LTE
-
రిలయన్స్ జియో... వై–ఫై కాలింగ్ సేవలు
న్యూఢిల్లీ: వై–ఫై ద్వారా కూడా వాయిస్, వీడియో కాలింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు టెలికం సంస్థ రిలయన్స్ జియో వెల్లడించింది. దీనితో ఇళ్లలో లేదా ఆఫీసుల్లో కాల్స్ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్టీఈ నుంచి వై–ఫైకి మారవచ్చ ని పేర్కొంది. జనవరి 16లోగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు జియో వివరించింది. పోటీ సంస్థ భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే ఈ తరహా సర్వీసులను ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో జియో ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
తొలి దేశీయ 4జీ సెమీకండక్టర్ చిప్
న్యూఢిల్లీ: 4జీ, ఎల్టీఈ, 5జీ మోడెమ్స్‌లో ఉపయోగించడానికి అనువైన సెమీకండక్టర్ చిప్స్‌ను తొలిసారి దేశీయంగా రూపొందించినట్లు బెంగళూరుకు చెందిన సిగ్నల్‌చిప్ వెల్లడించింది. ఇందులో నాలుగు చిప్‌ల శ్రేణిని బుధవారం ఆవిష్కరించింది. వీటి వినియోగం కోసం సంబంధిత రంగ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సిగ్నల్‌చిప్ వ్యవస్థాపకుడు, హిమాంశు ఖస్నిస్ వెల్లడించారు. తొలి దేశీ సెమీకండక్టర్ చిప్‌ల రూపకల్పనపై సిగ్నల్‌చిప్ సంస్థను టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ అభినందించారు. మరోవైపు, భద్రతాప్రమాణాలకు సంబంధించి అంతర్జాతీయంగా చైనా టెలికం పరికరాల తయారీ సంస్థలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై మరింతగా అధ్యయనం చేయనున్నట్లు అరుణ చెప్పారు. ‘చాలా దేశాలు చైనా సంస్థల టెలికం పరికరాల విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి భారత్ కూడా దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది‘ అని చిప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు చైనా కంపెనీలు.. ముఖ్యంగా హువావే సంస్థ తయారు చేసే టెలికం పరికరాలను ఉపయోగించరాదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అరుణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, హువావేకి వ్యతిరేకంగా కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. జర్మనీ తదితర దేశాలు మాత్రం ఆ సంస్థ పరికరాల వినియోగం కొనసాగించే యోచనలో ఉన్నాయి. -
42% : ఇంకా ‘డౌన్’లోడింగే
ఓ పాత జోకు.. భారతీయుల మనస్తత్వాన్ని తెలిపేందుకు.. ఇంట్లో కరెంటు పోయిందట.. జపానోళ్లు అయితే ఫ్యూజ్ చెక్ చేస్తారట.. అమెరికాలో పవర్ హౌస్‌కు ఫోన్ చేస్తారట.. మరి మన దగ్గరో.. పక్కింట్లో కరెంటు ఉందో లేదో చెక్ చేస్తారట.. అదే అలవాటు ప్రకారం ఓసారి 4జీ గురించి కూడా పక్కింట్లో(పొరుగు దేశాల్లో) చెక్ చేసి వద్దాం.. ఎందుకంటే.. ఇప్పుడంతా 4జీ మయం.. ఇంత స్పీడ్ అంత స్పీడ్ అని చెప్పుకుంటున్నాం.. అందుకే ఓసారి అక్కడి పరిస్థితి ఎలా ఉందో చెక్ చేసి వద్దాం.. వాళ్లతో పోలిస్తే.. మన 4జీ ఎల్టీఈ(లాంగ్ టెర్మ్ ఎవల్యూషన్) స్పీడ్ ఎంతో లెక్కేసి వద్దాం.. అయితే.. జోకులో అన్నట్లుగా పక్కింట్లోనూ కరెంటు లేదా.. అయితే ఓకే అని ఇక్కడ అనుకోవడానికి లేదు.. ఎందుకంటే.. మన పొరుగుదేశాల్లో 4జీ స్పీడు మనకంటే చాలా మెరుగ్గా ఉంది. ఎక్కడో ఉన్న అమెరికాలాంటివి వద్దు.. పక్కనున్న పాకిస్తాన్, శ్రీలంకతో పోల్చినా కూడా అదే పరిస్థితి. అంటే.. మన అందరి వద్ద 4జీలు ఉన్నా.. స్పీడు విషయానికొస్తే.. అవన్నీ ‘స్లో’జీలే అన్నమాట.. వైర్లెస్ కవరేజీని మ్యాపింగ్ చేసే బ్రిటన్ సంస్థ ‘ఓపెన్ సిగ్నల్’ మొత్తం 88 దేశాల్లో 4జీ ఎల్టీఈ స్పీడ్‌కు సంబంధించిన ఫిబ్రవరి నెల నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో మనం మొదటి స్థానంలో ఉన్నాం! అయితే.. చివరి నుంచి!! భారత్‌లో సగటు డౌన్లోడ్ స్పీడు 6.07 ఎంబీపీఎస్ (మెగాబైట్స్ పర్ సెకండ్) అట. అదే పాకిస్తాన్లో ఈ వేగం 13.56.. శ్రీలంకలో 13.95 ఎంబీపీఎస్‌గా ఉంది. మొదటి స్థానంలో ఉన్న సింగపూర్‌లో 4జీ స్పీడు 44 ఎంబీపీఎస్‌గా ఉంది. అయితే.. స్పీడు విషయంలో ఎలాగున్నా.. 4జీ విస్తృతి.. లభ్యత విషయంలో మాత్రం మనం 14 స్థానంలో ఉన్నాం. దేశంలో 4జీ కవరేజీ 86.26 శాతంగా ఉంది. ఈ జాబితాలో దక్షిణ కొరియా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 96 శాతం 4జీ కవరేజీ పరిధిలో ఉంది. పాక్‌లో ఇది 66 శాతంగా.. శ్రీలంకలో 45 శాతంగా ఉంది. 4జీ ఎల్టీఈకి సంబంధించి అడ్వాన్స్డ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని దేశాలు స్పీడు విషయంలో ముందంజలో ఉన్నాయని ‘ఓపెన్ సిగ్నల్’ పేర్కొంది. అయితే.. దక్షిణ కొరియా, సింగపూర్ వంటి చోట్ల మొబైల్ టారిఫ్ ఎక్కువగా ఉంటుందని.. దీని వల్ల నెట్‌వర్క్‌పై ఒత్తిడి తక్కువగా ఉండి.. వేగం విషయంలో స్థిరత్వం ఉందని.. భారత్ వంటి దేశాల్లో మొబైల్ నెట్ వినియోగదారులు ఎక్కువని.. దీని వల్ల నెట్‌వర్క్‌పై ఒత్తిడి ఎక్కువగా పడి.. స్పీడు తగ్గుతోందని తెలిపింది. ఎల్టీఈ అడ్వాన్స్డ్ నెట్‌వర్క్‌ను విస్తృతపరచడమొక్కటే దీనికి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు మన దగ్గర కూడా 4జీ డౌన్లోడ్ స్పీడు బాగా పెరుగుతుందని పేర్కొంటున్నారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
ఈ నెల నుంచే ఐడియా 4జీ సర్వీసులు..
తెలుగు రాష్ట్రాల్లో 122 పట్టణాల్లో... మొదలైన ప్రీ-బుకింగ్ రిజిస్ట్రేషన్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఐడియా సెల్యులార్ డిసెంబరులోనే 4జీ ఎల్టీఈ సర్వీసులను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తోంది. నెట్వర్క్ పనితీరుపై సాంకేతిక పరీక్షలను దాదాపు పూర్తి చేసింది. రిలయన్స్ జియో కంటే ముందే 4జీ మార్కెట్లో ప్రవేశించే దిశగా కంపెనీ ఏర్పాట్లను వేగిరం చేసింది. అటు ప్రీ-బుకింగ్ ఆఫర్‌ను ప్రారంభించింది. పేరు నమోదు చేసుకున్న కస్టమర్‌కు సర్వీసులు ప్రారంభం అయ్యాక 10 రోజుల కాలపరిమితి ఉండే 1 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది. కాగా, ఐడియా సెల్యులార్ తొలుత 1,800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో కలిపి) సర్కిల్, హర్యానా, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్ మరియు చత్తీస్‌గఢ్, పంజాబ్, ఒడిషా, తమిళనాడు సర్కిళ్లలో 4జీ మార్కెట్లో ప్రవేశిస్తోంది. చిన్న పట్టణాల్లోనూ.. చిన్న పట్టణాల్లో డేటా వినియోగం జోరుగా ఉండడం, 4జీ స్మార్ట్ఫోన్లు రూ.4,500 నుంచి లభిస్తుండటంతో ఐడియా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బండిల్ ఆఫర్ల కింద దిగ్గజ కంపెనీల స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టనుందని సమాచారం. డేటా చార్జీలు మార్కెట్ ధరలకు పోటీనిచ్చేలా ఉంటాయని ఐడియా ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు శుక్రవారం వెల్లడించారు. 122 పట్టణాల్లో 4జీ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో కంపెనీ 122 పట్టణాల్లో 4జీ సర్వీసులను ప్రారంభిస్తోంది. ప్రధాన పట్టణాలైన హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, కడప, తిరుపతి, రాజమండ్రితోపాటు అన్ని జిల్లా కేంద్రాలు వీటిలో ఉన్నాయి. -
లంక ఆర్మీది యుద్ధనేరమే: విచారణ కమిటీ
కొలంబో: ఎల్టీటీఈతో యుద్ధం జరిగిన సమయంలో శ్రీలంక సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆ దేశ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఓ కమిటీ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం చెప్పినట్లు ఈ నేరాలపై విదేశీ న్యాయమూర్తులతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది. ఎల్టీటీఈతో జరిగిన యుద్ధం చరమాంకంలో కొందరు సైనికులు దారుణంగా వ్యవహరించారని.. అధ్యక్షుడు మహీంద రాజపక్సే ఏర్పాటుచేసిన ఈ కమిటీ తన 178 పేజీల నివేదికలో పేర్కొంది. ఈ కేసుల విచారణకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.