Corporate Taxs
-
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 19 శాతం వృద్ధి
ఏప్రిల్–జూలై మధ్య రూ.1.90 లక్షల కోట్లు న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్– జూలై మధ్య 19 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది రూ.1.90 లక్షల కోట్లు. 2017–18 మధ్య కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.80 లక్షల కోట్లుగా ఉండాలని బడ్జెట్లో లకిష్యంచారు. తాజా వసూళ్ల మొత్తం ఇందులో 19.5 శాతంగా ఉంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ ట్యాక్స్‌లతో కూడిన ప్రత్యక్ష పన్ను వసూళ్ల వృద్ధి క్రమంగా వృద్ధి చెందుతున్నట్లుఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాగా రిఫండ్స్ విలువ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలంలో రూ.61,920 కోట్లని ఈ ప్రకటనలో వివరించింది. -
ఐటీ రిటర్నుల్లో 25% వృద్ధి
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) పరిణామాల అనంతరం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016–17 సంవత్సరానికి గాను 2.82 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 2.22 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 25.3 శాతం అధికమని వివరించింది. ఆగస్టు 5 దాకా మొత్తం 2.82 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వాస్తవానికి ఐటీఆర్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ అయినప్పటికీ.. కొన్ని వర్గాల కోసం ఆగస్టు 5 దాకా ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. కొత్తగా మరింత మందిని పన్ను పరిధిలోకి తేగలిగినట్లు తాజా గణాం కాలు సూచిస్తున్నాయని ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వ్యక్తిగత ఆదాయ పన్ను ను సంబంధించి (కార్పొరేట్ ట్యాక్స్ కాకుం డా) అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు ఆగస్టు 5 నా టికి 41.79 శాతం వృద్ధి నమోదు చేశాయి.