న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు డిజిటైజేషన్ దిశగా మరో కీలక అడుగు పడింది. అత్యున్నత న్యాయస్థానంలోని మొదటి అయిదు కోర్టు రూముల్లో వైఫై సేవలను అందుబాటులో తెచ్చినట్లు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం ప్రకటించారు. లాయర్లు, కక్షిదారులు, మీడియా వ్యక్తులు, ఇతర సందర్శకులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ ఇనిషియేటివ్‌లో భాగంగా తీసుకువచ్చిన ఈ వెసులుబాటును ‘ ఇఐ గిజీఊజీ‘ లాగిన్ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చునన్నారు. ‘అన్ని కోర్టు రూములు ఇకపై పుస్తకాలు, పేపర్లు కనిపించవు. అయితే దీనర్థం, పుస్తకాలు, కాగితాలపై అస్సలు ఆధారపడబోమని కాదు’అని సీజేఐ పేర్కొన్నారు. కాగా, వేసవి సెలవుల అనంతరం సోమవారం సుప్రీంకోర్టు తిరిగి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment