ఐటీ రిటర్నుల్లో 25% వృద్ధి | Income Tax Return Filings Grew 25%, Government Says | Sakshi
Sakshi News home page

ఐటీ రిటర్నుల్లో 25% వృద్ధి

Aug 8 2017 1:33 AM | Updated on Sep 17 2017 5:16 PM

ఐటీ రిటర్నుల్లో 25% వృద్ధి

ఐటీ రిటర్నుల్లో 25% వృద్ధి

పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌) పరిణామాల అనంతరం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016–17 సంవత్సరానికి గాను 2.82 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది.

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌) పరిణామాల అనంతరం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016–17 సంవత్సరానికి గాను 2.82 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 2.22 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 25.3 శాతం అధికమని వివరించింది. ఆగస్టు 5 దాకా మొత్తం 2.82 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది.

వాస్తవానికి ఐటీఆర్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ అయినప్పటికీ.. కొన్ని వర్గాల కోసం ఆగస్టు 5 దాకా ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. కొత్తగా మరింత మందిని పన్ను పరిధిలోకి తేగలిగినట్లు తాజా గణాం కాలు సూచిస్తున్నాయని ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వ్యక్తిగత ఆదాయ పన్ను ను సంబంధించి (కార్పొరేట్‌ ట్యాక్స్‌ కాకుం డా) అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వసూళ్లు ఆగస్టు 5 నా టికి 41.79 శాతం వృద్ధి నమోదు చేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement