వై-ఫై సేవలు వాయిదా | New Delhi Railway station Wi-Fi inauguration postponed | Sakshi
Sakshi News home page

వై-ఫై సేవలు వాయిదా

Published Thu, Dec 4 2014 10:24 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

New Delhi Railway station Wi-Fi inauguration postponed

 సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రెల్వే స్టేషన్‌లో గురువారం ప్రారంభించాల్సిన వై-ఫై సేవలు ఉత్తర ప్రదేశ్‌లో రైలు దుర్ఘటన కారణంగా వాయిదాపడ్డాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో  వై-ఫై సేవను ప్రారంభించాల్సిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. వై-ఫై సదుపాయం ప్రారంభంలో జాప్యం ఏర్పడిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.అన్ని ఏర్పాట్లు పూర్తి:  న్యూఢిల్లీ  రైల్వే స్టేషన్‌లోని మొత్తం 16 ఫ్లాట్ ఫారాలపై వై-ఫై సేవలను అందుబాటులోకి తేవడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మొదటి అరగంటపాటు ప్రయాణికులకు వై-ఫై సదుపాయం ఉచితంగా లభిస్తుంది. ఆ తరువాత వై-ఫై సేవను పొందడం కోసం ప్రయాణికులు స్క్రాచ్ కార్డు కొనుక్కోవలసి ఉంటుంది.
 
 30 నిమిషాలకు రూ. 25, గంటలకు రూ.35 ధరకు లభించే స్క్రాచ్ కార్డులు 24 గంటలు చెల్లుతాయి. వై-ఫై కోసం సెల్‌ఫోన్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంటుంది. ఇందుకోసం  హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటుచేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వై-ఫై  ప్రాజెక్టును రూ.50 లక్షల ఖర్చుతో నెలకొల్పారు. దీని నిర్వహణకుసంవత్సరానికి రూ.16 లక్షలు ఖర్చవుతుంది. న్యూఢిల్లీ ైరైల్వే స్టేషన్ దేశంలో అత్యంత రద్దీగా ఉండే ైరె ల్వే స్టేషన్,. రోజుకు 300 రైళ్లు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తాయి.రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు స్టేషన్‌ను సందర్శిస్తారని అధికారులు తెలిపారు. ఎప్పుడు ప్రారంభిస్తామనేది త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement