మాట ఉంది. తడిసి ఉండుట, చల్లగా ఉండుట అని దాని అర్థం. జీవితంలో ఎవర్నీ నమ్మని స్థితిలో మనసు పొడిబారుతుంది. అది జీవితంలో వృద్ధిలోకి రావడానికి అన్ని తలుపులూ మూసివేసుకుని ఉన్న స్థితికి పరాకాష్ఠ. అందుకే మన ఎప్పుడూ పొడిబారకూడదు. తేమగా ఉంటేనే విత్తనం జీవం పోసుకుంటుంది. పాషాణం మీద మొలకెత్తదు. గోడకు కొద్దిగా గుల్లబారుతనం ఉంటేనే మేకు దిగుతుంది. ఇనుప స్తంభానికి మేకు కొట్టే ప్రయత్నం చేస్తే అది వంగిపోతుంది తప్ప దిగదు. అందువల్ల మనిషి ప్రయత్నపూర్వకంగా జీవితంలో పొందవలసింది-మనసునందు ఆర్ద్రత. గురువు అంటే పాఠం చెప్పేవాడు, శిష్యుడు అంటే పాఠం వినేవాడు అయితే గురుశిష్యుల సంబంధం ఎప్పుడూ వక్త, శ్రోతల్లాగానే ఉంటుంది. అలాకాదు వినీతుడు, వినీయుడులాగా ఉండాలి. విద్యార్థిగా సంస్కారవంతుడు ఎప్పుడవుతాడంటే- ప్రప్రథమంగా గురువు దగ్గర వినయాన్ని నేర్చుకున్నప్పుడు. ఇది ఎలా తెలుస్తుంది? ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సముపార్జించిన గురువు దానిని అంతే కష్టపడి శిష్యుడికి నేర్పినప్పుడు... తదనంతర కాలంలో ఆ గురువు పేరు తలచుకున్నప్పుడల్లా ఆ శిష్యుడి కళ్ళు చెమ్మగిల్లినప్పుడు తెలుస్తుంది. ఒకసారి లబ్ధప్రతిష్ఠుడైన ఒక డాక్టర్‌ను కలిసాను. ఆయనకు 80 ఏళ్ళు. ఆయన ఒక్క పైసా ప్రతిఫలం పొందకుండా ఆరోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 1 లక్షా 70 వేల పోలియో ఆపరేషన్లు చేసాడట. ఉచితంగా ఎందుకు చేస్తున్నారని నేనడిగితే- ‘‘విశాఖపట్టణంలో వ్యాఘ్రేశ్వరుడని ఎముకల వైద్యంలో దిట్ట అయిన ఒక డాక్టరుగారుండేవారు. ఆయన పోలియో ఆపరేషన్స్‌లో పరమ నిష్ణాతుడు. ఆయన వద్ద పోలియో ఆపరేషన్స్ నేర్చుకున్నాను. మొట్టమొదటి పేషంట్‌కు నేను ఆపరేషన్ చేసేటప్పుడు ఆయన తన చేతిలో నా చెయ్యి వేయించుకుని ఒక మాట తీసుకున్నారు. దానికి ముందు ఆయనేం చెప్పారంటే.. ‘ఒక వ్యక్తికి పోలియో వచ్చి ఒక కాలు తోటకూర కాడలా, ఒక చెయ్యి మరో తోటకూర కాడలా వేలాడుతుంటే వాడు జీవితాంతం ఎంత బాధపడతాడో గుర్తు చేసుకో. భగవంతుడి అనుగ్రహం చేత శస్త్రచికిత్స చేసి అతని కాలూ చెయ్యీ కదిలేటట్లు చెయ్యగలిగే ప్రజ్ఞ పొందుతున్నావు. నీవిస్తానన్న గురుకట్నంగా ఈ మాట ఇవ్వు. నిన్ను గొప్ప నిష్ణాతుడిని చేస్తాను. పోలియో ఆపరేషన్ చేస్తే ఎన్నడూ నయాపైసా పుచ్చుకోకు’-అన్నారు. అలా ఇది ఆయన పెట్టిన భిక్ష. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా లక్షా 70 వేల ఆపరేష్ల చేసాను’’ అంటూ చెబుతూంటే ఆయన కళ్ళవెంట నీళ్ళు అప్రయత్నంగా కారిపోతున్నాయి. పోలియో బారి నుండి విజయవంతంగా బయటపడ్డ కొన్ని వేలమంది ఆ డాక్టర్‌ను దేముడిలాగా రోజూ తలచుకొని వారి భార్యాబిడ్డలతో సంతోషిస్తుంటే అంతకన్నా పుణ్యకార్యం ఇంకొకటి ఉంటుందా లోకంలో! అంతకన్నా కీర్తి పొందడానికి మరొక మార్గం ఉంటుందా ప్రపంచంలో! ఇదీ ఆర్ద్రత అంటే... ఇదీ వినయంతో కూడిన సంస్కారం అంటే. చదువు ఎప్పుడూ అహంకారానికే పనికి వస్తే అంతకన్నా అర్థరహితమైన విద్య లోకంలో మరొకటి లేదు. ప్రపంచంలో పరమ ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు... అహంకారగ్రస్థుడైన చదువుకున్నవాడు. పల్లెపట్టుల్లో ఏమీ చదువుకోని బాగా అమాయకులైన వారెక్కువగా ఉంటూంటారు. వాళ్ళు సాధారణంగా ఎవరూ ఎవరినీ పేరుపెట్టి పిలుచుకోరు. ఎవరినైనా పిలవవలసి వస్తే నాయనగారూ, అమ్మగారూ, బావా, బాబాయి, మామా, అక్కా, అన్నా - అంటారు తప్ప పేరుపెట్టి పిలవరు. బంధువుల్లాగా ప్రేమతో పిలుచుకుంటారు. అటువంటి చోట్ల ఒక అమాయకుడైన చదువుకోని వ్యక్తి ఒక నేరం చేయాల్సివస్తే బహుశః దొంగతనం, జేబులు కొట్టేయడం వంటివి చేస్తాడేమో కానీ బాగా చదువుకున్న వ్యక్తి ఏ సాఫ్ట్వేర్ వంటి వాటిలో కూడా నైపుణ్యం ఉన్నవాడు నేరం చేస్తే వాడిని పట్టుకోవడం ఒక పట్టాన సాధ్యపడదు. మనిషిలో తెలివితేటలు సమాజహితానికి పనికి రావాలి తప్ప కేవలం ఆ విద్య అడ్డుపెట్టుకుని తాను ఎలా బతకాలనుకుంటున్నాడో అలా భోగవంతమైన జీవితం గడపడానికి అది ఆలంబనం కాకూడదు. అందుకే విద్యావిధానం గురించి (పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలన్న విషయాన్ని గురించి) రామాయణంలో మహర్షి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. రెండు గంటల్లో చెప్పగల విషయాన్ని రెండు నిమిషాల్లో చాలా ప్రభావవంతంగా చెప్పగలిగినట్లు ఈ శ్లోకంలో చెప్పారు‘‘సర్వే వేద విదాః శూరాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానపాశ సంపన్నాః సర్వే సముదితాణైహి’’ వశిష్ఠుడు రామ లక్ష్మణ భరత శత్రుఘు్నలను కూర్చోబెట్టుకుని విద్య నేర్పాడు. అంటే పాఠం ఒక్కటే చెప్పి వెళ్ళిపోలేదు. వేదాలన్నీ నేర్పాడు, విద్యలన్నీ నేర్పాడు. శూరాః అంటే శూరుడు అంటే యుద్ధం చేసేవాడని కాదు. పండితుడనే అర్థం కూడా ఉంది. అంటే జ్ఞానవంతుల్ని చేసాడు. సర్వేలోకహితేరతాః... అంటే పాఠం చెప్పేటప్పుడే ఈ చదువుకున్న చదువంతా దేనికి పనికి రావాలో చెబుతుండేవాడు. లోక హితానికి, లోక క్షేమానికి ఆ విద్య ఎలా వినియోగించాలో చెప్పేవాడు. అందుకే అంత గొప్పవిద్య పొందిన ఆ శిష్యులు కూడా లోక హితానికే తప్ప లోక కంటకానికి, లోకుల్ని బాధించడానికి తమ విద్యలను ఎప్పుడూ ఉపయోగించలేదు. నిగ్రహం ఎక్కడి నుంచీ వచ్చిందంటే... గురువుగారు పాఠం చెప్పినప్పుడు... ‘‘ఈ విద్య లోక క్షేమానికి తప్ప నీ స్వార్థానికి వినియోగించుకోకుండా ఉండాలనే మాట నుంచి వచ్చింది’’ వ్యాఘ్రేశ్వరుడుగారు పోలియో ఆపరేషన్లు మాతమే నేర్పి చేతిలో చెయ్యి వేయించుకుని ఉండకపోతే ఆ ఆపరేషన్లు చేసిన డాక్టర్‌గారు కోట్లకు పడగలెత్తేవారేమో కానీ ఇలా ప్రపంచం గుర్తించుకోదగ్గ వ్యక్తిగా మాత్రం ఆయన అయి ఉండేవారు కాదు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు