ఆకలి ఆక్రోశం: గిన్నె ఎత్తిపడేసిన శునకం | Angry For Hungry: Dog Video Shared By IFS Officer | Sakshi
Sakshi News home page

ఆకలి ఆక్రోశం: గిన్నె ఎత్తిపడేసిన శునకం

Published Mon, Apr 5 2021 4:49 PM | Last Updated on Mon, Apr 5 2021 5:26 PM

Angry For Hungry: Dog Video Shared By IFS Officer - Sakshi

మనుషుల మాదిరి జంతువులకు దాదాపు అన్ని భావోద్వేగాలు ఉంటాయి. ఒక విధంగా చూస్తే అంతకంటే ఎక్కువ ఉంటాయి. తాజాగా ఓ శునకానికి యమ కోపం వచ్చేసింది. ఆకలవుతుందని భౌ భౌ అని అరుస్తుంటే ఎంతకీ యజమాని పట్టించుకోవడం లేదు. దీంతో చిర్రెత్తుకొచ్చి ఆ శునకం తిన్నె గిన్నెను నోటితో కరచుకుని విసిరి కొట్టేసింది. దానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి (ఐఎఫ్‌ఎస్‌) ప్రవీణ్‌ అంగుసామి తన పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియోను ట్వీట్‌ చేశాడు. తనకు ఆకలి అయ్యిందని ఆ కుక్క అరుస్తుంటుంది. కొద్దిసేపటికి కోపమొచ్చి వెంటనే గదిలోకి వెళ్లి తాను తినే గిన్నెను నోటితో పట్టుకొచ్చి ఎత్తేసింది. ‘0.5 సెకండ్ల తర్వాత నాకు ఆకలి అవుతుంది’ అని దానికి సంబంధించిన వీడియోను ప్రవీణ్‌ పంచుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. దీనిపై తెగ కామెంట్లు వస్తున్నాయి. ఎంత కోపం? ఆకలైతే అంతే.! తదితర కామెంట్లు చేస్తున్నారు. మీరు చూసేయండి ఆ వీడియో..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement