రిలయన్స్‌ జియో... వై–ఫై కాలింగ్‌ సేవలు | Reliance Jio Launches Voice And Video Calling Over Wi-Fi | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జియో... వై–ఫై కాలింగ్‌ సేవలు

Published Thu, Jan 9 2020 4:52 AM | Last Updated on Thu, Jan 9 2020 4:52 AM

Reliance Jio Launches Voice And Video Calling Over Wi-Fi - Sakshi

న్యూఢిల్లీ: వై–ఫై ద్వారా కూడా వాయిస్, వీడియో కాలింగ్‌ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు టెలికం సంస్థ రిలయన్స్‌ జియో వెల్లడించింది. దీనితో ఇళ్లలో లేదా ఆఫీసుల్లో కాల్స్‌ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్‌టీఈ నుంచి వై–ఫైకి మారవచ్చ ని పేర్కొంది. జనవరి 16లోగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు జియో వివరించింది. పోటీ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ ఇప్పటికే ఈ తరహా సర్వీసులను ఢిల్లీ–నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌)లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో జియో ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement