ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విటర్) విలువ గడిచిన రెండేళ్లలో దాదాపు 72 శాతం తగ్గిపోయినట్లు ‘న్యూయార్క్‌పోస్ట్’ నివేదించింది. ఇలాన్‌మస్క్ అక్టోబర్ 2022లో ఎక్స్‌లో అధిక వాటా కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్వెస్టర్ల గ్రూప్‌నకు సుమారు 24 బిలియన్ డాలర్ల(రూ.2 లక్షల కోట్లు) నష్టం వాటిల్లినట్లు తెలిపింది.
2022 అక్టోబర్‌తో పోలిస్తే ఎక్స్ విలువ దాదాపు 72 శాతం తగ్గిపోయింది. ఎక్స్‌లో అధిక వాటాలు కలిగిన ఎనిమిది మంది పెట్టుబడిదారుల ఇన్వెస్ట్‌మెంట్ మస్క్ పగ్గాలు చేపట్టిన తర్వాత దాదాపు 5 బిలియన్ డాలర్లు(రూ.41 వేలకోట్లు) తగ్గిపోయింది. ఎక్స్‌లో ప్రధానంగా జాక్‌డోర్సె, లారీ ఎల్సిసన్, సైకియా క్యాపిటల్స్ పెట్టుబడులు ఉన్నాయి. మస్క్ తర్వాత అతిపెద్ద పెట్టుబడిదారుగా కింగ్ అల్వీద్ బిన్ తలాల్ నిలిచారు. ఆయన వాటా 1.9 బిలియన్ డాలర్లు(రూ.15 వేలకోట్లు)గా ఉంది.
ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్
భవిష్యత్తులో ఎక్స్ ఆదాయ వనరులు భారీగా పెరుగుతాయని అల్వీద్ బిన్ తలాల్ విశ్వసిస్తున్నట్లు న్యూయార్క్‌పోస్టు తెలిపింది. కొంతకాలంగా ఎక్స్‌లో వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతోంది. సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ఛార్జీలు విధించడంతో ఎక్కువ మంది వినియోగదారులు ఈప్లాన్లపై ఆసక్తి చూపించడం లేదు. ఎక్స్ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో లేఆఫ్స్ ఇస్తుండడంతో నిర్వహణలో మార్పులు వస్తున్నట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. పలు నియంత్రణ సంస్థల నుంచి ఎక్స్‌కు సమస్యలు ఎదురవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment