Union Railway Minister Suresh Prabhu
-
తిరుమలలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు
సాక్షి,తిరుమల: ఆంధ్రప్రదేశ్ కోటా నుండి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు శుక్రవారం రాత్రి తిరుమల వచ్చారు. ఇ క్కడి అతిథిగృహం వద్ద జేఈవో పోల భాస్కర్, ట్రస్టుబోర్డు సభ్యు డు భానుప్రకాష్‌రెడ్డి పుష్పగుచ్చం తో స్వాగతం పలికారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమలకు వచ్చిన కేంద్ర మం త్రితో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఇక్కడి శ్రీకృష్ణ అతిథిగృహంలో బేటీ అయ్యారు. తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణ కోసం ఇటీవల లీజు కింద ఇచ్చిన 2.5 ఎకరాల స్థలం అప్పగింత విషయంతోపాటు అభివృద్ధి పనులపై చర్చించారు. సాయంత్రం రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకున్న ఆయన కపిలతీర్ధం వెళ్లారు. అనంతరం శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వెంకటేశ్వరుడ్ని సందర్శించుకున్నారు. -
'పరువు పోతోంది.. రైల్వే జోన్ ప్రకటించండి'
- విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు సీఎం చంద్రబాబు లేఖ - విశాఖ-రాయ్‌పూర్ సరుకు రవాణా కారిడార్ ఏర్పాటుకు వినతి హైదరాబాద్ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోగా ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్‌పై స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, రెండేళ్లు గడుస్తున్నా జోన్‌పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడు కట్టుకుందని వివరించారు. ఈ మేరకు చంద్రబాబు శనివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు లేఖ రాశారు. ఏపీలో రైల్వే జోన్‌పై బడ్జెట్లో కేంద్రం నోరు మెదపకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బడ్జెట్‌కు ముందు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రి సురేశ్ ప్రభుని కలిసి జోన్ విషయం చర్చించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని, ప్రధాని కార్యాలయం కూడా రైల్వే బోర్డుకు ఆదేశాలిచ్చిందని టీడీపీ పెద్దలంతా ప్రచారం చేశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి రైల్వే జోన్ కచ్చితంగా ప్రకటిస్తారని తమకు సమాచారముందని తనదైన శైలిలో మీడియా ఎదుట ఎప్పటిలాగే గొప్పలు చెప్పుకొచ్చారు. అయితే 25న బడ్జెట్లో రైల్వే జోన్ ఊసే లేకపోవడంతో విశాఖవాసులతో పాటు ప్రతిపక్షాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచి రైల్వే జోన్ సాధిస్తామని చంద్రబాబు ప్రకటనల్ని ఉటంకిస్తూ ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. దీంతో పరువు పోతుందని, రైల్వే జోన్ ప్రకటన చేయాలని తాజాగా చంద్రబాబు కేంద్ర రైల్వే మంత్రి కి లేఖ రాశారు. సరుకు రవాణాకు పీపీపీ విధానంలో మూడు కారిడార్లు ప్రకటించడంపైనా, రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్టణం-రాయ్‌పూర్ సరుకు రవాణా కారిడార్‌పై కూడా ప్రకటన చేయాలని, ఈ కారిడార్ ఖరగ్‌పూర్-ముంబయి కారిడార్‌ను తాకుతూ వెళుతుందని లేఖలో పేర్కొన్నారు. విశాఖ-రాయపూర్ కారిడార్‌తో కోస్తా తీరం వెంబడి పోర్టుల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని సురేశ్ ప్రభుకు సోదాహరణంగా వివరించారు. -
రైల్వే బడ్జెట్లో జిల్లాకు జీరో
రైల్వే బడ్జెట్లో ఒరిగిందేమీలేదు తాడేపల్లిగూడెం :ఊరింపులు.. నిరీక్షణలు.. చివరకు ఉసూరుమనిపించాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ జిల్లా ప్రజల ఆశలను నీరుగార్చింది. ప్రజల చిరకాల వాంఛ అయిన కోటిపల్లి-నరసాపురం, కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్ల నిర్మాణ ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నా.. ఆ నిధులు సర్వే పనులకు సైతం సరిపోవు. ఈ లైన్ ప్రతిపాదనను బతికించడానికి చేసిన కేటాయింపులే తప్ప ఎందుకూ అక్కరకు రావన్న విషయం తెలిసి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు జిల్లా మీదుగా కొత్త రైళ్లు నడిపే ప్రకటనలేవీ లేకపోగా.. కనీసం హాల్టులు కూడా కల్పించలేదు. ‘కోటి’పల్లి ఆశలపై నీళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం.. ఆ పార్టీ ఎంపీ ఒకరు జిల్లాలో ఉండటం.. అభివృద్ది విషయంలో తరచూ ఢిల్లీ వెళ్లి వినతులు సమర్పించే రాష్ట దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జిల్లాలో బీజేపీ ఆశాజ్యోతిగా ఉండటంతో.. ఈసారి తప్పకుండా రైల్వే పరంగా ఎంతోకొంత ప్రయోజనం కలుగుతుందని అంతా భావించారు. అయినా.. కేంద్రమంత్రి సురేష్‌ప్రభు ఎప్పటిలా మన జిల్లాను చిన్నచూపు చూశారు. నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ ఈసారి సాకారం అవుతుందని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఆశించారు. ఈ లైన్ నిర్మాణం కోసం అటు కోనసీమ, ఇటు నరసాపురంలో ఆందోళనలు సైతం జరిగాయి. కేవలం 60 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మిస్తే ఉభయ గోదావరి జిల్లాలకు ప్రయోజనం కలగటంతోపాటు అవసరమైనప్పుడు రైళ్ల దారి మళ్లింపు, దూరప్రాంత రైళ్ల పెంపు సాధ్యమవుతుంది. సుమారు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే తప్ప ఆచరణకు నోచుకోని ఈ లైన్ కోసం రూ.200 కోట్లు విదిల్చి చేతులు దులిపేసుకోవడం చర్చనీయాంశమైంది. మూడో లైన్ ముచ్చట లేదు విజయవాడ నుంచి విశాఖై వెపు గల మార్గంలో రైళ్ల ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. కొత్తగా నడుపుతున్న సూపర్ ఫాస్ట్ రైళ్లకు ప్రధాన స్టేషన్లలో కూడా హాల్టు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ట్రాక్ సామర్థ్యానికి మించి రైళ్లను నడుపుతున్నామని.. ఇకపై కొత్త రైళ్లు నడపలేమని, కొత్త హాల్టులు గాని ఇవ్వలేమని రైల్వే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మూడో లైన్ నిర్మాణమే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన రైల్వే లైన్ మీదుగా మూడో లైన్ అందుబాటులోకి వస్తుందని ఇటీవల ఏలూరులో దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం చెప్పారు. ఖాజీపేట నుంచి విజయవాడ వరకు మూడోలైన్ నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.114 కోట్లను కేటాయించారు. ఇదే లైన్‌ను విశాఖ వరకు విస్తరించి ఉంటే జిల్లాకు ప్రయోజనం కలిగేది. -
రైలు సౌకర్యం కల్పించాలి..
సూర్యాపేటపై కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ప్రభుకి మంత్రి జగదీశ్‌రెడ్డి విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ : నల్లగొండ జిల్లా సూర్యాపేటకు రైలు సౌకర్యం కల్పించాలని కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభుకు రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి విన్నవించారు. బుధవారం ఆయన ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి తేజావత్ రామచంద్రుతో కలసి రైల్వేమంత్రితో భేటీ అయ్యారు. సూర్యాపేటను కలుపుతూ మూడు రైల్వే లైన్లను ప్రతిపాదిస్తూ ఒక నివేదికను కేంద్రమంత్రికి అందజేశారు. భవిష్యత్‌లో సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారనుందని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. దీంతోపాటు ఆ ప్రాంతంలో పలు సిమెంటు పరిశ్రమలున్నాయని, భవిష్యత్తులో ఓ థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కాబోతున్నందున సిమెంటు, బొగ్గు తరలించేందుకు భారీ డిమాండ్ ఉంటుందన్నా రు. బోనకల్ నుంచి చిట్యాల(వయా సూర్యాపేట), ఖమ్మం నుంచి నల్లగొండ(వయా సూర్యాపేట), ఖమ్మం నుంచి మిర్యాలగూడ (వయా సూర్యాపేట) రైల్వే లైన్లను జగదీశ్‌రెడ్డి ప్రతిపాదించారు. వీటి నిర్మాణానికి వీలుగా సర్వేలు చేపట్టాలన్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో రైల్వే ప్రాజెక్టుల ఏర్పాటుకు వీలుగా జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకునేందు కు కేంద్ర మంత్రిమండలి సమ్మతించిందని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే ఈ సర్వే పనులు ప్రారంభించవచ్చని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. హైవే ప్రమాదాలపై గడ్కారీతో చర్చ జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీతో చర్చించారు. హైదరాబాద్-విజయవాడ జాతీ య రహదారిపై నార్కట్‌పల్లి వద్ద కామినేని ఆసుపత్రి కూడలి, దురాజపల్లి గ్రామం, జనగామ-సూర్యాపేట కూడలి, సూర్యాపేట పట్టణం ప్రధాన కూడలి, మునగాల మండలం ముకుందాపురం వద్ద వీయూపీలు ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలో నూతన పవన విద్యుత్... తెలంగాణ రాష్ట్రం 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని జాతీయ పవన విద్యుత్ సంస్థ(ఎన్ఐడబ్ల్యూఈ) అధ్యయనంలో తేలిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. 2017-18లోగా 361 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తిని రాష్ట్రంలో ప్రారంభించనున్నామన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘పునరుత్పాదక విద్యుత్’ అంశంపై ఢిల్లీలో జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటుచేసి విద్యుదుత్పత్తి చేసేందుకు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నామన్నారు. -
ఈ సారికింతే...
సాక్షి, ముంబై: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ముంబైకర్లను కొంత నిరాశకు గురిచేసింది. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ల కోసం కొత్త టెర్మినల్స్‌ను నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించడం నగర ప్రజలకు కొంతలో కొంత ఊరటినిచ్చే అంశం. ఈ టెర్మినల్స్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం లోకల్ రైళ్లపై పడుతున్న అదనపు భారం చాలా వరకు తగ్గిపోనుంది. ఫలితంగా కొత్తగా లోకల్ రైళ్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. నగర విస్తరణ, రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మూడు కొత్త టెర్మినల్స్ నిర్మించాలనే ప్రతిపాదనను పశ్చిమ, సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగాలు రైల్వే బోర్డుకు పంపించాయి. ఇందులో పన్వేల్, ఠాకుర్లీ, వసయిరోడ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో రెండు టెర్మినల్స్‌కు మంజూరు లభించే అవకాశముందని సూచన ప్రాయంగా మంత్రి వెల్లడించారు. పనులు పూర్తిచేసుకుని వినియోగంలోకి వస్తే ముంబైలో లోకల్ రైళ్లపై పడుతున్న దూరప్రాంతాల రైళ్ల భారం చాలా వరకు తగ్గిపోనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఐదు టెర్మినల్స్ ఉన్నాయి. జనాభాతో పోలిస్తే ముంబైలో టెర్మినల్స్ సంఖ్య రెట్టింపు ఉండాలి. కాని పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ముంబైలో ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), దాదర్, బాంద్రా, లోక్మాన్య తిలక్ (కుర్లా), ముంబై సెంట్రల్ టెర్మినల్స్ మాత్రమే ఉన్నాయి. వీటికి మరో మూడు అదనంగా చేరితే ముంబై వాసుల సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. సెంట్రల్ రైల్వే పన్వేల్, ఠాకుర్లిలో, పశ్చిమ రైల్వే వసయిరోడ్లో టెర్మినల్స్ నిర్మించాలనే ప్రతిపాదనను సంబంధిత బోర్డులు పంపించాయి. గత బడ్జెట్లోనే పన్వేల్‌లో టెర్మినస్, కలంబోలి ప్రాంతంలో రైలు బోగీల నిర్వాహణ, మరమ్మత్తుల కోసం కోచింగ్ టెర్మినస్ నిర్మించాలని మంజూరు లభించినా అది అమలుకు నోచుకోలేదు. అవి ఏర్పాటయ్యుంటే నగరంలోని వివిధ టెర్మినల్స్‌పై భారం తగ్గేది. లోకల్ రైళ్ల ట్రిప్పులు పెంచాలంటే కొత్త టెర్మినల్స్ నిర్మాణం జరగాలి. చాలా సందర్భాలలో లోకల్ రైళ్లకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లను లూప్లైన్లో పెట్టాల్సి వస్తోంది. కొత్త టెర్మినల్స్ ఏర్పాటైతే ఈ సమస్య కొంత మేర కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
నేటి నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో వై-ఫై సేవలు
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు వై-ఫై సదుపాయం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ సేవను ప్రారంభిస్తారు. రైల్ టెల్ అనే ైరె ల్వే ప్రభుత్వ రంగ సంస్థ ఈ సేవను అందుబాటులోకి తేనుంది. ప్రయాణికులకు వై- ఫై సేవను అందించడం కోసం స్టేషన్‌లోని అన్నిప్లాట్ఫారాలపై ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ైరె ల్వే అధికారి బుధవారం తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే ఏ్టషన్లో వై-ఫై సదుపాయానికి ప్రయాణికుల నుంచి ప్రతిస్పందనను బట్టి నగరంలోని మిగతా ప్రధాన స్టేషన్లలో వై-ఫై సేవలను అందించడంపై నిర్ణయం తీసుకుంటారు. బెంగళూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఇప్పటికే ఈ సదుపాయం లభిస్తోంది. బెంగళూరు రైల్వే స్టేషన్లో అక్టోబర్‌లో ఈ సేవలను ప్రవేశపెట్టారు. దేశంలోని అన్ని ఏ, ఏ1 కేటగిరీ రైల్వే స్టేషన్లతో పాటు రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ఎంపిక చేసిన 400 రైళ్లలో ప్రయాణికులకు వై-ఫై సేవలు అందిస్తామని అప్పటి రెల్వే మంత్రి సదానందగౌడ రైలు బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఈ సేవలను ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.