తిరుమలలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు | Tirumala Railway Minister Suresh Prabhu | Sakshi
Sakshi News home page

తిరుమలలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు

Published Fri, Jun 3 2016 10:33 PM | Last Updated on Mon, Jul 29 2019 7:35 PM

తిరుమలలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు - Sakshi

తిరుమలలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు

సాక్షి,తిరుమల: ఆంధ్రప్రదేశ్ కోటా నుండి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు శుక్రవారం రాత్రి తిరుమల వచ్చారు. ఇ క్కడి అతిథిగృహం వద్ద జేఈవో పోల భాస్కర్, ట్రస్టుబోర్డు సభ్యు డు భానుప్రకాష్‌రెడ్డి  పుష్పగుచ్చం తో స్వాగతం పలికారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమలకు వచ్చిన కేంద్ర మం త్రితో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఇక్కడి శ్రీకృష్ణ అతిథిగృహంలో బేటీ అయ్యారు.

తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణ కోసం ఇటీవల లీజు కింద ఇచ్చిన 2.5 ఎకరాల స్థలం అప్పగింత విషయంతోపాటు అభివృద్ధి పనులపై చర్చించారు. సాయంత్రం రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకున్న ఆయన కపిలతీర్ధం వెళ్లారు. అనంతరం శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వెంకటేశ్వరుడ్ని సందర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement