wi-fi services
-
సుప్రీంకోర్టులో ఉచిత వైఫై సేవలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు డిజిటైజేషన్ దిశగా మరో కీలక అడుగు పడింది. అత్యున్నత న్యాయస్థానంలోని మొదటి అయిదు కోర్టు రూముల్లో వైఫై సేవలను అందుబాటులో తెచ్చినట్లు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం ప్రకటించారు. లాయర్లు, కక్షిదారులు, మీడియా వ్యక్తులు, ఇతర సందర్శకులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ఇనిషియేటివ్‌లో భాగంగా తీసుకువచ్చిన ఈ వెసులుబాటును ‘ ఇఐ గిజీఊజీ‘ లాగిన్ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చునన్నారు. ‘అన్ని కోర్టు రూములు ఇకపై పుస్తకాలు, పేపర్లు కనిపించవు. అయితే దీనర్థం, పుస్తకాలు, కాగితాలపై అస్సలు ఆధారపడబోమని కాదు’అని సీజేఐ పేర్కొన్నారు. కాగా, వేసవి సెలవుల అనంతరం సోమవారం సుప్రీంకోర్టు తిరిగి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. -
రిలయన్స్ జియో... వై–ఫై కాలింగ్ సేవలు
న్యూఢిల్లీ: వై–ఫై ద్వారా కూడా వాయిస్, వీడియో కాలింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు టెలికం సంస్థ రిలయన్స్ జియో వెల్లడించింది. దీనితో ఇళ్లలో లేదా ఆఫీసుల్లో కాల్స్ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్టీఈ నుంచి వై–ఫైకి మారవచ్చ ని పేర్కొంది. జనవరి 16లోగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు జియో వివరించింది. పోటీ సంస్థ భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే ఈ తరహా సర్వీసులను ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో జియో ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
వైఫై కనెక్షన్ : అర్థగంటకు రూ.500
చెన్నై : విమానాల్లో త్వరలోనే వైఫై సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. ఆకాశంలో ఉండగానే నెట్ వాడుకోవచ్చు. సెల్ఫీలు దిగి పోస్ట్ చేసుకోవచ్చు. ఇక స్నేహితులతో చాట్ చేసుకోవచ్చు. అయితే, ఇవన్నీ చాలా ఖరీదుతో కూడుకున్నవిగా ఉండబోతున్నాయి. వీటి కోసం విమాన చార్జీలతో కలిపి అదనంగా 20 శాతం నుంచి 30 శాతం చెల్లించాల్సి ఉండనుంది. ట్రాయ్ ఆదేశాలతో విమానంలో వైఫై సేవలను ప్రారంభించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పెను భారం వినియోగదారులపైనే పడబోతున్నట్టు తెలిసింది. అంతర్జాతీయ ప్రమాణాల పరంగా 30 నిముషాల నుంచి గంట వరకు నెట్‌కనెక్షన్ కోసం రూ.500 నుంచి రూ.1000 వరకు ఛార్జీలు విధించనున్నట్టు అధికారులు చెప్పారు. వాస్తవానికి విమానయాన సంస్థలు ఇన్‌ఫ్లైట్ వైఫై సేవల కోసం ఇన్మార్శాట్ తదితర సర్వీస్ ప్రొవైడర్లకు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దేశీయ మార్గాల్లో ఇన్‌ఫ్లైట్ ఇంటర్నెట్ సౌలభ్యం కోసం అడ్వాన్స్ బుకింగ్ చార్జీలు రూ.1200 నుంచి రూ.2,500 దాకా ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకే కాకుండా విమానయాన సంస్థలకూ ఆ చార్జీలు భారంగానే పరిణమించనున్నాయి. ఖండాంతర, దేశీయ మార్గాల్లో ప్రయాణించే విమానాలకు ఇన్‌ఫ్లైట్ వైఫై వెసులుబాటు ప్రయోజనం చేకూరుస్తుందని ఓ విమానయాన సంస్థ అధికారి ఒకరు చెప్పారు. అంతేగాకుండా భారత గగనతలంలో ఉన్నప్పుడు వైఫైని స్విచాఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన చెప్పారు. దేశీయ విమానాల్లో వైఫై సౌకర్యం గురించి చర్చిస్తున్నామని, దానిపై పూర్తి నిర్ణయం తీసుకునేముందు దాని చార్జీలు, వైఫైకి ఉన్న డిమాండ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఓ ప్రైవేటు విమానయాన సంస్థ అధికారి ఒకరు సూచించారు. ఇక, వైఫై సేవలను అందించేందుకు గానూ సిగ్నల్స్ కోసం విమానాల్లో యాంటెన్నాను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. -
విమానాల్లో వైఫై సర్వీసులకు అనుమతివ్వండి
అసోచామ్ వినతి ∙ప్రధానికి లేఖ న్యూఢిల్లీ: విమానాల్లో వైఫై సర్వీసులను అనుమతించాలని అసోచామ్ ప్రభుత్వాన్ని కోరింది. ఇలా చేయడం వల్ల విమానాల్లో ప్రయాణించేవాళ్లు అనుసంధానమై ఉంటారని, అంతే కాకుండా విమాన భద్రతను మరింతగా మెరుగుపరుస్తుందని వివరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి అసోచామ్ ప్రధాన కార్యదర్శి డి. ఎస్. రావత్ ఒక లేఖ రాశారు. ప్రస్తుతం పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ తమ విమానాల్లో వైఫై సర్వీసులనందజేస్తున్నాయని, కానీ భారత గగనతలంలోకి రాగానే మన దేశ నియమనిబంధనల కారణంగా వీటిని అపేస్తున్నాయని తెలిపారు. -
విమానాశ్రయంలో వైఫై సేవలు
గన్నవరం విమానాశ్రయంలో వచ్చే నెల నుంచి వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా 52 విమానాశ్రయాల్లో వైఫై సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో నూతన రాజధానికి దగ్గర్లో ఉన్న గన్నవరం విమానాశ్రయంలో అత్యున్నత నాణ్యమైన సేవలందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు దేశంలో పలు ప్రాంతాల నుంచి దాదాపు 20 నుంచి 24 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. సుమారు రెండువేల మంది ప్రయాణికులు నిత్యం హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ తదితర నగరాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో విమాన ప్రయాణికులకు అత్యవసర సేవలు అందించేందుకు కొత్తగా నిర్మించిన టెర్మినల్ భవనంలో వైఫై సేవలు అందించాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఏర్పాట్లు చేస్తోంది. తక్కువ సమయంలో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలందించే వైఫైని అందుబాటులోకి తీసుకొస్తోంది. రిలయన్స్ సంస్థ కూడా విమానాశ్రయం బయట వైఫై సేవలందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే ఆ సంస్థ అధికారులు విమానాశ్రయానికి వచ్చి పరిశీలించి వెళ్లారు. -
సాంకేతిక పరిజ్ఞానంతోనే పారదర్శక పాలన
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి సికింద్రాబాద్ స్టేషన్లో వైఫై సేవలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలనకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదం చేస్తుందని, ఆ దిశగా ప్రధాని మోదీ ఏడాది పాలన అద్భుతంగా సాగిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, వైఫై సేవల అభివృద్ధికి కేంద్రం రూ.లక్షల కోట్లు వెచ్చిస్తుందని తెలిపారు. త్వరలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు దేశంలోని అన్ని యూనివర్సిటీలలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే నంబర్-1 రైల్వే స్టేషన్‌గా పేరొందిన సికింద్రాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. పాత గాంధీ ఆసుపత్రి స్థలాన్ని రైల్వేకు కేటాయిస్తే దాంతో పాటు, చిలకలగూడ వైపు ఉన్న రైల్వే క్వార్టర్స్ స్థలాన్ని కూడా కలుపుకొని సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయవచ్చునన్నారు. కాజీపేట్‌లో రాష్ట్రప్రభుత్వం స్థలం కేటాయిస్తే వచ్చే ఏడాది కల్లా వ్యాగన్ ఫ్యాక్టరీ పూర్తవుతుందని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ, ఈ ఏడాది చివరికల్లా నగరమంతటా వైఫై సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు. అనంతరం దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ప్రయాణికుల పక్షోత్సవాలను ప్రారంభించారు. రైళ్లు, స్టేషన్లలో అందజేస్తున్న సదుపాయాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సేవల్లో హైఫై
- పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు రాజధాని శోభ - దేశంలో వైఫై ఉన్న మొదటి బస్టాండ్ - 25 బస్సు సర్వీసుల్లో ఇంట్రా వైఫై - స్కానియా బస్సు రాకపోకలు సాక్షి, విజయవాడ : పండిట్ నెహ్రు బస్‌స్టేషన్ రాజధాని శోభను సంతరించుకుంది. క్రమంగా అధునాతన సౌకర్యాలను అందిపుచ్చుకుని వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తోంది. సర్వీసుల సంఖ్య మొదలుకుని వైఫై సేవల వరకు అన్నీ దశలవారీగా ఇక్కడ అమల్లోకి తెస్తున్నారు. తద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించటంతోపాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఆదాయం పెంచే దిశగా కసరత్తు సాగిస్తున్నారు. ప్రస్తుతం 25 బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం నాలుగు రోజులుగా అందుబాటులోకి వచ్చింది. ప్రతినెలా మూడురోజులు ఆర్టీసీ ఎండీ బస్టాండ్‌లోనే.. గడిచిన ఆరు నెలల్లో జిల్లాకు రెండు విడతల్లో 120కుపైగా కొత్త బస్సులు (వీటిలో 12 ఏసీ సర్వీసులు) వచ్చాయి. మరో మూడు నెలల వ్యవధిలో దశలవారీగా మంజూరైన 50 బస్సులు జిల్లాకు రానున్నాయి. ఇప్పటికే జిల్లాలోని 14 డిపోల్లో కలిపి 1,440 వరకు బస్సులు ఉన్నాయి. ఇవికాకుండా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉండటంతో ఎక్కువ సర్వీసులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 2,500 బస్సులు విజయవాడ నుంచి రోజూ వెళ్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతోపాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు పదుల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. వచ్చేనెల నుంచి ఆర్టీసీ ఎండీ నగరంలోనే మూడు రోజులు అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి అనుగుణంగా బస్‌స్టేషన్‌లోని పైఅంతస్తుల్లో మార్పులు చేసి ప్రత్యేక చాంబర్‌తోపాటు కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. టెస్ట్ డ్రైవ్‌లో స్కానియా బస్సు మల్టీయాక్సిల్ సౌకర్యం కలిగిన స్కానియా బస్సు గతనెల 15 నుంచి హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీకి రాకపోకలు మొదలుపెట్టింది. సుమారు రూ.1.20 కోట్ల విలువైన ఈ బస్సును విజయవాడ రీజియన్‌కు కేటాయించారు. దీనిని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రెండు నెలల పాటు విజయవాడ నుంచి హైదారాబాద్‌కు నడిపి పనితీరును పరిశీలిస్తున్నారు. దీనికోసం పదిమంది డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. స్కానియా కంపెనీకి చెందిన టెక్నీషియన్ ఒకరు బస్సులోనే ఉండి పనితీరును పరిశీలిస్తున్నారు. ఆటోమేటిక్ డోర్ లాకింగ్ సిస్టమ్, మల్టీయాక్సిల్ సీటింగ్, ఏసీ ఇందులోని ప్రత్యేకతలు. 25 సర్వీసుల్లో ఇంట్రా వైఫై ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, చెన్నై, బెంగళూరు తదితర సర్వీసుల్లోని కొన్ని బస్సులకు ఇంట్రా వైఫై సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేశారు. ఇంట్రానెట్‌లో కొన్ని సినిమాలు, కొన్ని రకాల గేమ్స్, వీడియో, ఆడియో సాంగ్స్ మాత్రమే ఉంటాయి. గత నెల 29 నుంచి ఈనెల 31 వరకు 25 బస్సు సర్వీసుల్లో వైఫై అమల్లో ఉంది. బస్టాండ్‌లో వైఫై వీటితోపాటు పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో సోమవారం నుంచి వైఫై సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఒకేసారి 8వేల మంది ప్రయాణికులు వినియోగించుకునే సౌకర్యంతో దీనిని అమల్లోకి తెచ్చారు. బస్టాండ్‌లో 17 మాక్సెస్ పాయింట్లు ఏర్పాటుచేసి దీనిని అందిస్తున్నారు. 220 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5జీ వైఫై సేవలను ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. రోజుకు అరగంట మాత్రమే వైఫై ఉచితంగా పనిచేస్తుంది. ఆ తర్వాత రీచార్జి చేయించుకోవాల్సిందే. ఈ సౌలభ్యంతో దేశంలోనే వైఫై ఉన్న మొదటి బస్టాండ్‌గా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌గా నిలిచింది. -
వై-ఫైకి బాలారిష్టాలు
సాక్షి, సిటీబ్యూరో:రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో ప్రారంభించిన వై-ఫై సర్వీసులకు బాలారిష్టాలు తప్పడం లేదు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, ఈట్‌స్ట్రీట్ ఫుడ్ కోర్ట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన వై-ఫై హాట్‌స్పాట్ పరికరాల వద్ద ఇంటర్నెట్ సర్వీసులను వినియోగించుకోవాలనుకున్న వారికి నిరాశ తప్పడం లేదు. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలను వినియోగించుకునేందుకు కొన్ని గంటల పాటు ప్రయత్నించి విఫలమైనట్టు పలువురు వినియోగదారులు వాపోయారు. ఉదయం వ్యాహ్యాళికి వెళ్లేవారు... ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సేదదీరదామనుకున్న వారికి ఈ పరిణామం నిరాశపరుస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఐదు రోజులు పూర్తయినప్పటికీ బాలారిష్టాలు అధిగమించకపోవడం గమనార్హం. ఇదే విషయమై వై-ఫై సౌకర్యం ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ సంస్థ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈట్‌స్ట్రీట్, పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన హాట్‌స్పాట్ పరికరాల్లో స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తాయని తెలిపారు. దీనికి తోడు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడంతో వీటి పరిధిలో నెట్ వినియోగించుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ అంశాన్ని హెచ్ఎండీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. వారి సహకారంతో పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటే హాట్‌స్పాట్ పరికరాల్లో సమస్యలు తలెత్తవని వెల్లడించారు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ చుట్టూ 40 వై-ఫై హాట్ స్పాట్ పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో పది మినహా మిగతా చోట్ల ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం లేదని చెప్పారు. ఒక్కో హాట్‌స్పాట్ పరికరం వద్ద ఒకేసారి 500 మంది లాగిన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలా వినియోగించుకోవాలి.. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని సెట్టింగ్స్‌లో వై-ఫై ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే నెట్‌వర్క్‌లో క్యూ5 నెట్‌వర్క్‌పై క్లిక్ చేయాలి. బ్రౌజర్లో మీ వివరాలను, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ తదితర వివరాలు నమోదు చేసి... సబ్మిట్ చేయాలి. మీ సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అందే సందేశంలోని నాలుగు అంకెల పాస్‌వర్డ్‌ను టైప్ చేయాలి. ఆ తరవాత లాగిన్ కావాల్సి ఉంటుంది. తొలి అరగంట ఉచితంగా వై-ఫై సేవలు అందుతాయి. ఆ తరువాత వినియోగానికి చార్జీలు తప్పవు. అక్కడ నో ఫికర్.. సైబర్టవర్స్-మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్ - కొత్తగూడ జంక్షన్, సైబర్ టవర్స్-రహేజా మైండ్‌స్పేస్ సర్కిల్ పరిధిలో గత ఏడాది అక్టోబర్‌లో వైఫైని అందుబాటులోకి తెచ్చారు. 8 కి.మీ మార్గంలో 17 కేంద్రాల వద్ద వై-ఫై సిగ్నల్స్‌ను అందించే హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో సుమారు 20 వేల మంది నిత్యం 750 మెగాబైట్స్ నిడివిగల వై-ఫై సాంకేతిక సేవలను నిరంతరాయంగా వినియోగించుకుంటున్నారు. అప్పుడప్పుడూ స్వల్ప అంతరాయం ఎదురవుతున్నప్పటికీ సాంకేతిక సమస్యలను ఎయిర్టెల్ సంస్థ వెంటనే సరిదిద్దుతోంది. దీంతో వై-ఫై సేవలకు అంతరాయం కలగడంలేదని వినియోగదారులు చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువమంది లాగిన్ అయినపుడు మాత్రం అంతరాయం కలుగుతోందని తెలిపారు. -
వెరీ ఫాస్ట్‌గా... వైఫై...
⇒గ్రెటర్ వ్యాప్తంగా విస్తరించేందుకు ఐటీశాఖ కసరత్తు ⇒ప్రధాన రహదారులను గుర్తించే పనిలో నిపుణులు ⇒ సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలపై లోతుగా అధ్యయనం ⇒నగర వ్యాప్తంగా 660 కి.మీ పరిధిలో విస్తరణకు యత్నాలు సాక్షి, సిటీబ్యూరో: మన నగరం పూర్తి ‘వై-ఫై సిటీ’ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. గతేడాది అక్టోబరులో హైటెక్‌సిటీ, మాదాపూర్ పరిధిలో 8 కి.మీ మార్గంలో ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి రాగా... మిగిలిన అన్ని ప్రధాన మార్గాల్లో వై-ఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ఐటీశాఖ ముమ్మర యత్నాలు చేస్తోంది. ఈ సేవల ఏర్పాటుకు రెండు నెలల క్రితం ఐటీశాఖ ఆసక్తిగల సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా ..ఎయిర్టెల్, రిలయన్స్, కన్వర్జెన్స్ టెక్నాలజీస్, హాత్వే, బీమ్ తదితర పది సంస్థలు ముందుకొచ్చాయి. ఇక ఈ నెలాఖరు వరకు అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ సామర్థ్యం, సాంకేతిక అర్హతలు, అనుభవం, నిపుణులు కలిగిన మూడు సంస్థలను ఎంపికచేసి మార్చి నెలలో వై-ఫై సేవలు విస్తరించేందుకు ఆయా సంస్థలకు అవకాశం ఇవ్వనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏడాదిలోగా గ్రేటర్ వ్యాప్తంగా హయత్‌నగర్-మియాపూర్, నాగోల్-హైటెక్‌సిటీ, జేబీఎస్-శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర ప్రధాన మార్గాల్లో సుమారు 660 కి.మీ మార్గంలో నిరంతరాయంగా వై-ఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం మహా నగరం ఉగ్రవాదుల పడగనీడలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలపై రాష్ట్ర ఐటీశాఖ లోతుగా అధ్యయనం చేస్తోంది. జాతీయ భద్రతను దష్టిలోఉంచుకొని సంఘవిద్రోహ శక్తులు వై-ఫై సౌకర్యాన్ని దుర్వినియోగం చేసే వీలులేకుండా పకడ్బందీగా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐటీశాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. వై-ఫై అంటే.. వై ఫై అంటే.. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ (డబ్ల్యూఐఎల్‌ఏఎన్). ఇది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ (ఐఈఈఈ) 802.11 స్టాండర్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఆంగ్లభాషలో డబ్ల్యూఐఎల్ఏఎన్ను కుదించి ‘వై ఫై’ అని పిలుస్తున్నారు. అంటే వైర్లెస్ ఫెడిలిటీ అన్నమాట. ఒక్క వై ఫై టవర్ సిగ్నల్స్ ఇన్డోర్ ప్రదేశంలో అయితే 20 మీటర్లు (66 ఫీట్లు), ఔట్‌డోర్‌లో అయితే 100 మీటర్లు (330 ఫీట్లు) వరకు అందుతాయి. వై ఫైతో కంప్యూటర్లు, వీడియో గేమ్స్ పరికరాలు, స్మార్ట్ ఫోన్లు, కొన్ని రకాల డిజిటల్ కెమెరాలు, ట్యాబ్లెట్స్, డిజిటల్ ఆడియో ప్లేయర్లను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడే.. సైబర్ టవర్స్-మాదాపూర్ పోలీస్‌స్టేషన్, కొత్తగూడ జంక్షన్, రహేజా మైండ్‌స్పేస్ సర్కిల్ పరిధిలో గతేడాది అక్టోబరులో 8 కి.మీ మార్గంలో 17 కేంద్రాల వద్ద వై-ఫై సిగ్నల్స్‌ను అందించేందుకు హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేశారు. దీంతో సుమారు 50 వేల మంది నిత్యం 750 మెగాబైట్స్ నిడివిగల వై-ఫై సాంకేతిక సేవలను నిరంతరాయంగా వినియోగించుకునే సౌకర్యం కలిగింది. సిగ్నల్స్ ఇలా.. తీగల అవసరం లేకుండా నిర్ణీత పరిధిలో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందడమే వై ఫై. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న తర్వాత వై ఫై రోటర్ పరికరాన్ని అమర్చుతారు. ఈ పరికరం బ్రాడ్ బ్యాండ్ ద్వారా అందే ఇంటర్నెట్ను నిర్ణీత పరిధిలో వై ఫై సౌకర్యం కలిగి ఉన్న ఫోన్లు, కంప్యూటర్లు వంటి వాటికి ఇంటర్నెట్ సిగ్నల్‌ను అందిస్తాయి. ప్రతిబంధకాలివీ... ⇒నగరవ్యాప్తంగా వై-ఫై సేవల విస్తరణ అనేక వ్యయ ప్రయాసలతో కూడినది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేయాలంటే కోట్లాది రూపాయలు వ్యయం చేయక తప్పని పరిస్థితి. ఈవిషయంలో ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థలు భారీగా రాయితీలు ఆశిస్తున్నాయి. ⇒ఒక వై ఫై హాట్‌స్పాట్ నుంచి మరో వై-ఫై హాట్‌స్పాట్‌కు వెళ్లేసరికి సిగ్నల్ కట్ కాకుండా ఉండేందుకు అనేక సాంకేతిక జాగ్రత్తలు తప్పనిసరి. ⇒తొలి పది నిమిషాలపాటు ఉచిత వై-ఫై సౌకర్యం ఇచ్చి ఆ తర్వాత ఛార్జీ వసూలు చేయాలన్న నిబంధన ఉచిత వై ఫై సేవల లక్ష్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చనుందన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ⇒కీలక సమాచారం ఉగ్రవాదుల చేతికి చిక్కకుండా సాంకేతికంగా అనేక జాగ్రత్తలు తీసుకోకుంటే లాభం కంటే నష్టమే అధిక మన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ⇒కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలు పూర్తి ఉచిత వై-ఫై సేవలను అనుమతిస్తాయా..? లేదా అన్న సంశయం నెలకొంది. ఈ విషయంలో రాష్ట్ర ఐటీ శాఖ అధ్యయనం తర్వాతే నిజానిజాలు బయటికి రానున్నాయి. ప్రయోజనాలివీ.. ⇒ఆన్లైన్లో అనుసంధానించిన సుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచ్చు. ⇒ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఇంటర్నెట్, ఫోన్ల పనితీరు ఎన్నో రెట్లు మెరుగవుతుంది. ⇒పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవచ్చు. ⇒4 జీతో టీవీలకు ఇక కేబుల్ కనెక్షన్లతో అవసరం ఉండదు. బెంగళూరే ఆదర్శం... బెంగళూరు నగరాన్ని రోల్ మోడల్‌గా తీసుకొని హైదరాబాద్‌లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎందుకంటే దేశంలోనే తొలి వై ఫై నగరంగా బెంగళూరు ప్రసిద్ధికెక్కింది. అక్కడి సానుకూల, ప్రతికూల అంశాలను పరిగణలోకి తీసుకొని నగరంలో వై ఫైను సేవలను విస్తరించనున్నారు. 2014 జనవరిలో బెంగళూరులోని మహాత్మా గాంధీ రోడ్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వైఫై సేవలను ప్రారంభించింది. 512 కేబీపీఎస్ వేగంతో రోజులో 3 గంటల పాటు 50 ఎంబీ డేటా వరకు ఉచితంగా వై ఫైను పొందుతున్నారు అక్కడి సిటీజనులు. -
వై-ఫై సేవలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రెల్వే స్టేషన్లో గురువారం ప్రారంభించాల్సిన వై-ఫై సేవలు ఉత్తర ప్రదేశ్‌లో రైలు దుర్ఘటన కారణంగా వాయిదాపడ్డాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో వై-ఫై సేవను ప్రారంభించాల్సిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. వై-ఫై సదుపాయం ప్రారంభంలో జాప్యం ఏర్పడిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.అన్ని ఏర్పాట్లు పూర్తి: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని మొత్తం 16 ఫ్లాట్ ఫారాలపై వై-ఫై సేవలను అందుబాటులోకి తేవడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మొదటి అరగంటపాటు ప్రయాణికులకు వై-ఫై సదుపాయం ఉచితంగా లభిస్తుంది. ఆ తరువాత వై-ఫై సేవను పొందడం కోసం ప్రయాణికులు స్క్రాచ్ కార్డు కొనుక్కోవలసి ఉంటుంది. 30 నిమిషాలకు రూ. 25, గంటలకు రూ.35 ధరకు లభించే స్క్రాచ్ కార్డులు 24 గంటలు చెల్లుతాయి. వై-ఫై కోసం సెల్‌ఫోన్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంటుంది. ఇందుకోసం హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటుచేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో వై-ఫై ప్రాజెక్టును రూ.50 లక్షల ఖర్చుతో నెలకొల్పారు. దీని నిర్వహణకుసంవత్సరానికి రూ.16 లక్షలు ఖర్చవుతుంది. న్యూఢిల్లీ ైరైల్వే స్టేషన్ దేశంలో అత్యంత రద్దీగా ఉండే ైరె ల్వే స్టేషన్,. రోజుకు 300 రైళ్లు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తాయి.రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు స్టేషన్‌ను సందర్శిస్తారని అధికారులు తెలిపారు. ఎప్పుడు ప్రారంభిస్తామనేది త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. -
నేటి నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో వై-ఫై సేవలు
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు వై-ఫై సదుపాయం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ సేవను ప్రారంభిస్తారు. రైల్ టెల్ అనే ైరె ల్వే ప్రభుత్వ రంగ సంస్థ ఈ సేవను అందుబాటులోకి తేనుంది. ప్రయాణికులకు వై- ఫై సేవను అందించడం కోసం స్టేషన్‌లోని అన్నిప్లాట్ఫారాలపై ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ైరె ల్వే అధికారి బుధవారం తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే ఏ్టషన్లో వై-ఫై సదుపాయానికి ప్రయాణికుల నుంచి ప్రతిస్పందనను బట్టి నగరంలోని మిగతా ప్రధాన స్టేషన్లలో వై-ఫై సేవలను అందించడంపై నిర్ణయం తీసుకుంటారు. బెంగళూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఇప్పటికే ఈ సదుపాయం లభిస్తోంది. బెంగళూరు రైల్వే స్టేషన్లో అక్టోబర్‌లో ఈ సేవలను ప్రవేశపెట్టారు. దేశంలోని అన్ని ఏ, ఏ1 కేటగిరీ రైల్వే స్టేషన్లతో పాటు రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ఎంపిక చేసిన 400 రైళ్లలో ప్రయాణికులకు వై-ఫై సేవలు అందిస్తామని అప్పటి రెల్వే మంత్రి సదానందగౌడ రైలు బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఈ సేవలను ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. -
త్వరలో 4జీ, వైఫై సేవలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ‘మెట్రో పొలిస్’ సదస్సుకు సమయం దగ్గర పడుతుండటంతో ఆలోగా ఎంపిక చేసిన మార్గాల్లో (సదస్సు వేదిక.. నగరానికి వచ్చే విదేశీ ప్రతినిధులు విడిదిచేసే హోటళ్లు.. సందర్శించే పర్యాటక ప్రదేశాల్లో) 4జీ, వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా రిలయన్స్ సంస్థకు జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. అక్టోబర్‌లో ‘మెట్రో పొలిస్’ సదస్సు జరుగనున్నందున సెప్టెంబర్ నెలాఖరులోగా 4జీ సేవలకు అవసరమైన సహకారాలందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడం తెలిసిందే. ప్రస్తుతం 310 కి.మీ.ల మేర అవసరమైన లైన్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ రిలయన్స్‌కు అనుమతించింది. దీనికోసం ఆయా మార్గాల్లో ఏర్పాటు చేసే పోల్స్ ఒక్కోదానికి రూ.వెయ్యి వంతున ఫీజుగా తాత్కాలికంగా నిర్ణయించారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయమే అంతిమమని, ఆ మేరకు రిలయన్స్ నుంచి అండర్‌టేకింగ్ తీసుకున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. సమయం తక్కువగా ఉండడం... రోడ్ల తవ్వకాల వల్ల తలెత్తే ఇబ్బందులు.. వర్షాకాల సమస్యల దృష్ట్యా ప్రస్తుతానికి పోల్స్ ద్వారా ఏరియల్ కేబుల్స్‌తో ఈ సేవలు అందుబాటులోకి తేనున్నారు. భూగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అందుబాటులోకి వచ్చేంతవరకు ఏరియల్ కేబుల్స్‌ను వినియోగిస్తారు. 4జీ, వైఫై సేవలు అందుబాటులోకి వస్తే ఒకే బిల్లుతో ఇంటర్నెట్, కంప్యూటర్, టీవీ, సెల్‌ఫోన్ సేవలన్నీ పొందవచ్చు. ‘మెట్రో పొలిస్’ సదస్సుకు హాజరయ్యే అతిథుల అవసరాల దృష్ట్యా తొలి దశలో వెస్ట్‌జోన్, సెంటర్జోన్లోని కొన్ని ప్రాంతాల ప్రజలకే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
హైదరాబాద్.. ఇంటింటా ఇంటర్నెట్
► ఇక హై(వై)ఫై ► తొలి విడతగా వైఫై వచ్చే ప్రాంతాలు ► హైటెక్ సిటీ ► మాదాపూర్ ► గచ్చిబౌలి ► వీటితో పాటు వెస్ట్ జోన్‌లోని కొన్ని ప్రాంతాలు ► మెట్రోపోలీస్ సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధులు విడిది చేసే హోటళ్లు, పర్యాటక ప్రాంతాలు వైఫై పనితీరు ఇలా.. ‘వెర్లైస్ ఫెడిలిటీ’(వైఫై)... ఇప్పటివరకు లగ్జరీ హోటళ్లు, కార్పొరేట్ ఆఫీసులు, షాపింగ్ మాళ్లకే పరిమితమైన వైఫై సేవలు.. త్వరలో నగరం నడిబొడ్డున పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఉంటే చాలు.. వైర్లతో పనిలేకుండా ఆన్లైన్లో ఉచితంగా విహరించొచ్చు. సెప్టెంబర్ కల్లా హైదరాబాద్‌లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైఫై కథాకమామిషేంటో ఓ లుక్కేద్దాం రండి! ఇప్పటికే ప్రపంచదేశాల్లో గుర్తింపు పొందిన భాగ్యనగరం మరో మైలురాయిని దాటనుంది. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌ను కూడా వైఫై ఆధారిత నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. దేశవ్యాప్తంగా 4జీ సేవల లెసైన్స్ పొందిన రిలయెన్స్ సంస్థ చేతికి పగ్గాలప్పగించింది. తొలి విడతలో.. హైదరాబాద్‌తో పాటు 6 కార్పొరేషన్లు, 37 మున్సిపాలిటీల్లో, రెండో విడతలో.. ఇతర పట్టణాలు, 220 మండల కేంద్రాల్లో, మూడో విడతలో రాష్ట్రమంతటా 4జీ సేవలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వై -ఫై అంటే.. వైఫై అంటే.. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ (డబ్ల్యూఎల్ఏఎన్). ఇది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) 802.11 స్టాండర్స్‌పై ఆధారపడి ఉంటుంది. వైఫై అంటే ైవెర్లైస్ ఫెడిలిటీ అన్నమాట. ఒక్క వైఫై టవర్ సిగ్నల్స్ ఇండోర్‌లో అయితే 20 మీటర్లు, ఔట్‌డోర్‌లో అయితే 100 మీటర్లు వరకు అందుతాయి. వైఫై సేవలను పొందాలంటే ఫోర్త్ జనరేషన్ (4జీ) ఉండాల్సిందే. సిగ్నల్స్ ఇలా.. తీగల అవసరం లేకుండా నిర్ణీత పరిధిలో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందడమే వైఫై. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న తర్వాత వైఫై రౌటర్ పరికరాన్ని అమర్చుతారు. ఈ పరికరం బ్రాడ్ బ్యాండ్ ద్వారా అందే ఇంటర్నెట్ను నిర్ణీత పరిధిలో వైఫై ఉన్న ఫోన్లు, కంప్యూటర్ల వంటి వాటికి ఇంటర్నెట్ సిగ్నల్‌ను అందిస్తా యి. మనం బ్లూటూత్ ద్వారా ఫోటోలు, పాటలు పంపినట్లే వై-ఫై ఇంటర్నెట్ సేవలను అందిస్తుందన్నమాట. తొలి 6 నెలలు ఉచితం.. ఆపై నెలకు రూ.1,200 తొలి విడతగా వైఫై సేవలను సచివాలయం, అసెంబ్లీ, జీహెచ్ఎంసీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని కొన్ని ప్రాంతాలు, సైబరాబాద్ పరిధిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాల్లో ఆరునెలల పాటు వైఫై ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మామూలుగా అయితే 4జీ కనెక్షన్‌కు చుట్టూ 4 కి.మీ. వరకు వైఫై అందుబాటులో ఉండే వీలున్నా.. పాస్వర్డ్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. అయితే ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందరికీ ఉచితంగా వైఫై సేవల్ని అందిస్తారు. ఆ తర్వాత కనెక్షన్‌కు ప్రతినెలా రూ.1,200 వరకు చార్జీ వసూలు చేస్తారు. ప్రయోజనాలనేకం.. - ఇంటి పన్ను, విద్యుత్ బిల్లులు, లే-అవుట్ల అనుమతులు, జనన, మరణ ధృవీకరణ పత్రాల వంటి స్థానిక సర్టిఫికేట్లు వంటి సుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తారు. దీంతో వినియోగదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఉచితంగా పొందవచ్చు. దీంతో డబ్బుకు డబ్బు.. సమయానికి సమయం ఆదా అవుతుంది. ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయండోయ్. - వైఫై సేవలతో ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దానికంటే ఇంటర్నెట్, ఫోన్ల పనితీరు ఎన్నో రెట్లు మెరుగవుతుంది. - వైఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటేచాలు.. మొబైల్ డేటా నెట్వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ను బ్రౌజింగ్ చేసే వీలుంటుంది. గల్లీ గల్లీల్లో నిలబడి కూడా ఈ-మెయిల్స్, ఫేస్బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌ల్లో సర్ఫింగ్ చేయొచ్చు. - 4జీతో కేబుల్ కనెక్షన్లతో అవసరముండదు. ఆన్లైన్ ద్వారా ఒకే టీవీలో అన్ని చానళ్లు వీక్షించే వీలుంటుంది. - మొబైల్ ఫోన్లో మనం మాట్లాడే వ్యక్తులను చూసే వీలుంటుంది. దీనివల్ల ఒకరికొకరు దగ్గరగా ఉండి మాట్లాడుతున్నామనే అనుభూతి కలుగుతుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ తప్పనిసరి.. వైఫై సేవలకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉండాల్సిందే. ముందుగా వినియోగదారులు మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు నమో దుచేసిన వెంటనే మొబైల్‌కు ఓటీపీ (వన్‌టైమ్ పాస్వర్డ్) వస్తుంది. ఈ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ కావచ్చు. ఇప్పటికే 500 కి.మీ. పూర్తి.. నగరంలో పూర్తి స్థాయి వైఫై సేవలకు 1,700 కి.మీ. మేర ఆప్లిక్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) లైన్లు అవసరముంటుందని నిపుణు ల అంచనా. ఇప్పటికే రిలయెన్స్ 500 కి.మీ. మేర లైన్ల నిర్మాణం పూర్తి చేసింది. అయితే అక్టోబర్‌లో నగరంలో జరగనున్న మెట్రోపోలీస్ సదస్సు నాటికి కొన్ని ప్రాంతాల్లోనైనా వైఫై సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రోజుకు 3 గంటలు.. 50 ఎంబీ డేటా.. రోజుకు 3 గంటల చొప్పున 50 ఎంబీ డేటా వరకు ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. కచ్చితమైన డేటాలోని ఐఎంఈఐ నంబర్లున్న మొబైల్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లకు మాత్రమే వైఫై సేవలు పొందే వీలుంటుంది. ఒక రోజులో 3 గంటల సమయం దాటితే వైఫై కనెక్టివిటీ ఉండదు. దృష్టి పెట్టాల్సిందిక్కడే: టీ ఐటీ ఎంప్లాయిస్ జేఏసీసీ లక్ష్మారెడ్డి - ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న వైఫై విధి, విధానాలు, లోటు పాట్లను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయాలి. ఇందుకోసం ప్రత్యేకమైన సాంకేతిక నిపుణుల్ని నియమించాలి. - వైఫై కింద ప్రభుత్వ సేవలను ఉచితంగా అందించి, ప్రైవేటు సేవలను కొంత మొత్తంతో అందించాలి. దీంతో నగదు భారం కాసింత తగ్గుతుంది. - వైఫై ఉపయోగించుకునే వ్యక్తి ఎలాంటి మొబైల్, ల్యాప్‌టాప్ వాడుతున్నాడు, ఇంటర్నెట్లో ఏం చెక్ చేస్తున్నాడు, ఏం డౌన్లోడ్ చేస్తున్నాడు.. వంటి అనేక అంశాలపై సర్వీసు ప్రొవైడర్లు ఎప్పటిక ప్పుడు నిఘా వేయాలి. - సంఘ విద్రోహక శక్తుల చేతుల్లోకి వైఫై కనెక్టివిటీ వెళ్లకుండా సైబర్ క్రైమ్ టీంను బలోపేతం చేయాలి. నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి. - కేవలం సమాచారాన్ని తెలుసుకునేందుకు, బ్రౌజింగ్, ఈ-మెయిల్స్ పంపించేందుకు మాత్రమే వైఫైని ఉచితంగా అందించాలి. వీడియో, ఆడియో స్ట్రీమింగ్, డౌన్లోడ్లను నియంత్రించాలి. - ఒకే సర్వర్‌పై ఎక్కువ గంటలు బ్రౌజింగ్ చేస్తే అక్కడి ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడంతో పాటు, సర్వర్ కుప్పకూలే ప్రమాదముంది. పైగా స్థానిక వ్యాపారులు అపరిమితంగా వాడుకుని దుర్వినియోగం చేసే అవకాశముంది. ఈ అంశంపై దృష్టి సారించాలి. - సిటీ ఫ్లస్ ప్రతినిధి -
శివసేన, ఎమ్మెన్నెస్ మధ్య ‘వై ఫై’ట్..!
సాక్షి, ముంబై: నగరంలో వై ఫై సేవల ప్రారంభంపై శివసేన, మహారాష్ర్ట నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. మహానగర పాలక సంస్థ(బీఎంసీ) తరఫున శివాజీ పార్క్ మైదానం పరిసరాల్లో వై ఫై సేవలు ప్రారంభిస్తామని గత ఏడాది మేయర్ సునీల్ ప్రభు ప్రకటించారు. కాని ఆ సేవలు ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. దీంతో వై ఫై సేవలను తాము ప్రారంభించనున్నట్లు ఎమ్మెన్నెస్ ప్రకటించింది.ఈ మేరకు సన్నాహాలు కూడా ప్రారంభించింది. దీంతో తేరుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ తాము నగరంలో వై ఫై సేవల కల్పనకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను ఎమ్మెన్నెస్ నేత రాజ్ ఠాక్రే కొట్టిపారేశారు. నగరవాసులకు వై ఫై సేవలను అందుబాటులోకి తెస్తామని శివసేన చెప్పి ఏడాది దాటినా ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదని అందుకే తాము ముందుకు వచ్చామని ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభిస్తున్నట్లు బీఎంసీలోని ఎమ్మెన్నెస్ గట్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే స్పష్టం చేశారు. దీనిపై సునీల్ ప్రభు మాట్లాడుతూ బీఎంసీ అనుమతి లేకుండా వై ఫై యంత్ర సామగ్రి ఏర్పాటు చట్టరీత్యా నేరమన్నారు. దీనిపై సందీప్ దేశ్‌పాండేది తొందరపాటు చర్య అని ఆరోపించారు. బీఎంసీ తరఫున త్వరలోనే వై ఫై సేవలు ప్రారంభిస్తామని ప్రకటించారు. -
రాపిడ్ మెట్రోలో వైఫై
గుర్గావ్: రాపిడ్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. 5.1 కిలోమీటర్ల పరిధిలోని ఆరు స్టేషన్ల మీదుగా ప్రయాణించే అన్ని రైళ్లలో ఉచిత వైఫై సేవలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఎంటీఎస్ బ్రాండ్ పేరు కింద పనిచేస్తున్న సిస్టిమా శ్యామ్ టెలిసర్వీసెస్ భాగస్వామ్యంతో రాపిడ్ మెట్రో రైల్ గుర్గావ్ లిమిటెడ్ ఈ సేవలను ప్రయాణికులకు అందిస్తోంది. రాపిడ్ మెట్రో రైళ్లలోనే కాకుండా సికందర్పూర్, ఇండస్ఇండ్ బ్యాంక్ సైబర్ సిటీ, ఫేజ్ 2, మైక్రోమ్యాక్స్ మౌల్శారి అవెన్యూ స్టేషన్లలో కూడా ఎంటీఎస్ ఈ సేవలను కల్పిస్తోంది. ఇందుకోసం ఆయా స్టేషన్లలో ఐదు దుకాణాలను ఏర్పాటుచేసింది. ఇక్కడ ప్రయాణికులకు వైఫై కూపన్లను అందుబాటులో ఉంచింది. ప్రతిరోజు 30వేల మంది ప్రయాణికులు అనుభూతి పొందనున్న ఈ వైఫై సేవలు ఆరు నెలల పాటు ఉచితంగానే అందజేస్తామని ఎంటీఎస్ కంపెనీ ప్రకటించింది. ఎంటీఎస్ 3జీ ప్లస్ నెట్‌వర్క్‌లో 9.8 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఎంటీఎస్ ఇండియా ప్రధాన కార్యనిర్వహణ అధికారి డిమిత్రి సుకోవ్ మీడియాకు తెలిపారు. ఇతర నగరాల్లోని మెట్రో, విద్యా సంస్థలతో పాటు ఇతర బహిరంగ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వైఫై సేవలను అందించాలనుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కాలంలో అనేక మంది వైఫై సేవలను వినియోగించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారన్న విషయం తమ కంపెనీ అంతర్గత పరిశోధనలో తేలిందన్నారు. అందుకే రాపిడ్ మెట్రో రైళ్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రాపిడ్ మెట్రోలో ప్రయాణించే వారిలో సుమారు 95 శాతం మంది ఇంటర్నెట్ కావాలన్న విషయాన్ని తాము నిర్వహించిన ఏజే రీసెర్చ్‌లో తెలిసిందని చెప్పారు. వీరిలో 15 నుంచి 35 మధ్య వయస్సు ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ‘రాపిడ్ మెట్రోలో ప్రతిరోజు వెళ్లే ప్రయాణికులు స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు ఉపయోగిస్తున్నారు. ఈ రోజు ప్రారంభించిన ఎంటీఎస్ 3జీ ప్లస్ నెట్‌వర్క్‌లో అధిక వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం పొందవచ్చ’ని రాపిడ్ మెట్రో గుర్గావ్ ఎండీ, సీఈవో సంజీవ్ రాయ్ వెల్లడించారు. ఈ వైఫై సేవల వల్ల ప్రయాణికులు తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు తమకు కావల్సిన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి అప్పటికప్పుడు పొందేందుకు వీలుంటుందని తెలిపారు. ఎంటీఎస్ అందిస్తున్న ఈ ఉచిత వైఫై సేవలను అందరు వినియోగించుకోవాలని కోరారు. ఇలాంటి ఆధునిక సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. -
సీఎస్టీ స్టేషన్లో వైఫై సేవలు
సాక్షి, ముంబై: చరిత్రాత్మక ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)లో ప్రయాణికులకు రైల్వే అధికారులు కొత్త సంవత్సర కానుక ప్రకటించారు. వినియోగదారుల సౌకర్యార్థం వైఫై (వైర్లెస్ ఫిడిలిటీ) సేవలు అందుబాటులోకి తేనున్నారు. మరో రెండు నెలల తరువాతే ప్రయాణికులు ఈ స్టేషన్లో వైఫై సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే మొదటి 20 నిమిషాలపాటు వైఫై సేవలను ప్రయాణికులకు ఉచితంగా అందించేందుకు రైల్వే అధికారులు యోచిస్తున్నారు. తదనంతరం ఈ సేవలకు చార్జీ వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై సెంట్రల్ రైల్వే అధికారులు టెలికం కంపెనీలతో గత కొన్ని నెలలుగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. వైఫై సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పుడు ప్రయాణికులకు ఉచితంగానే అందివ్వాలని రైల్వే అధికారులు భావించారు. అయితే ఈ ప్రయోగం చాలా ఖరీదుతో కూడుకున్నది కావడంతో మొదటి 20 నిమిషాలపాటు ప్రయాణికులకు ఉచితంగా అందజేసి, ఆ తర్వాత చార్జీలు వసూలు చేయాల్సిందిగా టెలికం కంపెనీలు రైల్వే అధికారులకు సూచించాయి. ఇదిలా వుండగా వైఫై సేవలు ప్రారంభించిన మూడునెలల పాటు ప్రయాణికులకు ఉచితంగానే సేవలను అందించేందుకు ప్రయత్నించామని టెలికం కంపెనీల అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకున్న 20 నిమిషాల తర్వాత చార్జీ వసూలు చేస్తామని వారు పేర్కొన్నారు. దీనివల్ల తాము 20 శాతం ఆదాయాన్ని పొందుతామని సెంట్రల్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎస్టీ రైల్వే స్టేషన్లో రోజుకు అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అందుకే వారి సౌకర్యార్థం వైఫై సేవలను అందజేసేందుకు సెంట్రల్ రైల్వే నిర్ణయించిందన్నారు. ఈ సేవలు అందుబాటులోకి రావడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతోందని చెప్పారు. నగర శివారు ప్రాంతాల నుంచే కాకుండా ఇతర నగరాలకు వెళ్లే ప్రయాణికులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్ (ఎమ్మార్వీసీ) ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. సీఎస్టీ నుంచి రోజుకు 6.36 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. స్థానికులే కాకుండా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇక్కడికి వస్తుంటారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే రైళ్ల ట్రాకింగ్, రైళ్లు ఆలస్యంగా వచ్చే సమాచారం, షెడ్యూల్ తదితర వివరాలను ప్రయాణికులు మొబైల్ఫోన్లు, ట్యాబ్లెట్ల ద్వారా సులువుగా తెలుసుకునే వీలు ఉంటుంది. ఇదిలా వుండగా వైఫై సేవలకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో అతుల్ రాణే తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే కళ్యాణ్, ఠాణే, డోంబివలి తదితర ముఖ్య రైల్వే స్టేషన్లలోనూ వైఫై సేవలను అందిస్తామని వెల్లడించారు. -
సీఎస్టీలో ఉచిత ‘వైఫై’ సేవలు!
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) రైల్వే స్టేషన్లో ఉచితంగా ‘వైఫై’ఇంటర్నెట్ సేవ లు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు తాము వెళ్లాల్సిన రైలు ఎక్కడుంది. ఏ సమయంలో ప్లాట్‌ఫాంకి చేరుకుంటుంది తదితర వివరాలను మొబైల్ఫోన్లో చూసుకునే వెసులుబాటు కలగనుంది. అయితే ఇది కేవలం స్మార్ట్‌ఫోన్, మొబైల్లో వైఫై సౌకర్యం ఉన్నవారికి మాత్రమే ఈ సేవ లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. సీఎస్టీకి ప్రతి రోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికుల తాకిడి ఉంటుందని, ఈ వైఫై సేవలు వారందరికి ఉచితంగానే అందుతాయని వివరించారు. ఈ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సెంట్రల్ రైల్వే అధికారులు మొబైల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ‘సీఎస్టీ స్టేషన్లోకి ప్రవేశించగానే ప్రయాణికుల మొబైల్ స్క్రీన్‌పై వైఫై సూచన వస్తుంది. దాని పై క్లిక్ చేసిన అనంతరం మొబైల్లో ఇంటర్నెట్ వస్తుంది. ఆ తర్వాత ప్రయాణికులు ఉచి తంగా ఇంటర్నెట్ సేవను పొందుతార’ని సెం ట్రల్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రైల్వే సమయాలు, అలాగే రైళ్ల కచ్చితమైన స్టేషన్ల గురించి ఎప్పటికప్పుడూ తెలియజేయాలనే ఉద్దేశంతో రైల్వే ఇటీవల www. enquiry.indianrail.gov.inవెబ్‌సైట్‌ను ప్రారంభించిందన్నారు. రైళ్ల సమయాలతో పాటు వాటి ప్రస్తుత స్థితి, సమయానికి బయలుదేరుతుందా, ఆలస్యమవుతుందా తది తర సమాచారం ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు. మొబైళ్లలో వినియోగించే ఇతర వెబ్సైట్లలో రైల్వే రూపొందించిన వెబ్సైట్ గురించి ‘పాప్-అప్’ వచ్చేందుకు రైల్వే తరపున సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని తెలిపారు.