పోలీసుల అదుపులో ఇన్‌స్పెక్టర్
కరెన్సీ మార్పిడి కేసులో కాంగ్రెస్ నేతను విచారిస్తున్న పోలీసులు
హైదరాబాద్: కొత్త కరెన్సీకి పాత నోట్లు ఇస్తామని నమ్మించి కోటి 20 లక్షలతో పరారైన సీఎం క్యాంపు కార్యాలయం ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి మాజీ మంత్రి దానం నాగేందర్ అనుచరుడు కాంగ్రెస్ నేత తిరుమలేష్‌నాయుడును శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితులు 20 మంది వరకు ఉన్నట్లు, ఒక్కొక్కరు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కొత్త కరెన్సీ తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాంగ్రెస్ నేత తిరుమలేష్‌నాయుడు సూచనల మేరకు ఈ నెల 1వ తేదీన ఖమ్మం ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ అగర్వాల్ అనే వ్యాపారితోపాటు మరికొందరు కోటి 20 లక్షల కొత్త కరెన్సీతో ఫిలింనగర్‌లోని సారుు గెస్ట్‌హౌస్‌లో దిగారు. టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో అడిషనల్ ఇన్‌స్పెక్టర్‌గా ఉండి సీఎం క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వ హిస్తున్న సీఐ రాజశేఖర్, పోలీసు డ్రెస్సులో ముగ్గురు కానిస్టేబుళ్లు, మరో ఎస్‌ఐతో కలసి గెస్ట్‌హౌస్‌కు చేరు కున్నారు.
రివాల్వర్ చూపి తాము పోలీసులమని బెదిరించి నగదుతో పరారయ్యారు. తిరుమలేశ్ నాయుడు, సీఐ రాజశేఖర్, మరో ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు ఈ డబ్బును పంచు కున్నారు. ఈ ఘటనపై ఈ నెల 2న బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తిరుమలేష్‌నాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించి ఆయన భార్యను స్టేషన్‌కు తీసు కెళ్లారు. రాజశేఖర్ పరారీలో ఉన్నాడు. శనివారం రాత్రి తిరుమలేష్‌నాయుడును అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్న సమయంలోనే తమను మోసం చేశాడంటూ మరో రెండు బృందాలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారుు. నగదుమార్పిడిలో తిరుమలేష్ నాయుడుకు సన్నిహితంగా ఉండే మరో ఎస్‌ఐ పాత్ర కూడా ఉన్నట్లు, గతంలో ఆయన బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోనే పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనను కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేశారు.