
కోల్‌కతా: తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా గవర్నర్ తనకు మెసేజ్‌లు పంపుతున్నారని ఆరోపించారు. గవర్నర్ స్థాయి వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం అనైతికమని విమర్శిచారు. తాను తృణమూళ్ కాంగ్రెస్ ఎంపీనని, సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ అధినేత్రి అని అన్నారు.
గవర్నర్‌ను ఎవరో వెనక ఉండి నడిపిస్తూ.. ఈ చర్యలకు పాల్పడాలని ప్రభావితం చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. ఇటీవల గవర్నర్ జగదీప్ ధంఖర్ బీజేపీ నేతలు కేంద్రమంత్రి అమిత్ షా, సువేందు అధికారిని కలిసిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మెసేజ్‌లు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ విషయం బెంగాల్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.