Ghosts
-
దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా?
ప్రతీ దేశానికి విభిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని దేశాల్లో పండుగలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. ఆ సంప్రదాయాలను చూస్తే అవాక్కవ్వల్సిందే. అలాంటి విచిత్రమైన సంప్రదాయమే కంబోడియాలో ఉంది. పైగా ఆ పండుగ చేసుకోవడం కోసం ప్రభుత్వం కూడా రెండు రోజులు సెలవు ప్రకటిస్తుందట. కంబోడియాలో జరుపకునే విచిత్రమైన పండుగ దెయ్యాలకు ఆహారం పెట్టే ఫెస్టివల్. ఇది అక్కడ చాలా ఫేమస్ పండుగ. దీన్ని అక్కడ ప్రజలు 'ఖైమర్ పండుగ' అని కూడా పిలుస్తారు. ఇది 15 రోజులు పాటు జరుపుకునే ఉత్సవం. సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో జరుపుకుంటారు. ఆకలితో ఉన్న దెయ్యాలు ఆ టైంలో నరక ద్వారం నుంచి బయటకు వచ్చి తమ నివాసల వద్ద సంచరిస్తాయిని విశ్వసిస్తారు కంబోడియా వాసులు. ఆ సమయంలోనే నరక ద్వారాలు తెరచుకుంటాయని, అందువల్లే వివిధ రకాల ఆత్మలు తమ నివాసాల వద్దకు వస్తాయని చెబుతున్నారు. ఈ పండుగ రోజున ప్రజలు దెయ్యాల కోసం వివిధ రకాల పిండి వంటలను తయారు చేసి మరీ పెడతారు. అయితే ఇలా రాత్రి సమయాల్లోనే చేస్తారు. ఎందుకంటే దెయ్యాలకు వెలుతురు ఇష్లం ఉండదు. అవి చీకటిలోనే ఉంటాయి. అందుకని ఉదయం లేచి సూర్యోదయం కాకమునుపే తమ కుటుంబంలో చనిపోయిన బంధువులను తలుచుకంటూ ఆహారం పెడుతుంటారు. ఇలా చేస్తే రాక్షసులు సంతోషిస్తారట. అందువల్ల తమకు ఎలాంటి కీడు వాటిల్లకుండా ఉండటమే గాక సంతోషంగా జీవించగలుగుతామని చెబుతున్నారు. ఈ పండుగ రోజును తమ చనిపోయిన ఏడు తరాల బంధువులను తలుచుకుని భోజనం పెడతారు. దెయ్యాలు ఇలా తమ బంధువుల పేరు మీద పెట్టిన భోజనాన్ని వారి దగ్గర నుంచి తీసుకుని తింటాయని అంటున్నారు. దీన్ని "ఫచమ్ బెన్"గా వ్యవహారిస్తారు. ఈ పండుగు 19వ శతాబ్దం కింగ్ ఆంగ్ డుయోంగ్ కాలం నుంచి ప్రజలు ఆచరిస్తున్నారు. అంతేగాదు ఈ పండుగ చివరి రోజున జరుపుకునే ఉత్సవానికి అక్కడి ప్రభుత్వం సెలవు ఇస్తుంది కూడా. పండుగ చివరి రోజున దెయ్యాల కోసం ఓ పడవలో నిండుగా వివిధ రకాల పిండి పదార్థాలన్ని పెట్టి కొంత దూరం వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడకు వివిధ ఆత్మలు వచ్చి ఆహారపదార్థాలతో ఆకలి తీర్చుకుని తిరిగి నరకానికి వెళ్లిపోతాయని చెబుతున్నారు కంబోడియా ప్రజలు. ఏదీఏమైనా చాలా విచిత్రంగా ఉంది కదూ ఈ పండుగ. (చదవండి: మిస్టీరియస్ 'భాన్గఢ్కోట‘!..ఆ సమయంలో గానీ కోటలోకి అడుగుపెట్టారో అంతే..!) -
దెయ్యాలు కట్టిన గుడి!..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!
మనిషిని నడిపించే శక్తికైనా, యుక్తికైనా.. పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయన్నది కాదనలేని నిజం. దేవుడంటే భక్తి, దెయ్యమంటే భయం. పసివయసు నుంచి దేవుడి పటాన్ని చూపించి.. ‘దండం పెట్టుకో..’ అన్నంత సాధారణంగా దెయ్యాన్ని పరిచయం చేయరు ఎవ్వరూ! గొంతు బొంగురుగా చేసి.. ‘హో..’ అనే ఓ విచిత్రమైన శబ్దంతో ‘అదిగో వస్తుంది’ అనే ఓ అబద్ధంతో బెదరగొడతారు. అలాంటి భయం నుంచి అల్లుకునే కథలకు స్పష్టమైన ఆధారాలుండవు.. అంతుచిక్కని ప్రశ్నలు తప్ప. కాకన్మఠ్ టెంపుల్ మిస్టరీ కూడా అలాంటిదే. మధ్యప్రదేశ్, మురైనాలోని శిథిలమైన ఈ శివాలయం ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది. గ్వాలియర్ నుంచి సుమారు 70 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయం ఆసక్తికరమైన సందర్శన స్థలంగా నిలిచింది. కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి, నిర్మించిన ఈ కట్టడం.. చూడటానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తుంది. ఏ నిర్మాణమైనా దృఢంగా ఉండాలంటే సిమెంట్ లేదా సున్నం అవసరం. కానీ ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైడింగ్ మెటీరియల్ (జిగట పదార్థం) వాడకుండా.. పెద్ద రాళ్లు, చిన్న రాళ్లను నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం ఓ అద్భుతమనే చెప్పుకోవాలి. ట్విస్ట్ ఏంటంటే.. రాత్రికి రాత్రే దెయ్యాలు, ప్రేతాత్మలు కలసి ఈ గుడిని నిర్మించాయని చెబుతుంటారు. అందుకే ఇక్కడికి వెళ్లే సందర్శకులంతా.. అదే భయంతో మెసులుకుంటారు. దీన్ని 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య నిర్మించారనేది పురావస్తు పరిశోధకుల అంచనా. 115 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం.. నేటికీ చెక్కుచెదరలేదు. అయితే ఈ కట్టడంలో కొంత నిర్మాణం ఆగిపోయినట్లుగా ఒకవైపు కర్రలు కట్టి ఉంటాయి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు.. ఆ చుట్టూ ఉండే చాలా పురాతన ఆలయాలను నేలమట్టం చేశాయి. కానీ ఈ టెంపుల్లో ఒక్క రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది. ఈ గుడికి పూజారి లేడు. వాచ్‌మన్ కూడా లేడు. కొందరు హోమ్ గార్డ్స్ మాత్రం.. ఈ గుడికి కాస్త దూరంగా.. రాత్రిపూట ఎవరూ అటువైపు పోకుండా కాపలా కాస్తూంటారు. ఏదో అతీతమైన శక్తి.. ఈ గుడిని కూలిపోకుండా కాపాడుతుందనేది అక్కడివారి నమ్మకం. అయితే ఈ గుడి కట్టడం అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఓ కారణం ఉందని చెబుతారు స్థానికులు. ఆ రాత్రి దెయ్యాలు ఆలయాన్ని కడుతుంటే.. ఓ వ్యక్తి ఆ శబ్దాలను విని, అక్కడికి వెళ్లి చూసి.. ప్రేతాత్మలకు భయపడి పెద్దగా అరవడంతో అవి మాయం అయిపోయాయని, దాంతో నిర్మాణం ఆగిపోయిందని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్కియాలిజిస్ట్‌లు ఈ ఆలయంపై స్టడీ చేయడానికి వస్తారు. చుట్టుపక్కల పరిశోధనలు చేస్తారు కానీ, ఈ ఆలయాన్ని మాత్రం టచ్ చేసే సాహసం చేయరు. అయితే నేటికీ ఈ ఆలయం చుట్టూ.. ఈ కట్టడానికి ఉపయోగించిన కొన్ని రాళ్లు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. అవన్నీ గుడి నిర్మాణంలో వాడాల్సిన రాళ్లేనని, నిర్మాణం మధ్యలో ప్రేతాత్మలు గుడిని వదిలిపోవడంతో అవి అక్కడపడి ఉన్నాయని కొంతమంది నమ్మకం. కానీ కొందరు దాన్ని కొట్టిపారేస్తారు. అవన్నీ కొన్ని శత్రుమూకలు ఈ ఆలయంపై దాడి చేసి, కూల్చిన రాళ్లేనని వాదిస్తారు. అయితే ఈ రాళ్లను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ప్రమాదమని.. కిందున్న ఏ రాయిని కదిలించినా, గుడి మొత్తం కదులుతున్నట్లుగా ఒకరకమైన శబ్దం వస్తుందనే పుకార్లూ విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చిన్న రాయి కూడా మోయలేనంత బరువుగా ఉంటుందంటూ తమకు తెలిసింది చెప్పి భయాన్ని పుట్టిస్తూంటారు చాలామంది. నిజాన్ని నిరూపించే సాహసమైతే ఎవరూ చేయలేదు. దాంతో ఈ ఆలయనిర్మాణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సంహిత నిమ్మన (చదవండి: వందల సంఖ్యల్లో రాతి బంతులు..అవి ఏంటన్నది నేటికి అంతుచిక్కని మిస్టరీ!) -
మీకు తెలుసా? ఒక్క రాత్రిలో దెయ్యాలు ఆలయాన్ని కట్టించాయట
మన దేశంలో ఎన్నో మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది, సైన్స్‌కు అందని రహస్యాలు కూడా ఉన్నాయి. అయితే ఓ ఆలయాన్ని దయ్యాలు రాత్రికి రాత్రే కట్టించాయట. అసలు దెయ్యాలు నిజంగానే ఉన్నాయా? అయినా వాటికి ఆలయం కట్టించాల్సిన పనేంటి? ఇంతకీ ఈ వింతైన ఆలయం ఎక్కడ ఉంది? దీని వెనుకున్న కథేంటి అన్నది ఈ స్టోరీలో చూసేయండి.. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్లు దయ్యాలు కూడా ఉంటాయని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. మన దేశంలో కొన్ని ఆలయాలు స్వయంగా దేవతలే నిర్మించాలని విన్నాం. అదే విధంగా దెయ్యాలు కట్టించిన ఆలయాలు కూడా మనదేశంలో ఉన్నాయట. కర్ణాటకలోని దొడ్డబళాపురం-దేవనహళ్ళి మార్గం మధ్యలో వచ్చే బొమ్మావర గ్రామంలోని శివాలయాన్ని దెయ్యాలే కట్టించాయని నమ్ముతారు అక్కడి గ్రామస్తులు. సుందరేశ్వర దేవాలయంగా ఆ గుడికి పేరుంది. సాధారణంగా దేవాలయాలపై దేవుళ్ళ రాతి శిల్పాలు, ప్రతిమలు కనిపిస్తాయి. కానీ దేవాలయంలో మాత్రం రాక్షసుల నమునాలు చెక్కబడి ఉన్నాయి. సుమారు 600 సంవత్సరాల క్రితం నుంచే ఈ ఆలయం ఉందట. ఈ గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు తెగ భయపెట్టేవట. బయటకు రావాలంటనే జనాలు భయపడిపోయేవారట. దీంతో ఆ ఊరు ప్రజలకు ఏం చేయాలో అర్థంకాక మాంత్రికుడిని ఆశ్రయించారు. వాటిని తరిమికొట్టేందుకు మంత్ర విద్యలు నేర్చుకున్నప్పటికీ ఆయనకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని తెలుసుకుని ఊరి ప్రజలందరి సహకారంతో గుడి నిర్మించారు. దెయ్యాలు ఆ గుడిని నాశనం చేసేయడంతో కోపంతో ఊగిపోయిన మాంత్రికుడు మంత్రశక్తితో దెయ్యాలను వశపర్చుకొని బంధీగా చేశాడట. దీంతో బుచ్చయ్యను బతిమాలగా, కూలదోసిన ఆలయాన్ని తిరిగి కట్టివ్వాలని దెయ్యాలకు శరతు విధించాడట. మాంత్రికుడి ఆదేశంతో దిగి వచ్చిన దెయ్యాలు రాత్రికి రాత్రే దేవాలయాన్ని నిర్మించి ఇచ్చాయట. అప్పటి నుంచి దెయ్యాలు కట్టిన దేవాలయంగా ఆ ఆలయాన్ని పిలిచేవారు. ఇక కొన్నాళ్లకు ఆ ప్రాంతంలో మంచినీళ్ల బావిని తవ్వుతుంటే పెద్ద శివలింగం బయటపడిందట. అప్పట్నుంచి ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎవరికైనా దెయ్యాలు పట్టినా ఈ ఆలయానికి తీసుకొస్తే దెయ్యం వదులుతుంది అని స్థానికుల నమ్మకం. -
అలాంటి వాటిపై నమ్మకం లేదు.. కానీ భయమేస్తుంటుంది: నయన్
నటి నయనతార ఏం మాట్లాడినా వార్తల్లో నిలుస్తోంది. కారణం ఆమె స్టార్ డమ్, తన వ్యక్తిగత అంశాలే. నయనతార నటన, ప్రేమ, పెళ్లి, పిల్లలు అన్ని సంచలనాలే. తాజాగా నయనతార ప్రధాన పాత్రలో నటించి, తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం కనెక్ట్. హార్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. ఈ నెల 22వ తేదీ విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. తాను నటించే ఏ చిత్ర ప్రచారానికి రాని నయనతార కనెక్ట్ చిత్ర ప్రచారంలో పాల్గొనడం విశేషం. అలా ఒక కార్యక్రమంలో దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? అన్న ప్రశ్నకు అలాంటి వాటిపై తనకు నమ్మకం లేకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు భయంగా ఉంటుందని చెప్పారు. నిజం చెప్పాలంటే దెయ్యాల కథా చిత్రాలకు తాను పెద్ద అభిమానినని తెలిపారు. ఇంతకుముందు దెయ్యాల ఇతివృత్తంతో కూడిన చిత్రాలను ఇష్టంగా చూసేదాన్ని అన్నారు. ఇకపోతే నయనతార, విఘ్నేష్ శివన్‌లు ఇటీవల కవల పిల్లలకు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయిన విషయం తెలిసింది. కాగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ దంపతులు తమ కవల పిల్లలతో ఇంట్లోనే క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆ వీడియోను తమ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. నయనతార విఘ్నేష్ శివన్ చెరొక బిడ్డను ఎత్తుకొని ఆనందంలో పరవశిస్తున్న ఆ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: చిరు, బాలయ్యలో ఉన్న కామన్ క్వాలిటీ అదే: శేఖర్ మాస్టర్ -
ఆ ఊళ్లో దెయ్యం భయం... రాత్రివేళల్లో వింత వింత శబ్దాలు!
కొన్నేళ్ల కిందట తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో ‘ఓ స్త్రీ రేపు రా’ అనే రాతలు ఇళ్ల గోడల మీద కనిపించేవి. స్త్రీ రూపంలో ఒక దెయ్యం హడలెత్తిస్తోందనే ప్రచారం కారణంగా, ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి ఇళ్ల గోడల మీద అలా రాసేవారు. ఇప్పుడు మన ప్రాంతాల్లో ఎలాంటి దెయ్యం భయాలూ లేవు, అలాంటి రాతలూ లేవు. అయితే, కొద్దిరోజుల కిందట మెక్సికోలోని కోకోయోక్ పట్టణంలో దెయ్యం తిరుగుతోందనే ప్రచారం మొదలైంది. రాత్రి పదిగంటల తర్వాత ఆ దెయ్యం వీథుల్లో తిరుగుతోందని కథలు కథలుగా ప్రచారం సాగడంతో ఆ ఊళ్లోని జనాలు రాత్రి పదిగంటల తర్వాత బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. కోకోయోక్ పట్టణం, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ‘నహువా’ తెగకు చెందిన ప్రజలు ఉంటుంటారు. వారికి అతీంద్రియ శక్తులపైన, క్షుద్రప్రయోగాలపైన నమ్మకాలు ఎక్కువ. కొద్దిరోజుల కిందట రాత్రివేళల్లో వింత వింత శబ్దాలు విన్నట్లు స్థానికులు చెప్పుకోవడం మొదలైంది. మెల్లగా ఈ ప్రచారం ఊరంతా వ్యాపించింది. ఇది దెయ్యాల పనే అయి ఉంటుందని కొందరు వృద్ధులు చెప్పడంతో జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఊళ్లో తిరిగే దెయ్యం ఇంట్లో చొరబడకుండా ఉండటానికి ఊళ్లోని ప్రతి ఇంటికీ వీధి తలుపులపై శిలువ గుర్తులు వేయించుకున్నారు. అయినా సరే భయం తీరక రాత్రివేళల్లో పదిగంటలకు లోపే ఇళ్లకు చేరుకుని, తలుపులు బిడాయించేసుకుంటున్నారు. చదవండి: వీడియో: సూపర్ టైపూన్ హిన్నమ్నోర్.. గంటకు 314 కిలోమీటర్ల ప్రచండ గాలులు.. చిగురుటాకులా వణుకు -
దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్
Kiara Advani Shares Her Near Death Experience In Dharamshala: 'భూల్ భులయ్యా' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మూవీ 'భూల్ భులయ్యా 2'. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది కియరా. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దెయ్యాల గురించి కియరాను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. దెయ్యాలంటే భయమా అని అడిగిన ప్రశ్నకు.. 'నాకు దెయ్యాలంటే భయం లేదు. కానీ దెయ్యం సినిమాలు చూడను. రాత్రిపూట ఒక్కదాన్నే నిద్రపోతుంటే భయపడతాను. అందుకే ఆ జోనర్ సినిమాల జోలికి వెళ్లను.' అని తెలిపింది కియరా. అంతేకాకుండా తన కాలేజ్ రోజుల్లో జరిగిన మరో విషయం గురించి తెలిపింది ఈ ముద్దుగుమ్మ. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం ''కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ధర్మశాల టూర్ వెళ్లాను. మంచు ఎక్కువగా కురవడంతో నాలుగురోజులపాటు మేం హోటల్ గదిలోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు కరెంట్ లేదు. తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకలేదు. వేడికోసం ఏర్పాటు చేసుకున్న మంట కూడా ఆరిపోతుందనుకున్నాం. నాలుగోరోజు రాత్రి గదిలో అందరం నిద్రపోతున్నప్పుడు మా పక్కనే ఉన్న కుర్చీకి అనుకోకుండా నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. అది చూసిన నా ఫ్రెండ్ మా అందర్నీ నిద్రలేపింది. మేమంతా కేకలు వేయడంతో చుట్టుపక్కవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టారు. ఆరోజు చావుని దగ్గర నుంచి చూసినట్లనిపించింది. అదృష్టం కొద్దీ అక్కడి నుంచి బయటపడ్డాం.' అని కియరా పేర్కొంది. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు -
‘ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్
మనం దెయ్యాలు గురించి ఎవరైనా చెబుతుంటే వారు చదువుకోలేదేమో! లేక వాళ్లు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అని కొట్టిపారేస్తాం. పైగా మూర్ఖులుగా భావించి కాస్త చిన్నచూపు చూస్తాం. కానీ మంచి ఉన్నతోద్యోగంలో పనిచేస్తున్న వ్యక్తి దెయ్యాల గురించి చెబితే ఒకింత ఆశ్యర్యపోతూ వింటాం. పైగా ఎవరతను అని కచ్చితంగా కుతుహలంగా ఉంటుంది. అచ్చం అలానే ఒక ఐఐటీ ప్రొఫెసర్ దెయ్యాల గురించి కొన్ని ఆస్తకికర వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయంలోకెళ్తే... ఐఐటి మండికి కొత్తగా నియమితులైన డైరెక్టర్, ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహెరా దెయ్యాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. పైగా వాటిని తాను మంత్రాలు, శ్లోకాలు పఠించి దెయ్యాల్ని తరిమికొట్టానంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు దెయ్యాలు గురించి చెబుతూ..1993 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో చెన్నైలోని తన స్నేహితుడి కుటుంబాన్ని కొన్ని దుష్టాత్మలు ఏడిపించాయని చెప్పాడు. పైగా తాను అప్పుడు తన స్నేహితుడికి ఇంటికి వెళ్లి 'హరే రామ హరే కృష్ణ' మంత్రాన్ని పఠించడంతో పాటు "భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు సాధన చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆ దెయ్యాలు తన స్నేహితుడి భార్యని, అతని తండ్రిని పట్టుకున్నాయని, వారు చాలా వింతగా ప్రవర్తించడం కూడా చూశానని చెప్పాడు. ఇలా ఒక ఐఐటీ ప్రోఫెసర్ దెయ్యాలు గురించి ఆసక్తి కరంగా చెబుతున్నా వీడియో ఒకటి యూట్యూబ్‌లో "లెర్న్ గీత లైవ్ గీత" పేరుతో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ఆసక్తికరమైన వీడియోగా వైరల్ అవుతోంది. అయితే బెహరా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్. పైగా అతను ఐఐటీ ఢిల్లీ నుండి పీహెచ్డీ కూడా చేయడమే కాక రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పేరుగాంచిన ప్రోఫెసర్ కావడం విశేషం. (చదవండి: కలలో కూడా ఊహించని గిఫ్ట్.. అవేమిటో తెలిస్తే షాక్..!) (చదవండి: రైళ్లు గమ్యానికి చేరక మునుపే సరకు అంతా స్వాహా...దెబ్బకు ఈ కామర్స్ సంస్థలు కుదేలు) -
అల్లు అర్జున్ ఇంట్లో క్యూట్ దెయ్యాలు.. వీడియో వైరల్
అల్లు అర్జున్ ఇంట్లో రెండు దెయ్యాలు పడ్డాయి. అవును.. అవి మాములు దెయ్యాలు కావు.. అల్లరి చేసే పిల్ల దెయ్యాలు. ఇళ్లంతా తిరుగుతూ నానా హంగామా చేసే క్యూట్ దెయ్యాలు. ఈ పిల్ల దెయ్యాలు ఎవరో కాదు అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే అల్లు అర్జున్ సతీమణి ఈ క్యూట్ దెయ్యాల వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన పిల్లలకు ఉన్నచోటే వినోదాన్ని అందిస్తోంది స్నేహ. పిల్లలకు రకరకాల గెటప్ వేసి ఆడిస్తోంది. వాటికి సంబంధిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరవేస్తుంది స్నేహ. తాజాగా ఆమె షేర్ చేసిన దెయ్యాల వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అందులో అర్హ, అయాన్లు తెల్లటి వస్త్రాలు ధరించి, దెయ్యాల గెటప్‌లో ఉన్నారు. ముఖాలకు కళ్లద్దాలు పెట్టుకొని క్యూట్ డ్యాన్స్ చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. . ఇక ఇందులో బుల్లి అర్హ వేసిన చిన్న స్టెప్పులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
‘దెయ్యాల పనే అంటారా?!’
లక్నో: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూస్తే.. ఒక్క క్షణం మనకు కూడా నిజంగానే దెయ్యాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఓ పార్కులోని జిమ్ పరికరం దానంతట అదే కదులుతుంది. దాని చుట్టూ చేరిన పోలీసులు ఈ అసాధరణ విషయాన్ని వీడియో తీయడంలో నిమగ్నమయ్యారు. నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. నెటిజనులు దీని గురించి రకరకాల వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఎక్కువ మంది మాత్రం ‘మానవ ప్రయత్నం లేకుండా ఈ పరికరం కదులుతుంది అంటే ఖచ్చితంగా ఇది దెయ్యాల పనే’ అంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ వార్తలు జోరుగా షికారు చేస్తుండటంతో ఝాన్సీ పోలీసులు రంగంలోకి దిగారు. ఇలా జరగడానికి గల కారణాన్ని వివరించారు. Fitness freak ghost 👻?@jhansipolice got a tip off about an open gym being used by ghosts!Team laid seige & soon found t real ghosts-Some mischievous person made video of moving swing & shared on #socialmedia. Miscreants will b hosted in a ‘haunted’ lockup soon #NoHostForGhost pic.twitter.com/JUaYt4IJMS — RAHUL SRIVASTAV (@upcoprahul) June 12, 2020 ‘ఓ పార్కులోని జిమ్ పరికరం దానంతట అదే కదులుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఝాన్సీ పోలీసులు ఇందుకు గల కారణాన్ని కనుగొన్నారు. గ్రీజు ఎక్కువ కావడంతో ఆ పరికరం దానంతట అదే కదులుతుంది. ఇది దెయ్యాల పని కాదు. దయచేసి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయకండి ’అంటూ ఝాన్సీ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు కారణం తెలియడంతో జనాలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. तेजी से वायरल हो रहे वीडियो जिसमें झूला अपने आप झूलता हुआ दिखाई दे रहा है, सत्यता की जाँच @COCityjhansi द्वारा मौके पर जाकर की गयी तो झूले में अधिक ग्रीस लगे होने से एक बार हिला देने पर कुछ समय तक हिलता रहता है। आप सभी से अपील है कि भूत आदि होने की अफ़वाह न फैलाएं #FakeNewsAlert pic.twitter.com/kvqpQCMCSv — Jhansi Police (@jhansipolice) June 13, 2020 -
పెళ్లి కాకపోవడానికి దెయ్యం పట్టడమే..
సాక్షి, సిటీబ్యూరో: ఇదో వెరైటీ ‘మాట్రిమోనియల్’ సైబర్ నేరం. వెబ్‌సైట్స్‌లో పెట్టిన ప్రొఫైల్ నచ్చిందంటూ పెళ్లి ప్రతిపాదన చేసి దండుకున్న కేసులు...విదేశీ వధూవరుల పేరుతో ఆన్లైన్లో పరిచయాలు చేసుకుని, బహుమతులు పంపిస్తానంటూ ఎర వేసి దండుకున్న వ్యవహారాలు... ఇవన్నీ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు సుపరిచితమే. అయితే మంగళవారం వచ్చిన ఓ ఫిర్యాదు చూసి అధికారులే కంగుతిన్నారు. పెళ్లి కాకపోవడానికి దెయ్యం పట్టడమే కారణమంటూ చెప్పిన సైబర్ నేరగాడు..అది వదిలిస్తానంటూ రూ.5 లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ యువతికి కొన్నాళ్లుగా వివాహం కావట్లేదు. ఈ విషయాన్ని ఆమె ఇటీవల తనకు పరిచయం ఉన్న వారితో చెప్పి బాధపడింది. దీంతో వారు నీ మీద చేతబడి చేసి ఉంటారని, అది వదిలించుకుంటే తప్ప పెళ్లి కాదంటూ ఓ ‘ఉచిత సలహా’ ఇచ్చారు. ఈ విషయం విని షాక్‌కు గురైన ఆ యువతి ‘గూగుల్ తల్లి’ని ఆశ్రయించింది. చేతబడులకు విరుగుడు చేసే వారి వివరాల కోసం నెట్లో అన్వేషించింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఉత్తరాదికి చెందిన ఓ వ్యక్తి వివరాలు, ఫోన్ నెంబర్ లభించాయి. దానికి కాల్ చేసిన యువతి తన బాధను, పరిచయస్తులు చెప్పిన చేతబడి అంశాన్నీ చెప్పుకుంది. ఇదంతా విన్న అతగాడు ఆమె గతం–వర్తమానం–భవిష్యత్తు అధ్యయనం చేస్తున్నట్లు నటించాడు. ఆపై వివాహం కాకపోవడానికి చేతబడి కారణం కాదని.. మీ కుటుంబంలో ఒకరికి దెయ్యం పట్టిందని భయపెట్టాడు. దాన్ని వదిలిస్తే తప్ప పెళ్లి కాదంటూ చెప్తూ తన మాటలతో మాయ చేశాడు. ఇతడి ట్రాప్‌లో పడిపోయిన నగర యువతి దెయ్యం వదిలించేందుకు ఏం చేయాలంటూ కోరింది. అందుకు ప్రత్యేక పూజలు ఉంటాయని, వాటి నిమిత్తం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పిన ఆ మాయగాడు తన బ్యాంకు ఖాతా వివరాలు అందించాడు. ఓ దఫా తన బ్యాంకు ఖాతాలోను, మిగిలిన సార్లు యూపీఐ ద్వారాను మొత్తం రూ.5 లక్షలు యువతి నుంచి కాజేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పాటు అతగాడు మరింత మొత్తం కోరుతుండటంతో తాను మోసపోయానని ఆ యువతి భావించింది. దీంతో మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు ప్రాథమిక పరిశీలన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నేరగాడు వినియోగించిన బ్యాంకు ఖాతా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందినదిగా గుర్తించారు. యూపీఐ వివరాలు సైతం సేకరించి నిందితుడి ఆచూకీ కనిపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
లాలు ఇంట్లో దయ్యాలు!
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సీఎం తన అధికార నివాసాన్ని వదిలి వెళ్లేముందు అక్కడ దయ్యాలను వదిలేశారా? తన తరువాత ముఖ్యమంత్రి పీఠం చేపట్టిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లక్ష్యంగా లాలు ఆ పని చేశారా? అంటే అవుననే అంటున్నారు నితీశ్ కుమార్. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక అనధికార కార్యక్రమంలో ఈ విషయాలను నితీశ్ కుమార్ పంచుకున్నారు. 2005లో ఆర్జేడీ అధికారం కోల్పోయాక, నితీశ్ లాలు కుటుంబం నివాసం ఉన్న 1, అన్నేమార్గ్ భవనంలోకి మారారు. విశాలంగా ఉన్న ఆ ఇంటి వెనక భాగంలో తనకు పెద్ద పెద్ద మట్టికుప్పలు కనిపించాయని, ఇంటి నలుమూలల్లో కొన్ని కాగితపు కవర్లు కనిపించాయని నితీశ్ గుర్తు చేసుకున్నారు. నీ కోసం కొన్ని దయ్యాలను ఆ ఇంట్లో వదిలి వచ్చానని ఆ తరువాత ఒక సందర్భంలో లాలు ప్రసాద్ యాదవ్ స్వయంగా నితీశ్‌తో చెప్పారట. అయితే, ఆ మాటలను లాలు తనదైన స్టైల్లో సరదాగానే అన్నారని నితీశ్ పేర్కొన్నారు. అయితే, నితీశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బిహార్‌లో సంచలనం సృష్టించాయి. నితీశ్ గతంలో లాలుకు నష్టం కలిగించే ఉద్దేశంతో పట్నాలోని కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారని గురువారం ఆర్జేడీ ఉపాధ్యక్షుడు శివానందతివారీ ఆరోపించారు. ఆ పూజలు చేసిన పూజారులు ఈ విషయాన్ని లాలుకు చెప్పారని, దాంతో లాలు ఆ ప్రభావం తనపై పడకుండా వేరే పూజలు చేశారని తివారీ వివరించారు. ఈ విషయం తనకు లాలునే చెప్పారన్నారు. కాగా, మూఢనమ్మకాలను, మంత్రతంత్రాలను లాలు విశ్వసిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో నితీశ్‌కు అలాంటి నమ్మకాలేవీ లేవని ప్రచారముంది. -
దెయ్యం దెబ్బకు హాస్టల్ ఖాళీ
సాక్షి, సి. బెళగల్(కర్నూల్) : ఆదర్శ బాలికల హాస్టల్లో దెయ్యం బూచితో బాలికలు హడలిపోతున్నారు. రాత్రిపూట విచిత్ర అరుపులు, కేకలు, పసిపిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయని పుకార్లు పుట్టించడంతో వారు భయందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులను పిలిపించుకుని ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో శుక్రవారం రాత్రికి హాస్టల్ పూర్తిగా ఖాళీ అయింది. ఒక్క విద్యార్థిని భయంతో మొదలు..హాస్టల్ 9 వతరగతి నుంచి ఇంటర్ వరకు ఉంది. ఇందులో మొత్తం 75 మంది బాలికలు ఉన్నారు. ఇటీవల కొత్తగా 9వ తరగతి విద్యార్థిని చేరింది. ఈ విద్యార్థిని భయపడి మిగతావారు కూడి భయపడేలా చేసింది. సదరు బాలికకు హాస్టల్లో ఉండేందుకు ఇష్టంలేక దెయ్యం బూచి పెట్టిందని హాస్టల్ సిబ్బంది, కొందరు తోటి విద్యార్థినులు చెబుతున్నారు. కొండప్రాంతంలో హాస్టల్ ఉండటంతో పక్షులు, జంతువుల అరుపులు వినిపించి ఉండొచ్చని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. వారిలో భయాన్ని పోగొట్టేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. నిస్సహాయక స్థితిలో ప్రిన్సిపాల్, వార్డెన్ హాస్టల్లో దెయ్యముందని పుకార్లు షికారు చేయడంతో శుక్రవారం సాయంత్రం నుంచి పిల్లల తల్లిదండ్రులు హాస్టల్‌కు క్యూ కట్టారు. తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తామని స్కూల్ ప్రిన్సిపాల్ కిషోర్‌కుమార్, వార్డెన్ నాగలక్ష్మితో వాదనకు దిగారు. వారు ఎంత సముదాయించినా వినిపించుకోకుండా పిల్లలను తీసుకెళ్లారు. దీంతో హాస్టల్ పూర్తిగా ఖాళీ అయింది. -
ఆకలి పొలం
ఒకరోజు.. రాత్రి.. పార్టీ జరుగుతోంది... ‘‘తమ్ముడూ.. నిజంగానే దయ్యాలు లేవంటావా?’’ అన్నాడు ఆ ఊరి సర్పంచ్ మనసులో కాస్త బెరుకుతోనే. ‘‘దయ్యాల్లేవ్.. గియ్యాల్లేవ్ సర్పంచ్ సాబ్..’’ అని అంటూ‘‘ఏమ్రా అజయ్..ఉన్నయా?’’ అడిగాడు పక్కనే ఉన్న తన కజిన్‌ను. వాడు అదోరకంగా నవ్వాడు. ‘‘మరి అంతకుముందు గీ పొలం కొంటామని వచ్చిన ఆ ఇద్దరు ఎట్లా చనిపోయినట్టు?’’ డౌట్ సర్పంచ్‌కి. ‘‘ఏముందీ.. బ్రెయిన్ హ్యామరేజ్‌తో చనిపోయిన పర్సన్‌కు అంతకుముందే క్లాట్స్ ఏవో ఉండి ఉంటాయి. యాక్సిడెంట్లో పోయిన అతని గురించి చెప్పేదేముంది? తాగి బండి నడుపుతున్నాడు..ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకున్నాడు. ఇక్కడ దయ్యమెక్కడినుంచి వచ్చింది సర్పంచ్ సాబ్?’’ వెటకారంగా రాహుల్. గ్లాస్‌ను పెదవుల దగ్గర పెట్టుకున్న అజయ్.. రాహుల్‌నే చూస్తున్నాడు తదేకంగా. ‘‘ఏమైతేంది.. పొలం కొనుక్కున్నరు. మీరు మంచిగా పండిస్తే మా ఊరోళ్లకు కూడా మస్తు ధైర్యమొస్తది అన్నిరకాలుగా’’ అన్నాడు సర్పంచ్ చికెన్ ముక్కను నములుతూ! మళ్లీ తన కజిన్ భుజమ్మీద చేయివేసి అతనిని చూపిస్తూ ‘‘ఇగో సర్పంచ్ సాబ్.. వీడు నా చిన్నమ్మ కొడుకు. రెండురోజుల కిందట అమెరికా నుంచి వచ్చిండు. నాకు హెల్ప్ చేయడానికే. నాతోనే ఉంటడు.ఇద్దరం కలిసి పొలం దున్ని చూపిస్తం. చాలెంజ్’’ అని సర్పంచ్‌తో సవాల్ చేసి.. మళ్లీ కజిన్ వైపు తిరిగి ‘‘ఏమంటావ్రా..అజయ్? ’’ అన్నాడు అతని భుజాన్ని గట్టిగా నొక్కుతూ.‘‘అంతే అన్నా.. చాలెంజ్. దున్ని చూపించుడే’’ అని అన్నకు జవాబిచ్చి సర్పంచ్ వైపు తిరిగి ‘‘ సర్.. వంచిన నడుము ఎత్తనీయకుండా పొలంల పనిచేయిస్తా మా అన్నతో. చాలెంజ్ ఏందో చెప్పుండ్రీ’’ అన్నాడు అజయ్నవ్వుతూ!ఆ చాలెంజ్‌లో ధీమా కన్నా అతని మాటలతో భయమే కలిగింది సర్పంచ్‌కి. మందు ఎక్కువైనట్టుంది అంటూ సమాధానపడ్డాడు. ఆ రాత్రి గడిచింది. రాహుల్... బిజినెస్ మేనేజ్మెంట్ చదివాడు. పేరున్న ఎమ్ఎన్సీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తూ ఓ స్టార్టప్ కంపెనీకి కూడా ప్లాన్వేస్తూండగా రైతుల ఆత్మహత్యలకు చలించిపోయి అగ్రికల్చర్ చేయాలని నిశ్చయించుకున్నాడు. మెదక్ జిల్లాలోని ఒక ఊళ్లో పొలం కూడా కొనేశాడు. తన బిజినెస్ మైండ్‌తో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు ప్రేరణనివ్వాలని ఆశపడ్తున్నాడు. అమ్మా, నాన్నా, చివరకు జీవితమంతా సేద్యంతోనే గడిపిన తాత చెప్పినా మనసు మార్చుకోలేదు అతను. గతం..రాహుల్ కొనుక్కున్న పొలం మల్లయ్యది. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఒమన్‌లో, చిన్న కొడుకు భివండిలో ఉంటారు. భార్యతో ఊళ్లో ఉండేవాడు మల్లయ్య. ఉన్న అయిదు ఎకరాల్లో మూడుఎకరాలు కౌలుకి ఇచ్చి, మిగిలిన రెండు ఎకరాల్లోనే పాక లాంటిది వేసుకొని ఆలుమగలిద్దరూ సాగు చేసుకునేవారు. వరసగా వానలు లేక.. పొలంలో వేసిన బోరులో నీళ్లు పడక.. పంట పండక.. అప్పులపాలయ్యాడు. ఆ బెంగతోనే ఓ రోజు రాత్రి గుండె ఆగి చనిపోయాడు. పెద్ద కొడుకు రానేలేదు. చిన్నకొడుకే వచ్చి కర్మకాండ తంతు నిర్వహించి వెళ్లిపోయాడు. మల్లయ్య భార్య ఒక్కతే ఉండడం మొదలుపెట్టింది. ఊళ్లో వాళ్లంతా ఆమెను చూసి జాలిపడేవారు. భర్త చనిపోయిన షాక్ నుంచి తేరుకోక.. భర్త ఉన్నాడనే భ్రమలోనే ఆమె బతుకుతోందని! రోజూ ఇద్దరికి సరిపోయే భోజనం వండేది. గుడిసెలో తనతోపాటు ఇంకో వ్యక్తి ఉన్నట్లే ప్రవర్తించేది. కొన్నాళ్లకు ఊళ్లో వాళ్లకు అనుమానం వచ్చింది..మల్లయ్య దయ్యమయ్యాడా ఏంటీ అని! మల్లయ్య పొలంవైపుగా వెళ్లిన కొంతమంది.. గుడిసెలో మగ గొంతుతో మాటలు వినిపిస్తున్నాయంటూ ఆ అనుమానాన్ని రూఢీ చేసేసుకున్నారు. ఆ ఊరి సర్పంచ్ మల్లయ్య పెద్ద కొడుక్కి ఫోన్ చేసి సంగతి చెప్పాడు. ఒమన్ నుంచి వచ్చాడు పెద్దోడు. భివండి నుంచి తమ్ముడినీ పిలిపించాడు. తల్లిని ఆ ఊళ్లోనే ఉన్న ఆశ్రమంలో చేర్పించి ఉన్న పొలం అమ్మేసుకొని చెరిసగం పంచుకొని వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. తల్లిని ఆశ్రమంలో చేర్పించారు కూడా. ఆ పొలం కొందామని బేరం కుదుర్చుకున్నాడు అదే ఊళ్లోని ఓ మోతుబరి. డబ్బులిచ్చే సమయానికి హఠాత్తుగా చనిపోయాడు. ఖంగుతిన్నారు అన్నదమ్ములిద్దరూ. మరో పదిరోజులకు ఇంకో వ్యక్తి ముందుకొచ్చాడు కొనడానికి. తెల్లవారి డబ్బులు తెస్తూ అతనూ చనిపోయాడు యాక్సిడెంట్లో.దీంతో ఊళ్లో వాళ్లకు మల్లయ్య నిజంగానే దయ్యమయ్యాడనే రుజువు దొరికినట్టయింది. కాని అన్నదమ్ములిద్దరూ నమ్మలేదు. పొలం అమ్మే బాధ్యతను తమ చిన్నాన్నకు అప్పగించి పెద్దోడు ఒమన్‌కు, చిన్నోడు భివండికి బయలుదేరారు. తర్వాత చాలా రోజులు ఆ పొలం అలాగే ఉంది. మల్లయ్య ఉన్నప్పుడు మూడు ఎకరాలు తీసుకున్న కౌలు రైతు కూడా భయపడి కౌలు చేయడం మానేశాడు. ఈ వ్యవహారమంతా వ్యవసాయం చేస్తున్న స్నేహితుల ద్వారా తెలుసుకున్న రాహుల్ చాలా చవకకు ఆ పొలాన్ని కొనేశాడు. ఆ సందర్భంగానే సర్పంచ్‌కి ఇచ్చిన పార్టీ అది. ప్రెజెండ్ డే... ఉదయం... తాత్కాలికంగా సర్పంచ్ ఇంట్లోనే అద్దెకు ఉంటున్న రాహుల్ నిద్ర లేచాడు. సెల్ ఫోన్లో టైమ్ చూశాడు. ఎనిమిది అయింది. ‘‘అమ్మో’’ అంటూ దిగ్గున లేచాడు. పక్కనున్న మంచం మీద అజయ్ కనిపించలేదు. బాత్రూమ్కి వెళ్లాడేమో అనుకొని ఓనరకి, టెనెంట్‌కు కామన్‌గా ఉన్న వసారాలోకి వచ్చాడు. పేపర్ చదువుతూ కనిపించాడు సర్పంచ్. ‘‘గుడ్ మార్నింగ్ సర్పంచ్ సాబ్!’’‘‘గుడ్ మార్నింగ్ సార్.. గిప్పుడు లేచిండ్రా..? మీ తమ్ముడు ఎప్పుడో పొలంకి పాయే’’ అన్నాడు నవ్వుతూ సర్పంచ్. ‘‘అవునా?’’ ఆశ్చర్యపోయాడు రాహుల్. ‘‘మాటలే గాదు.. షేతల్లో చూపిస్తుండు మీ తమ్ముడు’’ మెచ్చుకోలుగా సర్పంచ్ పేపర్లోంచి తల తిప్పకుండానే. ఆదరాబాదరాగా దినచర్యకు దిగాడు రాహుల్. అరగంటలో అన్నీ పూర్తి చేసుకొని పొలానికి వెళ్లాడు. అక్కడ..ఎవరో స్త్రీ మూర్తితో మాట్లాడుతూ కనిపించాడు అజయ్ అల్లంత దూరం నుంచి. దగ్గరకు వచ్చాక చూస్తే.. మల్లయ్య భార్య. చాలా నవ్వుతూ మాట్లాడుతోంది అజయ్‌తో. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది?ఆ సందేహాన్నే ప్రశ్నలుగా సంధించాడు ఆమె వెళ్లిపోయాక. ‘‘మనం ఈ పొలం కొన్నమని ఎవరో చెప్పిన్రట అన్నా. మంచిగ పండించుకోండ్రి అని చెప్పడానికొచ్చింది’’ అన్నాడు అజయ్ అదేదో అంతగా పట్టించుకునే విషయం కాదన్నట్టు. ‘‘ఊ’’ అంటూ చెట్టు కిందకు వెళ్తున్న రాహుల్ ఫోన్ మోగింది. విస్మయం.. ఆ భావంతోనే ఫోన్ లిఫ్ట్ చేశాడు రాహుల్. ‘‘హలో అన్నగా.. ఏంరా.. నేను రాకుండా.. లేకుండానే కల్టివేషన్ చేస్తవా? నేను వచ్చేదాకా ఆగు. ఈ వారంలో వస్తున్నా. జాబ్గీబ్ అన్నిటికీ గుడ్‌బై చెప్పేశ్న. కలిసి వ్యవసాయం చేసుకుందాం..మన దేశం.. మన మట్టి..’’ అంటూ ఇంకేదో చెప్తూనే ఉన్నాడు అవతల నుంచి. రాహుల్ మొహం నిండా చెమటలు. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. చెవి దగ్గరున్న ఫోన్‌ని పట్టుకున్న చేయి వణుకుతోంది. కాళ్లూ కంపిస్తున్నాయి. - సరస్వతి రమ -
శివరాజ్
‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి.’ చివరి వాక్యం రాసి వేళ్లు విరుచుకున్నాడు శ్రీధన్ శివరాజ్. డెబ్భై ఏళ్లు ఉంటాయి అతడికి. పొడవుగా, బక్క పలుచగా ఉంటాడు. కళ్లు లోతుగా ఉంటాయి. ఆ లోతుల వెనుకాల పూర్వజన్మల్లోంచి చూస్తున్నట్లుగా సూక్ష్మంగా, నిశితంగా ఉంటుంది శివరాజ్ చూపు. ఎంతటి మనిషినైనా పట్టేస్తాడు. దెయ్యాల్ని పట్టేయడం గొప్పగానీ, మనుషుల్ని పట్టేయడం ఏం గొప్ప అన్నారు ఎవరో ఎప్పుడో. అప్పుడు పెద్దగా నవ్వాడు శివరాజ్. నవ్వాడు అంతే. ఏమీ అనలేదు. శివరాజ్ ఎవరికీ అంతుపట్టడు. అంతుపట్టకపోవడానికి ఒక కారణం అతడు పెద్దగా మాట్లాడడు. భార్య పోయినప్పుడు, పిల్లలు వెళ్లిపోతున్నప్పుడూ అతడు మౌనంగానే ఉన్నాడు. ‘‘ఉండు పార్వతీ’’ అని మాత్రం తన అరవై ఏళ్ల వయసులో భార్య చేతిని పట్టుకుని అడిగాడు. వెళ్లిపోయాక ఎక్కడి నుంచి వస్తుంది పార్వతి? పార్వతి అనే ఆత్మ వెళ్లిపోయాక, శివరాజ్ అనే దేహం ఒక్కటే మిగిలింది భూమి మీద. ఎప్పుడూ ఆత్మలో ఉండే ఈ దేహానికి ఏకాంతాన్ని కల్పించాలని అనుకున్నారేమో పిల్లలు.\ ఊళ్లోనే ఉన్నా, విదేశాల్లో ఉన్నట్లుగా వేరే ఇంటికి మారిపోయారు. ఇల్లు, ఆ ఇంట్లో శివరాజ్.. ఇద్దరే మిగిలారు. పార్వతి ఫొటో ఉన్న గదిలో కూర్చుంటాడు రోజంతా అతడు. పార్వతి బతికి ఉన్నప్పుడు కూడా అతడు ఆమెతో మాట్లాడిందీ, ఆమెను చూస్తూ కూర్చున్నదీ లేదు. పార్వతితో మాట్లాడ్డం అంటే శివరాజ్‌కు తనతో తను మాట్లాడుకోవడమే. ఎవరైనా తమతో తాము మాట్లాడుకుంటారా? శివరాజ్ ఎవరికీ అంతుబట్టకపోవడానికి ఇంకో కారణం అతడు రచయిత. దెయ్యాల రచయిత. ఎప్పుడూ ఆ ఆలోచనల్లో ఉంటాడు. నలభై ఏళ్లుగా అతడు పత్రికలకు దెయ్యాల కథలు రాస్తున్నాడు. పరభాషల్లోకి కూడా అవి తరచూ అనువాదం అవుతుంటాయి. శివరాజ్ రాసేవి పేరుకు దెయ్యాల కథలే కానీ.. దెయ్యాలు ఉన్నాయనీ, దెయ్యాలు లేవనీ చెప్పే కథలు కావు. ‘‘మరెందుకు రాస్తున్నట్లు?’’ అని ఓసారెప్పుడో ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చినవాళ్లు అడిగారు. నవ్వాడు శివరాజ్. ‘‘దెయ్యాలు ఉన్నాయనుకునే వాళ్ల కోసం, దెయ్యాలు లేవనుకునేవాళ్ల కోసం రాస్తున్నాను’’ అన్నాడు. ‘‘మీరేం చెప్పదలచుకున్నారు. దెయ్యాలు లేవనా? దెయ్యాలు ఉన్నాయనా?’’.. అడిగారు ఇంటర్వ్యూ వాళ్లు.‘‘నేను చెప్పదలచుకున్నదే కదా రాస్తున్నాను’’ అన్నాడు శివరాజ్. ‘‘మీ ఉద్దేశం ఏంటి? దెయ్యాలు ఉన్నాయనా? లేవనా?’’ ‘‘తెలీదు. కానీ దెయ్యాల మీద నాకు రెస్పెక్ట్ ఉంది’’‘‘రెస్పెక్ట్ ఎందుకు?’’‘‘మీలా అవి ప్రశ్నలు వేయవు కాబట్టి..’’ఇలాగే ఉంటుంది శివరాజ్ మాట్లాడ్డం. శివరాజ్‌తో మాట్లాడ్డం. ‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి.’చివరి వాక్యం రాశాక.. ఫొటోలో పార్వతివైపు చూశాడు శివరాజ్. నవ్వు ముఖం. మనసు నిండా ప్రశాంతతను నింపే ముఖం. ఫొటోని చేతుల్లోకి తీసుకుని మెత్తటి గుడ్డతో తుడిచి, మళ్లీ గోడకు పెట్టేశాడు. పెరట్లోని తాజా పూలతో తానే గుచ్చిన దండను పార్వతి ఫొటోకి తగిలించాడు.అతడు రాసిన చివరి వాక్యం తను రాస్తుండే దెయ్యం కథల్లోని ముగింపు వాక్యం కాదు. తన బయోగ్రఫీలోని ‘ది ఎండ్’ సెంటెన్స్. అతడి జీవిత చరిత్రను సీరియల్‌గా వేసుకుంటామని పెద్ద పెద్ద పత్రికలు, పెద్ద పెద్ద పారితోషికాలతో ముందుకు వచ్చాయి. ఆసక్తి లేదన్నాడు. ఒకేసారి రిలీజ్ చేస్తానన్నాడు. పబ్లిషర్స్ వచ్చారు. ఇవ్వలేనన్నాడు. ప్రచురణ హక్కులు తన భార్యకు ఇచ్చేశానన్నాడు! పార్వతీ పబ్లికేషన్స్ పేరు మీద పుస్తకం వస్తుందన్నాడు. పార్వతే పుస్తకాన్ని ఆవిష్కరిస్తుందని కూడా చెప్పాడు! శివరాజ్ భార్య ఎప్పుడో చనిపోయింది కదా, ఆవిడ ఆవిష్కరించడం ఏంటని కొందరికి సందేహం వచ్చింది. శివరాజ్‌కి మతి భ్రమించినట్లుందని కొందరనుకున్నారు. ‘‘పూర్తయింది పార్వతీ’’ అన్నాడు శివరాజ్ పార్వతి ఫొటో వైపు చూస్తూ. ఫొటోలోని పార్వతి నిశ్చలంగా, కోనేటి పువ్వులా ఉంది. దేవుడి చెట్టు మీది నుంచి రాలిపడినట్టు. ‘‘పూర్తయింది’’ అని పత్రికల ఎడిటర్లకు ఫోన్ చేసి చెప్పాడు! ‘‘ఆల్రెడీ ఇచ్చేశారు కదా శివరాజ్ గారూ.. నెక్స్ట్ వీక్ కదా మీరు ఇవ్వాల్సింది ’’ అన్నారు వాళ్లు. ‘‘పూర్తయింది’’ చెప్పేశాడు శివరాజ్. అరగంటకు టీవీలో స్క్రోలింగ్ మొదలైంది! ప్రముఖ దెయ్యాల కథా రచయిత శ్రీధన్ శివరాజ్ (70) ‘కథాధర్మం’.మొదటి కథ çఫలానా సంవత్సరంలో. చివరి కథ ఫలానా పేరుతో.. అంటూ ఇంకా వివరాలేవో స్క్రోల్ అవుతున్నాయి. నవ్వుకున్నాడు శివరాజ్. వెళ్లి టీవీ కట్టేశాడు. రిమోట్ పనిచేయడం ఎప్పుడో మానేసింది. పార్వతికి టీవీలో ఆ డబడబలు ఇష్టం ఉండదు. ఆమె చనిపోయినప్పట్నుంచీ టీవీని మ్యూట్‌లోనే చూస్తున్నాడు శివరాజ్. టీవీ కట్టేశాక, పార్వతి ఫొటో వైపు ఒకసారి చూసి, గది తలుపులు వేసుకున్నాడు శివరాజ్. శివరాజ్ కథలు రాయడం మానేశారనే అర్థంలో ‘కథాధర్మం’ అని మొదటి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన చానల్‌ను చూసి, తక్కిన చానళ్లు కొన్ని.. ‘శివరాజ్ కాలధర్మం’ అని టెలికాస్ట్ చేసేశాయి! శివరాజ్ పోయారనే వార్త తెలిసి ఆయన అభిమానులు నివ్వెరపోయారు. ఆయనకు డెబ్భై ఏళ్లా అని కొందరు ఆశ్చర్యపోయారు. అందరికంటే ముందుండే టీవీ చానల్ వ్యాన్ ఒకటి లైవ్ టెలికాస్ట్ కోసం శివరాజ్ ఇంటి ముందు ఆగింది. ‘కథాధర్మం’ అని క్రియేటివ్ బ్రేక్ ఇచ్చింది ఆ చానలే. శివరాజ్ ఇంటి బయటి గేటు తెరిచే ఉంది. లోపలికి వెళుతూ, తన పక్కనే ఉన్న కెమెరామన్‌ని అడిగింది ఆ చానల్ నుంచి వచ్చిన రిపోర్టర్.. ‘దేవాలయాలు ఎక్కడైనా పాడుబడతాయా?’ అని. తెలియదన్నాడు కెమెరామన్. ‘మేము వెళ్లేటప్పటికి పాడుబడిన దేవాలయంలా ఉంది శివరాజ్ ఉంటున్న ఇల్లు’ అని మొదలు పెడితే బాగుంటుందని అనిపించినట్లుంది ఆ రిపోర్టర్‌కి. హాల్లోకి, అక్కడి నుంచి శివరాజ్ గది దగ్గరికి వెళ్లి తలుపుల్ని మెల్లిగా నెట్టారు ఆ రిపోర్టర్, కెమెరామన్. లోపల.. మంచం మీద పడుకుని ఉన్నాడు శివరాజ్. అతడి పక్కనే కుర్చీ ఉంది. ఆ కుర్చీలో అతడి బయోగ్రఫీ స్క్రిప్ట్ కాగితాలు ఒక బొత్తిగా తాడుతో కట్టి ఉన్నాయి. ఆ కాగితాల బొత్తికి ఆన్చి శివరాజ్ భార్య ఫొటో ఉంది. ఆమె ఫొటోకి ఉండాల్సిన తాజా పూల దండ, శివరాజ్ స్క్రిప్టు పేపర్స్‌కి వేసి ఉంది!‘‘సార్..’’ అని దగ్గరికి వెళ్లి లేపేందుకు ప్రయత్నించారు చానల్ వాళ్లు. కళ్లు తెరవలేదు శివరాజ్. స్క్రిప్టులోని చివరి కాగితం.. బొత్తి నుంచి వేరుగా ఉంది. ‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి’ అనే వాక్యం ఉన్న కాగితం అంది. రెండో రోజు న్యూస్ పేపర్లలో ఆ వాక్యాన్ని చూసి.. శివరాజ్‌ని గతంలో అనేకసార్లు ఇంటర్వ్యూ చేసినవారు అనుకున్నారు:‘దెయ్యాలు లేవని అబద్ధం చెప్పారా? దెయ్యాలు ఉన్నాయనే నిజాన్ని దాచిపెట్టారా?’ -
నవ్వు ముఖం
‘‘నాకు తెలిసిన వ్యక్తి ఒకరు నన్ను ఫాలో అవుతున్నారు డాక్టర్’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీ సమస్యేమిటీ?’’ అడిగాడు డాక్టర్ తరుణ్. సైకియాట్రిస్ట్ ఎదురుగా కూర్చొని ఉంది అన్విత. ‘‘చెప్పండి’’ అన్నాడు సైకియాట్రిస్ట్ గట్టిగా గుండె లోపలికి గాలి పీల్చుకుని.అన్వితకు పాతికేళ్ల వరకు ఉంటాయి. పెళ్లి కాలేదు కాబట్టి పద్దెనిమిదేళ్ల అమ్మాయిలా ఉంది. ఆయన ఎందుకంత గాఢంగా గుండె లోపలికి గాలి పీల్చుకోవలసి వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. బీపీ చెక్ చేసే డాక్టర్లా ఈ సైకియాట్రిస్ట్‌లు దేహం లోపలి విపత్తుల్ని, విలయాలను సంకేతపరిచే ఫీలింగ్స్ ఏవో అప్పుడప్పుడూ పెడుతుండటం గురించి ఆమెకు తెలుసు. ఇప్పుడీ సైకియాట్రిస్ట్ కూడా ఏ కారణమూ లేకుండానే అదే విధమైన ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చెయ్యడానికి గుండె లోపలికి గాలిని పీల్చుకొని ఉండి ఉండొచ్చని ఆమె అనుకుంది. ‘‘మీవన్నీ అనవసర భయాలు’’ అన్నాడు డాక్టర్ తరుణ్.ఆ నగరంలో పేరున్న సైకియాట్రిస్ట్ అతను. మనిషి డాక్టర్లా ఉండడు. దెయ్యాలు పట్టేవాడిలానో, దెయ్యాల పనిపట్టేవాడిలానో ఉంటాడు. కానీ నవ్వు ముఖం. దెయ్యాల భయం ఉన్నవారికి అతడిని చూస్తే మందు చీటీ రాయకుండానే ధైర్యం వచ్చేస్తుంది. ‘దెయ్యాల్ని మించినవాyì దగ్గరికే వచ్చాం’ అన్న దగ్గరి భావం ఏదో అతడి పట్ల కలుగుతుంది రోగికి. అయితే అలాంటి భావం అన్వితకు కలిగినట్లు లేదు. ‘‘ముందసలు మిమ్మల్ని మీరు ఒక రోగి అనుకోవడం మానండి’’ అన్నాడు డాక్టర్ తరుణŠ . అతడికో అలవాటుంది. వచ్చినవాళ్లు ఏ సమస్యతో వచ్చారో తెలుసుకోడానికి ముందే.. ‘మీవన్నీ అనవసర భయాలు, ముందసలు మిమ్మల్ని మీరు ఒక రోగి అనుకోవడం మానండి’’ అంటుంటాడు. ఇప్పుడు అన్వితతోనూ ఆ రెండు మాటలు అన్నాడు. అన్విత ఆశ్చర్యంగా చూసింది.‘‘నన్ను నేను రోగి అనుకోవడం లేదు డాక్టర్. భయపడుతున్నానంతే. ఆ భయమే రోగం అని మీరు అంటే కనుక.. ‘అప్పుడు.. ధైర్యం కూడా రోగమే అవ్వాలి కదా డాక్టర్’ అని నేను మిమ్మల్ని ప్రశ్నించడానికి సంకోచించను’’ అంది అన్విత. ఆ మాటకు నివ్వెరపోబోయి ఆగాడు డాక్టర్ తరుణ్. ‘‘మీ లాజిక్ బాగుంది. మీరు ఫిలాసఫీ స్టూడెంట్ అయి ఉంటారని నాకు నమ్మబుద్ధేస్తోంది’’ అన్నాడు. ‘‘నమ్మబుద్ధి కావడం ఏంటి డాక్టర్?’’ అని ప్రశ్నించింది అన్విత విస్మయంగా. ‘‘నా ఉద్దేశం.. మీరు ఫిలాసఫీ స్టూడెంట్‌నని నాతో చెప్పుకున్నారనీ, మీరు ఫిలాసఫీ స్టూడెంట్‌లా నాకు అనిపించకపోయినప్పటికీ.. మీరు ఫిలాసఫీ స్టూడెంట్ అని నాకు నమ్మబుద్ధేస్తోందని చెప్పడం కాదు మిస్ అన్వితా’’ అన్నాడు తరుణ్. ‘‘మరి!’’ అంది అన్విత.‘‘మీరు ఫిలాసఫీ స్టూడెంట్ అయి ఉండడం అన్న నా ఫీలింగ్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతే.’’ ‘‘ఓకే.. డాక్టర్. నా సమస్య భయమూ కాదు, ధైర్యమూ కాదు. జస్ట్ సమస్య. ఆ సమస్యను నేను మానసిక ఆరోగ్యమనీ, మానసిక అనారోగ్యమనీ అనుకోవడం లేదు. దానర్థం చికిత్స కోసం నేను మీ దగ్గరకు రాలేదని కాదు. నేనూ మీతో కొన్ని ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను’’ అంది. చెప్పమన్నట్లు చూశాడు తరుణ్. ‘‘నాకు తెలిసిన వ్యక్తి ఒకరు నన్ను ఫాలో అవుతున్నారు డాక్టర్’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీ సమస్యేమిటీ?’’ అడిగాడు డాక్టర్ తరుణ్. అన్విత అందంగా ఉంటుంది. తెలిసిన వ్యక్తులే కాదు, తెలియని వ్యక్తులకు కూడా ఆమెను ఫాలో అవ్వాలని అనిపించడానికి అవకాశాలు లేకపోలేదు. ‘‘ఒకప్పుడు నేనతన్ని ప్రేమించాను. ఇప్పుడు ప్రేమించే స్థితిలో లేను. తను మాత్రం నన్నింకా ప్రేమిస్తూనే ఉన్నాడు’’‘‘చివరిసారి మిమ్మల్ని ఎప్పుడు ఫాలో అయ్యాడు?’’ అడిగాడు తరుణ్. ‘‘చివరిసారి, మొదటిసారి అనేం లేదు డాక్టర్. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా నన్ను ఫాలో అయ్యాడు’’ చెప్పింది అన్విత. ‘‘ఫాలో అయి ఏం చేస్తాడు?’’‘‘నువ్వంటే ఇష్టం అంటాడు. నువ్వు లేందే బతకలేనంటాడు. నీతో పాటు వచ్చేస్తానంటాడు’’‘‘హెడ్డేక్గా తయారయ్యాడంటారు. అంతేనా?’’అన్నాడు తరుణ్. ‘‘లేదు లేదు. అలాంటిదేం లేదు’’ ‘‘మరేంటి’’? ‘‘మా నాన్న నాకు వేరే సంబంధం తెచ్చారు. మా ఇద్దరికీ ఉన్న ప్రేమబంధం గురించి చెప్పాను. ‘వాణ్ణి చంపేస్తాను’ అని పెద్దగా అరిచారు. ‘వద్దు నాన్నా.. నా ప్రేమను చంపుకుంటాను. అతన్ని చంపకు’ అని నాన్న కాళ్లు పట్టుకున్నాను. నాన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను దగ్గరకు తీసుకున్నాడు. ‘నా మాట విను. నీ జీవితం బాగుంటుంది’ అన్నాడు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న మాట వింటే నా జీవితం బాగుంటుందా, బాగుండదా అని నేను ఆలోచించలేదు. నాన్న మాట వినదలచుకున్నాను. నాన్న కోసం.. అతనిపై నాకున్న ప్రేమను చంపుకోడానికి నేను తయారైపోయాను కానీ, నాపై ఉన్న ప్రేమను చంపుకోడానికి అతను సిద్ధంగా ఉంటాడా అని ఆలోచించలేకపోయాను’’ అంది అన్విత. డాక్టర్ తరుణ్ మౌనంగా వింటున్నాడు. ఈ అమ్మాయి తన సమస్యను ఎక్కడికి తెచ్చి ఆపుతుందా అని అతడు ఎదురుచూస్తున్నాడు. ‘‘అతను నాకు సమస్య కాదు డాక్టర్. నేనే అతనికి సమస్యగా మారానేమోనని సందేహంగా ఉంది’’ అంది అన్విత.తరుణ్ నివ్వెరపోయాడు. మనసులోని విషయం గ్రహించినట్లే మాట్లాడింది అనుకున్నాడు. ‘‘అతన్ని చూడాలని అనిపించినప్పుడు అతనికి కనిపించకుండా దూరం నుంచి చూడొచ్చు. కానీ నేను అతన్ని చూస్తున్నప్పుడు అతను నన్ను చూడాలన్న కోరిక అతనికి నేను కంటపడేలా చేస్తోంది. ఆవెంటనే అతను నా వెంటపడుతున్నాడు’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీకొచ్చిన సమస్యేమీ కనిపించడం లేదు అన్వితా. అతను మిమ్మల్ని ఫాలో అవడం మీకూ సంతోషమే కదా. నిజానికి మీరే అతన్ని మీ వెంటపడేలా చేసుకుంటున్నారు’’ అని నవ్వాడు తరుణ్. ‘‘నా భయం కూడా అదే డాక్టర్. నా సంతోషం కోసం అతన్నేమైనా నేను దుఃఖంలో ముంచేస్తున్నానా అని. ఆ ఫీలింగ్‌ని షేర్ చేసుకోడానికే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను’’ అంది అన్విత. ‘‘కానీ.. నాదొక సందేహం అన్వితా. మీ నాన్నతో అన్నారు కదా. అతనిపై మీకున్న ప్రేమను చంపుకుంటానని. మళ్లీ ఇదేమిటి?’’ అన్నాడు తరుణ్. ‘‘అవును డాక్టర్.అయితే ప్రేమను చంపుకోవడం కష్టమని నాకు తర్వాత తెలిసింది’’. ‘‘తర్వాత అంటే?’’‘‘ఆత్మలు మనుషుల మీద ప్రేమను చంపుకోలేక ఆ మనుషుల చుట్టూ తిరుగుతున్నట్లే.. ఆత్మలు కనిపించినప్పుడుమనుషులూ ఆత్మల మీద ప్రేమను చంపుకోలేక ఆ ఆత్మ చుట్టూ తిరుగుతారని నాకు తెలిశాక’’.. చెప్పింది అన్విత.డాక్టర్ తరుణ్‌ది నవ్వు ముఖం.అన్విత అలా చెప్పాక.. ముఖం మాత్రమే మిగిలింది. - మాధవ్ శింగరాజు -
దెయ్యం – భయం
రోజులు గడుస్తున్నాయి. కాలేజీకి వెళ్లడం, రావడం ఇదే పని. ఓ రోజు కాలేజ్ అయ్యాక తొందరగా ఇంటికి వచ్చి బ్యాగ్ బెడ్ మీద పడేసి బయటకు జంప్ అవుతుంటే ‘‘ఒరేయ్! ఏదన్న తిని పోరా’’ అని అమ్మ వంట గది నుంచే అరిచింది. ‘‘ఆకలైతలేదమ్మా!’’ అని గట్టిగా అంటూనే బయటపడ్డా. అదే రోజు రాత్రివరకు బయట షికార్లు కొట్టి, అమ్మకు ఫోన్ చేసి చెప్పా – ‘‘అమ్మా! ఇవ్వాళ లేటయితది’’. అమ్మ తిట్టాల్సిందంతా తిట్టి, జాగ్రత్త చెప్పి ‘సరే’ అంది. నా ఫ్రెండ్ అర్జున్‌తో కలిసి ఓ హాలీవుడ్ హర్రర్ ఫిల్మ్‌కి వెళ్లా. సినిమా ఎంత భయంకరంగా ఉందో మాటల్లో చెప్పలేను. సినిమా చూస్తున్నంతసేపు భయపడుతూనే ఉన్నా, కానీ చూడాలి అనిపిస్తోంది.‘‘ఏంది మామా! హర్రర్ సినిమాలు ఈ రేంజ్లో ఉంటాయా! నాకు భయమైతుంది. పోదామా?’’ అని అర్జున్ నా చెవిలో అరుస్తున్నాడు.‘‘నాకేం తెలుసురా! ఇంట్లో హర్రర్ సినిమాలు చూస్తే పెద్దగా భయం కాలేదు కానీ థియేటర్లో చూస్తే మాత్రం చాలా భయమైతుందిరా! సర్లే, మొత్తం సినిమా చూసే పోదాం’’ అన్నా. ఆ దెయ్యాలు, ఆ సౌండు, దెయ్యాలు మనుషుల రక్తాలు తాగడాలు.. వణుకుతూనే సినిమా చూస్తూ కూర్చున్నాం. సినిమా అయ్యాక, ‘ఇంకోసారి చీకట్లో ఇలాంటి హర్రర్ సినిమాలకు రావొద్దురా’ అనుకున్నాం. అసలే చీకటి. హర్రర్ సినిమా చూసి ఇంటికి వెళ్తున్నాం. ఇద్దరం ఏం మాట్లాడుకోవట్లేదు. సడెన్‌గా, ‘‘రామ్! దెయ్యాలు ఎలా ఉంటాయో తెలుసా’’ అని వాడు నావైపు చూస్తూ అడిగాడు.‘‘ఈ టైమ్‌లో దెయ్యాల గురించి డిస్కషన్ ఏందిరా! నాకేం తెల్వదు.’’ అన్నాను భయపడుతూనే. ‘‘రామ్! నేను దయ్యాన్ని చూశా.’’ అని ఆగాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. భయమేసింది. ‘‘ఎక్కడరా?’’ అనడిగా. ‘‘నువ్వేం భయపడకు. ఇప్పుడు కాదులే! చిన్నప్పుడు..’’ అని గట్టిగా నవ్వాడు. నాకు ఆ భయంలో వాడి మీద కోపమొచ్చింది. ఇంటికొచ్చేశాం. వాడిల్లు, మా ఇల్లు పక్కపక్కనే. ఇంటికి చేరేసరికి భయం కాస్త పోయింది. రాత్రి కలలు భయపెట్టాయి కానీ, పొద్దున్నే లేచి ఇంట్లోనే ఉన్నా అని నమ్మకం కలిగాక నాకు నేనే నవ్వుకున్నాను. ఆ తర్వాతిరోజు ఏదో ఫంక్షన్ ఉందని ఇంట్లోవాళ్లు ఊరెళ్లారు. నేను, తమ్ముడు ఎప్పట్లానే కాలేజీకి వెళ్లిపోయాం. నేను కాలేజీ నుంచి ఇంటికొచ్చేసరికి ఇంటిముందు జనం. ‘ఏమైంది.. ఏమైంది..’ అని పరిగెత్తాను. అక్కడున్న వాళ్లెవరూ ఏం చెప్పట్లేదు. పక్కింటి ఆంటీని అడిగా – ‘‘ఏమైందాంటీ?’’ అని. ‘‘మీ తమ్ముడు ఇందాకే వచ్చి వెళ్లిండు. తాళంచెవి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత గంట నుంచి ఇగో.. ఇట్ల సౌండ్..’’ అని భయంతో చెప్పింది. ‘‘అరెయ్ రామ్! కొంపదీసి ఇంట్లో దయ్యముందారా?’’ అన్నాడు నన్ను చూసి అటు దూరంనించి నడుచుకుంటూ వచ్చిన అర్జున్. రాత్రి భయపెట్టింది చాలనట్లు ఇంకా భయపెడుతున్నాడు.డోర్ ఓపెన్ చేసి వెళ్దామంటే కీ లేదు. జనం మొత్తం వచ్చేస్తున్నారు. అయ్యో ఇంట్లో ఏదో చొరబడిందని భయపెట్టిస్తున్నారు. ఓ పెద్ద మనిషైతే ‘‘మొన్ననే ఒక దెయ్యాన్ని చూశిన. ఈ ఇంట్లనే జొరబడ్డదేమో!’’ అన్నాడు. ఈ కాలంలో దయ్యాలుంటాయా అని అనిపించినా నాకూ భయం పెరిగిపోతూనే ఉంది. కీ కోసం తమ్ముడికి కాల్ చేశా. వాడు రావడానికి అరగంట పడుతుందన్నాడు.లాభం లేదు. తాళం పగలగొట్టాలి. కానీ లోపల్నించి వస్తోన్న సౌండ్? భయం పెరుగుతూనే ఉంది. తమ్ముడి కోసం ఎదురుచూశా. వాడు రావడమే అందరం తలుపు పక్కన భయపడుతూ నిలబడ్డాం. కాసేపట్లో నిజంగానే హర్రర్ సినిమా లైవ్‌లో కనబడుతుంది అనుకుంటున్నా. లోపల్నించి ఎవరో బలంగా తలుపును కొడుతున్నారు. ‘‘నా వల్ల కాదు. అమ్మో దయ్యముందేమో!’’ అని నేను దూరంగా పరిగెత్తా. ‘‘ఎవరూ లోపల?’’ అని అరిచా గట్టిగా. అటువైపు నుంచి మాటలు రాలేదు కానీ డోర్‌ను గట్టిగా తంతూ ఓ వింత సౌండ్ మళ్లీ వినిపించింది. ‘తలుపు తీయ్’ అంటున్నారు అందరూ. కానీ ఎవ్వరూ ముందుకు కదలట్లేదు. మా తమ్ముడైతే దూరంగా వెళ్లి నిలబడ్డాడు అప్పటికే.‘‘అర్రె! ఏం భయంరా. అందరం ఉన్నాంగా! మేం దూరంగా నిలబడుతాం’’ అని నన్ను డోర్ దగ్గర వుంచి అందరు దూరంగా వెళ్లిపోయారు. ‘‘తలుపు తీయ్.. తలుపు తీయ్..’’ అని అరుస్తున్నారు. ఇక లాభం లేదని తాళంచెవి పెట్టి, తలుపు తీసి వెంటనే వెనక్కి పరిగెత్తుకొచ్చాను. అందరూ భయంభయంగా తలుపు వైపే చూస్తున్నారు. ఇంట్లోంచి ఎప్పుడూ వినని విధంగా సౌండ్ చేసుకుంటూ ఓ కుక్క బయటకు వచ్చి అందరిని చూసి భయపడి రెండు నిమిషాల్లో సందు దాటేసింది. అది వెళ్లిపోయాక అందరూ ఒకటే నవ్వులు. ‘భయపడి సచ్చినం కదరా!’ అనుకున్నారు అందరూ. అసలు విషయం ఏమైందంటే, మధ్యాహ్నం తమ్ముడు ఇంటికొచ్చి అన్నం తిని వెళ్లాడు. ఆ టైమ్‌లో ఆ కుక్క ఇంట్లో జొరబడింది. ఆ తర్వాత వాడు అది చూసుకోకుండా తాళమేస్కొని బయటికెళ్లాడు. దాన్ని చూసి వీళ్లంతా దయ్యమనుకొని భయపడ్డారు. నన్నూ భయపెట్టి పడేశారు. – రమేశ్ రాపోలు, నల్లగొండ. -
దెయ్యాలు నిజంగానే ఉన్నాయా?
సాక్షి, వెబ్ డెస్క్ : మీరు కళ్లు తెరచి పడుకుంటున్నారా?, నిద్రిస్తున్న సమయంలో ఏవైనా వింత శబ్దాలు మీకు వినిపిస్తున్నాయా?. సహజంగా ఒకసారి, రెండుసార్లు ఇలాంటి సంఘటనలు జరిగితే పట్టించుకోకుండా వదిలేస్తాం. అదే పదేపదే శబ్దాలు వినిపిస్తే మాత్రం అనుమానం(ఏదో ఉందని) మొదలవుతుంది. ఏదో గుర్తించలేని అదృశ్య శక్తి మనల్ని వెంబడిస్తుందని భావిస్తాం. ఒక్కోసారి పడుకున్న చోటును ఎటూ కదలలేకపోతాం. దీంతో మనల్ని ఎవరో వెంటాడుతున్నారన్న భయం పెరిగిపోతుంది. అప్పటినుంచి క్షణక్షణం నరకం అనుభవిస్తాం. చీకటి పడుతుంటుంది. ఇంటికి వెళ్లాలంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. రాత్రికి మళ్లీ ఏం జరుగుతోందనని హడలెత్తిపోతుంటాం. ఇలాంటి అనుభూతులన్నీ దెయ్యాలు, భూతాల వల్ల కాదని సైకాలజీ ప్రొఫెసర్ ఎలైస్ గ్రెగరీ తేల్చేశారు. గోల్డ్‌స్మిత్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగంలో ఆయన పని చేస్తున్నారు. హఠాత్తుగా నిద్రలో నుంచి లేచి ఇంట్లో ఏదో ఉన్నట్లు భావించే వారు అధికంగా బాగా పొద్దుపోయిన తర్వాత నిద్రిస్తున్నారని చెప్పారు. ఇదే వారిని మానసిక ప్రశాంత నుంచి దూరం చేస్తోందని వెల్లడించారు. నిద్ర పక్షవాతం నిద్ర మొత్తం 3 స్టేజ్లలో ఉంటుందని గ్రేగ్ చెప్పారు. మనుషులు మొదట మెల్లగా నిద్రలోకి జారుకుంటారని, సమయం గడిచే కొద్దీ గాఢ నిద్రలోకి వెళ్తారని, ఆ తర్వాత రకరకాల కలల్లోకి వెళ్తామని గ్రెగరీ పేర్కొన్నారు. ఈ దశలో కలలోని పనులను మనం నిజంగానే చేస్తున్నట్లు భావిస్తామని, బెడ్‌పై కాళ్లు, చేతులు, ముఖ కవళికలు కలకు అనుకూలంగా మారతాయని చెప్పారు. ఈ స్థితిని నిద్ర పక్షవాతం అంటారని చెప్పారు. బాగా పొద్దుపోయిన తర్వాత నిద్రించేవారిలో ఈ మూడు స్టేజ్‌లు పూర్తికావని దాంతో వారు పగటిపూట అవిశ్రాంతిగా ఫీల్ అవుతారని తెలిపారు. ఇదే పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మెల్కొన్న తర్వాత కూడా కదలలేకపోవడం, ఏదో జరుగుతున్నట్లు ఫీల్ అవ్వడం వంటివి జరుగుతాయని వివరించారు. -
హారర్ ఫిల్మ్ షూటింగ్ పేరుతో యువకుల హల్చల్
-
అర్థరాత్రి దెయ్యాలు.. పట్టుకున్న పోలీసులు..!!
సాక్షి, విజయవాడ : నగరంలో అర్థరాత్రి దెయ్యం వేషాలతో యువకులు ప్రజలను బెంబేలెత్తించారు. హారర్ ఫిల్మ్ షూటింగ్ పేరుతో దెయ్యాల వేషాలు వేసుకుని ఏలూరు రోడ్డుపైకి రావడంతో ప్రజలు హడలిపోయారు. వీరి దెబ్బకు దాదాపు రెండు గంటల పాటు ప్రజలు భయంతో వణికిపోయారు. దీంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న మాచవరం పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసమే వేషాలు వేసినట్లు యువకులు చెప్పారు. సోషల్‌మీడియాలో వదంతులతో అసలే బిక్కుబిక్కుమంటున్న నగరవాసులు దెయ్యం వేషం వేసుకున్న వారిని చూసి మరింత బెదిరిపోయారు. కేవలం షార్ట్‌ఫిల్మ్ కోసమేనా? లేక మరేదైనా కోణం ఈ ఘటనలో ఉందా? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
శ్మశానంలో సాహసం : దెయ్యం రాకతో హడల్
హాంట్స్, ఇంగ్లండ్ : 800 ఏళ్ల పురాతన శ్మశానంలో సాహసయాత్రకు వెళ్లిన ఫిట్నెస్ ట్రైనర్‌కు షాక్ తగిలింది. ఓ దెయ్యం వెంబడించటంతో అతను హడలిపోయాడు. దెయ్యం తనపై దాడికి వస్తున్న ఘటనను టోని ఫెర్గూసన్ వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. హాంట్స్లో సెయింట్ మెరీ చర్చ్ వద్ద ఏదో ఉందని పుకార్లు వస్తుండటంతో ఫెర్గూసన్ అక్కడకు వెళ్లాడు. శ్మశాన పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తుండగా ఉన్నట్లు ఉండి ఓ ఆత్మ అతనిపైకి వచ్చింది. ఈ ఘటనతో ఫెర్గూసన్ నిర్ఘాంతపోయాడు. వెంటనే అక్కడి నుంచి వచ్చేశాడు. పూర్వీకులకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చే వారిని ఈ దెయ్యమే భయపెడుతున్నట్లు చెప్పాడు. అయితే, ఫెర్గూసన్ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది ఎడిటెడ్ వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
దెయ్యం దెబ్బకు ఫిట్నెస్ ట్రైనర్‌కు షాక్
-
ఇద్దరు ధైర్యవంతులు
వాళ్లలా మాట్లాడుకుంటూ.. ఎప్పుడు వెళ్లిపోయారో, ఎందుకు వెళ్లిపోయారో తెలీకుండానే దెయ్యాల టాపిక్‌లోకి వెళ్లిపోయారు!‘‘స్పెసిఫిక్‌గా దెయ్యాలు ఈ భూమ్మీద చేసే పనేదైనా ఉంటుందా అని నాకో సందేహం’’ అన్నాడు శ్రీజన్ నవ్వుతూ. ‘‘స్పెసిఫిక్‌గా అంటే?’’ అన్నాడు విక్రమ్. ‘‘హెచ్ఆర్కి హెచ్ఆర్ పనులు, అకౌంట్ సెక్షన్‌కి అకౌంటింగ్ పనులు ఉన్నట్లు దెయ్యాలకు సపరేట్గా ఏదైనా జాబ్ ఉంటుందా అని’’ అన్నాడు శ్రీజన్. విక్రమ్ నవ్వాడు. ‘‘నేననుకోవడం మనుషుల్ని పీక్కుతినడం వాటి పనేమోనని’’ అన్నాడు. శ్రీజన్ నవ్వాడు. మనుషుల్ని పీక్కుతినడానికైతే మేనేజర్లు, సెక్షన్ హెడ్లు ఉన్నారుగా.. భూమి నిండా! దెయ్యాలు పనిగట్టుకుని తిరగడం ఎందుకు?’’ అన్నాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. విక్రమ్ కొంచెం ఎక్కువగా నవ్వాడు. శ్రీజన్ దెయ్యాల్ని నమ్ముతాడు. విక్రమ్ దెయ్యాలంటే నవ్వుతాడు. అందుకే కొంచెం ఎక్కువగా నవ్వాడు. శ్రీజన్, విక్రమ్ ఇద్దరూ రూమ్మేట్స్. రూమ్మేట్సే కానీ, వాళ్లను రూమ్మేట్స్ అనేందుకు లేదు. ఆ రోజు ఉదయమే వాళ్లు రూమ్ తీసుకున్నారు. వర్కింగ్ మెన్స్ హాస్టల్లోని షేరింగ్ రూమ్ అది. ఇద్దరుండే రూమ్. ఇద్దరూ బ్యాచిలర్స్. ఇద్దరివీ వేర్వేరు ఉద్యోగాలు, వేర్వేరు ఆఫీసులు. హాస్టల్ రూమ్ కోసం వెతుక్కుంటూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒకరికొకరు పరిచయం అయ్యారు. మొదట రూమ్స్ ఏమీ ఖాళీగా లేవన్నాడు హాస్టల్ మేనేజర్. వాళ్లేం ఉసూరుమనలేదు. ఇది కాకపోతే ఇంకోటి అన్నట్లు మాటల్లో పడిపోయారు.‘‘ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ నెలాఖరుకు ఒక రూమ్ ఖాళీ అవుతుంది’’ అన్నాడు మేనేజర్. ‘వేరే చూద్దాం’ అన్నట్లు చూశాడు విక్రమ్.. శ్రీజన్ వైపు. ‘ఇక్కడైతే బాగుండేది’ అన్నాడు శ్రీజన్. ‘‘అవును’’ అన్నాడు విక్రమ్. ఆ హాస్టల్ ఇద్దరి ఆఫీసులకీ దగ్గరగా ఉంది. ఆ వయసులో ఉన్నవాళ్లు నడుచుకుంటూ వెళ్లి, నడుచుకుంటూ వచ్చేంత దగ్గరగా.‘‘పోనీ, సెకండ్ ఫ్లోర్లో ఉంటారా.. ఒక గది ఖాళీగా ఉంది’’ అన్నాడు మేనేజర్. వీళ్లిద్దరి మాటలూ వింటున్నాడతను. ‘‘ముందు లేదన్నారు?!’’ అన్నాడు విక్రమ్. ‘‘సెకండ్ ఫ్లోర్ హాస్టల్ కిందికి రాదు. సపరేట్ రూమ్ అది. ఒకటే ఉంటుంది. ఎవరైనా ఇమీడియట్గా కావాలి అన్నప్పుడు ఇస్తుంటాం. నచ్చితే మీరు మళ్లీ రూమ్ మారనవసరం లేదు అక్కడే ఉండొచ్చు’’ అన్నాడు మేనేజర్. అడ్వాన్స్ ఇవ్వడానికి ముందు.. రూమ్‌ని ఒకసారి చూసి వచ్చి, ఆఫీస్‌కి వెళ్లిపోయారు శ్రీజన్, విక్రమ్. రూమ్ శుభ్రంగా ఉంది. ఒకటే ఫ్యాన్. రెండు సింగిల్ కాట్ బెడ్లు. గదిలోకి చక్కగా గాలి వీస్తోంది. ఒక కిటికీ ఉంది. గాలి కోసం దాన్నైతే తీసే అవసరం లేదు. పగలు సిటీ లైఫ్‌నీ, రాత్రిపూట సిటీ ౖలైట్స్నీ చూడాలనుకుంటే ఆ కిటికీలోంచి చూడొచ్చు. రూమ్‌కి ఎటాచ్డ్గా వాష్‌రూమ్ ఉంది. అందులో గోడకు చక్కటి ఫ్రేమ్ ఉన్న అద్దం బిగించి ఉంది. అద్దం కింద సింక్. ఇద్దరికీ ఆ రూమ్ నచ్చింది. ఆ రాత్రి బయటే మీల్స్ చేసి హాస్టల్‌కి వచ్చారు. హాస్టల్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. మూడూ ఉంటాయి. అయినా, బయటే తిని వచ్చారు. రేపట్నుంచీ ఎలాగూ ఇక్కడే తినాలి కదా అనుకుని ఉండొచ్చు. పక్కపక్కనే, కాస్త ఎడంగా ఉన్న కాట్ల మీద వెల్లకిలా పడుకుని సీలింగ్ వైపు చూస్తూ మాట్లాడుకుంటున్నారు శ్రీజన్, విక్రమ్.. చాలాసేపటిగా. వాళ్లకా రూమ్ బాగా నచ్చింది. కనీసం ఏడాది పాటైనా ఆ రూమ్ మారకూడదని అనుకున్నారు. అంతగా నచ్చింది. అది హాస్టల్ రూమ్‌లా లేదు వాళ్లకు. శ్రీజన్ వాళ్ల గెస్ట్ హౌస్‌లో విక్రమో, విక్రమ్ వాళ్ల గెస్ట్ హౌస్‌లో శ్రీజనో ఉన్నట్లుగా ఉన్నారు. వాళ్లలా మాట్లాడుకుంటూ.. ఎప్పుడు వెళ్లిపోయారో, ఎందుకు వెళ్లిపోయారో తెలీకుండానే దెయ్యాల టాపిక్‌లోకి వెళ్లిపోయారు! దెయ్యాలు ఉన్నాయనీ, లేవనీ వాళ్లేం వాదించుకోలేదు. ఊరికే దెయ్యాల గురించి మాట్లాడుకున్నారంతే. ఆ తర్వాత ఎప్పటికో గాని వాళ్లకు నిద్రపట్టలేదు.‘‘ఖాళీ చేస్తున్నాం’’ అన్నాడు విక్రమ్, ఆ మర్నాడే! ‘‘ఏమైంది?’’ అన్నాడు మేనేజర్. ‘ఏమైంది?’ అని అన్నాడే గానీ, ఏమైందో తెలుసుకోవాలన్న ఆసక్తి అతడిలో లేదు. ‘‘రాత్రి నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. వాళ్లకు తెలిసిన వాళ్లిళ్లు ఖాళీగా ఉందట. ముగ్గురం కలిసి ఉందాం రమ్మన్నాడు’’ అని చెప్పాడు శ్రీజన్. ‘‘అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేం’’ అన్నట్లు చూశాడు మేనేజర్. హాస్టల్ రిసెప్షన్ నుంచి బయటికి వచ్చి నిలుచున్నారు శ్రీజన్, విక్రమ్. వాళ్ల ముఖాల్లో రిలీఫ్ కనిపిస్తోంది. ‘‘సార్.. రాత్రే చెబుదామనుకున్నాను మీకు. ఆ రూమ్ మంచిది కాదు సార్’’ అన్నాడు హాస్టల్లో వీళ్లకు కనిపించిన మనిషి, దగ్గరికొచ్చి. రూమ్మేట్స్ ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. ‘‘ఇప్పుడిది మెన్స్ హాస్టలే కానీ, మొదట్లో ఉమెన్స్ హాస్టల్. ఇప్పుడు మీరు దిగిన రూమ్‌లోనే అప్పుడు ఒకమ్మాయి ఉండేది. తనొక్కతే ఉండేది. ఓ రోజు ఆత్మహత్య చేసుకుంది. అప్పట్నుంచీ ఆ గదిలోనే ఉంటోంది’’ అన్నాడు ఆ మనిషి. ‘‘నువ్వేం చేస్తుంటావ్ ఇక్కడ’’ అన్నాడు విక్రమ్. ‘‘వాచ్‌మేన్‌ని సార్, ఉమెన్స్ హాస్టల్‌గా ఉన్నప్పట్నుంచీ నేనే వాచ్‌మేన్‌ని’’ అన్నాడు ఆ మనిషి. శ్రీజన్, విక్రమ్ ఆ రోజు సాయంత్రం మళ్లీ కలుసుకున్నారు.‘‘నీకెందుకలా అనిపించింది?’’ అడిగాడు శ్రీజన్. ‘‘రాత్రి వాష్‌రూమ్‌కి లేచినప్పుడు అద్దంలో చూశాను’’ అన్నాడు విక్రమ్. ఉలిక్కిపడ్డాడు శ్రీజన్. ‘‘నాకూ ఆ అద్దంలోనే’’ అని చెప్పాడు. ‘‘ఏం చూశావ్.. అద్దంలో?’’ విక్రమ్ అడిగాడు. ‘‘నువ్వు కనిపించావ్’’ అన్నాడు శ్రీజన్. ఈసారి విక్రమ్ ఉలిక్కిపడ్డాడు. ‘‘మరి నీకు?’’ అడిగాడు శ్రీజన్. ‘‘నాకేం కనిపించలేదు’’ అన్నాడు విక్రమ్. ‘‘మరి!’’‘‘అద్దంలో చూసుకుంటున్నప్పుడు నాకు నేనైనా కనిపించాలి కదా’’ అన్నాడు విక్రమ్. - మాధవ్ శింగరాజు -
దెయ్యాలను వదిలారు.. అందుకే ఖాళీ చేశా!
పట్నా : ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విచిత్రమైన వాదనను వినిపిస్తున్నాడు. ఆ భవనంలో దెయ్యాలు ఉన్నాయనే ఖాళీ చేశామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలు నన్ను భవనం ఖాళీ చేయించటానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అందుకే వాళ్లు అందులోకి దెయ్యాలను వదిలారు’ అంటూ తేజ్ పేర్కొన్నాడు. గతంలో నితీశ్ హయాంలో తేజ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ఈ బంగ్లాను కేటాయించారు. దేశ్‌రత్న మార్గ్‌లో ఉన్న ఈ భవనానికి వాస్తు దోషం మూలంగా అప్పుడు తేజ్ మార్పులు కూడా చేయించాడు. అయితే మహాకూటమితో విడిపోయాక ఆ భవనాన్ని ఖాళీ చేయాలంటూ తేజ్‌కు నితీశ్ ప్రభుత్వం నోటీసులు పంపింది. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తల్లి రబ్రీదేవి ఇదే భవనాన్ని ఉపయోగించటం.. అది సెంటిమెంట్‌గా భావించి తేజ్ ఖాళీ చేయలేదు. ఇంతలో ఆర్జేడీ నేతలు ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది. విచారణ పెండింగ్‌లో ఉండగానే ఇలా ఉన్నపళంగా దెయ్యాలున్నాయంటూ భవనాన్ని ఖాళీ చేసేశాడు. అయితే ఇదంతా అతను చేస్తున్న జిమిక్కుగా జేడీయూ అభివర్ణిస్తోంది. అతని సోదరుడు తేజస్వి యాదవ్ ఈ మధ్య తరచూ మీడియాలో కనిపిస్తున్నాడు. అందుకే మీడియా దృష్టిని తనవైపు మళ్లించుకోవటానికే దెయ్యాలంటూ తేజ్ ప్రతాప్ నాటకాలు ఆడుతున్నాడు అంటూ జేడీయూ నేతలు మండిపడుతున్నారు. -
లోక విరుద్ధం
మంచివే అయినా, లోక విరుద్ధంగా కొన్ని పనుల్ని చేయలేం. ‘‘దెయ్యాలు పాత ఇళ్లల్లోనే ఎందుకుండాలి?! కొత్తగా కట్టిన ఇళ్లల్లో ఉండాలని వాటికుండదా?’’ పెద్దగా నవ్వి అన్నాడు వినోద్. వీచిక కూడా నవ్వింది. అయితే అది నవ్వొచ్చి నవ్వడం కాదు. వినోద్ నవ్వాడని నవ్వింది. ఆవలింతలకు ఉన్న గుణమే నవ్వుకీ, భయానికీ ఉంటుంది.. అంటుకోవడం! అలాంటి నవ్వు కావొచ్చది. ఆ రోజు ఉదయమే వాళ్లు ఆ ఇంట్లోకి వచ్చారు. కొత్తగా పెళ్లయినవాళ్లు, కొత్తగా కట్టిన ఇంట్లోకి, కొత్తగా వచ్చి చేరారు. కొత్తగా రావడం అంటే.. కాళ్ల పారాణి ఆరకముందే ఇటు వచ్చేయడం కాదు. అప్పటివరకు ఉన్న ఇంటిని ఖాళీ చేసి, ఈ ఇంట్లోకి వచ్చి చేరారు. పెద్దగా సామాను లేదు. ఇల్లు మాత్రం పెద్దది. ఓనర్ కూడా పెద్దాయన. ఆయన ఒక్కరే ఉంటారు. పక్క పోర్షన్‌లోనే ఉంటారు. వీళ్లున్న పోర్షన్ కొత్తగా కట్టింది. పెద్దాయన ఉన్నది పాతది. ఆ పాత ఇంటి కంటే కూడా పాత మనిషి ఆయన. ఓ డెబ్భై ఏళ్లు ఉంటాయి. తెల్లగా ఉంటారు. తెల్లటి పైజమా లాల్చీ వేసుకుని ఉంటారు. కొత్త ఇంట్లోకి ఆయనే షిఫ్ట్ అయి, పాత ఇంటినే ఈ దంపతులకు ఇవ్వొచ్చు కానీ ఇవ్వలేదు. ‘ఎందుకలా?’ అని వీళ్లు అడగలేదు. ఆయనకెవరూ లేరా అనే డౌట్ కూడా వచ్చింది. అదీ అడగలేదు. ‘‘హైదరాబాద్‌లో ఇంత తక్కువ అద్దెకు ఇలాంటి ఇల్లు దొరకడం మీ అదృష్టం’’ అని చెప్పి వెళ్లిపోయాడు, ఈ ఇంటిని చూపించిన అతను. నిజమే అనిపించింది వినోద్కీ, వీచికకు. ‘‘నిజానికి రెంటు కూడా నాకు అక్కర్లేదు. మంచివే అయినా, లోక విరుద్ధంగా కొన్ని పనుల్ని చేయలేం. రెంటు లేకుండా మీకు నా ఇంటిని ఇవ్వొచ్చు కానీ అది లోక విరుద్ధం. రెంటు లేకుండా నా ఇంట్లో ఉండడం మీకూ లోక విరుద్ధంగానే అనిపించవచ్చు. పద్ధతులు శుభ్రంగా ఉండటం నాకు ముఖ్యం. రెంటు కాదు’’ అన్నారు పెద్దాయన. వీళ్లిద్దరూ ఆశ్చర్యపోయారు. ‘‘ఇల్లు నచ్చింది. మంచిరోజు చూసుకుని వచ్చి చేరతాం’’ అని చెప్పి.. మెట్లు దిగారు.రోడ్డు మీదకు రాగానే.. ‘‘ఆయన మనకు ఇంటిని రెంట్‌కు ఇచ్చినట్లుగా లేదు. మన ఇంటిని చూసుకోడానికి ఆయనకే మనం జీతం ఇస్తున్నట్లుగా ఉంది’’ అన్నాడు వినోద్ నవ్వుతూ. వీచిక మాట్లాడలేదు. ‘‘పర్లేదంటావా?’’ అంది, అతడి చెయ్యి పట్టుకుని. ‘ఏంటి పర్లేదా?’ అన్నట్లు చూశాడు వినోద్. ‘‘కొత్తగా కట్టిన ఇంట్లో.. అలాంటివేమీ ఉండవు కదా?’’ అంది. ‘‘ఎందుకలా అనిపిస్తోంది!’’ అన్నాడు వినోద్. ‘‘అంత పెద్దింటికి రెంట్ ఇంత తక్కువగా ఉంటేనూ! పైగా.. రెంట్ తీసుకోకపోవడం లోక విరుద్ధం కాబట్టే ఆ మాత్రం రెంట్ అయినా తీసుకోవలసివస్తోంది అని కూడా ఆయన అన్నారు..’’ అంది వీచిక. వినోద్ మాట్లాడలేదు. రోడ్డు దాటే ధ్యాసలో ఉన్నాడు. రోడ్డు దాటాక, ఇద్దరూ వెనక్కి తిరిగి ఒకసారి ఆ కొత్తింటి వైపు చూశారు. తెల్లటి బట్టల్లో ఉన్న ఆ పెద్దాయన ఇంటి బయటికి వచ్చి నిలబడి, వీళ్లనే చూస్తూ ఉండడం కనిపించింది. ‘‘ఆయన్నలా చూస్తూంటే, ఆ ఇంట్లో ఏమీ లేవని నాకు అనిపించడం లేదు’’ అన్నాడు వినోద్ నవ్వుతూ. వీచిక మళ్లీ అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. ‘‘బాల్కనీలోంచి ఏదో చప్పుడు వినిపిస్తోంది వినోద్’’ అంది భయంగా వీచిక. అదిగో అప్పుడే అన్నాడు వినోద్ పెద్దగా నవ్వుతూ..‘‘దెయ్యాలు పాత ఇళ్లల్లోనే ఎందుకుండాలి?! కొత్తగా కట్టిన ఇళ్లల్లో ఉండాలని వాటికి మాత్రం ఉండదా?’’ అని.ఆ ఇంట్లో వారికది ఫస్ట్ డే. ఇంట్లోని గదులు విశాలంగా, కంఫర్ట్‌గా ఉన్నాయి. ఉన్న ఒకటీ అరా సామాను హాల్లో ఓ మూలకు ఉంది. కిచెన్‌ని మాత్రం రెడీ చేసుకున్నారు..‘గృహప్రవేశం’ రోజే బయట తినడం ఎందుకని. రాత్రికి కూడా సరిపోయేలా మధ్యాహ్నమే వండేసింది వీచిక. స్నానం అయ్యాక ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. భోజనం అయ్యాక వినోద్‌కి చెప్పింది వీచిక..‘‘పగలు వేసినట్లే.. రాత్రిళ్లు జోక్‌లు వెయ్యకు వినోద్. నాకు భయం’’ అని. తెల్లారి లేవగానే వినోద్ ముఖం అలజడిగా ఉండడం గమనించింది వీచిక. ‘‘ఏంటలా ఉన్నావు?’’ అని అడిగింది.. టీ కప్పు అందిస్తూ. ‘‘ఏం లేదు’’ అన్నాడు వీచికనే చూస్తూ. తేటగా, అందంగా ఉంది ఆమె ముఖం. అక్కణ్ణుంచి నేరుగా ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్లాడు వినోద్. ‘‘మీకేమైనా కనిపించాయా కొత్తింట్లో? నిజం చెప్పండి’’ అన్నాడు స్ట్రయిట్‌గా.‘‘నీకేమైనా అనిపించిందా?’’ అన్నారు పెద్దాయన!‘‘అనిపించడం ఏంటీ! కనిపిస్తేనూ..’’ అన్నాడు వినోద్ భయంగా. పెద్దాయన నవ్వారు. ‘‘నా మనవరాలికి నచ్చని పనేదో చేసి ఉంటావ్. చూద్దాం పద’’ అని, వినోద్‌తో పాటు కొత్తింట్లోకి వచ్చారు.‘‘ఇదిగో.. రాత్రి స్నానం చేశాక, ఒళ్లు తుడుచుకుని ఈ తడి టవల్ని తలుపు మీద కుప్పగా వేసినట్లున్నావ్’’ అన్నారు పెద్దాయన.‘‘వేస్తే?’’ అన్నాడు వినోద్.. పెద్దాయన్ని కళ్లప్పగించి చూస్తూ. ‘‘చెప్పాను కదా.. నా మనవరాలికి ఇలాంటివి నచ్చవని’’ అన్నారు పెద్దాయన. వినోద్ బిగదీసుకుపోయాడు. ‘‘మీ మనవరాలు.. ?’’ అంటూ ఆగిపోయాడు.‘‘యు.ఎస్.లో ఉంది. తనే ప్లాన్ పంపి ఈ ఇంటిని కట్టించుకుంది. ‘పద్ధతిగా ఉండేవాళ్లెవరికైనా రెంట్కివ్వు తాతయ్యా’ అని చెప్పి వెళ్లింది. రాత్రి నీకు జరిగిన దానిని బట్టి చూస్తే.. తన మనసంతా ఈ ఇంటిపైనే ఉన్నట్లుంది’’ అన్నారు పెద్దాయన. వినోద్ మరింత బిగుసుకుపోయాడు. ‘‘ఏంటీ.. రాత్రి జరగడం?’’ అంటూ వచ్చింది వీచిక... పెద్దాయనకు టీ అందిస్తూ. భార్యనే చూస్తున్నాడు.. వినోద్.తేటగా, అందంగా ఉంది ఆమె ముఖం. వినోద్ నమ్మలేకపోతున్నాడు.రాత్రి తన చెంపలు పగలగొట్టింది వీచికే అంటే నమ్మలేకపోతున్నాడు! పెద్దాయన మనవరాలు వీచికలోకి ప్రవేశించిందా?బతికున్నవారికి కూడా ఆత్మలుంటాయా?! ∙మాధవ్ శింగరాజు -
దెయ్యాల్లేవ్ గియ్యాల్లేవ్
ఆ చీకట్లో వాళ్లను అలా చూస్తే దెయ్యాలు ఉన్నాయనే అనుకుంటారు ఎవరైనా. ఇద్దరు మనుషులు వాళ్లు! ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. వాళ్ల మధ్యలో ఖరీదైన గుండ్రటి చెక్క బల్ల ఉంది. ఆ బల్ల మీద ఖరీదైన మద్యం సీసా ఉంది. ఉండడానికైతే ఉంది. ఆ ఇద్దరూ తాగడం లేదు. ఆ ఇద్దరికీ తాగే అలవాటు లేదు. చీకట్లో చాలాసేపటిగా చలనం లేకుండాచలికి గడ్డ కట్టుకుపోయినట్లున్న రెండు పొడవాటి చెట్ల మధ్య.. వాళ్లను మనుషులుగా పోల్చుకోవడం ఎంతటి ధైర్యవంతులకైనా కష్టమే. పైగా వాళ్లు తక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కువగా ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు.. కలర్ టీవీలు అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న కాలం నాటి క్షుద్ర రచయిత. ఇంకొకరు ‘ఘోరై’ అనే పెన్ నేమ్‌తో హాబీగా దెయ్యాల కథలు రాస్తూ, దెయ్యాలు లేవని నిరూపించడానికి ట్రై చేస్తున్న ప్రస్తుత రచయిత. ఘోరై అంటే ఘోస్ట్ రైటర్. ‘‘దెయ్యాలు లేవని నిరూపించడానికి నువ్వెవరు? ఆ పని చేయడానికి విజ్ఞాన వేదిక వాళ్లో, అజ్ఞాన దీపిక వాళ్లో ఉంటారు కదా’’ అన్నాడు క్షుర.. చాలాసేపు ఘోరై చెప్పింది విన్నాక. అప్పటికే నడి రాత్రి దాటింది. ‘‘అది నా ధర్మం అనుకున్నాను సార్’’ అన్నాడు ఘోరై. ‘‘పౌరుడిగా.. పాటించడానికి, అవలంబించడానికి, అనుసరించడానికి పౌర సమాజంలో ఇంకా అనేక ధర్మాలు ఉంటాయి. నువ్వు దెయ్యాలనే ఎందుకు పట్టుకున్నావు?’’ అడిగాడు క్షుర. పెద్దగా ఏడ్చేశాడు ఘోరై. ఆ ఏడుపు మనిషి ఏడుస్తున్నట్లుగా లేదు.‘‘ఊరుకో.. ఎందుకు ఏడుస్తున్నావ్?’’ అన్నాడు క్షుర. అతడి వృద్ధాప్యపు దవడ చలికి వణుకుతోంది. ‘‘పాటించడం, అనుసరించడం, అవలంబించడం.. ఎలా ఉండే భాష ఎలా అయిపోయింది సార్.. మీది! మీ దెయ్యం కథలు చదివి వణికి చచ్చిన జనరేషన్ మాది. మీ మాట ఎంత షార్ప్‌గా ఉండేది! శవం కాలుతున్నప్పుడు పుర్రె ‘టప్’మని పేలినట్లు ఉండేది. అదంతా ఏమైపోయింది సార్. అందుకే ఏడుపొచ్చింది’’ అన్నాడు ఘోరై. ‘‘అవన్నీ గుర్తు చెయ్యకు. ఎందుకొచ్చావ్ చెప్పు’’ అన్నాడు క్షుర విసుగ్గా. క్షుర హర్ట్ అయ్యాడని ఘోరైకి అర్థమైంది. తన కథల్లో దెయ్యాల్ని కూడా చాలాసార్లు హర్ట్ చేశాడు ఘోరై. పాఠకులకు ధైర్యం చెప్పడానికి అతడు చేసిన ఘాతుకం అది. అతడి కథల్లో ఒక్కచోటైనా ‘దెయ్యాల్లేవ్ గియ్యాల్లేవ్’ అనే మాట ఉంటుంది. ఆ మాట టెంపరరీగా మనుషులకు ధైర్యం తెప్పించినా, దెయ్యాలను పర్మినెంట్‌గా హర్ట్ చేస్తుందేమోనన్న ఆలోచన అతడికెప్పుడూ కలగలేదు. ‘‘ఏంటి నీ సమస్య?’’ అడిగాడు క్షుర. ‘‘నన్ను రాయొద్దంటున్నారు సార్’’ అన్నాడు ఘోరై.‘‘ఏం రాయొద్దంటున్నారు? ఎవరు రాయొద్దంటున్నారు?’’ ‘‘దెయ్యాల కథల్ని. పాఠకులు’’‘‘ఎందుకట?’’ అడిగాడు క్షుర. ‘‘పిల్లలు భయపడుతున్నారట’’.‘‘మంచిదే కదా. పిల్లలు ఎవరో ఒకరికి భయపడాలి. తల్లిదండ్రులకు భయపడడం లేదు. టీచర్లకు భయపడం లేదు. దేవుడికి భయపడడం లేదు. దెయ్యం భయమైనా లేకపోతే ఎలా? వాళ్లెలా మంచి పౌరుల్లా ఎదుగుతారు?’’ అన్నాడు క్షుర. ఘోరై మనసు మళ్లీ చివుక్కుమంది. తన గురు సమానుడైన క్షుర నోటి నుంచి ‘మంచి పౌరుల్లా ఎదగడం’ అనే దైవ భాష దిగుమతి అయినందుకు కలిగిన బాధ అది. ‘‘కానీ సార్..దెయ్యాలు ఉన్నాయని రాసి నేను పిల్లల్ని భయపెట్టడం లేదు. దెయ్యాలు లేవని రాసి పిల్లల్ని ధైర్యవంతుల్ని చేస్తున్నాను’’ అన్నాడు ఘోరై. ‘‘పిల్లలకు భయమే లేనప్పుడు వాళ్లకు ధైర్యం ఎందుకు చెప్పాలి?’’ అన్నాడు క్షుర. ‘‘అంటే.. సార్, ముందు భయపట్టి, తర్వాత ధైర్యం చెబుతాను. అదీ నా స్టెయిల్ ఆఫ్ రైటింగ్’’ అన్నాడు ఘోరై.. చేతులు నలుపుకుంటూ.ఘోరై వైపు తీక్షణంగా చూశాడు క్షుర.‘‘మరి పాఠకులకు వచ్చిన ప్రాబ్లం ఏంటి?’’ అన్నాడు. ‘‘దెయ్యాలు ఉంటే ఉన్నాయని చెప్పాలి కానీ, లేనప్పుడు లేవని చెప్పడం ఎందుకు అంటున్నారు సార్.’’‘‘నిజమే కదా’’అన్నాడు క్షుర. ‘‘అసలు ఈ పాఠకులకు ఏం కావాలి సార్. పిచ్చి పట్టిపోతోంది నాకు. రాసింది వద్దంటారు. రాయంది కావాలంటారు! చచ్చి, దెయ్యమై పిల్లల్ని తప్ప మిగతా ఇంటిల్లపాదినీ పీక్కుతినాలన్నంత కోపం వస్తోంది సార్’’ అన్నాడు ఘోరై. అతడి ఆవేదనను గమనించాడు క్షుర. ‘‘ఐ కెన్ అండర్‌స్టాండ్. ప్రతి దెయ్యాల రచయితకీ ఉండే ప్రాబ్లమే ఇది’’ అన్నాడు. ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉన్నారు. ‘ఏం చెయ్యమంటారు సార్’ అన్నట్లు చూస్తున్నాడు ఘోరై.క్షుర అతడికి ఏమీ చెప్పలేకపోయాడు. ముప్పై ఏళ్ల క్రితం తనకొచ్చిన సమస్యే ఇప్పుడీ వర్థమాన రచయితకీ వచ్చింది.‘‘రాస్తే ఏమౌతుందట?’’ అడిగాడు ఘోరైని.‘‘చంపేస్తారట సార్. బెదిరిస్తున్నారు’’‘‘రాయడం మానేస్తే ఏమౌతుంది?’’‘‘చచ్చిపోతాను సార్. రాయకుండా ఉండలేను’’.నిట్టూర్పు విడిచాడు క్షుర. ‘‘టేబుల్ మీద ఉన్న ఈ బాటిల్ చూశావా? ఫుల్ బాటిల్. పక్కనే సోడా, గ్లాసులు. తాగడం నాకు ఇష్టం. కానీ మానేశాను. ఇరవై ఏళ్ల క్రితం క్షుద్ర కథలు రాయడం మానేసిన రోజు నేరుగా వైన్ షాపుకు వెళ్లి, కొనితెచ్చుకున్న బాటిల్ ఇది. అప్పట్నుంచీ కథ రాయలేదు, ఈ బాటిలూ ఓపెన్ చెయ్యలేదు. ఎప్పుడైనా మనసు పీకుతుంది. ఒక్క దెయ్యం కథైనా రాయాలని. రాయకుండా ఉండడం కోసం వెంటనే బాటిల్ బయటికి తీస్తాను. ఈ బాటిల్లో నీకు మందు కనిపిస్తోంది కదా. నాకు దెయ్యం కనిపిస్తుంది. దెయ్యం కథ రాయాలన్న నా కోరికను దెయ్యంలా ఈ సీసాలో బంధించాను నేను’’.. మరోసారి నిట్టూర్పు విడిచాడు క్షుర. ఘోరై ఆ బాటిల్ వైపు చూశాడు. ‘మూత తెరవండీ.. మూత తెరవండీ’ అని బాటిల్ లోపల్నుంచి ఎవరో రోదిస్తున్నట్లుగా అనిపించింది. క్షుర వైపు చూశాడు. అతడి కళ్లు చెమ్మగిల్లి ఉన్నాయి. ‘‘ఈ పాఠకులు మనుషులు కాద్సార్’’ అని పైకి లేచాడు.‘‘పాఠకులను అనకు. మనమే మనుషులం కాదు’’ అని క్షుర కూడా పైకి లేచాడు. ఇద్దరూ పైకి లేచిన రెండు క్షణాలకు, అప్పటి వరకు శిలల్లా బిగుసుకుపోయి ఉన్న ఆ రెండు పొడవాటి చెట్లూ ఊగడం మొదలుపెట్టాయి! -
పరిమళ
దెయ్యాలు ఉన్నాయని ఎవరితోనూ వాదించడు విశ్వాస్. ‘ఉన్నాయి’ అని మాత్రం అంటాడు. అని, అక్కడితో ఆగిపోతాడు. ‘నువ్వు చూశావా? ను..వ్వు... చూ..శా..వా?’ అని ఎవరైనా వాదనకొస్తే నవ్వుతాడు. మనం చూసినవన్నీ, తిరిగి చూపించలేం అని అతడికి తెలుసు. అందుకే నవ్వుతాడు. అదీకాక దెయ్యాల్ని వాదనలోకి లాగడం అతడికి ఇష్టం లేదు. దెయ్యాల్ని అతడు రెస్పెక్ట్ చేస్తాడు. మనుషుల కన్నా ఎక్కువగా! కొన్నాళ్ల క్రితం వరకైతే విశ్వాస్ వాదించేవాడు. దెయ్యాలు ఉన్నాయని కాదు... దెయ్యాలు లేవని! దెయ్యాలు ఉన్నాయని పర్సనల్‌గా అతడికి రూఢీ అయ్యాక.. ఉన్నాయనే వాదన మొదలుపెట్టాలి కదా. పెట్టలేదు!విశ్వాస్‌కి చిన్నప్పట్నుంచీ ఓ అలవాటు ఉండేది. తను ఇష్టపడేవాళ్ల గురించి మాట్లాడడు. ఎవర్నీ మాట్లాడనివ్వడు. అతడికి తన చెల్లి అంటే ఇష్టం. తన కన్నా రెండేళ్లు చిన్న. కుదురుగా బొమ్మలా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఎప్పుడూ అన్నతోనే ఉంటుంది. పెళ్లయిపోయాక ఇప్పుడు భర్తతో ఉంటోంది. బావ తన చెల్లిని బాగా చూసుకుంటాడని విశ్వాస్‌కి తెలుసు. కానీ ఎందుకో అతడు బావతో ఎక్కువగా మాట్లాడడు. బావ దగ్గర చెల్లి గురించి అసలే మాట్లాడడు. బావ.. చెల్లి గురించి మాట్లాడుతున్నా వినడానికి ఇష్టపడడు.ఆరో తరగతిలోనో, ఏడో తరగతిలోనో స్కూల్ రీసెస్లో ఆడుకుంటున్నప్పుడు వేరే తరగతి కుర్రాడొచ్చి విశ్వాస్ చెవిలో ఏదో చెప్పాడు. ఆ చెప్పినవాడి చెంప ఛెళ్లు మనిపించాడు విశ్వాస్. వెంటనే అక్కడి నుంచి వెళ్లి.. ఆ కుర్రాడు ఎవరి పేరైతే చెప్పాడో వాడి చొక్కా పట్టుకుని ముందుకు గుంజి, వాడి దవడ పగల కొట్టాడు. వాడి పన్ను ఊడి రక్తం కూడా వచ్చింది. ఇంత రక్తపాతానికి కారణం.. ‘పరిమళ బాగుంటుంది కదా’ అని ఆ పన్ను ఊడిన వాడు తన క్లాస్‌మేట్‌తో అనడం. ఆ క్లాస్మేట్ వచ్చి విశ్వాస్‌కి చెప్పడం. పరిమళ విశ్వాస్ చెల్లెలు. ఆ స్కూల్లోనే చదువుతోంది.‘‘ఏంటన్నయ్యా.. ఎవర్నో కొట్టావంటా..’’ అని స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్నప్పుడు దారిలో పరిమళ అడిగింది.‘‘వాడు నా పెన్సిల్ కొట్టేశాడు. అందుకే కొట్టాను’’ అని చెప్పాడు విశ్వాస్.చెల్లి భుజంపై ఉన్న స్కూల్ బ్యాగ్‌ని ఆరోజు తనే మోశాడు ఇంటి వరకు. ‘బరువేం లేదన్నయ్యా’ అని చెల్లి అంటున్నా వినకుండా. విశ్వాస్ బ్యాచిలర్. సిటీలో మంచి ఉద్యోగం. మంచి ఉద్యోగం మాత్రమే కాదు.. అతడు ఎక్కడ అద్దెకు ఉన్నా ఆ చుట్టుపక్కల వాళ్లకు అతడు మంచి అబ్బాయి కూడా. రూమ్‌లో ఒక్కడే ఉంటాడు. తక్కువగా మాట్లాడతాడు. ఎక్కువగా చదువుతుంటాడు. ఏవో పుస్తకాలు.. పెద్దపెద్దవాళ్లు రాసినవి. ఉద్యోగానికి వెళ్లడం, రావడం, మెస్‌లో తినడం, నిద్రొచ్చేవరకు పుస్తకాలు చదువుకోవడం. ఇదీ అతడి రొటీన్. కానీ ఎప్పుడూ ఒకే రూమ్‌లో ఉండిపోడు. మారుతుంటాడు! ఏడాదికి రెండు మూడు రూములైనా మారుతుంటాడు. దెయ్యాల భయంతో అనుకోకండి. మనుషులతో పడలేక! అద్దెకిచ్చినవాళ్లు ఆ పైనో, కిందో ఉండి గట్టిగా పోట్లాడుకుంటున్నా చాలు.. విశ్వాస్ తన గదిలో తను ఉండలేకపోయేవాడు. వెంటనే ఇంకో రూమ్‌ని వెతుక్కుని షిఫ్ట్ అయిపోయేవాడు.దెయ్యాలు లేవు అని నమ్మే కాలంలో విశ్వాస్ ఓసారి అప్పటికప్పుడు రూమ్ మారవలసిన పరిస్థితి వచ్చింది. కారణం.. దెయ్యాలు, పిశాచాలు కాదు. ‘వద్దు’ అంటున్నా వినకుండా ఓనర్లు అతడికి ఏదో ఒకటి తినడానికి తెచ్చి పెడుతున్నారు! వాళ్లను తప్పించుకోడానికి రెండుమూడిళ్లు వెతికి నాలుగో దానికి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాడు. ఆ సాయంత్రమే షిఫ్ట్ అయిపోయాడు. షిఫ్ట్ అవడానికి విశ్వాస్ గదిలో పెద్దగా ఏమీ ఉండవు. చాప, బకెట్, బట్టలు, కొన్ని పుస్తకాలు. అంతే. విశ్వాస్‌కి అది కొత్త రూమే కానీ, అవడానికైతే పాత గది. కాకపోతే కాస్త పెద్ద గది. పార్టిషన్‌గా లోపల పిట్టగోడలాంటి చిన్న గోడ. గోడకు అవతల బాత్రూమ్. ఇవతల రూమ్. తనకు సరిపోతుంది.సాయంత్రం నాలుగవుతోంది. రూమ్‌లోకి షిఫ్ట్ కాగానే గోడకు జారిగిల పడి వెల్లకిలా నేలపై పడుకున్నాడు విశ్వాస్. రిలాక్స్ అవడానికి కాదు. ఊరికే అలా పడుకున్నాడు. చాప వేసుకోలేదు. దిండు అలవాటు లేదు.పడుకున్న కొద్దిసేపటికే విశ్వాస్‌లో ఏదో అలజడి. ఊపిరి అందనట్టు అనిపిస్తోంది. పైకి లేవబోయాడు! కానీ లేవలేకపోతున్నాడు. ఎవరో గుండెమీద కూర్చున్న ఫీలింగ్. బలవంతంగా పైకి లేచి గది తలుపుల్ని నెట్టుకుని ఒక్క అంగలో బయట పడ్డాడు. వీధి వెలుగులో అతడి గుండె తేలికయింది. నవ్వుకున్నాడు. అతడికి చిత్రంగా అనిపించింది. మళ్లీ లోపలికి వెళ్లాడు. అతడి మనసు ఏదో తెలుసుకోవాలనుకుంటోంది.అదే ప్లేస్‌లో మళ్లీ అలాగే వెల్లకిలా పడుకున్నాడు. అంతే! అతడి గొంతు బిగుసుకుంది. అతడు మళ్లీ లోపలికి రావడం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఎవరో అతడి గొంతును గట్టిగా నులిమేస్తున్నారు. విడిపించుకోవాలని ప్రయత్నించాడు. తన వల్ల కావడం లేదు. గట్టిగా విదిలించుకుని లేచి, బయటికి పరుగెత్తాడు.ఆ రాత్రి పాత రూమ్‌లోనే పడుకున్నాడు విశ్వాస్. మర్నాడు లేవగానే తను షిఫ్ట్ అయిన కొత్త రూమ్ ఓనర్స్ దగ్గరికి వెళ్లాడు. వాళ్లు ఆ పైఫ్లోర్లోనే ఉంటారు. విశ్వాస్ బెల్లు కొట్టగానే ఇంటావిడ బయటికి వచ్చింది.‘‘రూమ్ మారిపోతున్నానండీ. అడ్వాన్స్ మీరే ఉంచుకోండి’’ అన్నాడు విశ్వాస్.ఆమె ఆశ్చర్యపోయింది. ‘అదేంటి బాబూ.. నిన్ననే కదా చేరావ్’ అంది.జరిగింది చెప్పకూడదనే అనుకున్నాడు విశ్వాస్. కానీ అమె బలవంతం చేసింది. జరిగింది జరిగిన ట్టుగా కాకుండా, ఇంకో విధంగా చెప్పాడు విశ్వాస్. ఆ ఇంకోవిధాన్ని ఆమె సరిగ్గానే ఊహించినట్టుంది. ‘‘మా ఇంట్లో అలాంటివేమీ ఉండవు బాబూ’’ అంది!విశ్వాస్ నొచ్చుకున్నాడు.. ‘అలా అని కాదండీ..’ అన్నాడు. సడన్‌గా అప్పుడే.. వీళ్ల మాటల్ని వింటూ ఉన్న.. ఆ ఇంట్లోని చిన్నపాప వీళ్ల మధ్యలోకివచ్చింది.వచ్చి,‘‘పార్వతక్కేమో మమ్మీ’’ అంది!విశ్వాస్ అదిరిపడ్డాడు. ‘‘ఏయ్.. వెళ్లి ఆడుకోపోవే’’ అని ఆ చిన్నారిని తరిమేసింది ఇంటావిడ.లైఫ్‌లో ఫస్ట్ ౖటñ మ్ దెయ్యాలకు భయపడ్డాడు విశ్వాస్. అయితే ఆ భయం కొద్ది రోజులకే దెయ్యాల మీద ఇష్టంగా మారిపోయింది. అమ్మానాన్న తనను ప్రేమగా చూడ్డం లేదని ఆ ఇంట్లోని పార్వతి అనే అమ్మాయి అప్పటికి కొద్దిరోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుందని తెలిశాక విశ్వాస్‌కి నిజంగానే దెయ్యాలంటేఇష్టం గలిగింది. తన చెల్లి పరిమళ కంటే కూడా ఎక్కువగా అతడిప్పుడు దెయ్యాల్ని ఇష్టపడుతున్నాడు. దెయ్యాలు లేవు అని నమ్మే కాలంలో విశ్వాస్ ఓసారి అప్పటికప్పుడు రూమ్ మారవలసిన పరిస్థితి వచ్చింది. కారణం... దెయ్యాలు, పిశాచాలు కాదు. - మాధవ్ శింగరాజు -
ఆత్మల వేటగాళ్లు షాక్ : థియేటర్లో దెయ్యాలు..!
లింకన్షైర్ : ఓ థియేటర్లో కొందరు ఘోస్ట్ హంటర్లు తీసిన ఫుటేజీ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. లింకన్షైర్లోని ఓల్డ్ నిక్ థియేటర్లో హత్యకు గురైన పాతిక మంది కళాకారుల ఆత్మలు అక్కడే ఉన్నాయన్న అనుమానంతో ఘోస్ట్ హంటర్ల బృందం అక్కడికి వెళ్లింది. దెయ్యాలున్నాయనే అనుమానంతోనే థియేటర్‌ను ఇప్పటికే ఏళ్లుగా పాడుబెట్టారు. దీంతో హంటర్లు అర్థరాత్రి తమ వెంట ఇన్ఫ్రారెడ్ కెమెరాలను తీసుకుని థియేటర్లోకి వెళ్లారు. హత్యకు గురైన ప్రాంతంతో పాటు థియేటర్లో అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి చిన్నదాన్ని చిత్రీకరించుకుని వచ్చారు. మరుసటి రోజు ఆ వీడియోను చూసిన ఆత్మల వేటగాళ్లు షాక్‌కు గురయ్యారు. ఎక్కడైతే హత్య జరిగిందో.. అదే ప్రదేశంలో ఆత్మలన్నీ కలిసి గుమిగూడి ఉండటం వీడియోలో ఉంది. అంతేకాదు.. ఆ సమయంలో ఏదో వస్తువు అటుగా ఎగురుకుంటూ వెళ్లింది. ఈ చిత్రాలను టిమ్ మాథ్యూస్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. థియేటర్లో ఆత్మల ఉన్నాయా? లేదా? అన్న విషయాలను తెలుసుకునేందుకు ‘హ్యూమన్ పెండలం’ పరీక్ష కూడా చేసినట్లు చెప్పారు. -
ఆ దెయ్యాల కంట పడ్డారో.. అంతే?!
దయ్యాలు.. ఆత్మలు గురించి మాట్లాడుతుంటే.. ఇంకా ఈ కాలంలో వాటి గురించి చర్చించే వాళ్లున్నారా? అని వింతగా చూస్తారు. ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే.. అబ్బే అవన్నీ ఉత్తి మాటలని కొట్టి పారేస్తాం. ఆత్మలు, దయ్యాలు అనేవి లేవు.. మన భ్రమ అని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. మీరు నమ్మినా నమ్మకపోయినా.. అక్కడ మాత్రం దయ్యాలున్నాయి. బ్రిటన్.. ఆధునికతకు మారు పేరుగా నిలిచన దేశం. ఇక్కడున్న యార్క్‌షైర్, విల్ట్‌షైర్, నర్ఫోక్, కుంబ్రియా, స్టాఫోర్డ్‌షైర్, ఎడ్విన్ బర్డ్, ఇజిల్ ఆఫ్ వెయిట్, లండన్ ప్రాంతాల్లో దయ్యాలు విరివిగా తిరుగుతున్నాయి. ఏదో ఒకటిరెండు కాదు.. వందల సంఖ్యలో ఆత్మలు, దయ్యాలు సంచరిస్తున్నాయట. యార్క్‌షైర్ : ఈ ప్రాంతాన్ని బ్రిటన్‌లో దయ్యాల అడ్డాగా పిలుస్తారు. ఇక్కడ రమారమీ 607 దయ్యాలను ప్రజలు గుర్తించారట. బ్రాడ్‌ఫోర్డ్‌లోని గోల్ఫ్ కోర్ట్ దగ్గర రాత్రి సమయాల్లో దయ్యాలు సంచరిస్తాయట. తూర్పు యార్క్‌షైర్ ప్రాంతంలోనూ.. అతీత శక్తులు తిరుగాడుతాయట. ఈ ప్రాంతంలో 1960-70 మధ్యనివసించిన ఒక దొంగ సాధువు.. అనేకమందిని హత్య చేశాడట. కొన్నాళ్లుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడట. దొంగ సాధువు చేతిలో అమాకయంగా హతులైన వారు.. చివరకు దొంగ సాధువు కూడా దయ్యాలై ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నారని ఒక కథనం ఉంది. ఇది నిజమని చాలా మంది విశ్వాసం. విల్ట్‌షైర్: విల్ట్‌షైర్, నోర్ఫోక్ ప్రాంతంలోని అడవుల్లో సుమారు 28 దయ్యాలు తిరుగుతున్నాయట. ఇవి చాలా వరకు నల్లటి భీకరమైన కుక్కలా కనిపిస్తాయని.. మనిషి కనిపిస్తే.. వెంటాడి వేటాడతాయని ప్రజలు చెబుతున్నారు. స్టాఫొర్డ్షైర్ : ఈ ప్రాంతంలో 2007 నుంచి భీకరమైన తోడేలు రూపంలో దయ్యాలు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వీటిపైన వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ఘోస్ట్ క్లబ్ వారు పరిశోధనలు సైతం చేశారు. ఎవరైనా రాత్రి పూట ఒంటరిగా నడుస్తున్న సమయంలో.. ఈ తోడులు వెనకగా వస్తుందట.. మనిషి దానిన గమనిస్తే.. బిగ్గరగా అరిచి.. భయపెడుతుందట. లండన్ : గ్రేటర్ లండన్‌లోనూ ప్రజలకు ఇటువంటి అనుభవాలున్నాయట. సుమారు 547 మంది ప్రజలు వీటి బారిన పడి ఇబ్బందులు పడ్డారట. -
ఆ దెయ్యాల కంట పడ్డారో.. అంతే?!
-
దేశాధ్యక్షుడికి దెయ్యాల భయం!
రియో డి జెనిరో : బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమర్‌కు దెయ్యాల భయం పట్టుకుంది. దీంతో వెంటనే తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి దేశ ఉపాధ్యక్షుడి అధికార నివాసంలోకి మారారు. అధ్యక్ష భవనంలో అడుగు పెట్టినప్పటి నుంచి కంటి నిండా నిద్రలేకుండా పోయిందని, ఆ భవంతి ఎంత విలాసవంతంగా ఉన్నా అందులో అసాధారణమైనవి ఏమో ఉన్నట్టు మైఖేల్ టెమర్ పేర్కొన్నారు. ఆ ఇంట్లో దెయ్యాలున్నాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడి అధికార నివాసమైన అల్వొరాడా ప్యాలెస్ భయానకంగా ఉండటంతో అక్కడి నుంచి దేశ ఉపాధ్యక్షుడి భవనమైన జబురు ప్యాలెస్‌కు మకాం మార్చారు. తన భార్య మార్సెలా కూడా అధ్యక్షభవంతి వింతగా అనిపిస్తోందని తెలిపినట్టు టెమర్ పేర్కొన్నారు. దిల్మారౌసెఫ్ రోసెఫ్ సస్పెండ్ అయిన తర్వాత మైఖేల్ టెమర్ బ్రెజిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
ఘోస్ట్ విలేజ్ కుల్ధారా
ఊరినిండా మనుషులు ఉంటారు. అలా మనుషులు ఉంటేనే మనం దాన్ని ఊరు అంటాం. కానీ ఊరునిండా దెయ్యాలు ఉన్న సంగతి మీరెప్పుడైనా విన్నారా? అవును ఆ ఊరంతా దెయ్యాలే ఉన్నాయి. అక్కడ చూడటానికి మనుషులు ఎవరూ కనపడరు. ఖాళీ ఇళ్లు, పెద్ద పెద్ద పాడుబడ్డ గోడలు... ఆ ఊళ్లో దర్శనమిస్తాయి. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం కదా.....! సినిమాలనే తలదన్నే విధంగా ఉండే ఈ నిజజీవిత కథను మీరూ తెలుసుకోండి. అజయ్, సురేంద్రలు ఇద్దరు స్నేహితుడి పెళ్లికోసం జైసల్మేర్ బయలుదేరారు. కొంచెం దూరం ప్రయాణించాక రాత్రి 8 గంటలకు హైవే పక్కనున్న దాబాలో భోంచేసి మరల ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అప్పుడు రాత్రి 11 గంటలు కావస్తోంది. కారులో ఎంచక్కా పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ వెళుతున్న వారు దారితప్పారు. కొంచెం దూరం వెళ్లాక ఒక ముసలావిడ కనిపించడంతో దారి చెప్పమని అడిగారు. ఆమె చెప్పిన దారి గుండా కొద్ది దూరం వెళ్లాక గ్రామ ముఖద్వారం కనపడింది. గ్రామంలోకి ప్రవేశించి కారును ముందుకు నడుపుతున్నాడు అజయ్. కానీ అక్కడ ఎవరూ మనషులు ఉండేలా అనిపించలేదు వారికి. అక్కడ అన్ని పాడుబడ్డ బంగాళాలు, దుమ్ము, ధూళితో నిండి ఉన్నాయి. అనుమానం వచ్చి ఇద్దరు కారు దిగారు. వెనుకవైపు నుంచి ఎవరో వస్తున్నట్లు అలికిడి వినబడగానే తిరిగి చూశారు. ఒక పాతికేళ్ల మహిళ నీళ్లు మోసుకుంటూ వెళుతోంది. ఆమెను పలకరించిన ఉలూకూ పలుకూ లేకుండా పక్కనే ఉన్న సందులోకి వెళ్లింది. ఆమెను అనుసరించిన అజయ్, సురేంద్రలకు ఆ మహిళ మళ్లీ కనపడలేదు. ఎక్కడికి వెళ్లిందా అని ఆమెకోసం వెతుకుతుండగానే వారికి చిన్నగా ఏడుపు వినిపించింది. అది కాస్త పెద్దగా అయి భరించలేనంత శబ్దంతో మహిళ ఏడుస్తోంది. తీవ్ర భయానికి లోనైన వారు కారు వద్దకు పరుగెత్తుకొచ్చారు. కారులో కూర్చొని స్టార్ట్ చేయబోయినా ఫలితం లేకపోయింది. మహిళ ఏడుపు తగ్గించి నవ్వడం మొదలుపెట్టింది. అజయ్, సురేంద్రలు ఇద్దరు భయంతో హైవేవైపు పరిగెత్తడం ప్రారంభించారు. ఎదురుగా వస్తున్న లారీని ఆపి అందులోకి ఎక్కారు. చెమటలు, భయంతో వణుకుతున్న ఇద్దరిని చూసి ఏమిజరిగిందని డ్రైవర్ అడిగాడు. విషయం చెప్పడంతో మీరు కుల్ధారా వెళ్లారా అని లారీ డ్రైవర్ అడిగాడు. అవును అనడంతో అక్కడ మనుషులు ఎవరూ ఉండరు, 300 ఏళ్లుగా అక్కడ దెయ్యాలే ఉంటున్నాయని డ్రైవర్ చెప్పడంతో ఇద్దరు భయంతో వణికిపోయారు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో మాత్రమే చూస్తాం కానీ ఇది నిజం. రాజస్థాన్‌లోని కుల్ధారా గ్రామానికి వెళితే ఇలాంటి సన్నివేశాలు బోలెడు చూస్తాం. కుల్ధారా కథేంటి? రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్‌కి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుల్ధారా. ఒకప్పుడు ఊరినిండా జనంతో, అందమైన గృహాలతో కళకళలాడేది.కానీ ఇప్పుడు ఎడారితో సమానంగా ఉంది. మొండి గోడలు తప్ప ఇళ్లు లేవు. అంతుపట్టని నీడలు, వికృతమైన అరుపులు, ఎవరివో తెలియని అడుగుల జాడలు తప్ప మనుషుల ఉనికి లేదు. మూడు వందల ఏళ్ల క్రితం కుల్ధారాలో పలివాల్ అనే బ్రాహ్మణ కులస్థులు మాత్రమే ఉండేవారు. ఒకరోజు ఆ గ్రామానికి ప్రధాని సలీమ్ సింగ్ (అప్పట్లో గ్రామలకు ప్రధానులని ఉండేవారు. వారిదే ఆధిపత్యం)!కుల్ధారా గ్రామ పెద్దల్లో ఒకరి కుమార్తెను సలీమ్ ఇష్టపడ్డాడు. కానీ ఆమె అతణ్ని ఇష్టపడలేదు. అయినా ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు సలీమ్. అది తట్టుకోలేక ఊరివాళ్లు తిరగబడ్డారు. తమ కులం కానివాడికి అమ్మాయిని ఇవ్వలేమని, దూరంగా ఉండమని హెచ్చరించారు. రగిలిపోయిన సలీమ్ ఊరివాళ్లపై పగబట్టాడు. అధిక పన్నులు విధించి హింసించాడు. అయినా ఎవరూ లొంగకపోవడంతో ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలని ప్లాన్ వేశాడు. అతనికి ఎదురు తిరిగి పోరాడటం మాటలు కాదు. అందుకే అందరూ కలసి రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు. వెళ్లేముందు... ఆ ఊరు ఇక నివాసయోగం కాని విధంగా నాశనమైపోతుందని శపించారట. అందుకే కుల్ధారా అలా అయిపోయిందని అంటారు. అయితే ఈ కథలో కొంతే నిజం ఉందని, గ్రామస్థులు ఊరు విడిచి వెళ్లిపోలేదని, రాత్రికి రాత్రే సలీమ్ సింగ్ అందరినీ చంపి పాతి పెట్టేశాడని, వాళ్లంతా దెయ్యాలై ఊరిని పట్టి పీడించడం మొదలు పెట్టారనేది మరో వాదన. అందరికీ భయానక అనుభవాలు ఏది నిజమో తెలుసుకోవాలని, రాత్రికి రాత్రే జనమంతా ఏమైపోయారో కని పెట్టాలని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఎవరి జాడ తెలియకపోవడంతో మిన్నకుండిపోయారు. తర్వాత కొందరు ఇతర ప్రాంతాల నుంచి ఈ గ్రామంలో నివసించడానికి వచ్చారు. కానీ వారి వల్ల కాలేదు. అర్ధరాత్రి వేళల్లో ఎవరో తలుపులు బాదేవారు. తీసి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఎవరో గట్టిగట్టిగా అరిచేవారు. ఏడ్చేవారు, నవ్వేవారు. ఏవేవో నీడలు వెంట తిరుగుతూండేవి. ఏవేవో రూపాలు కనిపించి భయపెట్టేవి. దాంతో అందరూ ఊరు వదిలి పారిపోయారు. క్రమంగా ఈ గ్రామంలో జరుగుతున్నవన్నీ బయటకు తెలియడంతో ఎవ్వరూ అక్కడకు వెళ్లే సాహసం చేయలేపోయారు. ఒక్కోసారి ఆ ఊరి పక్క నుంచి వెళ్లేవాళ్ల వాహనాలు హఠాత్తుగా ఆగిపోయేవి. తర్వాత వారికి అక్కడ భయానక అనుభవాలు ఎదురయ్యేవి. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నవారంతా కలిసి కుల్ధారాను ఘోస్ట్ విలేజ్ గా తేల్చారు. ఆ ముద్ర నేటికీ అలానే ఉంది. దాన్ని చెరిపే ప్రయత్నం ఎవ్వరూ చేయడం లేదు. ప్రభుత్వం ఇప్పుడు దీన్ని పర్యాటక ప్రాంతంగా మార్చింది. రాత్రి అయితే మాత్రం ఇక్కడ ఎవరూ ఉండరు. – సాక్షి. స్కూల్ ఎడిషన్ -
మా వంశ దెయ్యాంకురం!
‘‘దెయ్యాలు ఫేస్‌పౌడర్ వాడతాయా?’’ అని మా రాంబాడుగాడిని అడిగాడు మా బుజ్జిగాడు. వాడీమధ్య హారర్ సినిమాలు టూమచ్‌గా చూస్తున్నాడు. దాంతో దెయ్యాల గురించి తరచూ తరచి తరచి అడుగుతున్నాడు. నన్నేమైనా అడిగితే ‘‘చల్... దెయ్యం లేదు... భూతం లేదు... ఫో’’ అంటూ కసురుకుంటాను కదా. అందుకే వాడు మా రాంబాబుగాడిని తగులుకున్నాడని నాకు అనిపిస్తోంది. అన్నట్టు... మా బుజ్జిగాడి ప్రశ్నకు రాంబాబు గాడు ఏం చెబుతాడా అని నాకూ అనిపించింది. దాంతో నేనూ ఆసక్తిగా వినడం మొదలు పెట్టాను. ‘‘ఏమోరా! ఐడియా లేదు. అవి తెల్లచీరలైతే కడతాయి. సినిమాల్లో చూసిన దాని ప్రకారమైతే కొన్ని దెయ్యాల ముఖం పౌడరు పూసినట్టుగా, మరీ ఎక్కువ తెల్లగా ఉంటుంది. కానీ పౌడరు పూసినందువల్ల అలా ఉంటుందా లేక వాటికి కావాల్సిన పౌష్టికాహారమైన రక్తం తగినంత దొరకక రక్తహీనత వచ్చిందా అన్న విషయంలో నాకు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు. అవి డాక్టర్ దగ్గరికి పోయి బ్లడ్‌టెస్ట్ చేయించినట్టుగా మనకెక్కడా ఎప్పుడూ సమాచారం ఎప్పుడూ లేదు. కాకపోతే చంద్రముఖి సినిమాలో చూసినదాన్ని బట్టి అందులోని దెయ్యం మాత్రం కాటుకను కాస్త ఓవర్‌గా పూసుకుంటుంది. కాబట్టి... కాటుకా పౌడర్ విషయానికి వస్తే... అవి కాటుకను విరివిగా వాడతాయని తెలుసుగానీ పౌడర్ విషయంలో మాత్రం మనకో స్పష్టత లేదురా’’ అని ఆన్సర్ ఇచ్చాడు రాంబాబుగాడు. ‘‘ఎలాగూ అనీమియాతో రక్తం తక్కువైనందువల్ల ముఖం తెల్లగానే ఉంటుంది కదా. ఆల్రెడీ ఫెయిర్‌గా ఉండే ముఖానికి మళ్లీ ఫేస్‌పౌడరు ఎందుకు? మరి దెయ్యాలు పళ్లు తోముకోడానికి పేస్ట్ వాడతాయంటావా?’’ మరో ప్రశ్నను సంధించాడు బుజ్జిగాడు. ‘‘అవి పండ్లూ, ఫలాలు తినే దాఖలా లేదు. డ్రాక్యులా సినిమాల ప్రకారం... రక్తం పీల్చడానికి వాటికి రెండు కోర పళ్లు చాలు. కేవలం రెండు పళ్ల సంరక్షణ కోసం అంతలా టూత్ పేస్టు అవసరం లేదు. అయినా ఆడ దెయ్యాలు జుట్టు విరబోసుకున్నా అప్పుడే షాంపూ చేసుకున్నట్లుగా, చక్కగా తల దువ్వుకొని ఉంటాయి. మగదెయ్యాలు మాత్రం చింపిరి జుట్టుతో చిందరవందరగా, చిరాగ్గా కనిపిపిస్తుంటాయి. దీని ప్రకారం ఆడదెయ్యాలు స్వచ్ఛభారత్ నినాదాన్ని చక్కగా పాటిస్తూ పరిశుభ్రంగా ఉంటాయనీ, మగదెయ్యాలు ఏమాత్రం తమ నీటుగా కనిపించవనీ అర్థమవుతోంది కదా’’ అని బదులిచ్చాడు వాడు.ఇలా మాట్లాడుతుండగానే రాంబాడు గాడి మొబైల్ మోగింది. ఏదో మాట్లాడి పెట్టేయగానే మళ్లీ మావాడు ప్రశ్నలతో తయారయ్యాడు. ‘‘ఇంతకీ దెయ్యాలు సెల్‌ఫోన్ వాడుతుంటాయంటావా?’’ ఆసక్తిగా అడిగాడు.‘‘ఏమోరా... మామూలుగా స్వీట్ వాయిస్‌తో ఉండే అమ్మాయిలు కూడా తాము దెయ్యాలయిపోయాక చాలా బొంగురుగొంతుతో మాట్లాడతాయని మనకు తెలుసు. మరి అవి సెల్‌ఫోన్ వాడతాయా, వాట్సాప్ మెసేజీలు పెడతాయా, మెయిల్స్ పంపుకుంటాయా అన్న విషయం మనకు ఇదమిత్థంగా తెలియదు. కాకపోతే లేటెస్ట్గా నేను చూసిన వాల్‌పోస్టర్‌లో ఒక మగదెయ్యం చుట్టూ నోట్లో పెట్టుకొని స్మోకింగ్ చేస్తోంది. దానికోసారి ‘ఈ నగరానికేమైంది... బహిరంగ ధూమపానానికి తప్పదు జరిమానా’ అనే ఆ సినిమా ట్రైల్పార్టీను చూపించాలని నాకు అనిపించింది రా’’ అన్నాడు రాంబాబుగాడు. మావాడు అడుగుతుంటే నాకూ ఓ మాట తోచింది. దెయ్యాలకు డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగనవసరం లేదు. వాటికి ఏటీయం క్యూలలో నిలబడాల్సిన ఖర్మ పట్టలేదు. వాటికి అలాంటి అగత్యం ఏమీ లేదు కదా అనిపించింది. ‘‘అయితే ఈ లెక్క ప్రకారం... దెయ్యాలకు చాలా సౌకర్యాలు ఉన్నాయి. అవి మొబైల్ రీఛార్జీలు చేయించనక్కర్లేదు. వైఫైలు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫేస్పౌడర్లు రాసుకోనక్కర్లేదు. పేస్టులూ, బ్రష్షులూ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనలా మంచి మంచి బిల్డింగులు కూడా అక్కర్లేదు. వాటికి పాడుబడ్డ భవనాలే చాలు. ఇక దెయ్యాల ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించినా... పాపం... ఏదో రక్తహీనతలాంటి జబ్బులే తప్ప... వాటికి చూపు పవర్ తగ్గిన దాఖలా లేదు. కనీసం కళ్లజోడు పెట్టుకున్న దెయ్యం ఒక్కటీ లేదు. మరి నేను చూసిన హారర్ సినిమాల ప్రకారమైనా... నువ్వు చూసిన తెలుగు సినిమాల లెక్కలోనైనా ఒక్క దెయ్యమూ మనం పడే కష్టాలను పడటం లేదు కదా. దాన్ని బట్టి వాటి లైఫే బాగుంది కదా. మరి అవి అంత హాయిగా బతుకుతూ ఉంటే... అందరూ దెయ్యాలంటే చిన్నచూపు చూస్తుంటారు. దెయ్యం బతుకును చూసి భయపడుతుంటారు?’’ లాజికల్‌గా అడిగాడు బుజ్జిగాడు.అంతంత పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు చేసే మా రాంబాబుగాడు కూడా వాడి ప్రశ్నకు ఏమీ ఆన్సరు చెప్పకుండా అవాక్కయిపోయాడు. కానీ ఎప్పుడూ ఏ వాదనలోనైనా సరే... తానే గెలిచే మా రాంబాబు గాడు మావాడి ప్రశ్నలను తట్టుకోలేకపోయాడు. ‘‘ఒరేయ్... పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని తెలుసుగానీ... మీవాడు పుట్టకముందే పరిమళిస్తున్నాడేమిట్రా. ఏదేమైనా గానీ వీడికి స్వజాతి ఫీలింగు ఎక్కువే’’ అంటూ మావాడి మీద తన అక్కసంతా వెళ్లగక్కాడు. – యాసీన్ -
దెయ్యాలున్నాయి జాగ్రత్త!
‘‘ఈ సృష్టిలో దేవుళ్లు ఉన్నది నిజమైతే.. దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం’ అనే అంశంతో ‘హ్యాక్డ్ బై డెవిల్’ (హెచ్‌బిడి) తెరకెక్కించాం. హారర్ – థ్రిల్లర్‌లా సాగుతుందీ చిత్రం’’ అన్నారు దర్శకుడు కృష్ణకార్తీక్. మేఘన, సంతోషి, సల్మాన్ ముఖ్య పాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్. వై ఈ చిత్రం నిర్మించారు. మహిమదన్ యం.యం. సంగీతం అందించిన పాటల సీడీలను మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేశారు. ‘‘కృష్ణకార్తీక్ పక్కా ప్లానింగ్ వల్ల సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి’’ అని నిర్మాత తెలిపారు. మహిమదన్, నిర్మాత లయన్ సాయివెంకట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్ గౌడ్. వై. -
దెయ్యాలు భయపడితే!
హారర్ ప్లస్ కామెడీ... నటీనటులకు మాంచి విజయాలు అందిస్తూ, దర్శక–నిర్మాతలకు కాసులు కురిపిస్తున్న హిట్ ఫార్ములా ఇది. ఇప్పుడు ఢిల్లీ భామ తాప్సీ కూడా ఇటువంటి తెలుగు సినిమాలో నటించనున్నారు. కానీ, ఆమె చేయబోయేది కామెడీ హారర్ సినిమా. మాములుగా మనోళ్లు ‘హారర్ కామెడీ’ అంటుంటారు కదా.. రివర్స్‌లో ‘కామెడీ హారర్’ అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు మతలబు. రొటీన్‌గా ప్రతి హారర్ కామెడీ సినిమాలోనూ దెయ్యాలను చూసి మనుషులు భయపడుతారు. కానీ, ఇందులో మనుషులను చూసి దెయ్యాలు భయపడతాయట! రెగ్యులర్ ఫార్ములాకి రివర్స్‌లో పూర్తి వినోదాత్మక చిత్రమిది. ‘పాఠశాల’ ఫేమ్ మహి వి.రాఘవ్ ఈ కొత్త జానర్‌ను తెలుగుకి పరిచయం చేయబోతున్నారు. ‘భలే మంచిరోజు’ నిర్మాతలు విజయ్‌కుమార్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఆల్రెడీ తాప్సీకి కథ చెప్పడం, ఆమె అంగీకరించడం జరిగాయి. తాప్సీ ముఖ్యతారగా నటించనున్న ఈ సినిమాలో జయప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్లు కీలక పాత్రలు చేయనున్నారు. ‘‘ఈ నెల 22న తాప్సీ హైదరాబాద్ వస్తారు. దర్శకుడితో ఆమె తన లుక్ గురించి డిస్కస్ చేయడంతో పాటు సినిమాకి సంతకం చేస్తారు’’ అని సమాచారం. ఆత్మలు, దెయ్యాలు మనుషులను భయపెట్టడమనేది ప్రతి హారర్ కామెడీ సినిమాలోనూ చూస్తున్నాం. బట్ ఫర్ ఏ ఛేంజ్... మనుషులను చూసి దెయ్యాలు, ఆత్మలు భయపడితే? తాప్సీ ముఖ్యతారగా ‘పాఠశాల’ ఫేమ్ మహి వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా మూలకథ ఇదేనట!! -
నమ్మే ధైర్యం మీకుందా?
ఘోస్ట్ దెయ్యాల గురించి మాట్లాడుకునే ధైర్యం భయస్థులకు మాత్రమే ఉంటుంది! సో... భయం అన్నది ధైర్యవంతుల క్వాలిటీ. ఇంతకీ దెయ్యాలన గుర్తించడం ఎలా? మీ చుట్టుపక్కల దెయ్యం తిరుగుతోందని కనిపెట్టడం ఎలా? కొన్ని హింట్స్. ►మీరున్న చోట హఠాత్తుగా టెంపరేచర్ డౌన్ అయితే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ► మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎవరో తాకినట్లు అనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నట్లనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►అకారణంగా మీ చర్మంపై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీరు పెట్టని చోట పెట్టని వస్తువు కనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ► మీ కంటి చివర్ల నుంచి నీడలేవో కదలినట్లు అనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీ కనుచూపు మేరలో ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎవరో పేరు పెట్టి పిలిచినట్లు అనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►బల్బులు వాటంతటవి వెలిగితే, ఫ్యాన్లు వాటంతటవి తిరగితే, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాటంతటవి పనిచేయడం మొదలుపెడితే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరో మెట్లు ఎక్కుతున్న లేదా దిగుతున్న చప్పుడు గానీ వినిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►గోడలపై, గ్లాసులపై అంతుచిక్కని (మానవాతీత) చేతి గుర్తులు కనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీ వెనుక ఎవరూ లేకున్నా, మీరు అద్దం చూసుకుంటున్నప్పుడు అద్దంలో వేరెవరో కనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►ఇరుకైన గోడల నడుమ ఎవరో నడుస్తున్నట్లు చప్పుడు వినిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీకు మాత్రమే వినిపించేలా ఎవరైనా పెద్దగా ఏడుస్తుంటే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►ఏదో చెప్పలేని వాసన.. అది మంచిదైనా, చెడ్డదైనా ముక్కు పుటాలకు తాకితే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీ పిల్లి గానీ, కుక్క గానీ అకారణంగా ఒకేవైపు చూస్తూ, బెదురుముఖం పెట్టి అలా నిలబడిపోతే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ఇవన్నీ... వదిలెయ్యండి. ఇప్పుటికిప్పుడు మీరు దెయ్యాన్ని చూడాలనుకుంటున్నారా? ఓసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి. చూసుకున్నారా? దెయ్యం కనిపించలేదా?! అయితే... మీరు చూశారని చెప్పి దెయ్యం వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి ఉంటుంది. (సరదాగా రాసిన ఐటమ్ ఇది. చప్పుడు చెయ్యకుండా పక్కవాళ్లకివ్వండి) -
అక్కడ సైడివ్వకుంటే ఇంతే...
ఆఫీస్‌లో లేటవడంతో అప్పుడే చిరాక్కుగా కారులో ఇంటికి బయల్దేరారు ఓ వ్యక్తి. అసలే రాత్రి.. ఆపై అమావాస్య కావడంతో చిమ్మచీకట్లో భయంభయంగా త్వరగా ఇంటికి వెళ్లాలని వేగంగా కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఇదే సమయంలో అతని ముందర ఒక కారు నెమ్మదిగా వెళ్తూ ఉంది. ఎంత హారన్ మోగించినా సైడ్ ఇవ్వడం లేదు. దీంతో హై బీమ్ లైట్లను వేగంగా డిప్ చేశాడు. ఇక అంతే ఆ వ్యక్తి ముందర దయ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం చైనాలో జరుగుతోందిదే. వెనుక నుంచి వచ్చి హై బీమ్ లైట్లతో విసికించే డ్రైవర్ల పనిపట్టేందుకు అక్కడ కార్ల వెనుక అద్దాలపై భయం కలిగించే వింత వింత ఆకారాలను స్టిక్కర్లుగా వేయిస్తున్నారు. వెనుక నుంచి హై బీమ్లైట్లు వేయగానే అకస్మాత్తుగా దయ్యాల రూపంలోని ఆకారాలు దర్శనమిస్తున్నాయంటా! వాటిని చూసిన డ్రైవర్లు బెంబెలెత్తిపోతున్నారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారని సమాచారం. ఆ విధంగా స్టిక్కర్లు వేయించుకోవడం తప్పేమి కాదని తద్వారా ప్రమాదాలు సంభవిస్తే అప్పుడు చర్యలు తీసుకుంటామని వారు అంటున్నారు. -
బంగళాలో మంచి దెయ్యం!
ఈ లోకంలో చెడ్డ దెయ్యాలు మాత్రమే ఉండవు, మంచి దెయ్యాలు కూడా ఉంటాయంటున్నారు బాలాజీ నాగలింగం. ఆయన సమర్పణలో విసినీ స్టూడియో పతాకంపై వి.లీనా నిర్మించిన చిత్రం ‘రాణిగారి బంగళా’. ఆనంద్ నందా, రష్మీ గౌతమ్ జంటగా నటించారు. డి.దివాకర్ దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బాలాజీ నాగలింగం మాట్లాడుతూ - ‘‘హారర్ కామెడీ చిత్రమిది. ‘రాణిగారి బంగళా’లో మంచి దెయ్యం ఏం చేసింది? ఆ బంగళాలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి? అనేది కథ. రష్మి సింగిల్ టేక్ ఆర్టిస్ట్. చాలా బాగా నటించింది. భవిష్యత్తులో శ్రీదేవి అంత పేరు తెచ్చుకుంటుందామె. సీనియర్ నటులు శివకృష్ణ కాటి కాపరి పాత్రలో కనిపిస్తారు. చిత్రంలో రెండే పాటలున్నాయి. ‘ప్రేమకథా చిత్రమ్’ దర్శకుడు ప్రభాకర్‌రెడ్డి ఛాయాగ్రహణం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. కాశీ విశ్వనాథ్, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: వి.లీనా, సహ నిర్మాత: శ్రీనివాసరావు, సంగీతం: ఈశ్వర్ పేరవల్లి. -
ఈ ఫొటోలో దెయ్యం ఎక్కడ ఉంది?
సమ్‌థింగ్ స్పెషల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటో 1900 సంవత్సరంలోనిది. ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ నగరంలో ఒక మిల్లులో పనిచేసే యువతులందరూ కలిసి దిగిన ఫొటో ఇది. అది సరే, మరి ఈ దెయ్యం గోల ఏమిటి? విషయం ఏమిటంటే, ‘దెయ్యాలు ఉన్నాయి’, ‘లేనే లేవు’ అనుకునే వాళ్లు ఈ ఫొటోను చూస్తూ రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎవరి వాదనలు వారు గట్టిగా వినిపిస్తున్నారు. గోల ఎక్కడ మొదలైందంటే... మూడో వరుసలో చివరన కూర్చున్న అమ్మాయి భుజం మీద చెయ్యి కనిపిస్తుంది. వ్యక్తి మాత్రం కనిపించరు. ఇది చాలదా దెయ్యం ఉందని చెప్పుకోవడానికని ఒక వర్గం, ఫొటో ట్రిక్ అని మరో వర్గం హీట్ హీట్‌గా వాదులాడుకుంటున్నాయి! -
దెయ్యం కట్టిన ఆలయం!
బొమ్మావరలో ఆకట్టుకుంటున్న సుందరేశ్వరదేవాలయం రాష్ట్రంలోనే ఎత్తై శివలింగం 600 సంవత్సరాల చరిత్ర దొడ్డబళ్లాపురం: దెయ్యాలు ఆలయాన్ని నిర్మించాయా? అంటే అవునంటున్నారు కర్ణాటక రాష్ట్రంలోని బొమ్మావర వాసులు. ఇది నిజమో, అబద్దమోకానీ ఈ ఆలయాన్ని చూడాలంటే దొడ్డబళాపురం-దేవనహళ్ళి మార్గం మధ్యలో వచ్చే బొమ్మావర వెళ్లాల్సిందే. ఈ గ్రామంలోనే ఉంది దెయ్యాలు కట్టిన సుందరేశ్వర దేవాలయం. మామూలుగా అన్ని దేవాలయాలపై మనకు కనిపించేది దేవుళ్ళ రాతి శిల్పాలు, కామసూత్ర భంగిమలు లాంటివి. అయితే ఈ దేవాలయంపై దెయ్యాల ప్రతిమలు కనిపిస్తాయి. రాక్షసుల నమూనాలు చెక్కబడి ఉన్నాయి. దేవాలయానికి సంబంధించి గ్రామంలోని వృద్ధులను కదిలిస్తే ఆసక్తికర సంగతులు తెలుస్తాయి. ఈ దేవాలయం సుమారు 600 సంవత్సరాల క్రితం నిర్మించిందట. ఆ కాలంలో మహా మాంత్రికుడిగా పేరుగాంచిన దెయ్యాలబుచ్చయ్య ఈ గ్రామంలో దేవాలయం నిర్మించాలని తీర్మానించి నిర్మాణ పనులు చేపట్టారు. అయితే గ్రామంలో అప్పుడు దెయ్యాలు ఎక్కువగా సంచరించేవట. పగలు కట్టిన దేవాలయాన్ని రాత్రికి రాత్రి అల్లరి చేసి కూలదోసేవట. దీంతో ఆగ్రహించిన బుచ్చయ్య దెయ్యాలను బంధించి వాటి వెంట్రుకలను కోసి రోకలికి కట్టి దగ్గర పెట్టుకున్నాడట. తమ వెంట్రుకలు ఇవ్వాలని దెయ్యాలు బుచ్చయ్యను బ్రతిమాలుకోగా కూలదోసిన దేవాలయాన్ని తిరిగి కట్టివ్వాలని బుచ్చయ్య దెయ్యాలను ఆదేశించాడట. దీంతో దిగివచ్చిన దెయ్యాలు ఒకే రాత్రిలో దేవాలయాన్ని నిర్మించి ఇచ్చాయట. ఆనాటి నుంచి ఈ దేవాలయాన్ని దెయ్యాలు కట్టిన దేవాలయంగా జనం పిలవనారంభించారు. దెయ్యాలు కట్టినది కాబట్టే దేవాలయంపై దెయ్యాల ప్రతిమలున్నాయంటారు గ్రామస్తులు. అయితే ఈ దేవాలయం గర్భగుడిలో దేవుడిని ప్రతిష్టించలేదు. 50 సంవత్సరాల క్రితం గ్రామ శివారులో ఉన్న తాగునీటి చెరువు లో తవ్వుతండగా 8 అడుగుల శివలింగం లభించిందట. ఆ లింగాన్ని తీసుకువచ్చి ఖాళీగా ఉన్న దేవాలయంలో ప్రతిష్టించి సుందరేశ్వర దేవాలయంగా నామకరణం చేసారు. ఇంత ఎత్తైన లింగం రాష్ట్రంలోనే ఎక్కడా లేదని, దేశంలో ఐదు చోట్ల మాత్రమే ఇంత ఎత్తైన లింగాలు ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. దెయ్యాల బాధ ఉన్నవారు ఈ దేవాలయాన్ని దర్శిస్తారట. -
దెయ్యాలు వెంబడిస్తున్నాయంటూ..
జూబ్లీహిల్స్: మానసిక స్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్ హనుమాన్ దేవాలయం సమీపంలో నివసించే బాల రాజు(45) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిగా విపరీతమైన భయానికి గురవుతున్నాడు. కుటుంబ సభ్యులు ఏమైందని ప్రశ్నిస్తే తనను దెయ్యాలు, భూతాలు వెంబడిస్తున్నాయంటూ చెప్పేవాడు. సోమవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భయపడొద్దు.. దెయ్యాలు లేవు
♦ ఇబ్రహీంపట్నం ముదిరాజ్ బస్తీలో జనం ఆందోళన ♦ జేవీవీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఇబ్రహీంపట్నం: దెయ్యాలు లేవని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు. తమ బస్తీలు దెయ్యాలు తిరుగుతున్నాయని ఇబ్రహీంపట్నంలోని ముదిరాజ్ బస్తీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వివరాలు.. ఇబ్రహీంపట్నం ముదిరాజ్ బస్తీకి చెందిన హనుమంతు కృష్ణ, సంతోష(25) దంపతులు. కొంత కాలంగా వీరు సంతోష పుట్టిల్లు అయిన నల్గొండ జిల్లా చిట్యాలలో ఉంటున్నారు. దంపతుల మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో గత 4న సంతోష ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికే ఆమె నిండు గర్భిణి. హనుమంతు కృష్ణ బంధువులు సంతోష మృతదేహాన్ని తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. మృతదేహం సరిగా కాలిపోకపోవడంతో మరుసటి రోజు తిరిగి కాల్చివేశారు. అనంతరం హనుమంతు కృష్ణ వెళ్లిపోయాడు. పక్క ఇంట్లో ఉండే ఆయన పెద్దనాన్న ఎల్లయ్య కుమారుడు హనమంతు రవి ఇటీవల పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. తనకు దెయ్యం ఆవహించిందని చెబుతున్నాడు. ఈవిషయంలో అతడి కుటుంబీకులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా, గత డిసెంబర్లో బస్తీకి చెందిన నల్లగొడుగు బాలమ్మ(60) మృతిచెందింది. బాలమ్మ దెయ్యమైందని స్థానికులు భయపడుతున్నారు. ఈనేపథ్యంలో బస్తీలో జనసంచారం తగ్గిపోయింది. సాయంత్రం అయితే చాలు ఇళ్లకు గడియ పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అవగాహన నిర్వహించిన జన విజ్ఞాన వేదిక బస్తీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞానవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడారు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనుషులు ఎక్కువగా దాని గురించే అలోచిస్తారని, ఈక్రమంలో మానసికంగా దాని ప్రభావం పడి ఆయా వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు వ స్తుందన్నారు. దీంతో దెయ్యం పట్టిందని జనాలు మూఢంగా విశ్వసిస్తారని తెలిపారు. ఇక్కడున్న దెయ్యాన్ని తాను పట్టుకెళ్తానని ఆయన ఓ బెలూన్ను చూపించారు. మూఢ విశ్వాసాలను నమ్మొదని చెప్పారు. నేను శ్మశానాల్లో నిద్రించాను.. కార్యక్రమంలో సీఐ జగదీశ్వర్ మాట్లాడుతూ.. తాను కొన్ని సందర్భాల్లో విధి నిర్వహణలో శ్మశానవాటికల్లో నిద్రించానని తెలిపారు, దెయ్యాలు ఉన్నాయనేది అభూత కల్పన మాత్రమేనని తెలిపారు. మానసిక జబ్బులతో భయాందోళనకు గురికావొద్దని చెప్పారు. దె య్యాలు లేవని, జనం భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాత్రివేళల్లో బస్తీలో గస్తీని పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీవీ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, సీపీఎం నాయకులు సామెల్, శంకర్, జంగయ్య, వెంకటేష్, షఫిఉన్నిషా బేగం తదితరులు పాల్గొన్నారు. -
చనిపోయాక కూడా ఎర్రగౌన్లోనే కనిపించేది
మిస్టరీ సాధారణంగా దెయ్యాలు తెల్ల దుస్తుల్లో కనిపిస్తాయంటారు. కానీ మార్తా ఎర్ర దుస్తుల్లో కనిపించేదట. ఆమెకు ఎరుపు ఇష్టం. ఎప్పుడూ ఎర్ర దుస్తులే వేసుకునేదట. దుప్పటి, దిండు కవరు, కర్టెన్లు కూడా ఎర్రటివే వాడేదట. అందుకేనేమో... చనిపోయాక కూడా ఎర్రగౌన్లోనే కనిపించేది. అందువల్లే ఆమెను రెడ్ లేడీ అంటుంటారు. ‘‘వెల్కమ్ డాళింగ్... రా లోపలికి’’... అంటూ రూమ్మేట్ ఎదురొచ్చి క్యాటీ చేతిలోని లగేజ్ అందుకుంది. ‘‘వారం అయ్యింది నేనీ రూమ్‌లోకి వచ్చి. తోడు ఎవరొస్తారా అని చూస్తున్నా. నువ్వొచ్చావ్’’ అందామె నవ్వుతూ. క్యాటీ నవ్వలేక నవ్వింది. హాస్టల్లో ఉండటం ఇష్టం లేదామెకి. వెనక్కి వెళ్లిపోదామా అని మనసు పీకుతోంది. ముభావంగా మంచమ్మీద కూర్చుంది. ‘‘ఇంటి మీద బెంగా? మొదటి రెండు రోజులూ నేనూ అలానే ఫీలయ్యా. ఒక్క సారి అలవాటు పడితే బెంగ పోతుంది. ముందు ఫ్రెష్ అవ్వు. డిన్నర్‌కి క్యాంటీన్‌కి వెళ్దాం’’ అందామె అనునయంగా. క్యాటీ కళ్లు తుడుచుకుంది. ‘‘అమ్మ ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చింది. ఇద్దరం ఇక్కడే తిందాం’’ అంది నవ్వలేక నవ్వుతూ. ‘‘ఓకే’’ అందామె భుజాలెగరేస్తూ. ఆమె కలివిడితనం నచ్చింది క్యాటీకి. ‘‘మీ పేరు చెప్పలేదు’’ అంది. ‘‘మార్తా’’ అందామె. ఇద్దరూ డిన్నర్ ముగించి పడకల మీదకు చేరారు. చప్పున లేచి కూర్చుంది క్యాటీ. చుట్టూ చూసింది. బెడ్ లైట్ లేదేమో... కన్ను పొడుచుకుని చూసినా ఏమీ కనిపించట్లేదు. ‘‘మార్తా.. మార్తా’’ అంది. ‘‘ఏంటి క్యాటీ... పీడకలేమైనా వచ్చిందా’’ అంది మార్తా. ‘‘లేదు. ఎవరో తలుపు కొడుతున్నారు’’... అంది. ‘‘ఎవరూ ఉండ రులే క్యాటీ. పడుకో’’ అంటూ మళ్లీ నిద్ర లోకి జారిపోయింది మార్తా. కానీ క్యాటీ పడుకోలేదు. ఎవరో తలుపు కొడుతు న్నారు. వార్డెన్‌గానీ ఏదైనా చెప్పడానికి వచ్చిందా? వెళ్లి తీస్తే మంచిదేమో! మంచం దిగింది క్యాటీ. స్విచ్ వేస్తే లైట్ వెలగలేదు. ‘కరెంటు కూడా ఇప్పుడే పోవాలా’ అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎవరూ లేరు. ఆశ్చర్యపోయింది. ఎవరో తలుపు కొట్టారు. ఇప్పుడేమై పోయారు? ఆలోచిస్తూ తలుపు మూయ బోయింది. అంతలో సన్నగా ఏడుపు. ఎవరా అనుకుంటూ చూసింది క్యాటీ. అక్కడే ఓ పక్కగా... ఓ అమ్మాయి మోకాళ్ల మీద తలపెట్టుకుని కూర్చుని ఏడుస్తోంది. జాలి గొలిపేలా ఉందా ఏడుపు. దగ్గరకు వెళ్లకుండా ఉండలేకపోయింది. ‘‘ఎందుకే డుస్తున్నారు’’ అంది. ‘‘నాకు ఇంటికెళ్లి పోవాలనుంది. నాతో ఎవరూ మాట్లా డటం లేదు. నేనంటే ఎవరికీ ఇష్టం లేదు’’ మరింత గట్టిగా ఏడవసాగిందామె. క్యాటీకి జాలేసింది. ‘‘బాధపడకండి. నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను’’ అంది ప్రేమగా. ఆ మాట వింటూనే వెనక్కి తిరిగిందామె. అంతే... హడలిపోయింది క్యాటీ. ఆమె మార్తా! కళ్లు చింతనిప్పుల్లా ఉన్నాయి. ముఖం వికృతంగా ఉంది. విరబూసివున్న జుత్తు గాలికి ఎగురుతూ భయపెడుతోంది. ఇందాకే తనతో గదిలో మాట్లాడింది. మరి ఇక్కడ? అయినా ఇలా ఉందేంటి? ‘‘నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? నేనంటే నీకు అంత ఇష్టమా?’’ అంది మార్తా. ఆ స్వరం భయానకంగా ఉంది. క్యాటీకి వెన్నులోంచి వణుకు వస్తోంది. ఎలాగో కాళ్లలోకి సత్తువ తెచ్చుకుంది. ఒక్క ఉదుటన వార్డెన్ దగ్గరకు పరుగు తీసింది. క్యాటీ చెప్పింది విని.. ‘‘రూమ్మేట్ ఎవరు? నీ రూమ్‌లో ఎవరూ లేరు. మొదట నువ్వే వచ్చావ్’’ అందామె. షాక్‌తో స్పృహ కోల్పోయింది క్యాటీ. ఇక లేవలేదు. అలబామా (యు.ఎస్.)లోని హంటింగ్డాన్ కాలేజీలో... కొన్ని దశాబ్దాల క్రితం ఈ సంఘటన జరిగింది. అప్పుడే అక్కడ ఓ దెయ్యం తిరుగు తోందన్న నిజం బయటికొచ్చింది. ఆ దెయ్యం ఎవరో కూడా తెలిసింది. ఆమె ఎవరో కాదు... మార్తా! హంటింగ్డాన్ కాలేజీలో చదువు కోడానికి ఊరిని, ఇంటిని, తల్లిదండ్రుల్ని వదిలి వచ్చింది మార్తా. కానీ ఆమెకది ఇష్టం లేదు. ప్రతిరోజూ ఏడుస్తూనే ఉండేది. ఎప్పుడూ మనసు ఇంటిమీదే. సరిగ్గా చదివేది కూడా కాదు. డల్‌గా ఉండే ఆమెతో ఎవరూ స్నేహం చేసేవారు కాదు. ఆమె రూమ్‌లో ఉండటానికీ ఒప్పుకునే వారు కాదు. కనీసం పన్నెత్తి పలక రించేవారు కాదు. దాంతో రాత్రయితే ఒంటరిగా ఉండలేక గదిగదికీ వెళ్లి తలుపు కొట్టేది. నాతో మాట్లాడండి, స్నేహం చేయండి అని అడిగేది. ఎవరూ పట్టించు కునేవారు కాదు. కుమిలిపోయింది. ఇంటికి వచ్చేస్తాను అంటే ఒప్పుకోని తండ్రిని కన్విన్స్ చేయలేక, ఆ బెంగతో బతకలేక ఆత్మహత్య చేసుకుంది మార్తా. అక్కడితో ఆమె కథ ముగిసి పోయిందనుకున్నారంతా. కానీ మార్తా ఆత్మ అక్కడక్కడే తిరుగుతోందని ఆమె రూమ్‌లోకి వచ్చిన అమ్మాయి మరణించే వరకూ తెలియలేదు. ఆమె రూమ్‌ని శాశ్వతంగా మూసేశారు. ఆ తర్వాత కూడా మార్తా ఆత్మ ఎందరికో కనిపించింది. కానీ కాలేజీ బిల్డింగ్‌ని రీమోడల్ చేశాక కనిపించడం మానేసింది. ఇక ఈ లోకంలో తనకు చోటు లేదనుకుందో... లేక ఆ లోకంలో ఆమెకో తోడు దొరికిందో!! -
దెయ్యం కెవ్వుమంది!
దెయ్యాలంటే అందరికీ భయమే. కారణం వాటిని ఎవరూ చూడకపోవడమే. చూస్తే ఇక ఏ భయమూ ఉండదు. ఒకప్పుడు పల్లెటూళ్లలోనే దెయ్యాలు ఎక్కువగా ఉండేవి. నగరీకరణకి ఆకర్షితమై అవన్నీ సిటీల్లోకి వచ్చేశాయి. వాటికి బస్సులు, రైళ్లు ఎక్కాల్సిన అవసరం లేదు. గాల్లోనే వచ్చేస్తాయి. అంతా ఎయిర్ వే. నగరాల్లో ఆల్రెడీ ఉన్న దెయ్యాలు, వలస దయ్యాలు ఏకీకృతమై వాట్సప్గ్రూప్లా జట్టుకట్టాయి. అందులో కొన్ని వీలు చూసుకుని సినిమాల్లో చేరిపోగా, మరికొన్ని సాహిత్యంలో దూరిపోయాయి. వేషభాషలపై అంతగా పట్టులేనివి జర్నలిజంలోకి దూకేశాయి. హాస్య సినిమాలు చూసి భయపడుతూ, పుస్తకం, పేపర్ తెరవడానికి జడుసుకుంటూ మనం జీవించడానికి వీటి కృషే కారణం. దెయ్యమంటే ఏమిటని ఒకసారి ఒక స్వామీజీని అడిగాను. ఆయన మొహానికున్న మాస్క్‌ని తీసి నా వైపు చూశాడు. కెవ్వున కేకేసి పారిపోయి వచ్చేశాను. దెయ్యాలు ఎక్కడైనా ఎలాగైనా ఉండొచ్చు. అనవసరంగా హారర్ సినిమాల్లో వెతుకుతూ ఉంటాం. మనల్ని ఎలాగైనా భయపెట్టాలని రాంగోపాల్‌వర్మ ప్రయత్నించి ప్రయత్నించి విఫలమై తానే భయపడి ఊరుకున్నాడు. తెల్లారి లేచినప్పటి నుంచి బోలెడంతమంది నాయకుల్ని చూసి అలవాటుపడిన ప్రాణాలు మనవి. దెయ్యాలకి మనమా భయపడేది? హారర్ సినిమాల్లో సంగీత దర్శకులు తమదైన శైలిలో కృషి చేస్తారు. కొందరు ఏమీ వాయించకుండా నిశ్శబ్దంతో భయపెట్టాలని చూస్తారు. మరికొందరు డమరుకం దగ్గర్నుంచి డోలు వరకూ ఎడాపెడా ఉతికేసి చెవులు కొరికి తినేస్తారు. వాయిద్యాలతో పాటు మన తలని కూడా బాదేస్తారు. అయినా అన్ని వైపుల నుంచి హారన్లు మోగించే ట్రాఫిక్జాంలకే మనం భయపడం. ఇక ఈ వాయిద్యాలొక లెక్క? బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో దెయ్యాలకి నిర్దిష్టమైన సిలబస్, బాడీలాంగ్వేజి ఉండేది. గడియారం 12 గంటలు కొట్టిన తర్వాతే యాక్టివేట్ కావాలి. అవి రావడానికి ముందు ఒక నక్క, గుడ్లగూబ కొన్ని సౌండ్స్ చేయాలి. కాలికి గజ్జెలు, తెల్లచీర కంపల్సరీ. చక్కటి సంగీతంతో ఒక పాట పాడగలిగితే దెయ్యానికి కాస్త గౌరవం. అయినా దెయ్యాలు ఆడవాళ్లనే ఎందుకు ఆశ్రయిస్తాయనేది చాలామంది సామాజిక వేదాంత తత్వవేత్తల ప్రశ్న. నిజానికి మగవాళ్లు, దెయ్యాలు ఒకే నాణానికి రెండు ముఖాలని ఎప్పట్నుంచో ఫెమినిస్ట్‌లు చెబుతున్నా, కొంతమంది హ్యూమనిస్ట్లు వినడం లేదు. మొగుళ్లని తన్నలేని ఆడవాళ్లకే దెయ్యాలు పడతాయని వెనకటికి మా పెద్దమ్మ ఒక థియరీ కనిపెట్టింది. భరించినంతకాలం భరించి చెలకోలా తీసుకుని మా పెద్దనాయన వీపుమీద రెండు, మూతి మీద మూడు వాయించేసరికి ఒళ్లు వాతలు తేలి దిక్కులు కూడా చూడకుండా పారిపోయాడు. మొగుడు పరారయ్యాడని నిర్థారించుకున్న తర్వాతే ఆమెలోని దెయ్యం వదిలింది. టీవీ సీరియళ్లు వచ్చిన తరువాత దెయ్యాలకి చేతినిండా పని తగ్గిపోయింది. సీరియళ్ల స్థాయిలో భయపెట్టడం ఎవరివల్లా కాదని రుజువు చేసుకుని అవి కూడా సీరియళ్లకి అడిక్ట్ అయిపోయాయి. వాస్తవానికి దెయ్యాలు లేవని నాకు చిన్నప్పుడే తెలుసు. ఆ విషయాన్ని ఒక దెయ్యమే చెప్పింది. - జి.ఆర్. మహర్షి -
ఓ ఆత్మకథ...
మిస్టరీ ‘‘అబ్బ... ఎంత అందంగా ఉన్నావే. నాకే ముద్దొచ్చేస్తున్నావ్’’... సుగంధ బుగ్గలు పట్టి లాగింది మైత్రి. ‘‘ఛీ ఊరుకోవే’’ అంది సుగంధ స్నేహితురాలి చేతుల్ని తోసేస్తూ. ‘‘ఏం సిగ్గుపడుతున్నావే. మా దగ్గరే ఇలా ఉంటే, ఇక మీ ఆయన వచ్చాక ఎన్ని సిగ్గులొలకబోస్తావో’’ అంది మరో స్నేహితురాలు రాగిణి కన్నుగీటుతూ. నిజంగానే సిగ్గు ముంచుకు వచ్చింది సుగంధకి. రెండు చేతులతో ముఖాన్ని మూసుకుంది. ‘‘ఏడిపించింది చాలు వెళ్లండి’’ అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో. ‘‘వెళ్లిపోతాంలేవే. మీ ఆయన వచ్చే టైమయ్యిందని మాక్కూడా తెలుసులే’’ పకపకా నవ్వుతూ వెళ్లిపోయారందరూ. గోడకున్న గడియారం వైపు చూసింది సుగంధ. తొమ్మిదీ పది అయ్యింది. ఇంకో పది నిమిషాల్లో భర్త వస్తాడు. ఓసారి గదంతా పరికించి చూసింది సుగంధ. అందంగా అలంకరించి ఉంది. మంచం నిండా పూలు పరిచి ఉన్నాయి. వాటి గుబాళింపులు గదంతా వ్యాపించాయి. మంచం దిగి అద్దం దగ్గరకు వెళ్లింది సుగంధ. మైత్రి చెప్పింది నిజమే. తను ఈ దుస్తుల్లో ఎంతో అందంగా ఉంది. ఓసారి తన రూపాన్ని సాంతం చూసుకుంది. పక్కకు జరిగిన పాపిట బిళ్లను సరి చేసు కుంది. బొట్టు కాస్త పెద్దదైనట్టుగా అని పించడంతో తీసేసి చిన్న స్టిక్కర్ పెట్టు కుంది. తృప్తిగా నవ్వుకుని వెళ్లి మంచంపై కూర్చుంది. అంతలో తలుపు తీసిన చప్పుడయ్యింది. సుగంధ గబగబా దుపట్టాను ముఖం కనిపించకుండా తల మీదుగా కప్పుకుంది. తలుపు మూసి వచ్చాడు విమలేష్. ‘‘సారీ... లేటయ్యింది. ఫ్రెండ్స్ వదిలి పెడితేగా. ఒకటే ఏడిపించారు’’ అన్నాడు సుగంధ పక్కనే కూర్చుంటూ. ‘‘ఫరవాలేదు’’... సుగంధ స్వరం మంద్రంగా పలికింది. ఆమెకు దగ్గరగా జరిగాడు విమలేష్. మెల్లగా దుపట్టాను పైకి లేపాడు. గడ్డం పుచ్చుకుని సుగంధ ముఖాన్ని పైకి లేపాడు. అంతే... ఉలిక్కిపడి లేచాడు. ‘‘నువ్వా?’’ అన్నాడు కంగారుగా. ‘‘అవును... నేనే’’ అంది సుగంధ. ఈసారి ఆమె స్వరం మంద్రంగా లేదు. మొరటుగా ఉంది. కంచు మోగినట్టుగా ఉంది. ఆ స్వరానికి గది దద్దరిల్లింది. ‘‘నువ్వు... నువ్వు..’’... మాట రావడం లేదు విమలేష్కి. నిలువెల్లా వణికిపోతున్నాడు. చెమటతో తడిసి ముద్దవుతున్నాడు. సుగంధ అతడివైపే చూస్తోంది. కోపంగా... కసిగా... అసహ్యంగా. ‘‘ఎందుకలా దూరంగా వెళ్లిపోతున్నావ్. రా... దగ్గరకు రా’’ అంది. తల అడ్డంగా ఊపాడు విమలేష్. అక్కడ్నుంచి పారిపోవాలని ఉంది. కానీ కాళ్లు కదలడం లేదు. ఒళ్లంతా గడ్డకట్టేసి నట్టుగా అనిపిస్తోంది. కానీ కదలాలి. అక్కడ్నుంచి పారిపోవాలి. ఎలాగో శక్తిని కూడదీసుకున్నాడు. ఒక్క అంగలో గదిలోంచి బయటకు పరుగుదీశాడు. ఇల్లంతా గోలగోలగా ఉంది. సుగంధ ఏడుస్తోంది. అందరూ ఆమెను ఓదారుస్తున్నారు. పెద్దలంతా విమలేష్ని నిలబెట్టి నిలదీస్తున్నారు. విమలేష్ మాట్లాడటం లేదు. భయంభయంగా సుగంధ వైపే చూస్తున్నాడు. ‘‘నేనంటే ఆయనకు ఇష్టం లేదను కుంటా. అందుకే నన్ను వదిలేసి బయటకు వచ్చేశారు. వద్దంటే చెప్పమనండి. వెళ్లిపోతాను’’ అంది సుగంధ ఏడుస్తూ. ‘‘చెప్పరా... అమ్మాయి అడుగుతోంది కదా! తనంటే ఇష్టం లేదా. మరెందుకు పెళ్లి చేసుకున్నావ్. ముందే చెప్పి చావొచ్చు కదా’’... అరుస్తున్నాడు విమలేష్ తండ్రి. ‘‘తను... తను సుగంధ కాదు నాన్నా. దెయ్యం. నన్ను చంపడానికి వచ్చింది. నన్ను కచ్చితంగా చంపేస్తుంది.’’ విమలేష్ మాటలకు విస్తుపోయా రంతా. బంగారు బొమ్మలాంటి పిల్లని పట్టుకుని దెయ్యమంటాడేంటి అంటూ అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు. ఏదో గాలి సోకినట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అన్నారు తలపండిన వాళ్లు కొందరు. ‘‘నాకే గాలీ సోకలేదు. నేను చెప్పేది నిజం. అది సుగంధ కాదు. పుర్వి. నన్ను చంపడానికొచ్చింది. దాన్ని నేను మోసం చేశానని నా మీద పగబట్టింది. దెయ్యమై వచ్చింది నన్ను చంపడానికి. దాన్ని పంపెయ్యండి. వెంటనే పంపెయ్యండి.’’ పిచ్చి పట్టినట్టు అరుస్తున్నాడు విమలేష్. అందరూ అతని మాటలకు అవాక్కయిపోయారు. పుర్వి ఎవరు? ఆమెను విమలేష్ మోసం చేయడమేంటి? ఆమె దెయ్యమై రావడమేంటి? ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అందరూ అయోమయంగా చూడసాగారు. అప్పుడు పెదవి విప్పింది సుగంధ. ‘‘మీ అందరి మనసుల్లో ఉన్న ప్రశ్నలు నాకు తెలుసు. వాటికి సమాధా నాలు నా దగ్గరున్నాయి’’ అంటూ చెప్పడం మొదలుపెట్టింది. మూడు నెలల క్రితం ఓ మధ్యాహ్నం... తన గదిలో పడుకుని పుస్తకం చదువు కుంటోంది సుగంధ. అంతలో ఫోన్ మోగింది. స్క్రీన్ మీద నంబర్ చూడగానే సంతోషంగా లేచి కూర్చుంది. పుస్తకం పక్కన పడేసి, ఫోన్ చేతిలోకి తీసుకుంది. ‘‘ఏయ్ పుర్వీ.. ఎలా ఉన్నావే? ఎన్నాళ్లయ్యింది నీతో మాట్లాడి... ఏంటే విశేషాలు?’’.. ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ఏం లేదు సుగంధా... నీతో మాట్లాడాలనిపించింది. అందుకే చేశాను.’’ పుర్వి గొంతు మెల్లగా ఉంది. ఏదో బాధ బరువును మోస్తున్నట్టుగా ఉంది. ‘‘ఏంటే? ఎందుకలా ఉన్నావ్? ఏమైంది?’’ ఆతృతగా అడిగింది సుగంధ. అలా అడగడంతోనే బావురుమంది పుర్వి. వెక్కి వెక్కి ఏడవసాగింది. ‘‘నేను మోసపోయాను సుగంధా. దారుణంగా మోసపోయాను. ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటే గుడ్డిగా నమ్మాను. ఎంతో దగ్గరైపోయాను. ఇప్పుడేమో తను నన్ను మానేసి వేరే అమ్మాయిని చేసు కుంటానంటున్నాడు. ఇంట్లోవాళ్లు ఒప్పు కోరు అంటూ వంకలు చెబుతున్నాడు. నేను తట్టుకోలేకపోతున్నానే. ఈ ద్రోహాన్ని నేను భరించలేకపోతున్నాను.’’ మ్రాన్పడిపోయింది సుగంధ. ‘‘అతను చాలా మంచివాడన్నావ్ కదే. అలా ఎందుకు చేస్తున్నాడు?’’ ‘‘మోసగాడు అలా కాకపోతే ఎలా చేస్తాడు సుగంధా. తప్పు నాదే. నేనే తనని నమ్మకుండా ఉండాల్సింది. నీకో విషయం తెలుసా? నేను తల్లిని కాబోతున్నాను. అందుకే పెళ్లి చేసుకొమ్మని అడిగాను. కుదరదన్నాడు. తనకి ఆల్రెడీ పెళ్లి కుదిరి పోయిందట. మరో మూడు నెలల్లో పెళ్లి అట. చూశావా ఎంత మోసం చేశాడో? నా జీవితం ముగిసిపోయింది సుగంధా. ఇక నేను బతికి లాభం లేదు.’’ ‘‘అయ్యో పుర్వీ... అలా అనకు. అలా ఏం జరగదు. నేనున్నాను కదా. నేను చూసుకుంటాను. నువ్వు...’’ సుగంధ మాట పూర్తి కాకముందే ఫోన్ కట్ అయిపోయింది. గుండె జారి పోయింది సుగంధకి. పుర్వి చాలా బాధలో ఉంది. తొందరపడి ఏమీ చేసుకోదు కదా! అలా అనుకోగానే మనసు రెపరెప లాడింది. వెంటనే పుర్వి దగ్గరకు వెళ్లాలి అనుకుంటూ మంచం దిగింది. అంతలో ఆమె తల్లి లోనికి వచ్చింది. ‘‘అమ్మా... నేను పుర్వి వాళ్లింటికి వెళ్తున్నాను’’ అంది సుగంధ హ్యాండ్‌బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ. నిట్టూర్చింది తల్లి. ‘‘నేనూ వస్తాన్రా. పాపం పుర్వి.’’ అయోమయంగా చూసింది సుగంధ. ‘‘ఏంటమ్మా... ఎందుకలా అన్నావ్’’ అంది తల్లి ముఖంలోకి చూస్తూ. ‘‘నాకు విషయం తెలిసింది. నీ ఫ్రెండ్ రూప ఇప్పుడే చెప్పింది. నీ సెల్‌కి చేస్తే ఎంగేజ్ వస్తోందట. అందుకే ల్యాండ్‌లైన్‌కి చేసింది. పాపం పుర్వి ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకుందట కదా!’’ హడలిపోయింది సుగంధ. ఏమంటోంది అమ్మ? పుర్వి ఆత్మహత్య చేసుకుందా? అది కూడా ఈ రోజు ఉదయమా? అదెలా? మరి ఇంతవరకూ తనతో మాట్లాడింది ఎవరు? పుర్వి కాదా? మాట్లాడింది తనే. కచ్చితంగా తనే. మరి పొద్దున్నే చనిపోవడమేంటి? వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది సుగంధకి. జరిగినదాన్ని జీర్ణించుకోలేక ఉన్నచోటే కూలబడిపోయింది. ‘‘ప్రేమలో మోసపోయిన పుర్వి చని పోయింది. తన ప్రాణాలు తనే తీసుకుంది. కానీ తన మరణం వెనుక ఉన్న నిజం మరుగున పడిపోకూడదని అనుకుంది. అందుకే ఆ నిజాన్ని నాకు చేరవేసింది. ఆ రోజు నాకు ఫోన్ చేసింది... పుర్వి ఆత్మ.’’ వింటున్నవాళ్లంతా ఉలిక్కిపడ్డారు. ఏం చెబుతోంది సుగంధ? ఆత్మా? ‘‘మీరు నమ్మరని నాకు తెలుసు. మొదట నేనూ నమ్మలేదు. కానీ నమ్మక తప్పని పరిస్థితి. ఆ రోజు మా అమ్మ, నేను పుర్వి వాళ్లింటికి వెళ్లాం. తను ఉరి వేసుకుని చనిపోయిందని తెలిసింది. పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్‌తో మాట్లాడితే తను గర్భవతి అని తేలింది. తర్వాత పుర్వి గదంతా వెతికాను. తన పుస్తకాల్లో ఒకచోట ఆమె ప్రియుడి ఫొటో దొరికింది. అది చూసి నేను షాక్ తిన్నాను. ఎందుకంటే ఆ ఫొటో ఎవరిదో కాదు... నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిది. ఆ వ్యక్తి ఎవరో కాదు... విమలేష్.’’ ఈసారి అదిరి పడ్డారంతా. సుగంధ చెప్పే కఠోర వాస్తవాల్ని జీర్ణించుకోలేక పోయారు వాళ్లు. అయితే ఆమె చెప్పిన ప్రతి మాటా ముమ్మాటికీ నిజం. సుగంధ, పుర్వి డిగ్రీ వరకూ కలిసే చదువుకున్నారు. పీజీకి మాత్రం వేర్వేరు కాలేజీల్లో చేరారు. కానీ అన్ని విషయాలనూ ఫోన్‌కాల్స్ ద్వారా పంచుకునేవారు. అలానే తన ప్రేమ విషయం కూడా సుగంధకు చెప్పింది పుర్వి. అయితే ఆమె ఎవరిని ప్రేమించింది అన్నది మాత్రం సుగంధకు తెలియదు. దాంతో విమలేష్తో తనకు పెళ్లి కుదుర్చుతామంటే ఓకే చెప్పింది. అయితే అంత తెలివిగా ఓ ఆడపిల్లను మోసం చేసినవాడు నిలదీసి అడిగితే నిజం చెప్పడు. అతడి నిజస్వరూపాన్ని బయట పెట్టేందుకు తన దగ్గర సాక్ష్యాలూ లేవు. అందుకే స్నేహితురాలికి న్యాయం చేయడం కోసం మౌనంగా అతణ్ని పెళ్లి చేసుకుంది సుగంధ. మొదటిరాత్రి పుర్విలా మాస్క్ వేసుకుని, ఆమెలా నటించి అతడితోనే నిజాన్ని చెప్పించింది. పుర్విని మోసగించి, ఆమె మరణానికి కారణమైన విమలేష్ని జైలుకు పంపించింది. ఇది మధ్యప్రదేశ్‌లో జరిగిన వాస్తవ గాథ. మరి ఇది విన్నాక కూడా దెయ్యాలు, ఆత్మలు అంతా ట్రాష్ అనాలా? లేక వాటిని ఉనికిని అంగీకరించాలా? -
దెయ్యాలు ఉన్నాయా?
దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. ఈ విషయం గురించి పరిశోధన చేయడానికి వెళ్లిన కొందరు విద్యార్థులకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆనంద్‌కుమార్, అనూష జంటగా చాంద్‌పాషా దర్శకత్వంలో ఖాదర్‌బాబు, తారాబేగం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ ప్రతి సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నవంబర్ నెలాఖరులో పాటలను విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆనంద్, సహ-నిర్మాత: సల్మాన్‌ఖాన్. -
ప్రేతాల పార్క్
మిస్టరీ * సరదా కోసం వెళ్లారు. * శవాలుగా మారారు. * దెయ్యాలై సంచరిస్తున్నారు. మే 1973, జపాన్‌లోని హొబారా... ‘టకకనోనుమా గ్రీన్‌ల్యాండ్ పార్క్’ అన్న బోర్డు కనిపించగానే హుషారొచ్చే సింది ‘షోమా’కి. ‘‘మమ్మీ... అటు చూడు, ఎంత బాగుందో’’ అంటూ గంతులు వేయసాగాడు. నవ్వలేక నవ్వింది అసాకా. ఎనిమిదేళ్ల పిల్లాడు షోమా. నెల రోజుల క్రితం ఓపెన్ చేసిన ఆ అమ్యూజ్మెంట్ పార్క్ గురించి టీవీలో చూశాడు. అప్పటి నుంచీ ఒకటే గొడవ అక్కడికి తీసుకెళ్లమని. కానీ అసాకాకి ఇష్టం లేదు. ఎందుకంటే వారం రోజుల క్రితం అక్కడో ప్రమాదం జరిగింది. జారుడు బల్ల మీద నుంచి జారుతూ ఓ పిల్లాడు అదుపు తప్పి పక్కకి పడిపోయాడు. తలకి దెబ్బ తగిలి అక్కడి కక్కడే చనిపోయాడు. ఆ సంఘటన గురించి వార్తల్లో చూసి హడలిపోయింది అసాకా. ‘తన కొడుక్కి కూడా అలాంటిదే మైనా అయితే’ అన్న ఆలోచనతో ఆమె తల్లి హృదయం తల్లడిల్లుతోంది. కానీ ఎంత చెప్పినా భర్త వినలేదు. పిల్లాడు సరదా పడుతున్నాడు కదా అంటూ తీసుకొచ్చాడు. ‘‘ఏంటి అసాకా నువ్వు. ఇంకా మూతి ముడుచుకునే ఉన్నావ్. వాడు చూడు ఎలా గంతులేస్తున్నాడో. వాడి కోసమే కదా వచ్చాం. నువ్విలా ఉంటే ఎలా?’’... డల్‌గా ఉన్న భార్యను చూసి అన్నాడు కైలానో. ‘‘నీకు అర్థం కాదులే నా బాధ. జరగరానిది ఏదైనా జరిగిందంటే?’’... కినుకగా అంది అసాకా. కైలానో నవ్వేశాడు. ‘‘నువ్వు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావు అసాకా. ఎవరికో ఏదో జరిగిందని అందరికీ జరుగుతుందా ఏంటి!’’ అంటూ బాబుతో పాటు లోనికి నడిచాడు. మౌనంగా అనుసరించింది అసాకా. లోపలికి వెళ్లీ వెళ్లడంతోనే జెయింట్ వీల్ వైపు పరుగెత్తాడు షోమా. దాదాపు నలభై పెట్టెల వరకూ ఉన్న ఆ పెద్ద జెయింట్ వీల్‌ని చూసి ఎక్కడలేని సంతోషం వేసింది వాడికి. అది ఎక్కించమంటూ మారాం చేయడం మొదలుపెట్టాడు. అసాకా నచ్చజెప్పబోయింది కానీ వినలేదు. ఏడుపు అందుకున్నాడు. దాంతో వాడిని జెయింట్‌వీల్ ఎక్కించడానికి సిద్ధపడ్డాడు కైలానో. ‘‘వద్దు కైలానో. నా మాట విను. నాకెందుకో భయంగా ఉంది’’ అంది అసాకా కంగారుగా. ‘‘ఫర్వాలేదు డియర్. మనమూ వాడితో పాటు ఎక్కుదాం రా’’ అన్నాడు కైలానో. తల అడ్డంగా ఊపింది అసాకా. ‘‘సరే నేను వెళ్తాను. నువ్వు ధైర్యంగా ఉండు’’ అంటూ పిల్లాణ్ని తీసుకుని జెయింట్ వీల్ దగ్గరకు వెళ్లాడు కైలానో. రెండు టికెట్లు తీసుకున్నాడు. బాబుతో సహా వెళ్లి ఓ తొట్టిలో ఎక్కి కూచున్నాడు. దూరంగా నిలబడి చూస్తోంది అసాకా. ఎందుకో తెలీదు... ఆమె మనసు కీడు శంకిస్తోంది. గుండె దడదడా కొట్టుకుంటోంది. అంతలో జెయింట్‌వీల్ కదిలింది. ‘‘హే... మమ్మీ. మేమిప్పుడు ఎలా తిరుగుతామో చూడు. పైకి... పైపైకి వెళ్లిపోతాం’’ అంటూ అరిచాడు షోమో. కొడుకు సంతోషం చూసి ముచ్చటేసింది అసాకాకి. మెల్లగా తిరగడం మొదలైన జెయింట్ వీల్ కాసేపటికి వేగం పుంజుకుంది. గిరగిరా తిరుగుతోంది. క్షణాలు గడిచాయి. నిమిషాలు గడిచాయి. ఇంకాసేపుంటే వేగం తగ్గేది. జెయింట్‌వీల్ ఆగేది. కానీ అంతలోనే ఓ పెద్ద అరుపు... ‘‘మమ్మీ’’ అంటూ. ఉలిక్కిపడింది అసాకా. అది తన కొడుకు గొంతు. ఏమైంది? చప్పున తలెత్తి పైకి చూసింది. అంతే... ఆమె గుండె ఆగినంత పనయ్యింది. ఓ తొట్టి... చక్రం నుంచి విడిపోయింది. అంత ఎత్తునుంచి నేలమీద పడటానికి దూసుకొస్తోంది. క్షణాల్లో అది నేలను తాకింది. అందులో ఉన్న ఇద్దరూ ఎగిరి నేలమీద పడ్డారు. ఆ ఇద్దరూ... కైలానో, షోమో. పడీ పడటంతోనే షోమో తల నేలకు గుద్దుకుని బద్దలయ్యింది. ఆ చిన్నారి ఆయువు క్షణాల్లో తీరిపోయింది. కైలానో ఒంట్లో ఎముకలు ఫెళఫెళా విరిగి పోయాయి. చెవుల్లోంచి, ముక్కులోంచి రక్తం వస్తోంది. రెండు మూడు క్షణాల్లో అతని ప్రాణం కూడా అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఏం జరిగిందో ఒక్కక్షణం ఎవరికీ అర్థం కాలేదు. అసాకాకి అయితే అస్సలు అర్థం కాలేదు. కళ్లెదుటే తన భర్త, కొడుకు మృత్యులోయలోకి జారిపోయారన్న నిజాన్ని ఆమె నమ్మలేకపోతోంది. కొయ్యబారిపోయి చూస్తూండిపోయింది. ఇక ఆ తర్వాత ఆమెలో మళ్లీ చలనం కలగలేదు. ఎందుకంటే... ఆ షాక్‌ని తట్టుకోలేక ఆమె గుండె ఆగిపోయింది. పోలీస్ టీమ్ వచ్చి ఎలా జరిగిందో ఇన్వెస్టిగేట్ చేసి, ప్రమాదం అని నిర్ధారించుకుంది. అంబులెన్సు వచ్చి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తీసుకుపోయింది. మీడియా వచ్చి ఆ ప్రమాదం తాలూకు వివరాలను రాసుకుని వెళ్లింది. అక్కడితో ఆ కథ ముగిసిపోయింది అని దేశమంతా అనుకుంది. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. అది యావత్ దేశాన్నే కాదు, ప్రపంచాన్నే భయంతో వణికించింది. ఇంతకీ ఏం జరిగింది? ‘‘ఏంటిది మేనేజర్గారూ... ఏం జరుగుతోందిక్కడ? మీ పార్కు తెరిచాక ఇది మూడో ప్రమాదం’’... కాస్త సీరియస్‌గానే అన్నాడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. మేనేజర్ తత్తరపడ్డాడు. ‘‘సారీ సర్. ఇది నిజంగా దురదృష్టకరమే. మేము ఎంతో పకడ్బందీగా అన్నీ ప్లాన్ చేసి ఈ పార్కుని ఏర్పాటు చేశాం. అన్నీ అధునాతన యంత్రాలే. అయినా ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు’’ అన్నాడు బుర్ర గోక్కుంటూ. ‘‘మీరేం చేశారో, ఏం చేస్తున్నారో మాకు తెలీదు. ఇప్పుడు మమ్మల్నేం చేయమంటారో చెప్పండి. మీ పార్క్ తెరచిన మూడు వారాలకే చిన్నపిల్లాడి మరణం సంభవించింది. అనుకోకుండా జరిగిన సంఘటన అనుకున్నాం. జెయింట్ వీల్ ప్రమాదం కారణంగా ఒకే కుటుంబంలోని ముగ్గురూ మృత్యువాత పడ్డారు. ప్రమాదంలే అనుకుని ఊరుకున్నాం. ఇవాళ స్విమ్మిగ్‌పూల్‌లో పడి పాప చనిపోయింది. ఇప్పుడేం అనుకోమంటారు?’’ కంగారు పడిపోయాడు మేనేజర్. ‘‘అలా అనకండి సర్. మేం కావాలని ఎవరి ప్రాణాలూ తీయం కదా! మా ఖర్మకొద్దీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకోసారి ఇలా జరక్కుండా చూసుకుంటాం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్’’ అంటూ కాళ్లా వేళ్లా పడ్డాడు. దాంతో మరోసారి అది యాక్సిడెంట్ అని రాసుకుని వెళ్లిపోయారు పోలీసులు. అదే వాళ్లు చేసిన తప్పు. ఎందుకంటే మేనేజర్ చెప్పినట్టుగా ప్రమాదాలు ఆగలేదు. ఏదో ఒకటి ముంచుకొస్తూనే ఉంది. ఆ పార్క్‌లో మృత్యుదేవత వీరవిహారం చేయడం మొదలుపెట్టింది. ఓరోజు వేగంగా తిరుగుతున్న రోలర్ కోస్టర్ పట్టాలు తప్పి పడిపోయింది. దాంతో ఇద్దరు చనిపోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకో రోజు స్వింగ్ రైడ్ చేస్తున్నప్పుడు తాడు తెగి ఓ అమ్మాయి కింద పడింది. తలకు బలమైన గాయం తగిలి బ్రెయిన్ డెడ్ అయ్యింది. మరోరోజు ఫుడ్ కోర్టులో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చాలామంది అస్వస్థులయ్యారు. తర్వాత ఇంకోరోజు ఏకంగా ఫుడ్ కోర్టులో అగ్నిప్రమాదం జరిగింది. ముగ్గురు చనిపోయారు. ఇలా ఒకటీ రెండూ కాదు... వరుసగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. దాంతో యాజమాన్యం ఆలోచనలో పడింది. కొన్నాళ్లపాటు పార్కుని మూసేసి ప్రతి యంత్రాన్నీ పరీక్షించింది. ప్రతి నిర్మాణ నాణ్యతనీ పరిశీలించింది. అణువణువూ చెక్ చేసి, ఏ సమస్యా లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మళ్లీ పార్కును తెరిచింది. కానీ ఫలితం లేదు. మళ్లీ అక్కడ మృత్యుఘోష మొదలయ్యింది. అస్తమానం ఏదో ఒక ప్రమాదం. అడుగడుగునా భయం. కొందరు చని పోయారు. ఇంకొందరు గాయపడ్డారు. దుష్టశక్తులు ఉన్నాయని, అవే అందరినీ కబళిస్తున్నాయని కొందరన్నారు. అక్కడ చనిపోయినవాళ్ల ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని, తమకు కనిపిస్తున్నా యని, ఏవేవో అరుపులు, కేకలు వినిపిస్తు న్నాయని చెప్పారు. ఓ చిన్న పిల్ల ఆత్మ అయితే అందర్నీ భయపెట్టసాగింది. దాంతో కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ఆ పార్క, సందర్శకుల్లేక వెలవెల బోయింది. అన్ని ఆధునిక హంగులూ, అలరించే అంశాలూ ఉన్నా... దెయ్యాల భయంతో నిర్మానుష్యమైపోయింది. చివరికి శాశ్వతంగా మూతబడింది. కాల క్రమంలో శిథిలావస్థకూ చేరుకుంది. అయితే ఆ పార్క్ వల్ల ఏర్పడిన భయం మాత్రం అలానే ఉండిపోయింది. అందుకే ఆ ప్రదేశాన్ని అమ్ముదామని ఎంత ప్రయత్నించినా కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అయినా ఎవరొస్తారు... దెయ్యమనే భయం మనసులో అంతగా నాటుకుపోయాక?! టకకనోనుమా గ్రీన్‌ల్యాండ్ పార్క్‌లో దెయ్యాలున్నాయన్నది కేవలం అపోహ అని, చాలామంది చనిపోవడం వల్ల అందరికీ ఆ భయం పట్టుకుందని పార్క్ యాజమాన్యం, ఆ ప్రాంత అధికారులు ఎంతగానో చెప్పారు. అయితే జనం మాత్రం దాన్ని నమ్మేందుకు సిద్ధంగా లేరు. ఎందు కంటే అక్కడ దెయ్యాలను చూశామని చాలామంది బల్ల గుద్ది చెబుతున్నారు. ఎడ్వర్డ్స్ అనే ప్రముఖ ఫొటోగ్రాఫర్ సైతం అదే అంటున్నాడు. ఓసారి అతను నిర్మానుష్యంగా ఉన్న పార్కును ఫొటోలు తీశాడు. తర్వాత వాటిని చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే ప్రవేశద్వారం దగ్గర తీసిన ఒక ఫొటోలో ఓ చిన్నపిల్ల ఉంది. ఆమె ముఖం విచిత్రంగాను, వికృతంగాను ఉంది. కాళ్లు వెనక్కి తిరిగి ఉన్నాయి. ఆమె కచ్చితంగా దెయ్యమే అన్నాడు ఎడ్వర్డ్స్. ఎవరూ కాదని అనలేక పోయారు. ఎదురుగా అంత పెద్ద సాక్ష్యం కనబడుతుంటే ఎలా కాదనగలరు! -
ఆత్మలకూ రుణాలు!
ఇదో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ... ఇక్కడ పని చేస్తున్నవారికి ఆత్మలతో పరిచయాలున్నాయి... దయ్యాలు వారికి దాయాదులు. చనిపోయినవారంతా వీరికి చుట్టాలే. శవాలపై కాసులేరుకోవడం ఇక్కడ పని చేస్తున్న కొందరికి భలే సరదా... సజీవంగా చెట్టంత మనిషి ఎదురుగా కనిపించినా బతికున్నట్టు ధ్రువపత్రం ఇస్తేగానీ పింఛన్లివ్వని ఈ రోజుల్లో పదేళ్ల కిందట చనిపోయినా సరే భేషుగ్గా బతికే ఉన్నారంటూ ఎంచక్కా రుణాలు ఇచ్చేసిన ఘనులున్నారంటే మీకు నమ్మశక్యంగా లేదా... అద్దంకి మండలం గోవాడ సొసైటీలో ఈ తంతు సాగుతోంది. కన్నుమూసినవారికే కాదు బినామీ పేర్లను సృష్టించి కూడా కాసులు కురిపించేస్తున్నారు. ఆ హస్తలాఘవాల అవినీతి కథేంటో మీరే చదవండి... ఒంగోలు వన్‌టౌన్: బతికున్న వాళ్లకు రుణం పుట్టక నానా అవస్థలు పడుతుంటే అద్దంకి మండలం గోవాడ సొసైటీలో మాత్రం చనిపోయిన వారికి కూడా రుణాలు అందజేస్తున్నారు. చనిపోయినవారి పేర్లతోపాటు నిబంధనలు పరిధి దాటి కూడా లక్షల్లో రుణాలు ఇవ్వడంతో భారీగా దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో ఈ తరహా అక్రమాలు 2013-14 ఆర్థిక సంవత్సర ఆడిట్లో బట్టబయలవడంతో ఆడిట్ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఈ అవకతవకలపై సొసైటీ ఆడిటర్ అధికారులకు ప్రత్యేక నివేదికను కూడా సమర్పించారు. సొసైటీలో తొమ్మిది సంవత్సరాల క్రితం చనిపోయిన వారి పేరుతో కూడా రుణాలు మంజూరు చేసిన ఘటనలూ బయటపడ్డాయి. కోఆపరేటివ్ కిసాన్ క్రెడిట్ కార్డు (సికెసిసి) విధానంలో సభ్యుల ఫోటోలు మార్చి సర్వే నెంబర్లను కూడా తప్పుగా నమోదు చేసి రుణాలు మంజూరు చేసినట్లుగా ఆడిటర్లు గుర్తించారు. సభ్యులకు రుణ మంజూరుకు సంబంధించి క్రెడిట్ లిమిట్ అప్లికేషన్ (సిఎల్ఎ) పరిమితిని మించి కొందరు రుణాలు మంజూరు చేసినట్లు తేలింది. ఈ సొసైటీలో మరిన్ని అక్రమాలు జరిగి ఉంటాయని, దీనిపై ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం 1964 సెక్షన్ 51 ప్రకారం సమగ్ర విచారణ జరిపించాలని ఆడిటర్‌కు సిఫార్సు చేస్తూ ప్రత్యేక నివేదికను సమర్పించారు. ఒంగోలు డివిజనల్ సహకారాధికారి కూడా ఈ సొసైటీలో ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సొసైటీ పాలకవర్గం భారీ అక్రమాలకు పాల్పడినందున సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా సహకారాధికారికి సిఫార్సు చేశారు. సి.ఎల్.ఎ.ను మించి రుణాలు సొసైటీల్లో రుణాల మంజూరుకు సంబంధించి ఏ రైతుకు ఎంత రుణం మంజూరు చేయాలన్నది మొదట క్రెడిట్ లిమిట్ అప్లికేషన్ (సిఎల్ఎ)లో ఖరారు చేస్తారు. సి.ఎల్.ఎ.ను సొసైటీలకు ఆర్థిక సాయం అందించే పీడీసీసీ బ్యాంకు ఆమోదిస్తుంది. సిఎల్ఎలో పేర్కొన్న మొత్తానికి లోబడే రైతులకు రుణం మంజూరు చేయాలి. అయితే సిఎల్ఎ రుణ పరిమితిని మించి కొందరు రైతులకు భారీగా రుణాలు మంజూరు చేసి అక్రమాలకు పాల్పడ్డారు. శిరీష, బిళ్ళా కోటమ్మ, అంకం ఏడుకొండలు, అద్దెపల్లి మోహనరావు తదితరులకు సొసైటీ బైలాలు, చట్టాలు, నిబంధనలు అధిగమించి రుణాలు మంజూరు చేశారు. విచారణకు ఆదేశం... గోవాడ సొసైటీలో జరిగిన అక్రమాలన్నింటిపై విచారణకు ఆదేశిస్తూ జిల్లా సహకారాధికారి సిహెచ్ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణాధికారిగా ఒంగోలు సబ్ డివిజనల్ సహకారాధికారి కె.వెంకటేశ్వరరావును నియమించారు. సొసైటీ ఆడిటర్ సమర్పించిన ప్రత్యేక నివేదికలో ప్రస్తావించిన అంశాలన్నింటిపై సమగ్రంగా విచారణ జరపమన్నారు. సొసైటీ ఆర్థిక పరిస్థితి, బినామీ రుణాలు తదితర అంశాలన్నింటిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీసీఓ ఆదేశాలు జారీ చేశారు. మరణించినవారికి ఇలా... గోవాడ సొసైటీ పరిధిలోని ఏలేశ్వరపాలెం గ్రామానికి చెందిన సొమ్మబత్తిన లక్ష్మయ్య తొమ్మిది సంవత్సరాల క్రితం మరణించారు. ఆయన బతికున్నట్లుగానే అధికారులు చూపిస్తూ కోఆపరేటివ్ కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ నెం.1145లో 25/02/2012న రూ. 10 వేలు రుణం మంజూరు చేశారు. సొసైటీ పరిధిలోని యంపరాలకు చెందిన సొమ్మబత్తిన ఆదినారాయణ ఎనిమిది సంవత్సరాల క్రితమే మరణిం చారు. అయితే ఆయన సీకెసీసీ లోన్ నెం. 1131కి 31/03/2011న రూ.67 వేలు రుణం మంజూరు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. బినామీలూ అధికమే... గోవాడ సొసైటీలో బినామీ రుణాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఫిర్యాదులు కూడా అధికారులకు అందాయి. పలువురు రైతులకు ఇతర సొసైటీలో రుణాలున్నప్పటికీ గోవాడ సొసైటీలో కూడా రుణాలు మంజూరు చేశారు. సొసైటీ పరిధిలోని శిఖాకొల్లి కోటేశ్వరరావు, పావులూరి శివయ్య, సాయంపు వెంకటేశ్వర్లు, సాతులూరి వెంకటేశ్వర్లుకు గోవాడ సొసైటీతోపాటు కొమ్మినేనివారిపాలెం, పర్చూరు, వలపర్ల సొసైటీలకు కూడా రుణాలున్నట్లు గుర్తించారు. -
లా లొరోనా
విన్న ప్రతిదాన్నీ నమ్మలేం. నమ్మిన ప్రతిదీ నిజమనీ చెప్పలేం. ముఖ్యంగా దెయ్యాల విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, వాటి గురించిన కథనాలు మాత్రం కోకొల్లలుగా ఉన్నాయి. వాటిలో ఇదొకటి... లా లొరోనా గురించి ఇంకో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇద్దరు పిల్లలకు తల్లయిన తర్వాత మారియా మరో వ్యక్తితో ప్రేమలో పడిందని, అతడి కోసం తన భర్తను, పిల్లలను కూడా చంపేసిందని, అప్పటికీ అతడు తనని స్వీకరించకపోవడంతో అవమానం భరించలేక మరణించిందని కొందరు అంటుంటారు. చనిపోయేముందు తన పిల్లలను చంపినందుకు ఎంతో కుమిలిపోయిందని, అందుకే ఆమె ఆత్మ వాళ్ల కోసం పరితపిస్తోందని చెబుతుంటారు. అయితే ఈ కథనాన్ని నమ్మేవాళ్లు తక్కువమందే ఉన్నారు. మెక్సికో నగరం (యు.ఎస్.ఎ)... టేబుల్ మీద భోజనాలను సర్దుతోంది బ్రెండా. ‘‘ఇవాన్... భోజనానికి రా’’ అంది ప్లేటులో ఆహారాన్ని వడ్డిస్తూ. ‘‘ఆ ఆ వస్తున్నా’’ అంటూ వచ్చి కూర్చున్నాడు ఇవాన్. అటూ ఇటూ చూసి... ‘‘బెన్ ఎక్కడ?’’ అన్నాడు. ‘‘ఏం చెప్పమంటారు మీ సుపుత్రుడి గురించి? ఉన్నచోట ఉండడు కదా! ఆడుకోవడానికని వెళ్లాడు. ఇంతవరకూ రానేలేదు’’ అంది తను కూడా కూర్చుంటూ. ‘‘రాకపోతే అలా వదిలేయడమేనా... నాకు చెబితే తీసుకొస్తాను కదా’’ అంటూ లేచాడు ఇవాన్.‘‘అరే... అంత కంగారుపడతావెందుకు? రోజూ బయటికెళ్లి ఆడుకోవడం వాడికలవాటే కదా’’ అంది బ్రెండా భర్తవైపు చూస్తూ. ‘‘ఆడుకోవడం అలవాటే కానీ ఈ టైమ్ వరకూ ఆడుకోవడం అలవాటు లేదు కదా... టైమ్ చూడు, తొమ్మిది దాటుతోంది’’ అంటూనే చెప్పులేసుకుని బయటకు నడిచాడు ఇవాన్. నిట్టూర్చింది బ్రెండా. ‘‘వాడూ మాట వినడు. ఈయనా వినడు. మధ్యలో నేను చస్తున్నాను’’ అంటూ భర్తకు భోజనం వడ్డించిన ప్లేటు మీద మరో ప్లేటు బోర్లించి లేచింది. భర్త, కొడుకు కోసం ఎదురుచూస్తూ గుమ్మం దగ్గరే కూలబడింది. అరగంట తర్వాత వచ్చాడు ఇవాన్... ఒంటరిగా. అతడి వెంట పిల్లాడు లేకపోవడం చూసి కంగారుపడింది బ్రెండా. ‘‘ఒక్కడివే వచ్చావేంటి? బెన్ ఏడీ?’’ అంది ఆతృతగా. మౌనంగా ఆమె ముఖంలోకి చూశాడు ఇవాన్. ఆమె చూపుల్లో కనిపిస్తోన్న ఆదుర్దాను చూసి మనసు అదోలా అయిపోయింది అతనికి. ‘‘బెన్ కనిపించలేదు’’ అన్నాడు నసుగుతున్నట్టుగా. ‘‘కనిపించడం లేదా? అంటే ఏంటి నీ ఉద్దేశం? మిసెస్ ఫెర్నాండాని అడిగావా... రోజూ వాళ్లింటికే వెళ్తాడు. వాళ్లమ్మాయితోనే ఆడుకుంటాడు.’’‘‘అక్కడికే వెళ్లాను. కానీ వాడు ఎప్పుడో వెళ్లిపోయాడని చెప్పిందావిడ. ఆ చుట్టుపక్కలంతా కూడా వెతికాను. ఎక్కడా కనిపించలేదు.’’ఆ మాట వింటూనే బావురుమంది బ్రెండా. ‘‘ఏమైపోయాడు? నా చిట్టితండ్రి ఎక్కడికెళ్లిపోయాడు? ఇవాన్... ఏం చేస్తావో తెలీదు. నాకు నా బెన్ కావాలి. తెచ్చివ్వు. వెంటనే తెచ్చివ్వు’’ అంటూ భర్తను వాటేసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇవాన్‌కి. మెల్లగా అన్నాడు... ‘‘ఒకవేళ మారియా ఏమైనా...’’ ఉలిక్కిపడింది బ్రెండా. గుండె ఝల్లుమంది. ఆ వణుకు ఒళ్లంతా పాకినట్టయ్యింది. ‘‘మారియానా? ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?’’ అంది ఆవేశంగా భర్త కాలర్ పట్టుకుని. ‘‘కూల్ బ్రెండా... ఆవేశపడకు. మనింటికి రెండు దారులున్నాయి. మామూలు దారిలో వస్తే సమస్య లేదు. కానీ ఒకవేళ త్వరగా వచ్చేద్దామని బెన్ ఆ దారిలోకి కనుక వెళ్లుంటే...’’ ‘‘లేదు... అలా జరగదు’’ భర్త మాట పూర్తవ్వకుండానే అరిచింది బ్రెండా. ‘‘నువ్వంటున్నది నిజం కాదు ఇవాన్.. అలా జరగదు. జరగడానికి వీల్లేదు.’’ పిచ్చిదానిలా అరుస్తూ ఏడుస్తోన్న భార్యను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు ఇవాన్‌కి. గబగబా వెళ్లి చుట్టపక్కల వాళ్లను తీసుకొచ్చాడు. అందరూ కలిసి అక్కడికి కాస్త దూరంలో ఉన్న చెరువు దగ్గరకు చేరుకున్నారు. లాంతర్లు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు పట్టుకుని అంతా వెతికారు. ఈత బాగా వచ్చిన కొందరు చెరువులోకి కూడా దిగి చూశారు. ఫలితం శూన్యం. బెన్ జాడ దొరకలేదు. ‘‘ఇక లాభం లేదు. ఇంతకు ముందు జరిగినట్టుగానే ఇప్పుడూ జరిగింది’’ అన్నాడో వ్యక్తి పెదవి విరుస్తూ. ‘‘అవును. ఇక బెన్ జాడ తెలుసుకోవడం అసాధ్యం’’ అన్నాడు మరో వ్యక్తి. ‘‘అయినా మారియా చేతికి చిక్కినవాళ్లు మళ్లీ కనిపించడం ఎప్పుడైనా జరిగిందా’’ అందో మహిళ. ఆ మాటలు వింటూనే బేజారైపోయింది బ్రెండా. ‘బెన్’ అని అరుస్తూ సొమ్మసిల్లిపోయింది. ఆమెను చూసి అందరి మనసుల్లోనూ జాలి నిండిపోయింది. కానీ ఎవరేం చేయగలరు? అందుకే ఒక్కొక్కరుగా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ బెన్ ఏమైనట్టు? ఏదో చేసింది అంటోన్న ఆ మారియా ఎవరు? ఆమె అతడిని ఏం చేసింది? తెలుసుకోవడం తేలికే. కానీ తెలుసుకున్న విషయాన్ని నమ్మడానికి మాత్రం చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే... మారియా మనిషి కాదు... దెయ్యం! మెక్సికో నగరానికి వెళ్లి, మారియా తెలుసా అని అడిగి చూడండి... అక్కడివాళ్లు ఉలిక్కిపడతారు. అంతగా వారిని భయపెట్టిందా దెయ్యం. మెక్సికో నగరంలోని ప్రధాన రహదారి మీద రాత్రిపూట ఒక సమయం దాటిన తర్వాత ప్రయాణించాలంటే భయపడేవాళ్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే... ఎక్కడైనా మారియా కనిపిస్తుందేమోనని భయం! చీకటి పడిన తర్వాత తమ పిల్లలను బయటకు పంపించేందుకు వాళ్లు అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే... వాళ్లని మారియా ఎత్తుకుపోతుందేమోనని! ఈ భయం వెనుక శతాబ్దం ముందునాటి కథ ఉంది. వందేళ్లకు పూర్వం... మెక్సికో నగరంలో మారియా అనే పేద యువతి నివసించేది. ఆమెకు తన పేదరికాన్ని చూసి చాలా వేదనగా ఉండేది. చినిగిన బట్టలు, నిండని కడుపులు, ఆగని కన్నీళ్లు ఆమెకు నచ్చేవి కావు. ఆ నిజాలను భరించలేక ఎక్కువగా ఊహల్లో విహరించేది. తన కోసం ఓ ధనికుడు గుర్రం మీద వస్తాడని, తనను మనువాడతాడని, మంచి జీవితాన్ని ఇస్తాడని కలలు గనేది. నిజంగానే ఓ రోజు ఓ ధనికుడు వ్యాపార నిమిత్తం గుర్రంమీద అక్కడకు వచ్చాడు. అతడిని చూస్తూనే వలపుల తోటలో విహారం మొదలుపెట్టింది మారియా. ఆమె కళ్లు రోజూ అతడినే వెతికేవి. అతడు వస్తున్నాడేమోనని దారివైపే చూస్తూ కాలం గడిపేది. గుర్రపు పాదాల సవ్వడి కోసం చెవులు రిక్కించేది. అతడు కనిపించిన ప్రతిసారీ అతడి కంట్లో పడాలని అక్కడక్కడే తచ్చాడేది. ఎలాగైతేనేం... ఆ యువకుడి దృష్టిని తనవైపు తిప్పుకుంది. దాంతో వ్యాపారం పెట్టేందుకు వచ్చిన అతగాడు... ఆమెను పెళ్లాడి ఆ నగరంలోనే కాపురం పెట్టాడు. ఆమె సౌందర్యారాధనలో మునిగి తేలాడు. ఇద్దరు బిడ్డలకు తండ్రయ్యాడు. అయితే ఆ తర్వాత అతడి మనసు మళ్లిపోయింది. మనసు కొత్త ఆనందాల కోసం వెతకసాగింది. ఒక డబ్బున్న మహిళను మనువాడేందుకు పరితపించాడు. అది తెలియని మారియా... వ్యాపార పనుల్లో పడి భర్త తనకోసం సమయం కేటాయించలేకపోతున్నాడేమో అనుకునేది. ఎలాగైనా అతడిని ఎప్పటిలాగా దగ్గర చేసుకోవాలని నానా తంటాలు పడేది. కానీ ఓరోజు పరస్త్రీతో తన భర్త నవ్వుతూ మాట్లాడటం దూరం నుంచి చూసింది. అతడు ఆమెను ముద్దాడటం భరించలేకపోయింది. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక, తన పిల్లల మీద చూపించింది. చెరువు దగ్గర ఆడుకుంటున్న వాళ్లిద్దరినీ నీటిలోకి తోసేసింది. ఆ తర్వాత తను ఎంత తప్పు చేసిందో అర్థమైంది ఆమెకి. పిల్లల కోసం అల్లాడిపోయింది. కళ్లముందే నీటిలో కొట్టుకుపోతున్న వాళ్లిద్దరినీ కాపాడుకోవాలని పరితపించింది. కానీ పూర్తిగా విఫలమయ్యింది. ఆమె చూస్తూండగానే వాళ్లు జలసమాధి అయిపోయారు. తాను ఎంతటి పాతకానికి ఒడిగట్టిందో తలచుకుని తలచుకుని కుమిలిపోయిందామె. అక్కడే కొన్ని గంటల పాటు ఏడ్చి ఏడ్చి, గుండె పగిలి చనిపోయింది. మారియా మృతదేహాన్ని అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టారు చుట్టుపక్కలవాళ్లు. ఆ రోజు రాత్రి... అందరూ నిద్రపోతుండగా... ఉన్నట్టుండి ఓ ఏడుపు వినిపించింది.. ఎంతో భయంకరంగా, బాధాకరంగా! ‘‘బాబూ, ఏమైపోయార్రా, ఎక్కడున్నార్రా, నా దగ్గరకు రండిరా’’ అంటూ ఒకటే అరుపులు, ఏడుపులు! అందరూ ఉలిక్కిపడి లేచారు. ఏడ్చేది ఎవరా అని వెతికారు. ఎవరూ కనిపించలేదు. అలా రోజూ జరగసాగింది. దాంతో... ఆ ఏడుస్తోంది ఎవరో కాదు, మారియాయేనని అందరికీ అర్థమైంది. తెల్లని గౌను వేసుకుని, జుత్తు విరబోసుకుని చాలామందికి కనిపించేదామె. దాంతో ఆమె దెయ్యమైందని అర్థమైపోయింది అందరికీ. అందుకే ఆమెకు ‘లా లొరోనా’ అని పేరు పెట్టారు. అంటే... ‘వీపింగ్ ఉమన్ (దుఃఖించే మహిళ)’ అని అర్థం! అది మాత్రమే కాదు... ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పిల్లలు మాటిమాటికీ జడుసుకునేవారు. జ్వరాలు తెచ్చుకునేవారు. నిద్రలో పీడకలలు వచ్చి పెద్దగా ఏడ్చేవారు. అదంతా మారియా వల్లనేననే ప్రచారం మొదలైంది. పైగా కొందరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా మాయమైపోవడం మొదలైంది. దాంతో మారియా పిల్లల్ని ఎత్తుకుపోతోందనే భయం మొదలైంది జనాల్లో. అయితే ఇదంతా భ్రమ అనేవాళ్లు లేకపోలేదు. ఇది ముమ్మాటికీ నిజమేనని నొక్కి వక్కాణించేవాళ్లూ ఉన్నారు. వీడియోలు, ఫొటోల్ని సాక్ష్యంగా చూపించేవాళ్లూ ఉన్నారు. కానీ దేన్ని నమ్మాలి అనేది... వారి వారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది కదా! అందుకే లా లొరోనా కథ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది! - సమీర నేలపూడి -
దెయ్యాలంటూ.. అర్ధరాత్రి హల్చల్
హైదరాబాద్ : 'ఇది బూత్బంగ్లా.. ఇందులో దెయ్యాలున్నాయి' అంటూ అర్ధరాత్రి సమయంలో ఓ బంగ్లా వద్దకు వచ్చి హంగామా సృష్టిస్తున్న 25 మంది యువకులను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంత మంది యువకులు సోమాజిగూడ కుందన్‌బాగ్‌లోని ఓ పురాతన భవనం వద్దకు ఫొటోలు తీసుకున్నారు. వాటిని ఫేస్బుక్, వికీపీడియా యూట్యూబ్‌ల్లో పెట్టారు. 'ఇది బూత్బంగ్లా.. ఇందులో దెయ్యాలున్నాయి. ఎవరికైనా దమ్ముంటే అర్ధరాత్రి వేళ ఈ ఇంట్లోకి వెళ్లాలి' అంటూ సవాల్ విసురుతున్నారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లోకి వెళ్లి బిగ్గరగా అరవడం, రాళ్లతో కొట్టడం, బాటిల్స్ విసరడం వంటివి చేస్తున్నారు. మరో ఇంట్లో ఉంటున్న ఆ ఇంటి యజమాని శారద ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం అర్ధరాత్రి అక్కడ హంగామా సృష్టిస్తున్న 25 మంది యువకులను అదుపులోనికి తీసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు సోమవారం వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు మళ్లీ ఇంటి చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి తప్పు చేయమని ఆ యువకులతో ప్రమాణం చేయిం చారు. కాగా, ఆ బంగ్లాలో ఎలాంటి దుష్టశక్తులు లేవని, భయాందోళనకు గురికావద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. -
దెయ్యాల టూరిజం!
సర్వే దెయ్యాలు ఉన్నాయి సుమా... అని భయపడేవారు కొందరు. దెయ్యాలు లేనే లేవు... అంటూనే భయపడేవారు కొందరు. రాత్రయినా సరే, పగలయినా సరే ‘దెయ్యాలున్నాయి’ అని భయపడే వారు మరికొందరు. పగలంతా ‘దెయ్యాలు లేవు’ అని గట్టిగా వాదించి రాత్రయితే చాలు ప్లేటు ఫిరాయించి కిటికీల వంక భయంగా చూసేవాళ్లు కొందరు... మొత్తానికైతే దెయ్యాల గురించి మాట్లాడకుండా ఉండలేం. దెయ్యాలను నమ్మడం మూఢ నమ్మకమని, వెనుకబడిన దేశాలలో, వెనకబడిన ప్రాంతాలలో, నిరక్షరాస్యత ఉండేచోట ‘దెయ్యాల మీద నమ్మకం’ ఎక్కువగా ఉంటుందనేది సాధారణ అభిప్రాయం. ప్రసిద్ధ మార్కెటింగ్ రిసెర్చ్ సంస్థ ‘హారిస్ పోల్స్’తో సహా ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేలలో మాత్రం పాశ్చాత్యదేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ దెయ్యాలను నమ్మేవారి సంఖ్య తక్కువేమీ లేదనే విషయం బయటపడింది. దెయ్యాలను నమ్మేవారు అమెరికాలో 42 శాతం మంది ఉన్నారు. బ్రిటన్‌లో 52 శాతం మంది ఉన్నారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ‘దెయ్యాలు ఉన్నాయి’ అని బల్లగుద్ది వాదించే వాళ్లలో విద్యావేత్తలు, వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కొందరైతే ఏకంగా తమ స్మార్ట్ ఫోన్లో నిక్షిప్తం చేసుకున్న కొన్ని వింత ఫోటోలను చూపిస్తూ ‘‘ఇంతకంటే రుజువు అవసరమా?’’ అని కూడా అంటున్నారు. సర్వేలో భాగంగా దెయ్యాలు తిరుగాడే ప్రాంతాల గురించి అడిగినప్పుడు రకరకాల దేశాల్లో రకరకాల పేర్లు వినిపించాయి. ఈ దెబ్బతో ‘పారానార్మల్ టూరిజం’ పెరిగిపోయింది. ఒకానొక ప్రాంతంలో ఎలాంటి చూడదగిన ప్రదేశమూ లేకపోయినా ‘అక్కడ దెయ్యం ఉంది’ అనే నమ్మకంతో వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిపోయింది. అలా పర్యటించిన వారికి దెయ్యాలు కనిపించాయో లేదోగానీ- ‘నేను మరియు ఆ దెయ్యం’లాంటి హాట్ హాట్ యాత్రాకథనాలు రాయడం మొదలు పెట్టారు కొందరు. హతవిధీ! -
కోర్టు ప్రాంగణంలో దెయ్యాలు, భూతాలు
న్యూఢిల్లీ: ‘రాత్రయితే చాలు అకస్మాత్తుగా కంప్యూటర్లు ఆన్ అవ్వడం.. గదుల్లో బుడగలు ఎగురుతూ కనిపించడం.. తెల్లని నీడ కాంపౌండ్‌లో తిరుగుతుండటం.. ఇదంతా హరర్ సినిమాలోని దృశ్యాల్లా అనిపిస్తున్నాయి కదూ.. కాదండీ.. కాడ్కడ్‌దూమా కోర్టు ప్రాంగణంలో రోజూ న్యాయవాదులకు ఎదురవుతున్న ఘటనలు.. కోర్టు ప్రాంగణంలో దెయ్యాలు, భూతాలు తిరుగుతున్నాయని న్యాయవాదులు, సిబ్బంది భయంభయంగా చెబుతున్నారు. ఒక తెల్లని ఆకారం రోజూ ప్రాంగణంలో తిరుగాడుతుండటం తాము స్వయంగా చూశామని కొందరైతే ఢంకా భజాయించి చెబుతున్నారు. వీరి వాదనలను ఒక సీసీటీవీ కెమెరాలో కనిపించిన దృశ్యాలు మరింత బలపరుస్తున్నాయి. షాద్రా బార్ కౌన్సిల్ సంయుక్త కార్యదర్శి రమణ్ శర్మ కథనం ప్రకారం కాడ్కడ్‌దూమా కోర్టు ప్రాంగణంలో అదృశ్య శక్తులు సంచరిస్తున్నాయి. తూర్పు ఢిల్లీలో నిర్మించిన ఈ పది అంతస్తుల కోర్టు ప్రాంగణంలో న్న లైబ్రరీ, బార్ కార్యాలయంతోపాటు పలు చోట్ల 8 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ‘తెల్లారుజామున నాలుగు కంప్యూటర్లు స్విచ్ వేసి ఉండటం కనిపించింది. మేం సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించగా, ముందు రోజు రాత్రి 11.35 నిమిష్లాకు ఒక తెల్లటి నీడ గోడల్లోంచి వచ్చి కంప్యూటర్ల స్విచ్‌లను వేయడం రికార్డు అయ్యింది..’ అని శర్మ తెలిపారు. మరో ఘటనలో, లైబ్రరీలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బుడగలు ఎగురుతూ కనిపించాయి. ఈ దృశ్యాలు కూడా కెమెరాలో రికార్డు అయ్యాయి.. అని శర్మ చెప్పారు. ఇటీవల తన చాంబర్లోనే ఒక భూతాన్ని చూసినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ కోర్టులో పనిచేసిన ఒక న్యాయవాది, అతడి కుటుంబం గత యేడాది ఉత్తరాఖండ్ వరదల్లో మృతిచెందారని, అలాగే కొన్ని వారాల కిందట ప్రాంగణంలో కరెంటు పనిచేస్తూ ఒక ఎలక్ట్రీషియన్ మృతిచెందాడని.. వారి ఆత్మలే ప్రస్తుతం కోర్టు ప్రాంగణంలో తిరుగాడుతున్నాయని న్యాయవాదులు కొందరు అంటున్నారు. వారి ఆత్మలు కోర్టు ప్రాంగణంలో తిరుగాడుతుండటం పలు సందర్భాల్లో తాము చూసినట్లు పలువురు నొక్కిచెబుతున్నారు. తాము టీ తాగుతున్నప్పుడు ఒక ఆత్మ తమ పక్కనే వచ్చి కూర్చుందని కొందరు లాయర్లు చెప్పారు. న్యాయవాదులు చెప్పినట్లు ప్రాంగణంలో ఎటువంటి దెయ్యాలు, భూతాలు, ఆత్మల సంచారం లేదని దర్యాప్తు అధికారులు చెప్పారు. సెల్ఫ్ ప్రోగ్రామింగ్ వల్ల కంప్యూటర్లు వాటికవే స్విచ్ ఆన్ అయ్యాయని, కంటికి కనిపించని ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి వల్ల బుడగలు ఏర్పడ్డాయని దర్యాప్తులో తేలిందని వారు నొక్కి చెబుతున్నారు. -
భావి సంస్కర్తతో నట్టింట్లోంచి పందిట్లోకి!
‘‘త్వరగా ఆం తినెయ్... లేదంటే బూచాడు వస్తాడు’’ అంటోంది మా ఆవిడ మా బుజ్జిగాడికి అన్నం తినిపిస్తూ. రాత్రివేళల్లో బూచిగాడొస్తున్నాడగానే గబగబా తినేసి, త్వరగా పక్క ఎక్కేస్తుంటాడు వాడు. ఒక ఆనవాయితీగా అనేక తరాల నుంచి వస్తున్న ఈ టెక్నిక్‌ను మా ఆవిడా వాడుతుండటాన్ని గమనించిన నేను సంప్రదాయానికి గల బలాన్ని చూసి ఆశ్చర్యపోయా. అయితే అంతకంటే ఆశ్చర్యపోయే ప్రశ్నొకటి వేశాడు మా బుజ్జిగాడు. ‘‘నానా... ఎప్పులూ బూచాడులే బయంకరంగా ఉంతాలా? బూచిది అంత బయంకరంగా ఉండదా? ‘అదుగో... బూచిది వస్తోం’దంటూ అమ్మ ఎప్పుడూ బయం పెట్టదెందుకు?’’ అని అడిగాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక అప్పటికి కలవర పడ్డా... బూచిదానికీ పిల్లల్ని భయపెట్టే శక్తి ఉంటుంది. ఆం తినిపించేటప్పుడు బయపెట్టడంలో దానికీ తగిన స్థానమివ్వాలి. బూచిదానికీ పిల్లల్ని పక్కతడిపేలా చేయగల శక్తి ఉంటుంది. దానికీ తగిన ప్రోత్సాహమివ్వాలి. బూచిదానికీ తగిన ప్రాచుర్యమివ్వాలి అని భవిష్యత్తులో ఆడబూచీల పక్షం వహించి పోరాడేబోయే ఓ చిన్నారి చలంగారు మా ఇంట పారాడుతున్నారంటూ చాలా సంతోషించా. తర్వాతి రోజుల్లో మా బుజ్జిగాడు కథలు చెబితేనే నిద్రపోనంతగా కాస్త పెద్దాడయ్యాడు. చిన్నప్పటి బూచిగాడి ప్రభావమో ఏమోగానీ... దెయ్యాల కథలు వింటేనే వెంటనే నిద్రపోయేవాడు. ఆ బలహీనత ఎరిగి వాణ్ణి త్వరగా నిద్రపుచ్చాలని నేనూ అవే కథలు చెబుతుండేవాణ్ణి. ఓరోజు నేను జవాబు చెప్పలేనివిధంగా మరో ప్రశ్న వేశాడు వాడు. ‘‘నానా... దెయ్యాలెప్పుడూ తెల్లచీరలే ఎందుకు కడతాయి? రంగు చీరలు కూడా కట్టొచ్చు కదా. వాటికి ఇష్టం ఉండవా? అయినా ఆడబూచీ దెయ్యాలు రంగులను ఇష్టపడకుండా ఎందుకుంటాయి?’’ అన్నది వాడి సందేహం. అప్పటికి ఏం చెప్పాలో నాకేమీ తోచలేదు. కానీ... ‘‘దెయ్యాలన్నీ చిమ్మచీకట్లో తిరుగుతుంటాయి కద నాన్నా... డార్క్ రంగు చీరలు కట్టుకుంటే ఆ చీకట్లో కళ్లు సరిగ్గా కనపడక, ఒకదానికొకటి గుద్దుకుంటాయేమోనని అలా తెల్లచీరలు కట్టుకుంటాయన్నమాట’’ అని సమాధానమిచ్చా. ఆ జవాబుకు సంతృప్తి పడలేదు వాడు. ‘‘బ్రైటు కలర్సూ, లైటు కలర్సూ, లైటులో బ్రైటు కలర్సూ కట్టుకోవచ్చు కదా’’ అని మళ్లీ అడిగాడు. మళ్లీ ఏం సమాధానం చెప్పాలో తెలియకపోయినా బుడిబుడి నడకలతో నడయాడుతూ భవిష్యత్తులో ఆడదెయ్యాల పాలిట అపర సంఘసంస్కర్తగా మారబోయే వీరేశలింగం-2 మా ఇంట్లో జన్మించినందుకు ఆనందించా. వీడి శ్రేయోదృష్టి వల్ల దెయ్యాల సమాజంలోనూ దెయ్యాలు తెల్లచీరలకు బదులు రంగు చీరలు కట్టే రోజు వస్తుందని, క్రమంగా అవి పంజాబీ డ్రెస్సులూ, చుడీదార్లూ వంటి మోడ్రన్ డ్రస్సుల దిశగా కూడా పరిణమిస్తాయనీ ఆనందించా. ఏ సంస్కరణ అయినా ఇంటితోనే మొదలవ్వాలనే ఓ ఇంగ్లిష్ సామెతను అనుసరించి... ఆడ బుచీల పట్ల, మహిళా దెయ్యాల పట్ల వాడికి గల ఉద్ధరణ శక్తిని మరింత ఉత్సాహపరిచేందుకు కొంత సానుకూలతతో మాట్లాడా. కానీ అదే నా కొంపకు చేటు తెస్తుందని నాకు తెలియదు. పిల్లల్లోని పాజిటివ్ అంశాలను ప్రోత్సహించాలన్న నా దృక్పథం తప్పనీ, దానివల్లనే వాడు దెయ్యాలు చేసే అన్ని చిలిపి పనులకూ అలవాటు పడ్డాడనీ మా ఆవిడ అభియోగం. ఈ విషయమై మా ఆవిడ ఎంత పెద్ద క్లాసు తీసుకుందంటే... వాడు సంఘసంస్కర్తగా మారాక సంస్కరించాల్సిన మొదటి వ్యక్తి మా ఆవిడే అన్నంత భయంకరంగా ఉందా క్లాసు! ఇప్పుడు నా ప్రోత్సాహం వల్ల వాడు చేసిన పనులన్నింటినీ మీకు చూపించేందుకు మిమ్మల్ని ఆహ్వానిద్దామంటే మేం తలదాచుకునేందుకు ఇప్పుడు ఇల్లు లేదు. జస్ట్... పందిరే. ‘ఈ అల్లరేమిట్రా?’’ అని అడిగితే ‘‘శుభకార్యాలకు పందిరి ప్రశస్తం. అది ఆనవాయితీ కూడా’’ అన్నాడు వాడు. ప్రస్తుతం నా చిరునామా: పందిరి నెంబర్ పదహారు తాలూకు రెండో గుంజ, బిసైడ్ గతంలో 9-6-3బి-596/25 నెంబరు గల మాజీ ఇల్లు, శ్రీకర్నగర్ కాలనీ, జిందాబాద్, హైదరాబాద్. మరి ఇల్లు పీకి పందిరేసినా మాజీ ఇల్లయినా ఉండాలికదా... ఏకంగా పదహారో పందిరికి ఎలా షిఫ్టయ్యారూ? అన్నది మీ డౌటా? చెబుతా వినండి. మరేం లేదు. ఇంటి ఓనర్లు వరసగా ఖాళీ చేయిస్తూ పోగా ప్రస్తుతం మేముంటున్న పందిరి నెంబరు పదహారు అయ్యిందన్న మాట! - యాసీన్ -
అఖిల భూత మహాప్రేత ఐకాస జిందాబాద్!
నవ్వింత ఆత్మహత్య చేసుకుని దయ్యాల్లో కలిసిపోవాలన్న కోరిక ఒకటి ఇటీవల నాలో బలంగా మొదలైంది. దీనికో కారణముంది. మొదట్నుంచీ నాకు దయ్యాలంటే సదభిప్రాయం. చిన్నప్పట్నుంచీ చదివిన చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర మున్నగు పుస్తకాల ద్వారా వాటికి దయ్యాశీలత ఎక్కువనీ, బహు స్నేహపూర్వకమైనవనీ సాహిత్యముఖంగా గ్రహించాను. అవి తమ దయ్యాదృష్టులతో అడవిలో చిక్కుకుపోయినవారికి దారి చూపించడం వంటి సహాయాలు చేయడం, అత్తల బారిన పడ్డ అమాయికపు కోడళ్లపై దయ్యాదాక్షిణ్యాలు చూపి వారిని ఆరడి పెట్టే అత్తలకు బుద్ధి చెప్పి కాపురాలు చక్కదిద్దడం, మారుటితల్లి పెట్టే బాధలనుంచి ఆడబిడ్డలను రక్షించడం వంటి పనులు చేస్తాయని బాలసాహిత్యం ద్వారా కొంత తెలుసుకున్నాను. అంతేకాదు... దుర్మార్గుల పనిపట్టి వాళ్లను సన్మార్గంలో పెట్టడం, పేదసాదలకు నిధులూ, నిక్షేపాలూ గట్రా చూపి వాళ్లు సుఖంగా బతికేలా చేయగల దయ్యాగుణం కూడా వాటి సొంతమన్న దృష్టాంతాలూ నాకు తెలుసు. కాబట్టి వాటి దయ్యార్దహృదయాలను ప్రస్తుతిస్తూ, వాటి ఘనతను కీర్తిస్తూ గతంలో కొన్ని వ్యాసాలూ అవీ రాసి ఉన్నాను కూడా. ఇక చచ్చి దయ్యమైతే గాలి నిండిన స్విమ్మింగ్పూల్లాంటి ఈ లోకంలో హాయిగా తేలుతూ, తుళ్లుతూ శ్రమలేకుండా సాగిపోవచ్చనే ఆశ కూడా నాలో ఉంది. చచ్చాక... చచ్చినా దేవత మాత్రం కాకూడదనే బలమైన అభిప్రాయమూ ఉంది. ఎందుకంటే... ఆకాశంలో అటూ ఇటూ పరుగులు పెడుతూ, ఎవరైనా గొప్పపనులూ గట్రా చేస్తే పైనుంచి పూలవర్షం కురిపించడానికి వీలుగా పూలబుట్టలు మోయడం తప్ప దేవతలకు వేరే పనేమీ ఉండదు. ఈ మోతబరువుల ఈతిబాధలు నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. అదే దయ్యాలకు అలాంటి బాదరబందీలేమీ ఉండవు. అయితే విజ్ఞులైన నాలాంటి వారు తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకూడదనీ, కాస్త ముందువెనకా ఆలోచించాలనీ మరోసారి అనుకున్నా. ‘దూరపు గోరీలు నునుపు’ అన్న సామెత ఉండనే ఉంది కదా. అందుకే దయ్యం అవ్వడం వల్ల ఉండే మంచి చెడులను బేరీజు వేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ ఆలోచనతో దయ్యాల గురించి కాస్త లోతైన అధ్యయనం మొదలుపెట్టా. దయ్యాలు చాలా మంచివి అన్న అంశంపై నాకు ఎలాంటి భిన్నాభిప్రాయాలూ లేవు. అయితే... దయ్యాల సామాజిక పరిస్థితుల గురించి కర్ణాకర్ణిగా కొంత తెలిశాక పునరాలోచనలో పడ్డ మాట మాత్రం కాస్త వాస్తవం. దయ్యాలన్నీ ఒకటి కావనీ... వాటిలోనూ అనేక సామాజిక వర్గాలున్న విషయం తెలిసి కాస్త విచలితుడినయ్యా. దయ్యాలూ, భూతాలూ, పిశాచాలూ, శాకినీ, ఢాకినీ, కామినీ, మోహినీ... లాంటి వర్గాలున్నాయని తెలిసి బాధపడ్డా. మనుషుల్లో ఉండే అగ్ర, నిమ్న జాడ్యాలు దయ్యాల్లోనూ ఉండాలా అని విచారించా. పైగా పతంజలిగారి రచనలు చదివాక గుండుదయ్యాలూ, జుట్టు దయ్యాలూ, పిలకదయ్యాలూ ఉంటాయనీ, వాటిలోనూ కొన్నింటి తాము అగ్రవర్ణ దయ్యాలమనే ఫీలింగ్ కొన్నింటికి ఉంటుందని తెలిశాక మనసుకు కష్టమనిపించింది. అంతేనా... పతంజలి వారి వీరబొబ్బిలి ‘కూరొండుకు తినడానికి దయ్యాలు పనికొస్తాయా, లేదా’ అంటూ తర్కించింది. ఈ విషయమై తమ ఛీఫ్ షెఫ్ వంట్రాజుతో సంప్రదించాలని అనుకుంది. ఎంత పతంజలిగారి కుక్కయితే మాత్రం దయ్యాలను అది కూరొండుకు తినడానికో, కైమా కొట్టుకుని తినడానికో, వేపుడు చేసుకోడానికో పనికొస్తాయా లేదా అంటూ బలిపశువుల్లా చూసిందంటే దయ్యాల దయ్యనీయ పరిస్థితేమిటో ఆలోచించవచ్చు. ఇక అల్లావుద్దిన్ ఓ దయ్యాన్ని తన అద్భుతదీపంలో అరెస్టు చేసి దాంతో కట్టుబానిసలాగా వెట్టిచాకిరీ చేయించుకున్నాడని తెలిసి బాధేసింది. ఇక గురజాడ వారి దాఖలా ప్రకారం ఆ రోజుల్లో పూజారి గవరయ్య లాంటివారు దయ్యాలను సీసాల్లో బంధించేవారని తెలిసి తెగ బాధపడ్డా. మొగుడు దయ్యం, పెళ్లాం దయ్యం ఒకే సీసాలో ఉంటే చిన్న చిన్న దయ్యప్పిల్లలు పుడతాయేమోనంటూ లుబ్ధావధాన్లు కూతురు మీనాక్షి ఆందోళన పడింది కూడానూ. దయ్యాలను బానిసల్లా చూడకుండా వాటిల్లోనూ సమానత్వం అందరూ కోరే రోజు రావాలని మనస్ఫూర్తిగా భావించా. ఇక ఇప్పుడు నాకున్న భయమల్లా ఒక్కటే. దయ్యాల సామాజిక జీవనానికి సంబంధించిన ఈ వివరాలన్నీ నేను బయటపెట్టడం వల్ల వాటి మనోభావాలేమైనా దెబ్బతింటాయేమో! అయితే చచ్చాక చచ్చినా దేవత కాకూడదనీ, చచ్చి దయ్యమే కావాలన్న నా కోరికను టెంపరరీగా వాయిదా వేసుకున్నా. ఎందుకంటే మనుషులతో పోలిస్తే దయ్యాలు మంచివన్న మాట మినహాయిస్తే అక్కడ కూడా సామాజిక వర్ణవివక్షా, వర్గవివక్షా ఉన్నాయి కాబట్టి నేను చచ్చే లోపు ‘అఖిలభూత మహాప్రేత ఐక్య కార్యాచరణ సమాఖ్య’ ఒకటి స్థాపించి, దయ్యాల్లో గల వర్గభేదాలను సమూలంగా తుదముట్టించాలని భావిస్తున్నా. అప్పటివరకూ విశ్వపిశాచ సమానత్వం వికసించేలా, సకల భూత సమభావన పరిఢవిల్లేలా విప్లవిస్తాను. నా ఉద్యమం ఫలించాక... ఆ తర్వాత ఇక దయ్యాల్లో దయ్యాన్నై, భూతాల్లో భూతన్నై, ప్రేతాల్లో ప్రేతాన్నై, పిశాచాల్లో పిశాచాన్నై ఆ దయ్యాలోకంలో చిరకీర్తిని గడిస్తాను. అందుకే ఈ కథకు శుభం కార్డు వేయడం లేదు. అప్పటివరకూ దిసీజ్ నాట్ ‘దయ్యెండ్’! - యాసీన్ -
సందేహాల ప్రదక్షిణ!
దేవుడిపై సందేహాలు రావడం పాపమూ కాదు. సందేహాలను సహించలేకపోవడం దైవభక్తీ అయిపోదు. దేవుడున్నాడా లేడా? దెయ్యాలు నిజంగానే ఉన్నాయా? ఈ మహావిశ్వాన్ని వీక్షిస్తున్న మనిషికి ఆది నుంచీ ఉన్న ప్రాథమిక సందేహాలు ఈ రెండూ. ఇవికాక ఇంకా లక్షప్రశ్నలు, యక్షసందేహాలు! అయితే అవన్నీ కూడా దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నవే. ఒకవేళ దెయ్యాలు నిజంగానే ఉన్నాయని రూఢీ అయినా అవేమీ వరాలిచ్చేవీ, కష్టాలను గట్టెక్కించేవీ కాదు కాబట్టి, వాటి జోలికి మనుషులు వెళ్లే ప్రసక్తే లేదు. పైగా ‘పట్టి పీడించడం’ వాటి వృత్తిధర్మం కనుక వీలైనంతగా వాటికి దూరంగా ఉంటాం. అయినా మనుషుల్లోనే నిత్యం ఎంతోమంది పీక్కుతినేవారినీ, పీడించేవారినీ చూస్తూ కూడా దెయ్యాలంటే భయపడేవారు ఎవరుంటారు?! దేవుడున్నాడా లేడా అని సందేహపడడంలో ‘లేకపోతే ఎలా?’ అనే భయం ఉంది. దెయ్యాలు నిజంగానే ఉన్నాయా అనుకోవడంలో ‘ఉంటే మాత్రం ఏమైంది?’ అనే ధైర్యం ఉంది. అందుకేనేమో ప్రతిదానికీ మనం దెయ్యాన్ని వదిలేసి, దేవుడి మీద పడిపోతుంటాం. చంటిపిల్లలు... ఇంట్లోకి వస్తున్న నాన్న మీదికి ఎగబాకినట్టు, ఇంటిపనిలో ఉన్న అమ్మ ఒడిలోకి పరుగున వచ్చి ఒక్క గెంతుతో దూకేసినట్లు దేవుడిని ఆక్రమించుకుంటాం. అవివ్వమనీ, ఇవివ్వమనీ నస పెడతాం. అదివ్వలేదేం? ఇదివ్వలేదేం? అని రాగం తీస్తాం. ‘నీకోసం హోమ్‌వర్క్ అంతా కంప్లీట్ చేశాను కదా, వేమన పద్యాలన్నీ అప్పజెప్పాను కదా, పదమూడో ఎక్కం కూడా నేర్చుకున్నా కదా, ప్లే స్టేషన్ ఎప్పుడు కొనిస్తావ్’ అని పిల్లలు అడిగినట్లు... రోజూ తెల్లవారుజామునే చన్నీళ్ల స్నానం చేస్తున్నాను కదా, టెంకాయలు కొడుతున్నాను కదా, ఉపవాసాలు ఉంటున్నాను కదా... అన్నీ మర్చిపోయావా అని ఆక్రోశిస్తాం. ‘భక్తతుకారాం’లో అక్కినేని అడిగినట్లు ‘చేసిన మేలును మరిచేవాడా నువ్వా దేవుడివీ... నువ్వొక వ్యర్థుడివి’ అని దుఃఖపడతాం. చివరికి... ఉన్నావా? అసలున్నావా? అని మొదటికొచ్చేస్తాం! మన తప్పు మాత్రం ఏముంది? దేవుడు ఉన్నాడని అనుకోబట్టే కదా, ‘ఉన్నాడా?’ అనే సందేహం. ఇలాంటి సందేహంతోనే ఓసారి ప్రఖ్యాత బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ విశ్వరహస్యాలపై కాల్టెక్ (కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే ఆ సందేహం ఆయనకు, దేవుడిని నమ్మడం వల్ల కలిగినది కాదు. దేవుడిపై తనకు నమ్మకం లేదని చెప్పడానికి తనకు తానుగా సృష్టించుకున్న సందేహం. వాట్ వాజ్ గాడ్ డూయింగ్ బిఫోర్ క్రియేషన్? అంటాడు స్టీఫెన్. విశ్వాన్ని సృష్టించడానికి ముందు దేవుడు ఏం చేస్తుండేవాడు? హాకింగ్ అలా అడగ్గానే అక్కడి శాస్త్ర నాస్తికులెవరో - బహుశా మనలాంటి ‘అవిశ్వాస తోమా’ (డౌటింగ్ థామస్) ల కోసం నరకాన్ని నిర్మిస్తూ ఉండివుండొచ్చని పెద్దపెట్టున నవ్వారు. మళ్లీ ఇంకో సందేహం. ‘నరకం అనేది దెయ్యాల సామ్రాజ్యం కదా, దాంతో దేవుడికేం పని?’ నమ్మకం ఉన్నచోటే సందేహమూ ఉంటుంది. ప్రేమ ఉన్నచోటే అనుమానం ఉంటుందని నిరీశ్వరత్వం నుంచి మేల్కొని అరుణాచలానికి చేరుకున్న చలం అన్నారు కదా! అలా ఉన్నదా అని సందేహించడం నమ్మకం వల్లనే. ఎన్ని సందేహాలుంటే దైవదర్శనానికి అన్ని మెట్లు ఎక్కినట్లు. సందేహాలు దెయ్యాలవంటివైతే దైవసాక్షాత్కారం కోసం వాటితో చెలిమి చెయ్యడమూ దైవకార్యమే. అర్చనలో భాగమే.