జైపూర్: ఆకలి.. ఆకలి.. ఆకలి.. ఎన్నిసార్లు రోదించాడో, ఎందరిని వేడుకున్నాడో. కనికరం లేని విధి, జాలి చూపని సమాజం అతని పాలిట శాపంగా మారాయి. ఆకలి తీర్చే నాథుడు లేక, క్షణక్షణానికి కడుపులో పేగులు మాడిపోతుంటే కళ్ల ముందు కనిపించిన కుక్కే ఆహారంగా తోచింది. చచ్చి, పేగులు ఊడి, కళేబరం మిగిలి ఉన్న కుక్క శవాన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో విందుగా ఆరగించాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ హృదయ విదారక ఘటన బుధవారం రాజస్థాన్‌లో జరిగింది. వలస కార్మికులు రోడ్ల వెంబడి మండుటెండలో పిల్లాజెల్లాను ఓవైపు, సామానో వైపు మోస్తూ స్వస్థలాలకు చేరేందుకు బహుదూరపు బాటసారులుగా మారుతున్నారు. (ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు..!)
ఈ క్రమంలో గమ్యం చేరేలోపు తనువు చాలించిన వాళ్లు కొందరు. దహిస్తున్న ఆకలితో మధ్యలోనే ప్రాణాలు వదిలిన వాళ్లు మరికొందరు. తాజాగా ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై ఓ వలస కార్మికుడు ఆకలితో అలమటించిపోయాడు. గుప్పెడు మెతుకులు తినక ఎన్నాళ్లయ్యిందో.., కళ్లెదురుగా రోడ్డు మీద పడి ఉన్న కుక్క శవాన్ని భుజించాడు. దీన్ని అటుగా వెళ్తున్న ప్రధుమన్ సింగ్ నరుక అనే ప్రయాణికుడు వీడియో తీశాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రధుమన్ అతడికి కాసింత భోజనం అందించడంతో పాటు డబ్బులు కూడా ఇచ్చాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందరినీ కంటతడి పెట్టిస్తోంది. (వలస కూలీల దుస్థితి జాతి క్షేమానికి ప్రమాదం)
Person witnesses a man purportedly eating dead dog's meat he found on road. Helps him by offering food.#Hunger #MigrantWorkers #MigrantsOnTheRoad #migrants pic.twitter.com/51LpXQ7qUj
— The Rational Daily (@RationalDaily) May 19, 2020
Comments
Please login to add a commentAdd a comment