ప్రతినిధిని నియమించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు
ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ పట్టించుకోని ఫలితం
సావొ పౌలో: ఎలాన్ మస్క్‌కు చెందిన సామా జిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ను నిషేధించేందుకు బ్రెజిల్ యంత్రాంగం నడుం బిగించింది. శని వారం నుంచి ఇంటర్నెట్‌తోపాటు మొబైల్ యా ప్ ద్వారా కూడా ‘ఎక్స్’అందుబాటులో లేకుండా పోయింది. బ్రెజిల్‌లో ‘ఎక్స్’కు న్యాయ ప్రతి నిధిని నియమించాలంటూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అలెగ్జాండర్ డీ మొరెస్ ఇచ్చిన ఆదేశాలపై నెల రోజులుగా వివాదం నడుస్తోంది.
వాక్ స్వా తంత్య్రం, దుష్ప్రచారం, అతివాదులు దుర్విని యోగం చేస్తుండటం వంటి కారణాలపై జడ్జి ‘ఎక్స్’ను తప్పుబట్టారు. నెల రోజులుగా బ్రెజిల్‌లో ‘ఎక్స్’కు ప్రతినిధంటూ ఎవరూ లేకపోవడమేంటని ప్రశ్నించారు. 24 గంటల్లోగా ప్రతినిధిని నియమించకుంటే దేశంలో ‘ఎక్స్’ను నిషేధిస్తామని జడ్జి బుధవారం రాత్రి అల్టిమేటం జారీ చేశారు. ‘బ్రెజిల్ సార్వభౌమాధికారం, ప్రత్యేకించి న్యాయవ్యవస్థ పట్ల ఏమాత్రం గౌరవం లేనట్లుగా ఎలాన్ మస్క్ వ్యవహ రిస్తున్నారు.
తనను తాను అత్యున్నతంగా, దేశాల చట్టాలకు అతీతుడిగా భావించుకుంటున్నారు’అని డీ మోరెస్ శుక్రవారం వెలువరించిన ఉత్తర్వుల్లో తీవ్రంగా వ్యాఖ్యానించారు. ‘నా ఉత్తర్వులను అమలు చేసేదాకా నిషేధం కొనసాగుతుంది. కాదని ఎవరైనా వీపీఎన్‌ల ద్వారా ‘ఎక్స్’ను వాడుకునేందుకు చూస్తే రోజుకు రూ. 7.47 లక్షల జరిమానా విధిస్తాం’అని ఆయన స్పష్టం చేశారు.
ఎలాన్ మస్క్‌కే చెందిన స్టార్‌లింక్ ఆస్తులను స్తంభింపజేయాలని కూడా గత వారం జడ్జి ఆదేశాలిచ్చారు. జరిమానాలు చెల్లించేందుకు ‘ఎక్స్’ఖాతాల్లో చాలినంత డబ్బు లేనందున, ఒకే యాజమాన్యంలోని స్టార్‌లింక్‌పై ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. స్టార్ లింక్‌కు బ్రెజిల్‌లో 2.50లక్షల మంది ఖాతాదారులు న్నారు. కాగా, శనివారం అర్ధరాత్రిలోగా కోర్టు ఉత్తర్వు లను అమలు చేయాలని టెలి కమ్యూనికేషన్ల నియంత్ర ణ విభాగం అనాటెల్ దేశంలోని టెలికం సంస్థలకు స్ప ష్టం చేసింది.
‘ఎక్స్’కున్న అతిపెద్ద మార్కెట్లలో బ్రెజిల్ ఒకటి. దేశ జనాభాలో ఐదో వంతు, సుమారు 4 కోట్ల మంది దీనిని వాడుతున్నారు. నిషేధం అమలు చేయడంతో వేలాది మంది బ్రెజిల్ యూజర్లు వీపీఎన్‌ల ద్వారా ఎక్స్‌ను వాడుకునే పనిలో పడ్డారు. ఇటువంటి వారిని గుర్తించి, జరిమానా వసూలు చేయడమెలాగనే ప్రశ్న తాజాగా అధికారులను వేధిస్తోంది.
తీవ్రంగా స్పందించిన ఎలాన్ మస్క్
బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశాలపై ‘ఎక్స్’యజమాని ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. జడ్జి ముసుగులో కొనసాగుతున్న అత్యంత తీవ్ర నేరగాడు అంటూ డీ మొరెస్‌పై నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారం కొలిక్కి వచ్చేవరకు తమ స్టార్ లింక్ బ్రెజిల్ వినియోగదారు లకు ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment