
కోల్‌కతా : బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్‌తో కలిసి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సగుతా రాయ్ స్టెప్పులేసిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కోల్‌కతాలో గురువారం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి రవీనా టాండన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న సగుతా రాయ్‌ను తనతో కలిసి డాన్స్ చేయాల్సిందిగా కోరారు. 1994లో విడుదలైన తన హిట్ మూవీ ‘మోహ్రా’లోని ‘తూ చీజ్ బడీ హై మస్త్’ పాటకు ఎంపీతో కలిసి రవీనా కాలు కదిపారు.
ఈ సందర్భంగా వేదికపై ఉన్న ఇతర నాయకులను కూడా సగుతా రాయ్‌తో కలిసి స్టెప్పులేయాలంటూ రవీనా ఆహ్వానించారు. డెబ్బై ఏళ్ల వయస్సులోనూ ఇంత జోష్‌గా ఉండే వ్యక్తిని తానెప్పుడూ చూడలేదని, సగుతా రాయ్ నిజంగా చాలా స్పోర్టివ్ పర్సన్ అని రవీనా ప్రశంసించారు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని డుమ్ డుమ్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సగుతా రాయ్ మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో పట్టణాభివృద్ధి శాఖగా మంత్రిగా పనిచేశారు.
Watch TMC MP Prof Saugata Roy groove with Bollywood star Raveena Tandon at an event in #Kolkata! #UserGeneratedContent. @iindrojit
— India Today (@IndiaToday) January 17, 2019
More videos: https://t.co/FAHzdjSiWA pic.twitter.com/b7nCNTOLrj