Saugata Roy
-
దాదా.. మీరు మాట్లాడాలనుకుంటే నేను కూర్చుంటాను: అమిత్ షా ఫైర్
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైరయ్యారు. ‘దాదా, మీరు మాట్లాడాలనుకుంటే, నేను కూర్చుంటాను. అప్పుడు మీరు మాట్లాడవచ్చ’ అంటూ టీఎంసీ ఎంసీ సౌగతా రాయ్‌కి కౌంటర్ ఇచ్చారు. అనంతరం, అమిత్ షా కామెంట్స్‌కు బీజేపీ ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్‌సభలో అమిత్ షా ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అమిత్ షా.. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ కల్చర్, మాదక ద్రవ్యాల ముప్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ కల్పించుకుని ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో, సౌగతా రాయ్‌పై అమిత్ షా వెంటనే ఆగ్రహం చూపించారు. సభలో సీరియస్ అయిన అమిత్ షా.. ఆగ్రహంతో దాదా, మీరు మాట్లాడాలనుకుంటే, నేను కూర్చుంటాను. అప్పుడు మీరు మాట్లాడవచ్చు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా సీనియర్ ఎంపీగా ఉన్న మీరు ఇలాంటి అంతరాయాలు కలిగించడం కరెక్ట్ కాదు. ఇది మీ హోదా, మీ సీనియారిటీకి తగదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలపై సౌగతా రాయ్ వెంటనే స్పందిస్తూ.. మీకు అంత కోపం ఎందుకు అంటూ ప్రశ్నించారు. దీంతో, రాయ్ ప్రశ్నలకు అమిత్ షా సమాధానిమిస్తూ.. తాను కోపగించుకోలేదని, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఆ వెంటనే తన సీటులో కూర్చొన్నారు. ఇంతలో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. టాపిక్ సీరియస్‌నెస్‌ను అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రసంగాన్ని కొనసాగించాలని అమిత్ షాను కోరారు. దీంతో పైకి లేచిన ఆయన మాట్లాడటాన్ని కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. A show-stopping moment at the Parliament's ongoing Winter Session. pic.twitter.com/rbyRH6Z4ha — P C Mohan (@PCMohanMP) December 21, 2022 -
రాబోయేదీ యథాతథ విధానమే: భట్టాచార్య
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) వచ్చే వారం ద్రవ్య పరపతి విధానంలోనూ యథాతథ రెపో రేటును(బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 4 శాతం) కొనసాగించే అవకాశం ఉందని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ సౌగట భట్టాచార్య సోమవారం పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయ-భౌగోళిక ఉద్రిక్తతలు దీనికి కారణమని విశ్లేషించారు. ఇటీవలి పరిణామాలు వృద్ధి, ద్రవ్యోల్బణానికి విఘాతం కలిగేలా ఉన్నాయని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం కట్టడి-వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగిస్తున్న ఆర్బీఐ పరపతి విధాన కమిటీ 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి భేటీ ఏప్రిల్ 6 నుంచి 8వ తేదీ వరకూ జరుగుతున్న సంగతి తెలిసిందే. చివరి ఆరునెలల్లో అరశాతం అప్ కాగా 2022-23 చివరి ఆరు నెలల్లో(2022 అక్టోబర్-2023 మార్చి) రెపో రేటు 50 బేసిస్ పాయింట్ల(100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) మేర పెరగవచ్చని భట్టాచార్య అంచనా వేశారు. 2021-22లో వృద్ధి రేటు 8.9 శాతం ఉంటే 2022-23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గవచ్చని విశ్లేషించారు. ఇక ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.8 శాతంగా ఉంటుందన్నది భట్టాచార్య విశ్లేషణ. రిటైల్ ద్రవ్యోల్బణం 2-6 శాతం శ్రేణిలో ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. ఇక క్రూడ్ ధర బ్యారల్‌కు 2021-22లో సగటున 79.6 డాలర్లుగా ఉంటే, 2022-23లో ఇది 105డాలర్లకు చేరుతుంనది ఆయన అంచనావేశారు. ఇక ఇదే కాలంలో డాలర్ మారకంలో రూపాయి విలువ సగటు 74.50 నుంచి 76.50కి తగ్గుతుందని పేర్కొన్నారు. అయితే దేశీయ కరెన్సీకి నిజమైన పరీక్ష 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎదురవుతుందని అంచనావేశారు. ఆర్బీఐ ప్రస్తుతం తన వద్ద ఉన్న 630 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారక నిల్వలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) అస్థిరతలను అడ్డుకోడానికి, ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తుందని అన్నారు. ఇలాంటి సందర్భంలో 2023-24 రూపాయికి కీలకమవుతుందని విశ్లేషించారు. (చదవండి: భారత్‌లో మరో మైలురాయి దాటిన లంబోర్గిని) -
సీఎంకు వ్యతిరేకంగా గవర్నర్ మెసేజ్‌లు.. అనైతికమని ఎంపీ ఫైర్
కోల్‌కతా: తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా గవర్నర్ తనకు మెసేజ్‌లు పంపుతున్నారని ఆరోపించారు. గవర్నర్ స్థాయి వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం అనైతికమని విమర్శిచారు. తాను తృణమూళ్ కాంగ్రెస్ ఎంపీనని, సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ అధినేత్రి అని అన్నారు. గవర్నర్‌ను ఎవరో వెనక ఉండి నడిపిస్తూ.. ఈ చర్యలకు పాల్పడాలని ప్రభావితం చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. ఇటీవల గవర్నర్ జగదీప్ ధంఖర్ బీజేపీ నేతలు కేంద్రమంత్రి అమిత్ షా, సువేందు అధికారిని కలిసిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మెసేజ్‌లు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ విషయం బెంగాల్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
‘ఆ ఐదుగురు ఎంపీలు రాజీనామా చేస్తారు’
కోల్‌కతా: మంత్రి సుభేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్‌ను వీడినట్లయితే మమత సర్కారు కుప్పకూలూతుందంటూ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీలో చేరినట్లయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని జగద్దల్ ఘాట్ వద్ద శనివారం ఆయన ఛట్ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘తృణముల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎంపీలు కాషాయం కండువా కప్పుకోవడం ఖాయం. సుభేంధుని టీఎంసీ పార్టీ చాలా అవమానించింది. తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టి వేధించింది. కానీ ప్రజా నాయకులను అలాంటి చర్యలు ఏమీచేయలేవు. (చదవండి: సవాళ్లను స్వీకరించాలి, పోరాడాలి, ఓడించాలి) సుభేందు వంటి ఎంతో మంది నేతల ప్రోద్బలంతో మమతా బెనర్జీ నాయకురాలిగా ఎదిగారు. కానీ ఇప్పుడు గతాన్ని, ఎంతో మంది నేతల త్యాగాన్ని మర్చిపోయి తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీఎం కుర్చీపై కూర్చొబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాన్ని ఏ నాయకులు ఒప్పుకోరు’’అంటూ విమర్శలు గుప్పించారు. అదే విధంగా టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తారని అర్జున్ సింగ్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆయన కేవలం టీఎంసీ నాయకుడిలా మీడియా ముందు నటిస్తున్నారని, ఏ క్షణమైనా బీజేపీలో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుభేందుతో సౌగతా రాయ్ చర్చలు జరుపుతున్నారని, ఒక్కసారి కెమెరా కళ్లు వారిని దాటిపోయినట్లయితే వారు కాషాయ కండువా కప్పుకోవడం తథ్యమని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను సౌగతా రాయ్ వట్టి పుకార్లేనంటూ కొట్టివేయడం గమనార్హం. -
చంద్రయాన్-2: భారత్‌కు చెడ్డపేరు వచ్చింది!
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడి ఉపరితలంపైకి పంపిన విక్రమ్ ల్యాండర్ కూలిపోవడంతో దేశం అప్రతిష్ట పాలైందని మండిపడ్డారు. ఇందుకు కారణమైన వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విఫల ప్రయోగాల కోసం కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతరిక్ష రంగం కోసం మరిన్ని నిధులు కేటాయించడం వృథా ప్రయాసే అన్నారు. వివిధ కార్యక్రమాల కోసం అదనపు నిధుల మంజూరు విషయమై బుధవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా సౌగతా రాయ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. (చదవండి : నాసా ప్రకటనను వ్యతిరేకించిన శివన్) కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష చరిత్రలో ఒక గొప్ప కార్యక్రమంగా నిలిచిన చంద్రయాన్-2 గురించి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఇలా మట్లాడటం సరికాదని హితవు పలికారు. ఇక సెప్టెంబరు 7న ఇస్రో... చంద్రుడి ఉపరితలం పైకి పంపిన విక్రమ్ ల్యాండర్ జాడలను తాము గుర్తించినట్లు నాసా మంగళవారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ సాయపడటంతో విక్రమ్ పడిన ప్రాంతాన్ని, శకలాలను కనుగొన్నామని నాసా పేర్కొంది. అయితే నాసా వ్యాఖ్యలను ఇస్రో చీఫ్ శివన్ వ్యతిరేకించారు. చంద్రయాన్-2లో భాగంగా తాము ప్రయోగించిన ఆర్బిటార్ ఇంతకుముందే ఆ పని చేసిందని ఆయన స్పష్టం చేశారు. -
హీరోయిన్‌తో స్టెప్పులేసిన ఎంపీ
కోల్‌కతా : బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్‌తో కలిసి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సగుతా రాయ్ స్టెప్పులేసిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కోల్‌కతాలో గురువారం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి రవీనా టాండన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న సగుతా రాయ్‌ను తనతో కలిసి డాన్స్ చేయాల్సిందిగా కోరారు. 1994లో విడుదలైన తన హిట్ మూవీ ‘మోహ్రా’లోని ‘తూ చీజ్ బడీ హై మస్త్’ పాటకు ఎంపీతో కలిసి రవీనా కాలు కదిపారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న ఇతర నాయకులను కూడా సగుతా రాయ్‌తో కలిసి స్టెప్పులేయాలంటూ రవీనా ఆహ్వానించారు. డెబ్బై ఏళ్ల వయస్సులోనూ ఇంత జోష్‌గా ఉండే వ్యక్తిని తానెప్పుడూ చూడలేదని, సగుతా రాయ్ నిజంగా చాలా స్పోర్టివ్ పర్సన్ అని రవీనా ప్రశంసించారు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని డుమ్ డుమ్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సగుతా రాయ్ మన్మోహన్ సింగ్ కేబినెట్లో పట్టణాభివృద్ధి శాఖగా మంత్రిగా పనిచేశారు. Watch TMC MP Prof Saugata Roy groove with Bollywood star Raveena Tandon at an event in #Kolkata! #UserGeneratedContent. @iindrojit More videos: https://t.co/FAHzdjSiWA pic.twitter.com/b7nCNTOLrj — India Today (@IndiaToday) January 17, 2019 -
‘ఖాళీ’ చేయించే బిల్లుకు ఓకే
ప్రభుత్వ భవనాల్లో అక్రమ నివాసులకు అడ్డుకట్ట న్యూఢిల్లీ: ప్రభుత్వ భవనాల్లో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించేందుకు ఉద్దేశించిన ఒక బిల్లును లోక్‌సభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. అయితే, ఈ బిల్లులోని నిబంధనలను సాకుగా తీసుకుని పార్లమెంటు సభ్యులను ప్రభుత్వం వేధించే అవకాశం ఉందని పలువురు సభ్యులు సభలో ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ భవనాల్లో అక్రమం నివాసం సమస్యపై గ ట్టి చర్యలు తీసుకునేందుకు త్వరలోనే నగరాల మేయర్ల సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బిల్లును రూపొందించినట్టు చెప్పారు. ఈ బిల్లు కాంగ్రెస్ తెచ్చినదే అయినప్పటికీ రాజకీయ వివేచనతోనే సభలో ప్రవేశపెడుతున్నట్టు ఆయన చెప్పారు. చర్చలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత రాయ్, వెంకయ్యకు మధ్య లోక్‌సభలో సంవాదం చోటుచేసుకుంది. ఎంపీలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతిలో ఔచిత్యంలేదని, రాయ్ వ్యాఖ్యానించగా, ఈ అంశంపై నిబంధనలను అనుసరించక తప్పదని మంత్రి అన్నారు. తమకు ఎవరిపైనా కక్షలేదని, మంత్రులకు అధికారిక నివాసం కల్పించేందుకు అక్రమ నివాసులను ప్రభుత్వ భవనాలనుంచి ఖాళీచేయించవలసి వస్తోందని, బాధాకరమే అయినా, ఇది తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. కాగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎమ్మెన్నార్ఈజీఏ) అమలులో ప్రభుత్వం తీరును ప్రతిపక్ష సభ్యులు పలువురు సోమవారం లోక్‌సభలో విమర్శించారు. -
ముందస్తు పొత్తు పెట్టుకోం: అఖిలేశ్
బల్లియా (యూపీ): లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఉత్తరప్రదేశ్‌శాఖ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ప్రస్తావించగా తమ పార్టీ నేతలే అసలైన ‘ఆమ్ ఆద్మీ’లన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు దూరం: తృణమూల్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు సమ దూరం పాటిస్తామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ వెల్లడించారు. ఆ రెండు పార్టీలూ నాణేనికి ఉన్న రెండు వైపుల వంటివని...ఎన్నికల్లో ప్రజలు ప్రత్యామ్నాయానికే పట్టం కడతారని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం ఇప్పటికే రుజువైందని చెప్పారు. తృతీయ ప్రత్యామ్నాయానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని భావిస్తున్నామన్నారు.