Pigcasso: The Piggy Painter Selling Its Latest Artwork For High Price - Sakshi
Sakshi News home page

డబ్బే డబ్బు!: జంతువు వేసిన పెయింటింగ్‌కు రికార్డు ధర

Published Sat, Dec 18 2021 5:27 AM | Last Updated on Sun, Dec 19 2021 9:56 AM

Pigcasso the piggy painter selling its latest artwork for rs20,20,396.33   - Sakshi

మాస్టారి టాలెంట్‌ ఏమిటో ఫొటో చూడగానే మీరో అంచనాకు వచ్చేసుంటారు.. ఇది ఉత్త పిగ్‌ కాదు.. దీని పేరు పిగ్‌కాసో.. అంటే.. పందుల్లో పికాసో టైపు అన్నమాట. నిజానికి బిర్యానీలో లెగ్‌పీసు కింద మారాల్సిన ఈ వరాహం.. జువానే లెఫ్‌సన్‌ అనే ఆవిడ పుణ్యాన రోజుకో ఆర్టు పీసును సృష్టించేస్తోంది.. ఇంతకీ ఏమైందంటే.. 

చిన్నప్పుడు దీన్ని ఓ మటన్‌ షాపుకు అమ్మేశారట.. కీమా కొట్టేయడానికి.. అయితే జువానే రక్షించి.. పెంచుకున్నారు.. అదే సమయంలో తన షాపులోపడి ఉన్న పెయింట్‌ బ్రష్షు పట్టుకుని.. విన్యాసాలు చేస్తుంటే చూసి.. ఆ దిశగా ప్రోత్సహించారు.. అంతే... అప్పట్నుంచి పిగ్‌ కాసో తనదైన రంగుల ప్రపంచాన్ని సృష్టించేసుకుంది.. 

తాజాగా వారాల తరబడి కష్టపడి.. ఇదిగో ఈ పెయింటింగ్‌ను వేసే సింది. తన కష్టం వృథా పోలేదు.. ఈ వరాహం వేసిన పెయింటింగ్‌కు అచ్చంగా వరహాల మూటే దక్కింది. జర్మనీకి చెందిన పీటర్‌ ఎసర్‌ అనే వ్యక్తి రూ.20 లక్షలకు పైగా చెల్లించి.. వేలంలో ఈ పెయింటింగ్‌ను దక్కించు కున్నారు. దాంతో పిగ్‌కాసో యజమాని జువానే ఆనందానికి అంతులేదనుకోండి.. మరో విషయం.. ఓ జంతువు వేసిన చిత్రానికి ఇంత ధర పలకడం కూడా ఇదే తొలిసారి.. గతంలో కాంగో అనే చింపాజీ వేసిన చిత్రానికి రూ.14 లక్షల ధర పలికింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement