ట్విటర్‌లో సాంకేతిక సమస్యలు.. యూజర్ల గగ్గోలు | Sakshi
Sakshi News home page

#TwitterDown: ‘ఆ మస్క్‌ను ఎవరైనా నిద్ర లేపండ్రా..’ ఆడేసుకున్న ట్విటర్‌ యూజర్లు

Published Sat, Jul 1 2023 10:09 PM

Twitter Down Users report problems with Elon Musk app - Sakshi

మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లకు ట్విటర్‌ మొరాయించినట్లుగా ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలను సమీక్షించే వేదిక ‘డౌన్‌ డిటెక్టర్‌’ నివేదించింది.

‘డౌన్‌ డిటెక్టర్‌’ ప్రకారం.. భారత్‌లో 300 మందికి పైగా ట్విటర్‌ యూజర్లు ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. 7 వేల మంది​కి పైగా  యూజర్లు అవుట్‌టేజ్ ట్రాకర్ వెబ్‌సైట్‌లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను నివేదించారు.

సాంకేతిక సమస్యలపై యూజర్ల ఫిర్యాదుల నేపథ్యంలో ట్విటర్‌లో #TwitterDown హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌ అవుతోంది. యూజర్లు ఎవరికి తోచిన విధంగా వారు ఎలాన్‌ మస్క్‌ను తమ కామెంట్లతో ఆడేసుకున్నారు.

"ఎలాన్‌ మస్క్‌ను ఎవరైనా నిద్రలేపి అతని 44 బిలియన్‌ డాలర్ల యాప్ పని చేయడం లేదని చెప్పండి!" అంటూ ఓ యూజర్‌ రాసుకొచ్చారు. “ట్విటర్ డౌన్ అయిందా? ఇంకా ఎవరికైనా ఇదే సమస్య వచ్చిందా? కామెంట్‌ సెక్షన్‌ తెరవడం సాధ్యం కాలేదు" అని మరొక యూజర్‌ ట్వీట్ చేశారు. "నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ.... #TwitterDown" ఇంకొక యూజర్‌ పోస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement