The new currency
-
చెరకును పీల్చేస్తున్నారు
తన్నుకుపోతున్న పొరుగు జిల్లాల ప్రైవేట్ చక్కెర కర్మాగారాలు పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా సమకూరిందన్నదే ప్రశ్న పట్టించుకోని చెరకు అభివృద్ధి అధికారులు అనకాపల్లి : జిల్లాలో సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో సాగవుతున్న చెరకుపై ప్రైవేట్ కర్మాగారాలు కన్నేశాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రైవేట్ చక్కెర కర్మాగారాలు నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాంతంలోని చెరకును తరలిస్తున్నాయి. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో గత రెండు సీజన్ల నుంచి గానుగాట జరగకపోవడంతో దీనిని వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ విషయంలో చెరకు అభివృద్ధి అధికారులు ప్రైవేట్ కర్మాగారాలకు అనుకూలం గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న చెరకును తరలించే విషయంలో ఆయ ఫ్యాక్టరీలకు అధికారాలు ఉంటాయి. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో గాను గాట ఆడకపోవడంతో ఈ ప్రాంత చెరకును ఏటికొప్పాక, తాండవ చక్కెÆ ý‡ కర్మాగారాలకు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశా లు జారీ చేశారు. అయితే చెల్లింపు లు నగదు రహితంగా జరగాలన్న నిబంధన పెద్ద ప్రతిబంధకంగా మారింది. పెద్ద నోట్ల రద్దు అంశాన్ని అనుకూలంగా మలుచుకొని... అనకాపల్లి చక్కెర కర్మాగారం పరిధిలో లక్ష హెక్టార్లకు పైబడి చెరకు సాగవుతోంది. దీనిలో కొంత చెరకును బెల్లం తయారీకి వినియోగించగా, మిగిలిన చెరకును తప్పని పరిస్థితుల్లో కర్మాగారాలకు తరలించాల్సి ఉంది. సహకార చక్కెర కర్మాగారాలకు చెరకును తరలించే రైతులకు ఇవ్వాల్సిన మద్దతు ధరను నగదు రహి త లావాదేవీల రూపేణా వారి అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. కానీ ఈ నిబంధనలు అమలు చేయకుండా పొరుగు జిల్లాలకు చెందిన ప్రైవేట్ కర్మాగారాలు వ్యవహరించడం పలు అనుమానాలు తావిస్తోంది. ఈ ప్రాం తం నుంచి చెరకును తరలిస్తున్న ఒక ప్రైవేట్ కర్మాగారం.. తన పరిధిలో చెరకును తరలించిన రైతులకు రూ.8 కోట్ల వరకు బకాయి పడింది. కానీ అనకాపల్లి పరిధి లోని రైతుల నుంచి సేకరిస్తున్న చెరకుకు మద్దతు ధరను టన్ను కు రూ.2,070 చొప్పున చెల్లిస్తోంది. అది కూడా నగదు రూపంలోనే కావడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని సంస్థల వద్ద కొత్త కరెన్సీ లేదు. కానీ అనకాపల్లి కర్మాగారం పరిధిలోని కూం డ్రం, నీలకంఠాపురం, వెంకుపాలెం కేంద్రంగా ఏర్పాటు చేసిన చెరకు బరువు తూచే కాటాల వద్ద చెల్లింపులను ఏ రోజుకు ఆ రోజుకు జరుపుతున్నారు. సుమారు 400 టన్నుల వరకు రోజుకు çతరలించుకుపోతున్నారు. ఈ ప్రాంత రైతులకు రోజుకు రూ.8 లక్షల నగదును కొత్త కరెన్సీ రూపంలో అందిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైందన్నదే ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న. సహకార కర్మాగారాల పరిధిలో టన్నుకు రూ.2300 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో టన్నుకు రూ.2300 చెల్లిం చాల్సి ఉంది. అది కూడా అకౌంట్లలోనే జమ చేయాలనే నిబంధన ఉంది. ఈ విధంగా కూడా రైతులు ప్రైవేట్ కర్మాగారాలకు చెరకును తరలించడం ద్వారా టన్నుకు రెం డు వందలకు పైగా నష్టపోతున్నారు. అయితే సహకార కర్మాగారాలకు తరలించే చెరకుకు మద్దతు ధర ఎప్పుడు అందుతుందో తెలియని ఆందోళన కూడా రైతుల్లో కనిపిస్తోంది. ఇప్పుడు ఏటికొప్పాక, తాండవ చక్కెర కర్మాగారాలకు తరలివెళ్లాల్సిన 20 వేల టన్నుల చెరకును ఇప్పటికే ప్రైవేట్ కర్మాగారాలు తీసుకెళ్లిపోయాయి. అయితే జిల్లాలో సహకార రంగంలో కొనసాగుతున్న కర్మాగారాల పరిధిలో సమకూరాల్సిన చెరకు మోతాదు తగ్గితే అక్కడ కూడా క్రషింగ్ జరిపే అవకాశాలు తగ్గుతాయి. తద్వారా భవిష్యత్‌లో ప్రైవేట్ కర్మాగారాల పుణ్యాన తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలకు ప్రమాదం పొంది ఉంది. -
పోలీసుల అదుపులో ఇన్స్పెక్టర్
కరెన్సీ మార్పిడి కేసులో కాంగ్రెస్ నేతను విచారిస్తున్న పోలీసులు హైదరాబాద్: కొత్త కరెన్సీకి పాత నోట్లు ఇస్తామని నమ్మించి కోటి 20 లక్షలతో పరారైన సీఎం క్యాంపు కార్యాలయం ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి మాజీ మంత్రి దానం నాగేందర్ అనుచరుడు కాంగ్రెస్ నేత తిరుమలేష్నాయుడును శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితులు 20 మంది వరకు ఉన్నట్లు, ఒక్కొక్కరు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కొత్త కరెన్సీ తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాంగ్రెస్ నేత తిరుమలేష్‌నాయుడు సూచనల మేరకు ఈ నెల 1వ తేదీన ఖమ్మం ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ అగర్వాల్ అనే వ్యాపారితోపాటు మరికొందరు కోటి 20 లక్షల కొత్త కరెన్సీతో ఫిలింనగర్‌లోని సారుు గెస్ట్‌హౌస్‌లో దిగారు. టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో అడిషనల్ ఇన్స్పెక్టర్గా ఉండి సీఎం క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వ హిస్తున్న సీఐ రాజశేఖర్, పోలీసు డ్రెస్సులో ముగ్గురు కానిస్టేబుళ్లు, మరో ఎస్ఐతో కలసి గెస్ట్‌హౌస్‌కు చేరు కున్నారు. రివాల్వర్ చూపి తాము పోలీసులమని బెదిరించి నగదుతో పరారయ్యారు. తిరుమలేశ్ నాయుడు, సీఐ రాజశేఖర్, మరో ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు ఈ డబ్బును పంచు కున్నారు. ఈ ఘటనపై ఈ నెల 2న బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తిరుమలేష్‌నాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించి ఆయన భార్యను స్టేషన్‌కు తీసు కెళ్లారు. రాజశేఖర్ పరారీలో ఉన్నాడు. శనివారం రాత్రి తిరుమలేష్నాయుడును అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్న సమయంలోనే తమను మోసం చేశాడంటూ మరో రెండు బృందాలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారుు. నగదుమార్పిడిలో తిరుమలేష్ నాయుడుకు సన్నిహితంగా ఉండే మరో ఎస్ఐ పాత్ర కూడా ఉన్నట్లు, గతంలో ఆయన బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోనే పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనను కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. -
ప్రత్యామ్నాయం చూపేవరకు పాత నోట్లు అనుమతించాలి
హిమాయత్‌నగర్: దేశంలో కొత్త కరెన్సీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకూ పాత కరెన్సీ చెల్లుబాటయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలు సంఘాలకు చెందిన నాయకులు కోరారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని అమృత ఎస్టేట్స్‌లో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం(ఎఐపీఎస్ఓ) ఆధ్వర్యంలో పాతనోట్లపై రౌండ్ టేబుల్ సమావేశాశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి మాట్లాడుతూ రద్దయిన పాత నోట్ల స్థానంలో కొత్త కరెన్సీని వెంటనే అందుబాటులో తేవాలన్నారు. అవి వచ్చే వరకూ పాత కరెన్సీ చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాజీ రాజ్యసభసభ్యులు అజీజ్పాషఅ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు నోట్లను రద్దుచేసినప్పుడు పెద్ద ఫలితాలేమీ రాలేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ గుండా మల్లేష్, సిపిఐ గ్రేటర్ కార్యదర్శి డాక్టర సుధాకర్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నోట్ల రద్దను ప్రకటించడం సరైంది కాదన్నారు. దీనివల్ల పేద వర్గాలకు చెందిన వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. -
రాతలు చెల్లవ్!
► కొత్త కరెన్సీ నోట్లపై రాతలుంటే చెల్లవ్ ►స్పష్టం చేస్తున్న బ్యాంకు అధికారులు ►అవగాహన కోసం బ్యానర్ల ఏర్పాటు కొత్తనోట్లపై రాతలు వద్దని శ్రీకాకుళం ఎస్బీఐ ప్రధాన బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బ్యాంకుల వద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. తీరని చిల్లర సమస్య పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేయడంతో చిన్ననోట్లకు డిమాండ్ పెరిగింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకొని వారం దాటినా చిల్లర సమస్య ప్రజలను వెంటాడుతూనే ఉంది. చేతిలో వేలాది రూపాయలు ఉన్నా దేనికీ పనికిరాని పరిస్థితి. దీంతో చిన్ననోట్ల కోసం బ్యాంకులు, తపాలాశాఖ కార్యాలయాలు, ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచిఉంటున్నారు. ‘టోల్’ తీస్తున్న ఆర్టీసీ ఓ వైపు కరెన్సీ కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలను ఆర్టీసీ అధికారులు మరోలా దోచుకుంటున్నారనే ఆందోళన అందరి నుంచీ వ్యక్తమవుతోంది. టోల్‌ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి చార్జీలు వసూలు చేయవద్దనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు భిన్నంగా బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల నుంచి ఆర్టీసీ సిబ్బంది టిక్కెట్ చార్జీతోపాటు టోల్ చార్జీని కూడా వసూలు చేస్తున్నారు. దీంతో ఈ పద్ధతి ఎంతవరకూ సమంజసమని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ వరకూ టోల్ ఫీజును ప్రభుత్వం రద్దు చేసింది. అరుుతే ఆర్టీసీ మాత్రం చార్జీల పేరిట టోల్ తీస్తుందా..లేక ఉపశమనం కలిగిస్తుందా అనేదానిపై ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు.