సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు వై-ఫై సదుపాయం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ సేవను ప్రారంభిస్తారు. రైల్ టెల్ అనే ైరె ల్వే ప్రభుత్వ రంగ సంస్థ ఈ సేవను అందుబాటులోకి తేనుంది. ప్రయాణికులకు వై- ఫై సేవను అందించడం కోసం స్టేషన్‌లోని అన్నిప్లాట్‌ఫారాలపై ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ైరె ల్వే అధికారి బుధవారం తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే ఏ్టషన్‌లో వై-ఫై సదుపాయానికి ప్రయాణికుల నుంచి ప్రతిస్పందనను బట్టి నగరంలోని మిగతా ప్రధాన స్టేషన్లలో వై-ఫై సేవలను అందించడంపై నిర్ణయం తీసుకుంటారు.
బెంగళూరు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఇప్పటికే ఈ సదుపాయం లభిస్తోంది. బెంగళూరు రైల్వే స్టేషన్‌లో అక్టోబర్‌లో ఈ సేవలను ప్రవేశపెట్టారు. దేశంలోని అన్ని ఏ, ఏ1 కేటగిరీ రైల్వే స్టేషన్లతో పాటు రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ఎంపిక చేసిన 400 రైళ్లలో ప్రయాణికులకు వై-ఫై సేవలు అందిస్తామని అప్పటి రెల్వే మంత్రి సదానందగౌడ రైలు బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఈ సేవలను ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
నేటి నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వై-ఫై సేవలు
Published Wed, Dec 3 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM
Advertisement
Advertisement