రాతలు చెల్లవ్!
► కొత్త కరెన్సీ నోట్లపై రాతలుంటే చెల్లవ్
►స్పష్టం చేస్తున్న బ్యాంకు అధికారులు
►అవగాహన కోసం బ్యానర్ల ఏర్పాటు
కొత్తనోట్లపై రాతలు వద్దని శ్రీకాకుళం ఎస్‌బీఐ ప్రధాన బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బ్యాంకుల వద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.
తీరని చిల్లర సమస్య
పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేయడంతో చిన్ననోట్లకు డిమాండ్ పెరిగింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకొని వారం దాటినా చిల్లర సమస్య ప్రజలను వెంటాడుతూనే ఉంది. చేతిలో వేలాది రూపాయలు ఉన్నా దేనికీ పనికిరాని పరిస్థితి. దీంతో చిన్ననోట్ల కోసం బ్యాంకులు, తపాలాశాఖ కార్యాలయాలు, ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచిఉంటున్నారు.
‘టోల్’ తీస్తున్న ఆర్టీసీ
ఓ వైపు కరెన్సీ కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలను ఆర్టీసీ అధికారులు మరోలా దోచుకుంటున్నారనే ఆందోళన అందరి నుంచీ వ్యక్తమవుతోంది. టోల్‌ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి చార్జీలు వసూలు చేయవద్దనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు భిన్నంగా బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల నుంచి ఆర్టీసీ సిబ్బంది టిక్కెట్ చార్జీతోపాటు టోల్ చార్జీని కూడా వసూలు చేస్తున్నారు. దీంతో ఈ పద్ధతి ఎంతవరకూ సమంజసమని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ వరకూ టోల్ ఫీజును ప్రభుత్వం రద్దు చేసింది. అరుుతే ఆర్టీసీ మాత్రం చార్జీల పేరిట టోల్ తీస్తుందా..లేక ఉపశమనం కలిగిస్తుందా అనేదానిపై ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు.