ప్రత్యామ్నాయం చూపేవరకు పాత నోట్లు అనుమతించాలి
ప్రత్యామ్నాయం చూపేవరకు పాత నోట్లు అనుమతించాలి
Published Tue, Nov 22 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
హిమాయత్‌నగర్: దేశంలో కొత్త కరెన్సీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకూ పాత కరెన్సీ చెల్లుబాటయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలు సంఘాలకు చెందిన నాయకులు కోరారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని అమృత ఎస్టేట్స్‌లో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం(ఎఐపీఎస్‌ఓ) ఆధ్వర్యంలో పాతనోట్లపై రౌండ్ టేబుల్ సమావేశాశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి మాట్లాడుతూ రద్దయిన పాత నోట్ల స్థానంలో కొత్త కరెన్సీని వెంటనే అందుబాటులో తేవాలన్నారు. అవి వచ్చే వరకూ పాత కరెన్సీ చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాజీ రాజ్యసభసభ్యులు అజీజ్‌పాషఅ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు నోట్లను రద్దుచేసినప్పుడు పెద్ద ఫలితాలేమీ రాలేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ గుండా మల్లేష్, సిపిఐ గ్రేటర్ కార్యదర్శి డాక్టర సుధాకర్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నోట్ల రద్దను ప్రకటించడం సరైంది కాదన్నారు. దీనివల్ల పేద వర్గాలకు చెందిన వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Advertisement