ముందస్తు పొత్తు పెట్టుకోం: అఖిలేశ్ | Samajwadi Party not to forge any pre-poll alliance: Akhilesh Yadav | Sakshi

ముందస్తు పొత్తు పెట్టుకోం: అఖిలేశ్

Jan 20 2014 2:06 AM | Updated on Aug 29 2018 8:54 PM

ముందస్తు పొత్తు పెట్టుకోం: అఖిలేశ్ - Sakshi

ముందస్తు పొత్తు పెట్టుకోం: అఖిలేశ్

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఉత్తరప్రదేశ్‌శాఖ అధ్యక్షుడు,

బల్లియా (యూపీ): లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఉత్తరప్రదేశ్‌శాఖ అధ్యక్షుడు,  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ప్రస్తావించగా తమ పార్టీ నేతలే అసలైన ‘ఆమ్ ఆద్మీ’లన్నారు.
 
 కాంగ్రెస్, బీజేపీలకు దూరం: తృణమూల్
 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు సమ దూరం పాటిస్తామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ వెల్లడించారు. ఆ రెండు పార్టీలూ నాణేనికి ఉన్న రెండు వైపుల వంటివని...ఎన్నికల్లో ప్రజలు ప్రత్యామ్నాయానికే పట్టం కడతారని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం ఇప్పటికే రుజువైందని చెప్పారు. తృతీయ ప్రత్యామ్నాయానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని భావిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement