సాక్షి, ముంబై: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విటర్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. తన యూజర్ల సౌకర్యం నిమిత్తం ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని పేరును ‘సర్కిల్’ గా పిలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఉన్న మాదిరిగా ట్విటర్ యూజర్ తన ట్వీట్‌ను ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో నిర్ణయించుకునే అవకాశాశాన్ని కల్పించనుంది. క్లోజ్ ఫ్రెండ్ ఫీచర్ ను పోలిన దానినే ట్విటర్‌లో ‘సర్కిల్ పేరుతొ తీసుకొస్తోంది.
పరిమితంగా ఆండ్రాయిడ్, ఐవోస్ వినియోగదారులకు అందుబాటులో ఉందని ట్విటర్ తన బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. నిర్దిష్ట ట్వీట్లలో కొన్నింటిని స్నేహితులు మాత్రమే చూసే విధంగా సెట్ చేసుకోవచ్చు. సర్కిల్‌లో ఉన్నవారికి మాత్రమే సంబంధిత ట్వీట్‌లకు రిప్లై ఇవ్వడం, లైక్, రీట్విట్ లాంటి వాటికి అవకాశం ఉంటుందని ట్విటర్ పేర్కొంది. సర్కిల్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ప్రపంచవ్యాప్తంగా కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే ఈ సర్కిల్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
ఎలా యూజ్ చేయాలంటే
ట్విటర్ యాప్‌లో మెయిన్ మెనూలో ట్వీట్ కంపోజర్ క్లిక్ చేయాలి. ఇక్కడ ట్విటర్ సర్కిల్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత సెలెక్ట్ ఎవ్రీవన్ లేదా మన కిష్టమైన వ్యక్తులను సెలక్ట్ చేసుకొని, డన్ క్లిక్ చేయాలి. ఒకవేళ లిస్ట్ లోని వారిని ఎవరినైనా వద్దు అనుకుంటే రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment