సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) రైల్వే స్టేషన్‌లో ఉచితంగా ‘వైఫై’ఇంటర్‌నెట్ సేవ లు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు తాము వెళ్లాల్సిన రైలు ఎక్కడుంది. ఏ సమయంలో ప్లాట్‌ఫాంకి చేరుకుంటుంది తదితర వివరాలను మొబైల్‌ఫోన్‌లో చూసుకునే వెసులుబాటు కలగనుంది. అయితే ఇది కేవలం స్మార్ట్‌ఫోన్, మొబైల్‌లో వైఫై సౌకర్యం ఉన్నవారికి మాత్రమే ఈ సేవ లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. సీఎస్టీకి ప్రతి రోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికుల తాకిడి ఉంటుందని, ఈ వైఫై సేవలు వారందరికి ఉచితంగానే అందుతాయని వివరించారు. ఈ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సెంట్రల్ రైల్వే అధికారులు మొబైల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
‘సీఎస్టీ స్టేషన్‌లోకి ప్రవేశించగానే ప్రయాణికుల మొబైల్ స్క్రీన్‌పై వైఫై సూచన వస్తుంది. దాని పై క్లిక్ చేసిన అనంతరం మొబైల్‌లో ఇంటర్‌నెట్ వస్తుంది. ఆ తర్వాత ప్రయాణికులు ఉచి తంగా ఇంటర్‌నెట్ సేవను పొందుతార’ని సెం ట్రల్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రైల్వే సమయాలు, అలాగే రైళ్ల కచ్చితమైన స్టేషన్ల గురించి ఎప్పటికప్పుడూ తెలియజేయాలనే ఉద్దేశంతో రైల్వే ఇటీవల www. enquiry.indianrail.gov.inవెబ్‌సైట్‌ను ప్రారంభించిందన్నారు. రైళ్ల సమయాలతో పాటు వాటి ప్రస్తుత స్థితి, సమయానికి బయలుదేరుతుందా, ఆలస్యమవుతుందా తది తర సమాచారం ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. మొబైళ్లలో వినియోగించే ఇతర వెబ్‌సైట్లలో రైల్వే రూపొందించిన వెబ్‌సైట్ గురించి ‘పాప్-అప్’ వచ్చేందుకు రైల్వే తరపున సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని తెలిపారు.
సీఎస్టీలో ఉచిత ‘వైఫై’ సేవలు!
Published Wed, Nov 27 2013 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement
Advertisement